Sunday, June 21, 2015

మనం ఇలాగే ఈదారిలో
ఉస్సురుస్సురనుకుంటూ
ఉచ్చ్వాస నిశ్వాసాల
ఊపిరులూదుకుంటూ ఇలానే
పయనిద్దామా నేస్తం?

మన తాతలూ ముత్తాతలూ
ఈ బాటను పట్టి ఇలానే నడిచారని
దారి ప్రక్కన యేపుగా పెరిన పిచ్చి మొక్కలను
త్వరత్వరగా తప్పించుకుంటూ
దారికాచి నక్కిన విష పన్నగాల పన్నగాలను
ఏదోరకంగా వదిలించుకుంటూ

ఇలాగే సర్దుకుపోతూ సాగిపోవడం తప్పదంటావా మిత్రమా?

తిరుగుబాటును తిక్కవేదాంతమని కొట్టిపారేస్తూ
మనం అనునిత్యం  ఇలాగే కొనసాగితే యుద్ధం మనలను
అంతరాంతరాళాల్లో తొఇచివేస్తూ భయపెడుతుంది.
అగ్రరాజ్యాలు అగ్రసనాధిపత్యం కొనసాగిస్తూ మనల్ను వేధిస్తూనే వుంటుంది.అహరహమూ మనలను చింతాక్రాతులనుజేసి ఆడుకుంటూనే వుంటుంది.

ఇప్పటిదాకం మనం రొప్పురూ రోజుతూ నడిచిన ఇరుకు త్రోవను వద్లేద్దాం.
ఇంతదాకా అప్రయత్నంగా వచ్చిపడుతున్న మారణహోమాలను
చెల్లు చీటీ రాసి పంపేద్దాం.
శిశిరానికి చేరువగానే వసంతం వేచివుంటుదన్న సత్యాన్ని నమ్మేద్దాం.
మరపురాన్విధంగా మనం నిత్య నీతనంగా మరో ప్రస్థానానికి ఉపక్రమిద్దాం.
మన బాటకు బాసటగా వుండేలా
మన ఊహలకు ఆశలకూ ఆశయాలకూ
కొత్త చివురులు తొడిగేలా  కొంగ్రొత్త ఊపిరిలూదుదాం  రా
తిమిరంతో సమరం చేసి అది పలాయనం చిత్తగించేలా
వెలుగు దివిటీలను వెలిగిద్దాం.
జీవితాన్ని నూత్న మర్యాదకతో నందనవనంగా మారేలా
నిరంతరం చెమటోదుస్తూ శ్రమైక జీవన సౌందర్యా న్ని మూల్యాకనం జేసి
సరయిన ఖరీదును గట్టే షరాబులై పయనిద్దాం
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\

Thursday, June 18, 2015

సచిత్రంగా--
---------రావెల
శైశవంలో
చిరుదరహాసపుచిందులు
కేకలు,కేరింతలు,తృళ్లింతలు.

బాల్యంలోకడుగిడగానె
తడబడినా,తపుపట్ట లేని
సత్యవాక్య పాలనం.


యవ్వనంలోకి ప్రవేశించగానే
పరువాలపౌరుషంతో
ప్రగల్భాలుచిందించే పలుకుల ప్రవాహాలు.

అది ధర్మామీటరుకాదుస్వామీ
మరోసారికి పనికిరాకుండా నమిలివుమ్మేయడానికి
అది డాక్టర్గారి వేలుసుమా! ఒక్కసారి నోరుతెరుద్దురూ!!'

నడివయసు కొచ్చేసరికి
నకిలీ రూపలావణ్యాల
నిలువెత్తు విజృంభణలు.
ముదిమి మీద పడేసరికి
మరోశైశవానికి
నాందీవచనంగా నిలిచే
ముచ్చటైన ముఖచిత్రం.
=====================

Wednesday, June 17, 2015

మౌన రాగం
--------------రావెల

జీవితాన్ని
నిర్దిష్టంగా,
నిర్దుష్టంగానూ
నిర్వచించాలని
నిరంతరంతపించాను.
యేండ్లు గడిచాయి
పూండ్లు దాటాయి
దశాబ్దాలుసైతం
దీశ మార్చుకు వెళ్లాయి.

కానీ
నామనోభీష్టం మాత్రం
నెరవేరనేలెదు.
'జీవితంప్రేమమయం' అన్నాను.
ప్రణయపయోధి జలాల్లో
ఒల్లకున్న ప్రేయసిపన
ఆంల ద్రావణంజల్లేవారో
రాక్షాంగా గొంతుకోసేవారో
కళ్ళెదుట సాక్షాత్కరించారు.

జీవితం భక్తి సంభరితం
అన్నాను.అహం బ్రహ్మాస్మి అంటూ
హూంకరిస్తూనే విదేశీ భక్తులపట్ల
అవ్యాజానురాగాలను ప్రకటించే
కపట కాషాయాంబర ధారులే
పరాయిదేశాల పర్యటనల్లో
ఊరేగుతూ స్వార్ధమంటే ఇదేనంటూ
సోదాహరణంగా నిలిచారు.
స్వామీజీలపెరిట కపట నాటకాలాడే
కాషాయంబరహారులకు ఓ నంస్కారంపడేసి
మనోవల్మీకంలోంచి వాళ్ళ పొదను తుడిచేసాను.

శ్రమైక జీవన సౌందర్యాన్ని అభిలషించే
సంఖ్య ఈషణ్మ్,ఆత్రమైనా కనబడలెదు.
మానవత్వానికి మేమె చిరునామా
అని చెప్పగలిగిన ధీశాలురే కరువై పోయారు.

విఫల మనోరధంతో వెనుదిరిగి గృహోన్ముఖుడనయాను.
వేసవికాలంలో చెలరెగె పెనుతుఫానుల నడిగాను.
వర్షాకాలంలో మందిపోయే సూర్య కిరణాలను ప్రశ్నించాను.
ఆమని అందాలు ఎక్కద అని అనునయంగా అడిగాను.కాలుష్యపు కోరలను విప్పారుస్తూ కలికాలం ఎదురొచ్చినిలిచింది.
ౠతువులనీ క్షతగాత్రమై దర్శనమిచ్చాయి.
నెత్తురోడుతూ నన్ను భయ విహ్వలుదిని గావించాయి.
జీవితాన్ని నిర్వచించగల బుద్ధికుశలత నాకులేదని
ఆలోచలన్నింటికీ అర్ధాంతరంగానే స్వస్తిజెప్పి.
నాకునెనే సమాధానంగా నిలిచి మౌనరాగాన్నాలపిస్తూ
స్థాణువుగా నిలిచిపోయాను.
--------------------------------------------------------------18-6-15
తూనీగలు
ఆకాశానికి
నిచ్చెనలను
నిర్మిస్తూ
వానచినుకుల
వలపు తడికోసం.
ఎగబాకుతూ
--------------------
సుప్రభాతానికీ
సొర్యాస్తమయానికీ
మధ్యన అంగలారుస్తూ
వృద్ధాప్యం
-----------------
శిలాక్షరాలుగా
--------------రావెల.
************************

 మనిషిని మహస్సులోకి నడిపే
మార్గంకోసం అన్వేషిస్తున్నా
మానవజాతిచరిత మకిలపట్టకుండా
కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నా.


శతాబ్దాలతరబడి చీకటి విస్తరించినజగతిలో
నియంతల సామ్రాజ్యాధికారంలో నీరుగారిన ప్రజాగళం
తనగొడవను తానే స్వతంత్రంగా వెళ్లబుచ్చుకునే
అవకాశాన్ని సద్వినియోగపరచుకొమ్మని విన్నపంచేస్తున్నా.

పరాయి ప్రభువుల పాలనపు దురవస్థలో పతనమై పోయిన
జీవన మూల్యాలను పునరుద్ధరించుకోవడం మొదలుపెట్టండని
మరోసారిగుర్తుచేస్తూనే  మరో పోరాటపు అవసరం రాకుండానే
తమను తాము పాలించుకునే స్వామ్యంలో స్వార్ధపరులకు
ససేమిరా స్థానం కల్పించకూడదని ఇంకోసారి హెచ్చరిద్దామని
మీముందు నిలబడి కలంతో ఈ లేఖను కళ్ళకు కట్టినట్లుగా
వివరిస్తూ శిలాక్షరాలమాదిరిగా  నిలిచిపోవాలని లిఖిస్తున్నా.
==========================================

Tuesday, June 16, 2015

జీవన పధంలో
-----------------రావెల
---------------------------------


స్నేహపు చిరుజల్లులలో
తడిసి పునీతమౌతూ
ప్రణయ ప్రవాహంలో
పయనించాలని కాంక్ష.

ఉగ్రవాదం  విసురుతున్న
వడిసెల వేగానికి
క్షత గాత్రుడిని
అయిపోతాననే అనుమానo
ఆవగిoజంతయినా లేదు.



 మతమౌఢ్యం విస్తరింపజేస్తున్న
విశృంఖలమౌ  మూఢత్వంలో
చిత్తుకావాలన్న ధ్యాస లేదు సుమా!
కులం రాజేసే సంకులసమరమనే దావాగ్నికి
ఆహుతై పొయే ఆలోచన అసలేంలేదు.

ఒడిదుడుకుల జీవిత సంగ్రామంలో
ఓడిపోతానన్న ఒప్పందమేమీలేదండోయ్
విసుగు ,విరామంలేకుండా శ్రమిస్తూ
విజయ బావుటాఎగరేయాలన్న ఓ చిన్న
ఆశమాత్రం సజీవంగా నాలో హత్తుకుపోయివుంది.
------------------------------------------------------------
కలగాపులగంగా--
-----------------------రావెల

అడుక్కునేవాళ్ళు
ఈగల్లాముసురుతూ
ఐస్వర్యానికి ఊపిరి
సలుపకుండా చేస్తున్నారు.
----------------------
ఎత్తులూ పైఎత్తులూ
ప్రభుత్వం ప్రతిపక్షం
ప్రజలే పావులుగా
------------------------
కుప్పతొట్లలో
కొంగ్రొత్తగా
శిశు సమూహం
మాతృత్వాన్ని మంటహలుపుతూ
-------------------

వింటినారిని
 సంధిస్తూ
వంటింటిపోరి
క్రోధారుణనేత్రాలతో
-----------------------
మౌనాన్ని
 రాగబద్ధంచేస్తూ
నిశ్శబ్దరవం
---------------16.-6---15

----------------------------

Monday, June 15, 2015

జయగీతం--

--------
కోటిపున్నముల వెన్నెల కోరుకుందమా
వేయివసంతాల వెలుగు వేడుకుందమా
భరతజాతి బహుళ కీర్తి పాడుకుందమా
మానవతకు జయపతాక ఎగురవేతమా      -కోటి--

ఈగంగా గోదావరి బహుపవిత్ర తీర్ధజలము
ఆకాశీ,ఈ కంచీ సురవాసపు దేవళములు
కాళిదాసు భవభూతులు టాగోరు పోతన్నలు
సాహితీ సామ్రాజ్యమందు సురభిళమౌ పరిమళాలు.--కోటి--

త్యాగయ్యా రామదాసు తులసిదాసు అన్నమయ్య
సంగీతపు భావజగతిన సంకీర్తనల స్వర ఝరులు
తాజమహలు బృందావని సందర్శకక్షేత్రములు
ఎల్లోరా అజంతా చిత్రకళా స్రవంతులు----------కోటి--
కూచిపూది కధాకళి నృత్యభారతికి సిరులు

హిమాలయమూ కశ్మీరము, భరతమాతకు మకుటములు
సత్యాహింసల ధర్మము జాతిగర్వ పడే ధ్వనులు.--కోటి-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^-

దృక్పధం
----------రావెల

శిలలకుసైతం
చెమ్మగిలేనయనముందని
చిన్నప్పుడు అర్ధమయేదిగాదు.
అర్ధ శతాబ్దికి పైగా జీవితాన్ని
ఆమూలాగ్రంగా నమిలేసాక
మెల్ల మెల్లగా అవగతమౌతోందిప్పుడు.


అకాలమృత్యువుహరిస్తున్న
అమాయకప్రాణుల అంతర్ధానాన్ని
దృశ్యాదృశ్యమాత్రంగా
కట్తెదుట క్నీటితెరల్ను ఆవిష్కరింపబడుతున్న వేళ
పెంజీకటి గంప గుత్తగా హృదయగతమై
కళ్ళను బైర్లుగమ్మించేవేళ.
==============================

Sunday, June 14, 2015

మట్టి,మనిషి-సంతకం
-------------------------మట్టిమహిమాన్విత
పుట్తిన ప్రతిప్రాణికీ
పుణభూమిగా ద్యోతకమౌతుంది.
గిట్టినప్పుడదేనేల
వట్టి మౌభూమిగా దర్శనమిస్తుంది.

మట్టి మాYఅలమరాఠీ కానేకాదు.
మనసెరిగిమసలుకునే మాతృస్వరూపం.
విత్తిన ప్రతివిత్తునూ
విస్తరించేదిశగా సమ్రక్షిస్తుంది.
కోతకొవ్చ్చేసమయానికి
కడుపులోదాచుకుని సమ్రక్షిస్తుంది.

మట్టంటే సేద్యగాండ్రకళ్ళలో
కాతిదీపాలనువెలిగిస్తుంది
అమ్మాయిపెళ్ళి,అబ్బాయిచదువులపై
భయాందోళనలనుమలిగిస్తుంది.
ఒడిదుడుకుకులతో సాగేజీవితాలకు
చక్కని దిగుగుబడినందించి సహకరిస్తుంది.
ఓరిమిని ఒకితసాయంగా నేర్పిస్తుంది.
సాఫీగా సాగేజీవితాలకు
సన్మార్గగామియై సం రక్షిస్తుంది.
మట్తిమీద నమ్మకంతో సంతకం చేసిన మనిషిని
మహిమాన్వితునిగా తీర్చిదిద్ది
మాననీయమైన మనీషిగా రూపొందిస్తుంది.
----------------------------------------

విరామానికి తిమిరం---
---------------
అన్ని కిటికీలనూ
ద్వారబంధాలనూ
ఒక్క సారిగా తెరిచేసాను
.ఎంతోహడావుడిగా  వెలుతురు
వేగంగా నన్ను వెన్నంటి వచ్చేసింది.

ఇప్పటిదాకా ఇంతకాలంగా
చెరసాలజీవితాన్ననుభవించిన చీకటి
చిత్రంగా వెలుగును ఒక్కుదుటున వాటేసుకుని
వలవలా ఏడ్చేసింది.
గుహల్లోనో గుయ్యారాల్ల్లోనోమహళ్ళలోనో
మారుమూల ప్రాంతాల్లోనో నక్కున్న వెలుతురు
అధాటుగా ఆనందంతోముఖాన్ని విప్పార్చుకున్నది.

ఎంతధైర్యమోగదా ఈ చీకటికి
ఒక్కతేఒంటరిగా బేలతనాన్ననుభవిస్తూ
విసిగి వేసారిన దాఖలాలు స్పష్టంగా
దాని ముఖ కవళికల్లో ద్యోతకమయింది.

ఏమయితేనేం ఇంకా నయంగదా
ఇప్పటికయినా చెరసాలజీవితాన్ని
చిత్తగించమని చెప్పి చిర్నవ్వులతొ
వెలుతురును గాఢంగా కౌగలించుకుని
ఏకధారగా కన్నీటిని దాని సరీరాన్నంతటినీ
ఆమూలాగ్రంగా అభిషేకించింది.
వెలుతురు ఎప్పటికయినా మెలుకొల్పుతూ
ప్రభాతగీతం పాదితేనేగదా
తిమిరానికి పవళింపుసేవకు సమాయత్తమయేది.
నిద్రాణంగానయినా నివురు గప్పిన నిప్పుగానయినా
నిష్క్రమించే చీక టి ని అభినందించడంతప్పెలా అవుతుంది?
----------------------------------------------------------------- 14-6-15
పడక్కుర్చీ ఇటీవలికాలలోప్రవచించడం నేర్చుకుండి
సప్తసముద్రాలను దాటించి సందేశాలివ్వడం నేర్చుకుంది.
మనసు మడతల్లో దాగిన భావాలను కనుక్కుని
బయలు పరిచేపనిలో పూర్తిగా బహ్రోసా ఇవ్వడం సాగిస్తున్నది.

లోకం చుట్తూ పరిభ్రమించే నేర్పును వేలికొసలపై నిక్షిప్తం చేసుకుంది
కష్టాలనూ కన్నీళ్లనూ కలగాపులగంచేసి
తాజా వార్తలరూపంలోఅందించి.
దృశ్య శ్రవణమాధ్యమంలో ఒద్దికగా నిబిడీకృతమై నిలిచిపోయింది.

ఇకాధ్యాత్మిక సందేశాలకోసం యే ఆచార్యులవారినీ సంప్రదించపనిలేదు.
శాలువాకప్పుకుని వీబూదిరేకలు పులుముకున్న వాళ్ళంతా
ఉదయాన్నే స్టూడియోలముందు మేమంటెమేమని బారులు తెర్చి నుంచున్నారు.
గీతోపదేశమైనాసరే కీ ఇచ్చినట్లు పలుకుతుంటారు
హితీఓపదేశాలమూటలను ఇట్టే విప్పేస్తుఇంటారు.

వేళ్ళకు ధరించే ఉంగరాలను గూర్చి చర్చించపనిలేదు
దివ్యమైన రత్నసంపదను వీధిల్లోకితెచ్చి అమ్ముతునారు.
 పడక్కుర్చీ ఇప్పుడు ప్రవచించడం నేర్చుకుంది.
ప్రభుత్వ మబస్తత్వాలకనుగునంగా పంచాంగ శ్రవణాన్ని
వినిపించి విద్యావంతులకోవలోకి
తమను తామేచేర్చుకుని
కులాసాగా
ఉభయకుసలోపరి మాట్లాడుతుంది.
========================================

Saturday, June 13, 2015

పడక్కుర్చీ ఇటీవలికాలలోప్రవచించడం నేర్చుకుండి
సప్తసముద్రాలను దాటించి సందేశాలివ్వడం నేర్చుకుంది.
మనసు మడతల్లో దాగిన భావాలను కనుక్కుని
బయలు పరిచేపనిలో పూర్తిగా బహ్రోసా ఇవ్వడం సాగిస్తున్నది.

లోకం చుట్తూ పరిభ్రమించే నేర్పును వేలికొసలపై నిక్షిప్తం చేసుకుంది
కష్టాలనూ కన్నీళ్లనూ కలగాపులగంచేసి
తాజా వార్తలరూపంలోఅందించి.
దృశ్య శ్రవణమాధ్యమంలో ఒద్దికగా నిబిడీకృతమై నిలిచిపోయింది.

ఇకాధ్యాత్మిక సందేశాలకోసం యే ఆచార్యులవారినీ సంప్రదించపనిలేదు.
శాలువాకప్పుకుని వీబూదిరేకలు పులుముకున్న వాళ్ళంతా
ఉదయాన్నే స్టూడియోలముందు మేమంటెమేమని బారులు తెర్చి నుంచున్నారు.
గీతోపదేశమైనాసరే కీ ఇచ్చినట్లు పలుకుతుంటారు
హితీఓపదేశాలమూటలను ఇట్టే విప్పేస్తుఇంటారు.

వేళ్ళకు ధరించే ఉంగరాలను గూర్చి చర్చించపనిలేదు
దివ్యమైన రత్నసంపదను వీధిల్లోకితెచ్చి అమ్ముతునారు.
 పడక్కుర్చీ ఇప్పుడు ప్రవచించడం నేర్చుకుంది.
ప్రభుత్వ మబస్తత్వాలకనుగునంగా పంచాంగ శ్రవణాన్ని
వినిపించి విద్యావంతులకోవలోకి తమను తామేచేర్చుకుని
కులాసాగా ఉభయకుసలోపరి మాట్లాడుతుంది.


పడక్కుర్చీ ఇటీవలికాలలోప్రవచించడం నేర్చుకుండి
సప్తసముద్రాలను దాటించి సందేశాలివ్వడం నేర్చుకుంది.
మనసు మడతల్లో దాగిన భావాలను కనుక్కుని
బయలు పరిచేపనిలో పూర్తిగా బహ్రోసా ఇవ్వడం సాగిస్తున్నది.

లోకం చుట్తూ పరిభ్రమించే నేర్పును వేలికొసలపై నిక్షిప్తం చేసుకుంది
కష్టాలనూ కన్నీళ్లనూ కలగాపులగంచేసి
తాజా వార్తలరూపంలోఅందించి.
దృశ్య శ్రవణమాధ్యమంలో ఒద్దికగా నిబిడీకృతమై నిలిచిపోయింది.

ఇకాధ్యాత్మిక సందేశాలకోసం యే ఆచార్యులవారినీ సంప్రదించపనిలేదు.
శాలువాకప్పుకుని వీబూదిరేకలు పులుముకున్న వాళ్ళంతా
ఉదయాన్నే స్టూడియోలముందు మేమంటెమేమని బారులు తెర్చి నుంచున్నారు.
గీతోపదేశమైనాసరే కీ ఇచ్చినట్లు పలుకుతుంటారు
హితీఓపదేశాలమూటలను ఇట్టే విప్పేస్తుఇంటారు.

వేళ్ళకు ధరించే ఉంగరాలను గూర్చి చర్చించపనిలేదు
దివ్యమైన రత్నసంపదను వీధిల్లోకితెచ్చి అమ్ముతునారు.
 పడక్కుర్చీ ఇప్పుడు ప్రవచించడం నేర్చుకుంది.
ప్రభుత్వ మబస్తత్వాలకనుగునంగా పంచాంగ శ్రవణాన్ని
వినిపించి విద్యావంతులకోవలోకి తమను తామేచేర్చుకుని
కులాసాగా ఉభయకుసలోపరి మాట్లాడుతుంది.




ప్రవచనానందం
------------రావెల
--------------------------------------------

పడక్కుర్చీ ఇటీవలికాలలోప్రవచించడం నేర్చుకుండి
సప్తసముద్రాలను దాటించి సందేశాలివ్వడం నేర్చుకుంది.
మనసు మడతల్లో దాగిన భావాలను కనుక్కుని
బయలు పరిచేపనిలో పూర్తిగా బహ్రోసా ఇవ్వడం సాగిస్తున్నది.

లోకం చుట్తూ పరిభ్రమించే నేర్పును వేలికొసలపై నిక్షిప్తం చేసుకుంది
కష్టాలనూ కన్నీళ్లనూ కలగాపులగంచేసి
తాజా వార్తలరూపంలోఅందించి.
దృశ్య శ్రవణమాధ్యమంలో ఒద్దికగా నిబిడీకృతమై నిలిచిపోయింది.

ఇకాధ్యాత్మిక సందేశాలకోసం యే ఆచార్యులవారినీ సంప్రదించపనిలేదు.
శాలువాకప్పుకుని వీబూదిరేకలు పులుముకున్న వాళ్ళంతా
ఉదయాన్నే స్టూడియోలముందు మేమం టే  మేమని

బారులు తీర్చి భూపతుల్లా వరుసక్రమం లో నుంచుంటున్నారు.
గీతోపదేశమైనాసరే 'కీ' ఇచ్చినట్లు పలుకుతుంటారు
హితోపదేశాలమూటలను ఇట్టే విప్పేస్తుఇంటారు.

వేళ్ళకు ధరించే ఉంగరాలను గూర్చి చర్చించపనిలేదు
దివ్యమైన రత్నసంపదను వీధిల్లోకితెచ్చి అమ్ముతునారు.
 పడక్కుర్చీ ఇప్పుడు ప్రవచించడం నేర్చుకుంది.
ప్రభుత్వ మనస్తత్వాలకనుగుణంగా  పంచాంగ శ్రవణాన్ని
వినిపించి, విద్యావంతులకోవలోకి తమను తామేచేర్చుకుని
కులాసాగా ఉభయకుశలోపరి మాట్లాడుతుంది.
-----------------------------------------------------------------













ఒక విషాదం వెనుక
ఎన్నెన్ని గుండెగొంతుకల
నిశ్శేష రోదనలో.

ఒక చీకటి కోణం వెనుక
ఎన్నెన్ని వెలుతురుదివ్వెల
మలిగిపోయే పోకడలో.

ఒక విరోధం వెనుక
ఎన్నెన్ని రాగ ద్వేషాల
మలుకలయికలో.

ఒక వరదముంపు వెనుక
ఎన్నెన్ని అవినీతి అధికారుల
స్వంత లాభపు అంచనాల
సమాహారాల అవకరాలో.


ఒక బాధాతప్త హృదయం వెనుక
ఎందరు స్వార్ధపరుల
గునపాలు దించిన లోతయిన  పోత్లో.

ఒక సంతాపపు కవిత వెనుక
ఎన్నెన్ని అక్షరాల
 ఆత్మహత్యా సాదృశ్యపుపోకడలో.

ఒక కలత నిదుర వెనుక
ఎన్నెన్నిదు:ఖ భాజనుల
కన్నీటి సంద్రాలపై ఎగసిపడే
అలలనంటిపెట్తుకున్న అనుభూతుల
కవ్వింపుల కలరవాల సందడులో.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^.

స్వేదపుష్పాలు
---------------------రావెల
--------------------------------
శ్వాసప్రక్రియను చేపట్టినదేతడవుగా
రెప్పపాటునకూడావిరామ్మాన్నసించకుండా
అవిశ్రాంతంగా శ్రమించే
శ్రమజీవులుకదా శ్వాసకోశాలు.

అవి అత్యంత సహజంగా
 మానవనైజంకన్నా భిన్నంగా
తమసేవా ధర్మాన్ని దయాగుణంతో
నిర్వర్తించే నియమనిబద్ధతలకు
అవేగదా అక్షరాలా సోదాహరణాలు.

గడ్దకట్టించేచలిలోనైనా
రోళ్ళను బద్దలుకొట్తించే రోహినీ కార్తె

ఎండలలోనయినా క్షణమాత్రమేనా
యేమరుపాటుకులోనవకుండా
వాతావరణశాఖ హెచ్చరికలనుసైతం
 ఖాతరు చేయకుండా, నిస్స్వార్ధంతో
తమపనిని తాము విధ్యుక్తంగా
చేసుకుపోగలిగిన నిస్స్వార్ధ జీవులుగాదా
ఈ శ్వాసకోశాలు.

మనిషి నైజం మాత్రం  మరెందుకో ఇందుకు భిన్నంగా నడుస్తూ
నలుగురిలోనూ నగుబాట్ల పాలయి వేదనకు గురవుతూ వుంటుంది.
 కార్యాలయాలకుతమ తమ కార్యాలయాలకు చేరుకుని
కేటాయించబడిన కుర్చీలలో కూర్చున్నదేతడవుగా
కళ్లను గోడకమర్చబడిన గడియారాలకతికించి
ఎప్పుడెప్పుడు మనుషులోస్తారా వారితో ఫలహారశాలలకెళ్ళి
పనిని దూరంగానెట్టేసి కాలక్షేపానికే
ప్రాధాన్యతనిచ్చే పరభాగ్యోపజీవులుకదా
మన మానవకోటి.


 పైఅధికారి సెలవుపై వెళ్ళినా,
కార్యాలయంపనిమీద గ్రామాంతరం వెళ్ళవలసివచ్చినా
ఎవరికి వారే యమునాతీరేనన్నట్లుగా కార్యాలయాలు
పనిగండంగాళ్ళతో అధోగతికి ప్రస్థానం సాగించడం మనమెరుగనిదా?
ఇలా శ్వాసకోశాలను చూసయినా మనం శ్రద్ధాళువురై
నేర్చుకుని మన ప్రవర్తనతీరును ఎంతగానో మార్చుకోక తప్పదనిపిస్తుంటుంది. ఊపిరితిత్తులనుచూసయినామనిషన్నవాడు
తనపంధాన్ని మార్చుకోవాల్సిన అవసరమందరెరిగినదే.

సర్వ ప్రాణికో సదా ధ్యానమగ్నులై పనిచేసుకోగలిగితే
మట్టికూడా మాణిక్యంచేయగల పరుసవేదులై
 ప్రభవించగలరనడంలో నాకెలాంటి సందేహం
లేదన్నది నిర్వివాదాంశంసుమా!
***************************************



Wednesday, June 10, 2015

----------------రావెల
--------------------------


నేను అకస్మాత్తుగా
ఆకాశాన్నుంచి ఊడిపడ్డ
అయోమయాన్నికాదుసుమా
అనంత కాలంగా
 జనజీవనంతొ
పెనవెసుకుపోయిన
అమృతభాండాన్ని
ఆకలి అని అందంగా
జనం నోళ్ళలో నానుతూన్న
అనంత విశ్వస్వరూపాన్ని.

---------------------------
సుపాణినీలు.-----------రావెల
-----------------------------------

కళ్ళల్లో
 నీటిచలమలు
కర్షకులకవి
వార్షికాదాయాలు.
--------------------
నీటి ఘోష
నీకెమెరుక
ఎండిన చేలనడుగు
ఏకరువు పెడతాయి.
---------
చెరువంతటా
ఇళ్ళస్థలాలు
చేలకు నీరందక
ఊరంతా ఆక్రందనల పర్వాలు.
-------
పడకంటే
సరిపడక
నడకదారిలొ

ప్రతిప్రభాతానా
 ఉదయిస్తాను.
------------

Tuesday, June 9, 2015

ఈ చీకటి గుయ్యారం వెనుక
ఎంతచరిత్ర దాగుందో ఎందరికెరుక?
ఇవ్వళొక్కసారిగా తలుపులూ కొటికీలూ
తెరవగానే ఓ రకమైన
 తేజస్సు ఆవిష్కృతమయింది.
దగ్గరదగ్గర రెండేళ్ళు మూసిన
ఇల్లంతా మూగరాగమాలపిస్తూ
మౌన భంగం కాకుండా
 కాపాడుకుంటూఒచ్చింది.
చీకటితోనే ఇంటిలోని అణువణువూ
చెట్టపాట్టాలేసుకుని తిరిగాయి.

ఇప్పుడొక్కసారిగా వెలుగు వేనువూదుతూ
ఒక్కుదుటన విచ్చేసింది.
చీకటంతా చిందరవందరై చెల్లాచెదరైపోయింది.

వెలుగుమతాబాలు వెలిగించడమ్మొదలెట్టాక
మసిపువ్వొత్తుల్లాంటి చీకటికి స్థానమెక్కడుంటుంది?

అందుకే వెలుగులప్రస్థానం మొదలయాక
చీకటి చిత్తగించడం తప్పనిసరయింది.

ఒకందుకు చీకటినికూడాభినందించకుండా ఉండలేకపొతున్నాను.
పుస్తకాల బీరువాలచెంతకు