Sunday, May 31, 2015

కాదిది కవితకు నిర్వచనం
---------------------------------రావెల
కవిత సామాన్యమైంది కాదు.
అఖండజ్యోతిలా అనవరతం వెలిగేది.
కవిత కల్లోలాంతరంగ కాదు
తొలివేకువకు విప్పారే
సుందర సుమధుర స్వప్నం.

కవిత కాలం అల్లిన ఉచ్చు కానేకాదు.
మమతానురాగాలతో పొదిగిన మణిమయకాంతుల ధీధితిని
ప్రకటించే ముత్యాలహారం.
కవిత చిక్కులముడి కానేరదు.
చర్వితచర్వణమౌతున్న హక్కుల ఆరంగేట్రం.
కవిత వృధాశోష కాదు
భాషాసంస్కృతులకు బాసటగానిలిచే
ఉచ్చ్వాస నిశ్వాసాల తొ పెనగూడిన
ఊపిరితిత్తుల కదలికల శ్వాసాంతరంగ తరంగం .

Saturday, May 30, 2015

మాతృ దేవోభవ----
===================
అమ్మ నాకెప్పుడూ అపురూపంగానూ
అమూల్యమౌ రత్నంగానూ సాక్షాత్కరిస్తుంది.

అలుపూ సొలుపూపైకెగబాకకుండా ముఖకవళికల్లో
నవ్వుల జలపాతమై ప్రభవిస్తుంది.

ప్రభాత వేళ సుప్రభాతంలా
వేడి వేదిగా పొగలుకక్కే డికాక్షన్ కాఫీలా
మంచాలదగ్గరకే నడిపిస్తూ వుంటుంది.
కుక్కరై విజిల్ వేస్తుంది.గ్రైండరుగా మారి చట్నీలను రుబ్బేస్తుంది.
తాలింపై ఘుమ ఘుమ లాడుతుంది.
.

పూజామందిరంలో అగరుబత్తీలా వెలిగిపోతుంది.
స్కూలు బ్యాగుల్లో టిఫిన్ బాక్షుల్లా వాటర్ బాటిల్లా
సర్దుకుపోతుంది.
 మధ్యాహ్నం వేళకు వాషింగ్ మిషనై సబ్దం చేస్తూ
బట్టలకున్నమురికినంతా వదిలించేస్తుంది.
ఆరవలసిన బట్టలు తానే తాడై ఎండేలాచేస్తుంది.
సాయంత్రానికి దందె మీదకో కావిడిపెట్టెలోకో
అల్మరాల్లోకో చెజ్క్క బీరువా అరల్లోకోసర్దుకుపోతుంది.

సాయంత్రానికి పిల్లలకు ఆటస్థలమై ఆడిస్తుంది.
ఇచ్చిన హోంవర్కుకు టీచరై సహకరించి పూర్తయేలా చూస్తుంది.

అప్పటిదాకా సూపర్ ఫాస్టు రైలులా నాన్ స్తాప్ బస్సులా ఉరుకులుపరుగులతో యంత్రాలై తిరుగాడిన అమ్మ
అర్ధరాత్రికి ఓ గంట అటో ఇటో చీరచెరగుపై దిందులా ఒదిగిపోతుంది.

మళ్ళీ తెలతెలవార్రుతుండగా పాలపేకెట్తై దర్శనమిస్తుంది.
సెలవురోజంతూలేకుందా విసుగును వెనక్కు నెట్టేసి శ్రమజీవన
ఫలాలను స్వాదుయోగ్యంజేసి సంతసిస్తూంది.
---------------------------------------------------------------------

Friday, May 29, 2015

భువి భూతలస్వర్గమా? భూతాలనిలయమా?
---------------------------రావెల
శ్వాస ప్రక్రియను
చేపట్టిన క్షణం నుంచి
ఆఖరు శ్వాసవదలే నిముషం వరకూ
ప్రతిప్రాణికోటిలోనూ
విరామాన్నాసించకుండా శ్రమించే
శ్వాస  కోశాలు ఎంత గొప్పవోకదా!
అవి మానవనైజంకన్నా భిన్నంగా
అత్యంత పట్టుదలతో
తమ కివ్వబన ధర్మాన్ని
రెప్పపాటుకూడా ఏమరుపాటుకు లోనుకాకుండా
గొప్పదైన సేవాదృక్పధంతో
అహర్నిశమూ క్రమం తప్పకుండా
అది గడ్డకట్టె చలిప్రాంతంలోగాని
రోళ్ళు పగిలిపోయేలా కాచే
ఎండల ప్రదేశాల్లోగానీ
వాతావరణానుకూలతలను అననుకూలతను
 సంబంధంలేకుండా వాటినే  మాత్రం
 తనతల పై కెక్కించుకోకుండా
 దీక్షతో శ్రమించే
సైనికులకుమించిన సేవా దురంధరులుగదా!!
మన ప్రాణికోటి ఊపిరితిత్తులు.

మనిషి నైజం ఇందుకు భిన్నంగా ఎందుకుమారిందో
మనం గమనించి శ్రద్ధగా గుర్తెరుగాలి !
కార్యాలయాలకు వెళ్ళగానే గడియారాలకు
కళ్ళనతికించి కుర్చీలో కునికి పాట్లు పడుతూ
భోజన విరామసమయం ఎప్పుడెప్పుడా అని 
ఎదురుచూసే వ్యర్ధజీవులనెలా  మందలించాలి?
పై అధికారి సెలవుపై వెళ్ళినా లేదా పనిమీద
నగరాతరం వెళ్ళినా ఇక ఆ కార్యాలయాల సంగతి దేవుడికే యెరుక సుమా!
ఇలా తమ ఇష్టారాజ్యంగా గాడితప్పి ఓ రెప్పపాటు ఊపిరితిత్తులలా
విశ్రమించాలని తలుచుకుంటే ,ఇక ప్రాణికోటి బ్రదుకు లెలామారి
స్వర్గధామం స్వర్గ ధామం  ద్వారాలచెంతకు వడి వడిగా
సవ్వడిచేసుకుంటూ పరుగులెడతాయో ఊహించండి.

ఇకామీదయినా ఊపిరితిత్తులను చూసయినా సమస్త మానవకోటి
సేవాదృక్పధంతో ప్రవర్తించడం మొదలెడితే
ఈ భువినిమించిన స్వర్గం బ్రహ్మర్షి విశ్వామితృడయినా సృజించగలడా? ఊహించండి.

ఈభూమి అటుపై పుణ్య భూమిగా
అలరారారుతుందనడంలోఈ సందేహము వలదు వలదు

Sunday, May 17, 2015

ఎదురుతెన్ను------------
---------------------


నీకోసమే ప్రతినిముషం వేచి వేచి చూసాను.
కలనైనా నీ రాకకోసం ప్రతిరాత్రీ
కలవరిస్తూ అలిసిపోయాను.

నాప్రాణమె నీవంటూ బాసలెన్నో  చేసాను
నీ ప్రణయపు జడివానలో మరల మరల తడిసిముద్దయాను.
చెరో చోటున మనముoటూ కలవడం వీలుగాకున్నా
ఊహలలో నీ బాసలతో పూవులా విరబూసాను.

ప్రేమలన్నీ గుడ్డివని అంటారట ఎందుకో పెద్దవాళ్ళు
ఆ అంధత్వమన్నదంతా అసత్యమని
 ఘంటాపధంగా నిజం తెలుసుకున్నాను.

పగలూ రేయీ నీధ్యానమే మేలనుకుంటూ గడిపాను
కన్నులనిండా నీరూపమే నింపుకుని
కళ్ళనిండా నీళ్ళు కుక్కుకుంటూ కదలుతున్నాను.





.




రోజులు గడిచేకొద్దీ నీ జడలోని మల్లెలు వాడుముఖం పెడుతున్నాయ్.
భ్రమరాలూ దూరంగా జరిగి విరహ గీతాలు పాడడ0  మొదలెడుతున్నాయ్ .
 అందుకే ప్రతిరేయీ అమూల్యమని  పదే నేను చెపుతుంటాను.
పెద్దలు వేసిన పీటముడులన్నీ ఇప్పుడిప్పుడే
ఒక్కటొక్కటిగా ముడులు వీడి మసలడం మొదలెడుతున్నాయ్.

నీ సామీప్యంలోనే కలలన్నీ సాకారమవుతూసాక్షాత్కరిస్తున్నాయ్.
నీఓడిలో తలపెట్టుకున్నరోజులన్నీ కనులముందు సుస్పష్టంగా  కదులుతున్నాయ్.
మోహావేశంలో నన్ను దింపేసి తారలన్నీ అడవిదారిలో తిరోగమిస్తున్నాయ్.
తారలన్నీ అందమైన చందమామ వెంట శరవేగంగా పరుగెడుతున్నాయ్.

విరహమెంత చేదైన గాధో చందమామ పుస్తకంలోని కధలాగా స వివరంగా బోధచేస్తున్నాయ్.
 వసంతం నాటికయినా  నీ ఆగమనం వుండాలని కచ్చితంగా ఆదేశాలను జారీ చేస్తున్నాయ్.

==============================
యంత్రంలాపనిజేసి
సాయంత్రానికి ఇంటికొస్తే
సరుకులన్నీ నిండుకున్నాయని
ఇంటావిడ సమాచారం
కాలేజీ ఫీసుకు రేపే ఆఖరురోజని
అమ్మాయి కస్సు బుస్సు
యూనిఫార్మ్ చినిగిపోయిందని
కడపటివాళ్ళిద్దరి ఫిర్యాదు.
మధ్యతరగతి మందహాసంకోసం
వెదుకుతూ ఇల్లంతా కలయదిరిగే నేను
కంగారు పడితే జబ్బుల పాలౌతాను
అందుకే ఓ చిరునవ్వుతో జవాబుగా
జవానీనై స్పందించాను.
------------------------------------

Friday, May 15, 2015

సన్నిహితంగా
----------
పక్షుల కిలకిలారవాలు
పారుతున్న నీటి గలగలలు
అతి సమీపపంలోనే వినబడుతున్నాయ్
సుమాల పరిమళ సౌరభం
యేమంత దూరంగాలేవనుకుంటా
బహుశా నీవెక్కడనో ఈ దగ్గర్లోనే
దాగివున్నావని స్పష్టమౌతున్నది.
ఎందుకింక వ్యవధానం చెంతచేర వేగ రమ్ము!
=====================