Wednesday, November 30, 2016

మాట్లువేసే పనిలో
నిర0 తర0 శ్రమిస్తున్నాను
నన్ను మనసారా మన్ని 0చ0డి..
మాటల తూటాలతో
పేట్రేగిపోతున్నసమాజాన్ని
స0స్కరి0చేదిశలో
సతమతమైపోతున్నాను గ్రహి0చ0 డి
పసరుమ0దులేమీ పనిచేయడ0లేదని
ఇట్టే తేలిపోయి0ది.
మరి0కా ఘాటైన ప్రక్రియ మొదలెట్టాల్సివు0ది..

మారా0చేయడమే నాలక్శ్యమని
మ 0కుపట్టిన మానవసమాజానికి
పట్టిన మకిలను వదిలి0చాలని
అసమర్ధపు నాయకత్వానికి
అ0టుకున్నరోగాన్ని
ఆసా0త0 కుదిరి0చాలని
అనవరత0శ్రమిస్తున్నాను.
గద్దెనెక్కిన ప్రభుత స0కల్పిత0గాచేసుకొస్తున్న
గాయాలను మాన్పేపనిలో శ్రమిస్తున్నాను..

ఎటుచూసినా ఈర్శ్యా ద్ఞేశాలమధ్య
ఉఉపిరిసలుపకు0డా
ఉక్కిరిబిక్కిరౌతున్న మానవాళికి
ఉదజని వాయువున0ది0చడ0లో
ఉబుసుపోక కబుర్లతో ఊసులాడే
మనస్తత్వాలతో ఊగిసలాడుతున్న
సమాజానికి ఉన్మాద చికిత్సను మొదలెట్టి
మాట్లువేసే పర్వానికి ముగి0పుచెప్పాలిక..

Friday, August 5, 2016

మండుటెండలు మండించు  మద్దెనేల
స్వేదగ్రంధులు శ్రమపడి చెలగు వేళ
తెరపి యెరుగక వానలు చూరునుండి
కారు వంటిండనుండ సౌఖ్యమ్ము గాదె..




Wednesday, August 3, 2016

చివరాఖరుకు వాళ్ళ ఇంటిపురోహితుడు తేల్చి చెప్పేసాడట
కుర్రాడికి ద్వితీయ వివాహయోగం వుంది జాతకంలో ఇక మీ ఇష్టం అని
అమ్మాయిని అడిగారు యేంచేద్దాం? అని ఆందోళనాపధంలో ఊగిసలాడుతూ,,
ఆ అమ్మాయి ఒ చిరునవ్వును తల్లిదండ్రులవైపు విసిరేసి..
అయితే ఒక పనిచేద్దాం..అతనితో ముహూర్తం ఖాయం చేసేద్దాం..
అందరూ అవాక్కయ్యారు..ఎందుకలా మొండిగా ఆలోచిస్తున్నావ్?
యేం లేదు..అతనిది ఉద్యోగం గనుక నేను బ్రతికుండగా రెండో ఆలోచన వస్తుందనుకోను..నేను పోయాక అతనేమయితే నాకేంటి అంటాననుకున్నారా? అలా యేమీ అనబోవడంలేదుసుమా!!
నేను పోయాక నామీద మోజన్నా పెరగాలి,లేదా వివాహ వ్యవస్థమీద విరక్తయినా పుడుతుందిగాని అతనా ధైర్యంచేస్తాడనినేననుకోను..

ఇద్దరికీ మాంచి నడి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం సమయంలో
ప్రచండ భానుడి సాక్షిగా వివాహమయింది..

అప్పుడప్పుడూ ఉప్పూ కారాలూ తిరగమాత గింజల్లా పేలినా ఆ ఇద్దరూ
40 సంవత్సరాల పైబడి ఆనందంగా కలిసికట్టుగా కాపురం సాగించారు..

ఆవిడ అనుకోకుండా దాటిపోయింది మూడేళ్ళయింది..
జాతక చక్రంపట్ల వైముఖ్యమో ఆవిడపట్ల అస్తమించని అనురాగమో
అల్లానే ఒంటెద్దులా  బండినితోలుతూనే జీవన యానం చేస్తున్నాడు..
====================================================
అనురాగబంధాల ప్రహేళికలు[జీవన చిత్రాలు-2]
-------------------------------
ఆవిడకు గడుల నుడికట్టులంటే ఆరోప్రాణం..
ఆదివారం ఒచ్చిందంటే ఆవిడకోసం మాములుగా
ఇంటిదగ్గరకొచ్చే దినపత్రికలు గాక మరో మూడు
 దిన పత్రికలు రెండు వారపత్రికలు అదనంగా తెచ్చేవాడిని..
సోమవారం ఉదయమ్నుంచీ ఆకార్యక్రమంలోమునిగి తేఏల్ది..

బహుమతులు ప్రకటించిన ఒక వారపత్రికలో మాత్రం గడులునేనే పూర్తిచేసే ప్రయత్నం చేసే వాడిని..రెండు మూడు ఆధారాలు
కఠినమైతేవదిలేసే వాడిని..తను కొద్ది ఆలోచనలతోనే
ఆగడులను సునాయాసంగా పెన్సిల్ తోపూర్తిచేసి ఇక ఒకసారి చూసుకునిమీరుపంపించొచ్చునండీ! అనేది ఇలా ఈ అనురాగబంధం
దాదాపు మూడు దశాబ్దాలపాటు నిరాటకంగా సాగిందనే చెప్పుకోవాలి..అప్పుడప్పుడూ ఆ పజిల్ పూర్తిచేసినవారికి లాటరీలో తగిలితే 150 రూపాయలు బహుంతిగా వచ్చేవి ఆడబ్బులను మాత్రం తను అడిగిమరీ తీసుకునేది..ఆడబ్బులు ఓ పర్సులో దాచిపెట్టేది..

అలా ఇంకొన్ని గంటలలో  అసువులుబాస్తుందనుకున్నరోజు కూడా ఈనాడు
గడిని 90 శాతందాకా పూర్తిచేసింది..అక్కడది పోటీ పజిల్ కాదుగనుక భద్రంగ  ఇప్పటికీ దాచివుంచాను.
.మధుర స్మృతిగా....


ప్రతి ప్రభాతాన
నడక దారిలో
స్వాగతగీతాలు
 గానంచేసే పక్షిగణం
ఒక్కుదుటన పాడడం మానేస్తే
చిక్కబడిన నా గుండెకు సమాధానం
చెప్పుకోలేని అసమర్ధునిగా
అలమటిస్తూ కునారిల్లుతూ
 కాలం గడిపే నేను..

Friday, July 29, 2016

ఎప్పటినుంచో తల్లిఒడిలోకి
కొద్దికొద్దిగా ,మెల్లగా కుదురుకున్న
ఓ బుజ్జిపాపాయిలా అల్లుకుపోయి
 ముద్దూ ముచ్చటలతో మురిసిపోతున్న
ఓ జాజి తీగ  అకస్మాత్తుగా నేలకు
ఒరిగిపడినప్పుడు కలిగిన బాధ
అక్షరాలా వర్ణనాతీతం..

Wednesday, July 15, 2015

తమసోమా--
-------------రావెల
====================
ఎదలో చీకటి
మదిలోచీకటి
తలెత్తి యేదిశన చూసినా
తలవంపులుతెచ్చే చీకటి
అమ్మా భారతమాతా
అఖిల సుగుణసముపేతా!!
ఎక్కడ సంకెళ్ళను ఛేదించికున్న
స్వాతంత్ర భారతం ఎక్కడ?
ప్రభుత్వం ప్రతిపాదించే ప్రతిపనిలోనూ
కల్తీయే మాహారాజ్ఞియై భాషిస్తున్నది.
ప్రాణాన్ని రక్షించే మందులలోగూడా
జీవితాన్ని హరించే లాభదృష్టి
నాణ్యతను కోల్పోయేలా చూస్తున్నది .
వంటలకు వాడేనూనెల్లో
వాహనాలనూనెతోకల్తీ
మేలిరకపు వెన్నపూసలో
మృతపశువులకొవ్వుతో కల్తీ!!
చీడ పురుగులను చంపాల్సినమందులు
చేలగట్లపై రైతన్నలను పొట్టనబెట్టుకుంటున్నాయ్
మద్యపానపు సీసాల్లో
మత్తుకోసం విషపదార్ధాల మేళవింపు.
రాజకీయ రణరంగంలో
రావణుల పాత్ర అధికమయింది.
అగ్నిపునీత సీతలకు
ఆక్రందనే శాపమై కరుడుగట్టింది. 
సోషలిజం సూర్యుడింకా
మనపొద్దునపొడవలేదు
తారతమ్యాల తమస్సులింకా
అంతరించిన జాడలేదు.
=====================

Sunday, June 21, 2015

మనం ఇలాగే ఈదారిలో
ఉస్సురుస్సురనుకుంటూ
ఉచ్చ్వాస నిశ్వాసాల
ఊపిరులూదుకుంటూ ఇలానే
పయనిద్దామా నేస్తం?

మన తాతలూ ముత్తాతలూ
ఈ బాటను పట్టి ఇలానే నడిచారని
దారి ప్రక్కన యేపుగా పెరిన పిచ్చి మొక్కలను
త్వరత్వరగా తప్పించుకుంటూ
దారికాచి నక్కిన విష పన్నగాల పన్నగాలను
ఏదోరకంగా వదిలించుకుంటూ

ఇలాగే సర్దుకుపోతూ సాగిపోవడం తప్పదంటావా మిత్రమా?

తిరుగుబాటును తిక్కవేదాంతమని కొట్టిపారేస్తూ
మనం అనునిత్యం  ఇలాగే కొనసాగితే యుద్ధం మనలను
అంతరాంతరాళాల్లో తొఇచివేస్తూ భయపెడుతుంది.
అగ్రరాజ్యాలు అగ్రసనాధిపత్యం కొనసాగిస్తూ మనల్ను వేధిస్తూనే వుంటుంది.అహరహమూ మనలను చింతాక్రాతులనుజేసి ఆడుకుంటూనే వుంటుంది.

ఇప్పటిదాకం మనం రొప్పురూ రోజుతూ నడిచిన ఇరుకు త్రోవను వద్లేద్దాం.
ఇంతదాకా అప్రయత్నంగా వచ్చిపడుతున్న మారణహోమాలను
చెల్లు చీటీ రాసి పంపేద్దాం.
శిశిరానికి చేరువగానే వసంతం వేచివుంటుదన్న సత్యాన్ని నమ్మేద్దాం.
మరపురాన్విధంగా మనం నిత్య నీతనంగా మరో ప్రస్థానానికి ఉపక్రమిద్దాం.
మన బాటకు బాసటగా వుండేలా
మన ఊహలకు ఆశలకూ ఆశయాలకూ
కొత్త చివురులు తొడిగేలా  కొంగ్రొత్త ఊపిరిలూదుదాం  రా
తిమిరంతో సమరం చేసి అది పలాయనం చిత్తగించేలా
వెలుగు దివిటీలను వెలిగిద్దాం.
జీవితాన్ని నూత్న మర్యాదకతో నందనవనంగా మారేలా
నిరంతరం చెమటోదుస్తూ శ్రమైక జీవన సౌందర్యా న్ని మూల్యాకనం జేసి
సరయిన ఖరీదును గట్టే షరాబులై పయనిద్దాం
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\