Saturday, February 28, 2015

కవిత రాయడమంటే
అడవి యేనుగును
అవసరార్ధం బంధించేందుకు
అనుల్లంఘనీయంగా ప్రయత్నించడం.

ఓ కందకాన్ని తవ్వు
దాన్ని ఆకులూ అలములతో కప్పు
 అందులో పడి ఘీం కరిస్తూన్న
ఓ ఉద్విగ్న రూపం ప్రత్యక్షమౌతూ
పెనుగులాడటం ప్రారంభమౌతుంది.
ఇప్పుడిక కష్టమైన పనల్లా
దాన్ని ఉపాయంతో లంఘించగలగడం.
మావటి వాడి రూపంలో
పరకాయ ప్రవేశం చేయడం.
అప్పుడిక నీలో అంతర్గతం గా ఓ భయం
తొణికిసలాడడం మొదలవుతుంది.
ఏరోజయినా దాని ఉగ్రరూపపు పద ఘట్టనలక్రింద
నలిగిపోవడం ఖాయమన్న జంకేగదా ఆ భయం!
[ఓ ఆంగ్ల కవిత ఆధారంగా]
===============================
యధాతధంగా
----------------రావెల పురుషోత్తమ రావు.

ప్రపంచపు పోకడలు
ఉన్నదున్నట్లుగా యదాతధంగా
స్వీకరించుకోవడం అలవాటు చేసుకుందాం.

ఉద్వేగాలనూ,  ఉత్తేజాలనూ
చీకటి వెలుగులనూ
సంతోషాలనూ, సంతాపాలనూ
ప్రణయాన్నీ, ప్రళయాన్నీ
సత్యాన్నీ అసత్యాన్నీ
అలానే ఉన్నదున్నట్లు గా స్వీకరించి
పరిశీలనగా గమనలోకి తీసుకుందాం!

కాలపు రేపటి భవితవ్యానికి ఊపిరులూదే
ఉచ్చ్వాస నిశ్వాసాలు
ఇవ్వళ మనం వేసే పునాదులపైనే
ఆధారపడివుంటున్నదన్న వాస్తవాన్ని
ఉరకలు బెట్టే యువతరం కని సాకారంజేసుకునే
స్వప్నాలపైనే నిర్మితమౌతుందన్న నిజాన్ని గమనిద్దాం.

అనురాగపు,ఆత్మీయతాజ్యోతులను ఇవ్వాళే మన ముంగిళ్ళలో
వెలిగించుకునే ప్రక్రియంకు మనం ఇప్పటికిప్పుడే నాందీ వచనం పలుకగలితే
సౌహార్దానికీ సౌబ్రాతృవానికీ శుభాశీసులు అనంతంగా అనవరతo లభిస్తాయి!
********************************************************************************
షరామామూలే!! తప్పదు చూడండి
            రావెల పురుషోత్తమరావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

ఇప్పుడిప్పుడే నా మరో యాత్ర మొదలయింది.
అప్పటికీ ఇప్పటికీ ఈ దారిలో
 చాలా మార్పు చోటుచేసుకున్నట్లుంది.

దూరం అదే గా ఉండిపోయినా
కాలంలో కళ్ళునమ్మలేనంత మార్పు చోటుకుంది.
ఋతువులూ తమవంతు సాయంగా
దశనూ దిశనూ మార్చుకుని
దగాచేయడం మొదలెట్టిందని
ఇట్టే అర్ధమయిపోతున్నది.

పింగాణీ జాడీలమెరుపుకన్నా
రహదారి మాత్రం నున్నగా సిమెంట్తో
ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లు
అవగాహనకు రావడానికి
ఇట్టే సమయంపట్టడంలేదు.

అప్పుడు దారిమధ్యలో వదాన్యులు
ముందు చూపుతో నిర్మించిన సత్రం బావీ
ఎండను మరిచిపోయేలా నీడనందించే వృక్షరాజం
రాజసంతో నాలాంటి పాదచారులను
రారమ్మని ఆహ్వానించే తీరికుండేది.

ఇప్పుడిక్కడ బావిలేదు అందులో
భానుడినిసైతం చల్లబరిచే
బుకెట్ తో తోడుకుని గొంతు తడార్చుకునే
నీటివసతీ మృగ్యమై పోయింది.

ఇప్పుడు ఆ శిధిలమైన సత్రంలో
అధునాతనంగా ఓ కొట్టు వెలిసింది.
ప్లాస్తిక్ బాటిల్ లో నీళ్ళను నింపి విక్రయించే
తంతు ప్రారంభమయింది.
గుట్కాలూ,కూల్డ్రింక్లూ షరా మామూలుగానే
చాటుమాటుగా లభ్యమవుతున్నాయ్ లెండి.

చెట్లన్నీ రహదారి విస్తరణలోఉనికినికోల్పోగా
దారంతా సరిహద్దుల్లో మనరక్షణకోసం
ప్రాణాలను పణంగా పెట్టి భార్యా పిల్లలను
అనాధలుగాజేసి వెళ్ళిపోయిన సైనికుడి
విధవరాలైన భార్యను తలపింపజేస్తున్నది.

వాతా వరణమంతా అతనికోసం శోకతప్తమైన
దేశం లా దీనంగా తరురహితమై దడబుట్టిస్తున్నది.

ఆధునికత మనుషుల సుఖ సంతోషాలనుమరచి
గుత్తేదారుల సౌలభ్యంకో సం విస్మరించబడ్డ నేతల
నిన్నటి వాగ్దానాల్లా ఇవ్వాల్టి బుడ్జెట్లా వెల వెలా బోయిన
మధ్య తరగతి వేతన జీవుల్లో గతంలో పడిన నిప్పులను
విస్మరించేరీతిలో విస్మయం కలిగించి విసనకర్రతో విసరుతూ
బడాబాబులకోసం బంగరు బాటలను నిర్మిస్తూ

బాటంతటా ఎర్ర తివాసీ పరిచి సగటు మనిషి నెత్తిపై
సుత్తితో ఘట్టిగా 'మోదీనట్లయి అరుణారుణ రెఖలా
అతని కంట కన్నీరుకు కారణమయిన క్రూరమైన బుడ్జెట్లా
రక్తకనీరును తెప్పిస్తూ నవ్వమని బలవంత పెట్టి
చక్కలిగిలి పెడుతూ నవ్వమంటూ ఆదేశాలిస్తున్నట్లనిపించి
గుండె నిండుగా విషాదం నింపి నవ్వితే  నవ్వండీ మాకోసం అన్నట్లు

వ్యంగ విలసితంగా ప్రభుత్వం శోభించాలని శతధా
ప్రయత్నిస్తున్న ధోరణి ఇట్టే వ్యక్తమై
 ఇది షరా  మామూలేకదా సోదరా !
 మళ్ళీ ఎన్నికల కలలకోసం ఎదురుచూడమని
మధ్య తరగతిని మందహాసానికి వెలేసినట్లుగా
వెల వెలబోతున్నది. దారంతా ఇక కంటకావృతమే
 దారి తప్పకుండా
జాగరూకత వహించమని హెచ్చరిస్తున్నట్లనిపిస్తున్నది.
*************************************************************[*28-2-15]

Friday, February 27, 2015

సుమవిలాపం
-------------------

అవును నీవన్నది నిజమే
నేను కేవలం ఓ గడ్డిపూవునే
ఏ వాసనా వెలయించలేక
తిరస్కారానికిగురౌతున్న
ఓ చిన్ని గడ్డిపూవునే.

కానీ నాకో హృదయముందనీ
దానికీ బాధాతప్తమైన
పొరలుంటాయని ఎంతమందికి తెలుసు.

ప్రభాత సమయంలో పార్కుల్లో పరుగెట్టే
ఆరోగ్యంపై అతి శ్రద్ధవహించే పాదచారుల
పదఘట్టనలక్రిందో పశువుల పరాన్ముఖత వల్లో
మా వూపిరి గాలిలో కలిసే దిశలో
అభద్రతాభావంతో అరక్షణీయమై
ఊగిసలాడుతూ వుంటుంది.

ఎవరూ అయ్యో పాపం చిట్టి ప్రాణం
 గిజ గిజ లాడుతుందని
జాలితలచి కన్నీటిబొట్టును రాల్చగాగలిగిన
కృపాదృష్టికెవరికుంటుంది  చెప్పండి?

కవుల క్రాంత దర్శనలో కనిపించాను గనుక
కనీసం అక్షరబద్ధమై పరోక్షంగానైనా
కొందరు మమ్మల్ను గూర్చి
ఆలోచించే అవకాశం లభించింది.

లేకపోతే ఇలా అనామకంగా
అమాయకమౌ  మానస సంఘర్షణలో
పడి నలుగుతూ  నాలుగు కాలాలపాట
వేదనాతప్త హృదయంతో

కాలం వెళ్ళదీయాల్సి వచ్చేది.కన్నీటికడలిలో పడికొట్టుకు పోయి
 చరిత్రహీనులుగా మిగిలి శేషజీవితాన్ని
 విషణ్ణ వదనంతోగడపాల్సి వచ్చేది.
********************************

Thursday, February 26, 2015

అమృతం కురిపించిన రాత్రి
-----------------------
నాజీవితంలో ఆనందమయిన రాత్రులు
నేనస్సలు బయటికి వెళ్ళవలసిన అవసరం రానివేసుమా!
అమ్మయ్య ఇవాలెక్కడికీ వెళ్ళనక్కరలేదు ఎంత హాయి ఈ రేయి
అంటూ పాత పాటను నెమరేస్తున్నది ఇంటావిడ హుషారుగా.
ఈలంటూ వేయడంవస్తే ఆపనికూడా చేసేసివుండునేమో ఆనందానికి.

హాయిగా ఈజీ చైర్లో తనువును ఆనించుకుంటూ
ఆవిడందించిన వేడి వేది కాఫీని చుక్క చుక్క సేవిస్తూంటే దొక
చెప్పలేని హాయి నులివెచ్చగా గొంతుదిగుతుంటుండి.
ఇష్టమైన ఓ చలం పుస్తకమో లతమ్మ మోహన వంసీనో
గోపీచంద్ గారి యమపాశమో చదువుతూ
మధ్య మధ్యలో తంపటిన వేరుశనగలనో

ఉడకబెట్ట్తిన కంది కాయలనో ఒక్కొక్కటే వొలుచుకుని తింటూ.

భోజనానికేం తొందరలేదు,నువ్వు తినాలనుకుంటే తినేసెయ్
ఈపుస్తకంగంటలో లాగించేస్తాను,సరేనా అంటే
ఆమే చిరునవ్వుతో అలాగే అని ఓ చిరునవ్వును విసిరేసి 
నాప్రక్కన ఓ వారపత్రికను చేతులో దొరకబుచ్చికొని
వారం వారం జీడిపాకంలా సీరియల్నవలను నమిలేస్తూ
ఆవిడానేనూ, ఇవ్వళ బయటికెళ్ళే పని లెదని
సంతోష పడుతూ ఇంతకన్నా ఈజీవితానికింకేం కావాలి
జీవితమే మధురమూ రాగ సుధా భరితమూ ప్రేమకధా 
మధురమూ ఈ దాంప త్యసీమ అంటూ ఆరాత్రిని
అమృతం కురిసిన రాత్రికన్నా అపురూపంగా తలుచుకుంటూ. 
==========================================

Wednesday, February 25, 2015

చివరకు మిగిలింది
-------------------రావెల పురుషోత్తమ రావు.

ఇకశేష జీవితం ఉక్క ఏడాదే
మిగిలివుందని తెలిస్తే
దిగుళ్ళరో బ్రదుకునిక
దిగజార్చడం మానేస్తాను.
ఒక్కయేడాదిపాటు
ఇచ్చి పుచ్చుకోవడంలోని
అపరిమితానందాన్ని అనుభవిస్తాను.
ఈ యేడాదిపాటు మనుషులను ప్రేమిస్తూ
చిన్నారులను మనసారా ఆశీర్వదిస్తూ
ఫలవంతంగా జీవితాన్ని గడిపేస్తాను.
నేను నవ్వుతూ ఇతరులను నా చిరునగవులతో
చిరంజీవంగా ఇతరుల హృదయకమలాలను చూరగొంటూ
కాలం కన్నీటికి దూరంగా నడిపిస్తూ  గడిపేస్తాను.
ఏ క్షణాన్నయినా ఆ  శీతల మృత్యువు కౌగిలిలోనికి
ఒరిగిపోక తప్పదన్న భావనలో చిరంతనం
చిరునగవులను పంచుతూ, స్నేహహస్తాన్న్ని అందిస్తూ
తోటి ప్రాణుల కష్ట సుఖాలలో అనునిత్యం పాలు పంచుకుంటూ
ఆ యజమాని ఆజ్ఞలను వినమ్రంగా అమలుచేస్తూ
పరోపకారిగా ప్రజా హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకుంటూ ఈ శెషజీవితాన్ని చివరకు మిగిలిన
చివరకు మిగిలింది ఈ ఘడియలనే
మధుర క్షణంగా భావిస్తూ జీవితాన్ని 
చరితార్ధం చేసుకుంటాను.
[  ఓ ఆంగ్లకవిత ఆధారంగా]

===========================
మన్నించి వదిలేసి--
================రావెలపురుషోత్తమరావు.
**************************************
ఇప్పుడు మౌనం మాట్లాడినా
నిశ్శబ్దాన్ని నిఉవెత్తునా నిండు  కౌగిలిలొ
నలిపి నమిలేసినా ప్రయోజనమేముంది?

నేరమంతా జరిగి దొంగలంతా జారుకున్నాక
ఆప్రదేశానికి ఆదరా బాదరా రొప్పుకుంటూ
రోజుకుంటూ, రక్షక భటసమూహం
ఈగల్లానో దోమల్లానో వచ్చి వాలినట్లు.

ఆడతనాన్ని అందంగా చూపిస్తున్నానని
అర్ధ నగ్నంగానో అసలు నగ్న స్వరూపానికి
అతిదగ్గర గానో సౌందర్యాన్ని హరించేసాక
ఇప్పుడు ఆమౌన ఋషి మాట్లాడి లాభం యేముంది.

నాభి చుట్టూ కటి చుట్టూ వలయాకారంలో
మీద విసరగా ఫలక్షతాల గాయాలు మానతాయా?

ఆడతనమే శాపమయిందనుకునే కన్నె పిల్లల తల్లిదండ్రుల
మౌనంగా ఆలపించిన శోకండాలకు చరమగీతం పడుతుందా?

జరుగుతున్న అత్యాచారాలకు నేపధ్యం ఈ దృశ్య సంపద
కారణంకాకుండా పోతుందా? క్షణం క్షణం
ఆ అడవిరాముడి దెబ్బలకు ఆక్రందించిన ఆడతనం

ఊరడింప బడి ఉన్నతంగా జనాల మనో ఫలకాలపై
కొత్తముద్రలను ముద్రించగలుగుతుందా?

ఇప్పుడింకామౌనం మాట్లాడినా ఒకటే ఈ మూగతనం
ముసిముసి నవ్వులతో మురిసిపోయే గడువు మించిపోయింది.

మనుషుల్లారా !!మన్నించి వదిలేయండి.
క్షత గాత్రాలపై చణకులు సంధించడం మానేయండి.
మన్నించి వదిలేసి-- మామానాన్న మమ్మల్ను బ్రదికేలా

త్యాగమూర్తుల్లా -మీదారిన మీరు --చిత్తగించండి.
=========================================

Tuesday, February 24, 2015

చేవ్రాలు--
                             [స్వహస్తాలతోనే సుమా!!]
================================రావెల పురుషోత్తమ రావు.

అక్షరానికి ఆయువు పోయాలని వుంది.
దాన్ని మర్రినీడలామారకుండా
కాపాడ వలల్సిన అవసరమూ మనకే తప్పకుండా వుంది.

అక్షరానికి ఎవరి దృష్టీ తగలకుండా జాగ్రత్త వహించాలి.
అంతేకాదు ఎవరి ఉసురూ దానికెప్పుడూ తగలకూడదని 
అనునిత్యం ఆశించాల్సిన ఆవశ్యకత
కూడా మన భుజస్కంధాలమీదే 
వుందన్న స్పృహనుకూడా  మనమే గుర్తెరుగాలి.
అక్షరాన్నిగవాక్షానికి కూడా అందుబాటులొనే వుంచాలి.
అందరం దాన్ని అందుకుని సంతసించే వీలుండాలి.
అక్షరం అజరామరమై వెలుగొందాలని మనసారా ఆశిద్దాం.
********************************************


కవిత్వాన్ని నమ్ముకుంటే పడే ఇబ్బందులు చాలా ఉన్నాయ్
ఓరాత్రిపూట సముద్రపు ఒడ్డున నడక సాగిస్తుంటే
కిందన హిమ శైతల్యాన్ని తలదన్నే చలితీవ్రత
పాదాలకింద నలిగిపోతున్న సైకత రేణువుల వల్ల తెలుస్తుంటే
పైన ప్రకాశించే తారాగణపు   సమూహం
మూకుమ్మడిగా పరిహాసాలతో
పరాచికాలాడడం మొదలెట్టింది..
కవిత్వపు రచనల్లొ ఎదురయ్యే కష్టసుఖాలు
అంతా ఇంతా అని చెప్పడానికి వీళ్ళేదు.
చిరుచేపలన్నీ చేపలచెరువులో తుళ్ళిపడే  ధోరణి
చిన్న చిన్న కుందేటి పిల్లలు వడివడిగా తల్లి వొడిలోంచి
చెంగు చెంగున చెంగు చెంగున క్రిందకు దూకి గడ్డితివాసీలపై
పరుగెడుతూ కంగారు పెడుతున్నట్లు పదే పదే అనిపిస్తుంటుంది.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
అమ్మ మనకెప్పుడూ అపురూపమైన దేవతా స్వరూపమే.
అమ్మంటే పూర్ణమినాటి పిండారబోసిన పండు వెన్నెల
అతిదగ్గరగా ప్రవహించే అనుభూతుల సెలయేటి గలగలలు.

వసంత కాలపు రాకతో తనివితీరా నవ్వుకునే
లేలేత చివురాకుల సుతిమెత్తని సుకుమారంకూడా  అమ్మేకదా!

అమ్మంటే దినమంతా ఇల్లంతా కలయదిరిగే యంత్రం మాత్రమే కాదు.
అందరి అనుపానులు తెలుసుకుని 
అద్వితీయంగా సహకరించే సౌందర్య సీమ.

అనురాగ సముద్రం--అనుభవాల నరసి పట్టుకునే అందాల మకరందం.
ఇంటి వాకిలిముందు ప్రభాతానికే ముద్రితమై 
సోయగమొలికించే ముత్యాల ముగ్గు.
తోటముంగిటిలో సువాసనల సుమగంధం.
అమ్మంటే గ్రీషర్తువులో అందుకునే నారికేళ ఫలసారం.
హేమంతర్తువులో నులివెచ్చదనాన్నందించే ఊలు శాలువా!
వర్షాకాలంలో తడిసిముద్దయిపోకుండా కాపాడే చత్రం.

శిశిరంలోనయినా కుటుంబ సంక్షే మo కోసం తాపత్రయపడే
రంగు రంగుల రామణీయకమై వెల్లివిరిసే పత్రసౌందర్యం.
+++++++++++++++++++++++++++++++++++++++++

చెలిమికథ----------------
అణువణువున నీవేఅధివసించి యుండనాకేల కలిగెనోఈ వెఱపు నివ్వెరపాటు.
అంతరంగమున నీవేఅంతర్హితమై నడయాడనాకేల నాలోన వింత తొందరపాటు.
ఆన్నీ ప్రవాహ దిశలందు, దశలందునీవె నావ నడుపుచునుండఎందుకింతగ కలిగెఈ ఉలికిపాటు.
మనిషి మనసును దెలిసిమనసు మెచ్చిన మహిళమార్గదర్శిగనుండ ఏమరుపాటునాకేల?నా హృదయ నేస్తమా !!
-----నా హృదయ నేస్తమా !!వొగుడాకు వలె నీవువణుకు చుండుట తగదుమేరునగ ధీరునిగమారవలె నీవింక
కలతజెందుటదేల?కరుణజూపెదనయ్య దయయు శాంతము గలిపిధర్మమొసగెద నిజము.
కలికాలమన్ననేకాలుష్య కారకముఅఘపు శాతము పెరిగిఆనందమె క్షీణించు.
భక్తి యొక్కటె మిమ్ముబాధలన బడకుండఅనునిత్యమూ గాచిఆదుకొను దైవతము
మనిషి మనిషిగ మారిమనగలుగుటే మేలుదానవత్వము వీడిధర్మ మార్గము నడుప.
తోటి మనుజులపట్లకొంత క్షేమము దలచిచెంతనున్న ధనముచెలిమి బలమని నమ్ము.^^^^^^^^**********************

Monday, February 23, 2015

కమ్మని కలల కళాఖండం--
-----------రావెల పురుషోత్తమ రావు.
**************************************

ప్రతిరోజూ సమయం మీరకుండా
ఇంటికి తిరిగొస్తున్నప్పుడు
వీధి మలుపులోనే
విరజాజి పూవులా గుబాళించే
సురబిళ పరిమళం అమ్మ.

ఇంటికి చేరువవుతుండగానే
మరువంలా, దవనంలా గట్టిగా
 భుజ తట్టి ఈలోకంలోకి గట్టిగా
లాగి ఈడుకొచ్చే దివ్య స్వరూపం.

ముఖ ద్వారం దగ్గరే నిలబడి
ముసి ముసి నవ్వుల నదిలో
ముగ్ధ మనోహరంగా ప్రవహించే
పూల పడవ

నేను ఇంటిపట్టున ఉన్న నాల్రోజులూ
స్వేద సంద్రమై సాక్షాత్కరించే
కమ్మని పిండి వంట.

అమ్మంటే నాసికా పుటాలచెంత
పట్టు విడవకుండా పట్టి వుండే
ఇంగువ సువాసన.

చేదు అనుభావాలను గుండే గొంతుకలోనే
కట్టి పడే సి కదలాడే
కమ్మని దేవతా మూర్తి అమ్మేగదా!

నేను మళ్ళీ తిరిగి పెద్ద చదువులకై సాగిపోతుంటే
కన్నీటికడలియై ఆత్మీయతాక్షలను
శిరసుపై రాలుస్తూ చిరంజీవ అంటూ
దీవించే దివ్య భావనా మధు కలశం.

ఆరోగ్య సూత్రాలను వేద పనసలా
వల్లించే ఘనా పాఠి గదా అమ్మంటే.
చదువులు పూర్తయిన వెంటనే
ఉద్యోగం వచ్చినదని చెప్పగానే
మొదటిజీతంతో నీకు నప్పే మంచి బట్టలు కుట్టించుకుని
ఆఫీసుకు అందంగా తయారయి వెళ్ళుతుండమని
పదే పదే విన్నవించే విన్నాణ సర్వస్వం అమ్మ.
----------------

[ ఊహలంటూఊపిరి పీల్చుకోని   చిరు ప్రాయంలో
మా అమ్మనూ ,సంతోషం ఆకాశమంతటా అల్లుకుంటూ
తారా స్థాయికి చేరుకునే సమయంలో
నా పిల్లలకు తల్లిగా తనివి తీరని
ప్రేమామృతాలను వర్షింపజేసిన వాళ్ళ
 అమ్మనూ నా జీవిత భాగస్వామిగా
ఇంట్లో ఆనందోపదేశయుజే అన్నట్లు నందనవనమై ప్రభవించి
కనుమూసి తెరచేలోపు  దూర దూర తీరాలకు
ఆ సర్వమంగళ స్వరూపాన్ని సాగనంపుకున్న
మా దురదృష్టానికి పదే పదే విలపిస్తూ--]
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^23-2-15

Sunday, February 22, 2015

కావ్యావతరణం--
-----------------రావెల పురుషోత్తమ రావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
కవులెందుకు కావ్యాలను
వెలయిస్తారో తెలియడంలేదు.
అష్టాదశవర్ణలతో అధిష్టాన దేవతలను
పౌరాణికాలనుంచి పట్టుకొచ్చి
అసమానమైన పాతివ్రత్యపు ఔచిత్యాన్నందించి 
భువిలోని జనులందరికీ ఆదర్శంగా నిలపాలన్న
కోరికతో అలా ఇతివృత్తాలను స్వీకరించి యుండనోపు.



రాజాశ్రయంకోరి కొందరు రాణీప్రేమపురాణాలకు
ఔచిత్యాన్నాపాదించి వారిముఖస్తుతిని కావ్యాలుగామలచి
శృంగార రసగంగాధరులుగా వారి జీవితాలను
రసమయంజేసే రామణీయార్ధంకోసం
గజారోహణాల గ్రాహకంగా మార్చుకోడానికో
ప్రబంధాలను ప్రకృష్ట పదబంధాలుగా
తీర్చిదిద్దుతూ రచనలు సాగించి క్షీణ ప్రబంధయుగానికి
మెరుగులు దిద్దో నాందీ వచనాలు పలికో వుండి వుండవచ్చును.


కవులెందుకు కావ్యాలను వెలువరిస్తారో అవగతమవదు

ఊహల్లో విహరించే ప్రేయసిని ఉన్నత శిఖరాలకధిరో హింపజేసే
సదుద్దేశంతో ప్రణయ కవితా మహాసంద్రాల్లో మునిగితేలుతూ

లలిత లలితమైన పదబంధాలతో భావగీతాలను గిలికి
ఆధునిక కాలంలో అల్లకల్లోలంగా మారిని జన హృదయాలను
మరో లా మనసును చల్లబరిచే భావనా స్రవంతికి

ఏతమెత్తే సద్భావనా విలసితంగా కావ్య సంపుటులను
వెలికిదెచ్చి వేదనాతరంగాలకు కొంతమేర ఉపశమనం కలిగించి ఉండవచ్చును.

కవులెందుకు ప్రగతిశీలమైన కవితలతో అధోజగత్తులో
అట్టడుగున వెంపర్లాడుతూ అలంటించే వారికి ఉపశమనం కలిగిస్తూ
కడుపునింపుకుని అల్లకల్లోలాలను సృష్టిస్తూ ప్రగతిరధాన్ని
తిరోగమనం పాలుజేయాలన్న వారి తిక్కనడంగించడానికీ
కడుపు మండిన వారికి సాంత్వన చేకూర్చేలా సమసామాజనిర్మాణమే
లక్ష్యంగా మరోప్రపంచపు ధగద్ధగలను సామాన్యుడికీ
పరిచయంచేయాలన్న తపనతోనూ మహాప్రస్థానం వైపు
వారి వారి మనసులను మళ్ళించే దివ్య భావనతో ఉత్తేజపరిచే
కవితలతో ఉద్యమ స్ఫూర్తికి భంగం వాటిల్లకుందా
ప్రబోధగీతాలనూ ప్రచార ధోరణిలో వెలువరించి ఉందనోపు.

స్మాతంత్ర్యం సముపార్జన ధ్యేయంగా స్వార్ధాన్నీ సంకుచితత్వాన్ని
కాలరాచుకుంటూ రాష్ట్రావతరణకోసం ప్రత్యేక భావాలను
సముపార్జించే ప్రబోధలక్ష్యాలతో కవితలను ఉత్తేజపరుస్తూ
వెలువరించి తమ గమ్యంకు  ప్రజలను చేర్చే దిశగా ప్రయత్నిస్తూ
గీతాలను జనహృదయాలకు హత్తుకుని వారి లఖ్యం నెరవేరెందుకు
రచనలను ఆధునిక భావాలకనుగుణంగా మలచుకుంటూ రచనలు చేసి వుండవచ్చును.
మధు కీల
=============

నింగినుంచి
నేలమీదకు
క్షణకాలం పాటు 
దూకి పడిన
ఉల్కలా నీవు.

మానసిక హిమ సాగరంలో
శోకతప్తయై
కృద్ధలా విలపించే నేను

ఘనీభవించేందుకు
ససేమిరా సిద్ధంగా లేనని
మొరాయించే గుండె 

ప్రతిక్షణంలోనూ
నీ రూప స్మరణమే
నిఖార్సుగా నిలబడుతుంటే
శోక రహితంగా సాక్షాత్కరించలేని
నా అసమర్ధపు బ్రదుకు పాట

వ్యధా తప్తమై,  ద్రవీభూతం కాలేనని
ఘనమై,  అనురాగ ధనమై
వేదనాంతరంగం వెదుకులాట
మొదలెట్టింది. నింగికీ నేలకూ
నిచ్చెన వేసి నీ సన్నిధికి
ఎగబ్రాకాలనే వ్యధార్త హృదయం
కన్నీటికే కొంగ్రొత్త నిర్వచనం
పలుకుతున్నట్లుంది కదా శ్రద్ధగా గమనించు.
ఆ దివినుంచి ఈభువి మీదకు
నీ విశాల దృష్టిని ఒకసారి
క్షణ కాలమో,కనీసం ఓ లిప్త పాటైనా  
దయామృత వర్షిణివై సారించు.
=====================

Saturday, February 21, 2015

అగణిత సత్య బాష
-------------------------
అతి ప్రాచీన వారసత్వంగల పార్టీ
గణిత శాస్త్రంలొ తన అజ్ఞానాన్ని చాటింది.
కూడికలూ తీసివేతల్లో  వేడి పప్పులోకాలేసింది.
భాగహారాన్ని సమయం సందర్భ శుద్ధీ లేకుండా చేసి

ఆ రాష్ట్రపు ఉసురును బహుదా తలకెత్తుకుని మోసింది.
ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలలోనూ
శూన్య సంఖ్యనే చక్కగా సాధించుకుండి.
దేశ రాజధానిలోనూ ఇదే వరుసను తిరిగి తెచ్చుకుంది.

జనవాసాలకు దూరంగా ఇప్పుడు
వారి ఊసులు నెమరేసే వీలు కలుగ [లే]నంత దూరంగా
తల్లీ కూతురూ కొడుకూ 10 జనపధ్ లో
అజ్ఞాతవాస దీక్షను జేసుకుంటూ
మౌన వ్రతాన్నాచరిస్తూ పుణ్యంగట్టుకుంటున్నది.
=======================================

నిశ్శేష జాడ్యాపహా!!

*************************
ఎగసి పడే అలలనెలా తమాయించుకోగలనో తెలియడంలేదు,
పొంగి వస్తున్న శోక జలధినెలా సంబాళించుకోగలనో
అవగతమవడంలేదు.

రాగరహితమైన మనసునెలా రాగ రంజితమొనరించుకోగలనో
బోధ పడడంలేదు.

హృదయదఘ్నంగా పేరుకుపోతున్న విషణ్ణాన్నెలా
నేర్పుమీర తొలగించుకోగలనో తెలియడంలేదు.
మనసును వ్యాకుల పరుస్తున్న అస్తి,నాస్తి విచికిత్సనుంచి
ఎలా గట్టెక్కాలో అవగతం అవడంలేదు.

కాలం కురిపిస్తున్న కన్నీటిజడులనెలా
చెలియలికట్టను దాటించగలనో ఎరుక పడడంలేదు.

మనసునంతా ఆవరించుకున్న మౌన హిమాలయాన్ని
ఎలా అధిరోహించి సమ ర్ధించుకోగలనో బోధపడడంలేదు.

ఈ శే షప్రప్రశ్న ల కు  సమాధానాలకోసం
ఎంతగా శ్రమకోర్చి స్వేదం వెలార్చాలో గుర్తుకు రావడం లేదు.
=======================================================
అంతరాంతరం
----------------రావెలపురుషోత్తమరావు
==========================================
అంగట్లో రతనాలు
అమ్మిన తరం నాదికాదు
ఇంటి వాకిట్లోనే అమ్మతనాన్ని
అమ్ముకుంటున్న తరం నాది.

స్వాతంత్రంకోసం స్వార్ధాన్ని
త్యాగం చేసిన తరం నాదికాదు
స్వార్ధంకోసం స్వాతంత్రాన్ని
త్యాగంచేయగల తరం నాది

విదేశీ వస్తు బహిష్కరణలో
పాల్గొన్న తరం నాదికాదు.
విదేశీ విద్య,ఉద్యోగాలకోసం
మేధోవలసల వారసత్వం నాది.

కవిత్వానికి 
గజారోహణం గావించిన ఘనమైన తరం నాదికాదు
కవిత్వాన్న్ని ఆస్వాదించడమే 
కను మరుగు చేసుకుంటున్న  కబోది తరం నాది.
==========================20-2-15

Friday, February 20, 2015

పాంచ భూతాత్మికం--
------------------
ఆకాశమంతటా  నువ్వే విస్తరిస్తూ పోతుంటే
మబ్బు కన్నెలకు నిద్రెక్కడ పడుతుంది?

వనమంతటా నువ్వే పరిమళవీచికలై ప్రభవిస్తే
పూల బాలలకు ప్రశమించే చోటె క్కడుంటుంది?

అంతటా నువ్వే ఆనందార్ణవమై ప్రవహిస్తే
కరుణ రసానికి నిధి ఎక్కడ సంప్రాప్తిస్తుంది?


అంతటా నువ్వే అగ్ని శిఖలను రాజేస్తూ పోతే
కాలుష్యపు కోరలకు దహనమయ్యే తీరికెక్కడ లభిస్తుంది?

భూమ్మీదంతటా  నీ ప్రాభవమే ఋజువౌతుంటే

 ప్రణయమా! వగపుకింక వనవాసమే శిక్షగా మిగులుతుంది.






Thursday, February 19, 2015

సిరి సిరిమువ్వలు
===========
ఆకాశం నుంచి
ఊడిపడ్డ ఊర్వశిలా
నా భావ కవిత
----------------
మహాప్రస్థానానికి 
చేరువవుతూ
నా అభ్యుదయ కవిత
----------------
పల్లె తల్లికి
నుదుటన తిలకంలా
నా జానపదం
--------------
ప్రాచీనానికి
వారసురాలిగా
నా సీస పద్యం
----------------
నిన్ను మురిపించేలా
అనునిత్యం
నా ప్రణయగీతం.
--------------------
---------------------------
వాస్తవమ్ము నార్ల వారి మాట
------------------------------రావెల పురుషోత్తమ రావు.
చిక్కనైన భావాలతో చక్కని సంపాదకీయాలతో జనాన్ని జాగృతపరిచిన,చైతన్య పరచిన
బహుదా శ్రమించిన ఘనకీర్తి నార్ల వేంకటే శ్వరరావు గారిది.
వాడియైన కలం బలంటో చదువరులనాకట్టున వ్యక్తి నార్ల వారు.
తను నమ్మిన సిద్ధాంతాన్ని సునిశితంగా,సుందరంగా,పరిశీలనాత్మకంగా వివరించి చెప్ప్పగలిగిన వివేకమూ,వివేచనా గలిగిన మహా మనిషి,నార్ల

ఆత్యయిక పరిస్థితిని జనం అనుభవిస్తున్న కాలంలో సూటిగా మేటిగా తనసునినిశితమైనవిష్లేషణాత్మక వ్యాసాలద్వారా
వివేకవంతులను గావించడంలో విశేష శేముషీఖని నార్ల వారు.

నిత్యం మననిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలను,మనకళ్ళెదుట
జరుగుతున్న విసేషాలను వేమన సతకంలోని పద్యాలవోలే
హిత బోధజేసేలా, ఉపదేశాఅత్మకమైన ధోఋఅణిలో హితబోధగావించే
ధోరణిలో వాస్తవమ్ము నార్ల వారిమాట అన్న మకుటంతో 300 పైగా
పద్యాను సంపుటీకరించి 1956 సంవ్సత్సరంలో వెలువరించారు.

ఆతరువాతి కాలంలో ఆంధ్రజ్యోతిలో నవయుగాల బాట నార్ల మాట
అనేమకుటంతో ఇంకొన్ని ఆటవెలదులను వ్యంగ భావ స్ఫూర్తితో
వెలువరించారు. ఈ పద్యాలు ఎందరినో ఆకర్షించి అలరించడమేగాక ఆలోచింపజేస్తాయి. ప్రజాస్వామ్య యుగోదయాన్ని ప్రస్తావిస్తూ
  రాజుపోయె అతని రాణువబోయెను
----------------------------------------\'
కాకి గోల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
ఈ పత్రరహితమైన తరువుల తరఫున
మాట్లాడే అధికారం నీకుందా?
ఆ ఇనుపతీగపై ఉతికి ఆరేసిన
ఆమే రాత్రి దుస్తులూ,
అతని పొట్టిచేతులచొక్కా లను
విసురుగావీచే ఈ గాలి
ఏం చేయనున్నదో నీకెరుకనా?
ఈ నల్లటిమేఘాలను గూర్చి
నీకు తెలిసిన సమాచారమేమిటి?
అలాగే ఆకొలను నిండా నిండిపోయిన
రాలిపడిన ఎండుటాకులగూర్చి నీకేం తెలుసు?
ఇంటిముందున ఎండకెండి వానకు తడిసీ
తుప్పు పట్టిపోతున్న కారును గూర్చిన
పూర్తి సమాచారం నీకు తెలుసా?
ముందున్న గోతిలో తాగిపడేడిన
బీరు సీసాలపై తీక్షణంగా
దృష్టి సారించేందుకు నిన్నెవరు అనుమతించారు?
ఇంటిప్రక్కన విధవావిడ ఇంటిముందు
చెట్టుకు ఉయ్యాలనెవరునెవరు వేలాడదీసారో
నీకెమైనా సమాచారముందా?
ఒక్క నిముషం ఈప్రశ్నలన్నింటికీ
సరయిన సమాధానాలు నీదగ్గరున్నాయా లేవో
ఒక్కసారి నీ అంతరంగాన్ని తడిమి చూసుకో
ఈరహదారి మీద ఈ తెల్లటి రంగు గీతలకర్ధమేమిటో
వివరంగా నీకు తెలుసా?
లేదా కాకిలా రెక్కలంగలార్చుకుంటూ
కాకిలా శాఖాచంక్రమణంచేస్తూ
సద్దు చేయకుండా తరలిపో--సరేనా?
[ఓ ఆంగ్ల కవిత ఆధారంగా]
=================================

Wednesday, February 18, 2015

షరామామూలే --------------
==================
నేనిక వదన గ్రంధం లోకి అడుగుపెట్టాలి
అమ్మ చెప్పగా పుస్తకంలో రాసుకుకున్న
వంటకాలనన్నింటినీ ఇక్కడ
ఇవ్వళ నేనింట్లో చేసినట్టుగా
 నావిగా,  వండి వడ్దించాలి.
కట్టుకున్న మొగుణ్ణి కర్రీ పొయింట్
దగ్గర వదిలేసి వచ్చానిప్పుడే
అది ముఖ పుస్తక మిత్రులెవ్వరూ
గమనించకుండా జాగ్రత్త పడాలి.

ముదివగ్గులైన అమ్మా నాన్నలను
నస భరించలేనని చెప్పి
చెల్లినీ , తమ్ముడినీ, ఒప్పించే ఓపికలేక
వృద్ధాస్రంలోచేర్చి హాయిగా 
గాలి పీల్చుకుంటున్నాను.

అతామామలనెపుడూ ఆప్యాయంగా 
పలకరించిన పాపాన పోలేదన్ 
అవకాశం దొరికినప్పుడల్లా  ఇ
ఆయనెప్పుడూ దెప్పి పోస్తున్నే ఉంటారు.

ఇవ్వళో రేపో "మానవత్వపు పరిమళాల"  పై
నేను చేసిన అంతర్వూహాలానన్నింటినీ
సంపుటిగా తీసుకొచ్చే ప్రయత్నం పూర్తవుతుంది.

ఆవిష్కరణమహొత్సవావానికి అందరూ వచ్చేలా చూసుకోవాలి.
ఇక నేను వదన గ్రంధంలో హృదయదఘ్నంగా ప్రవేశించాలి.
పరకాయప్రవేశం చేస్తున్నానని చుట్టాలంతా
పరిహాసంచేస్తూ ఆటపట్టిస్తుంటారు.
ఇవన్నీ షరా మామూలే నా అభిమాన
 సంఘ సభ్యుల సంఖ్య అందరికన్నా అధికమై వెలగాలి.

అనుకోకుండా లభించిన ఈ మహదవకాశమనే
అఖండజ్యోతిని ఆరకుండా కాపాదుకోవాలి.
________________________________
తా .క : ఇదిఎవరో  ఒక్కరినీ నుద్దెశించనదని
 మాత్రం తలపుకు రానివ్వకండి. 
======================================

Tuesday, February 17, 2015

రాజకీయానికే   రాచపుండు పుట్టినట్టుంది.
-----------------రావెల పురుషోత్తమరావు.

మనిషికులానికేదో  గత్తరొచ్చినట్లుంది.
మన్ను దిన్న పాముల్లా ముసుగు కప్పుకుని
దీర్ఘ నిద్రలోకి జారుకుంటున్నారు.
తెలిసిన వాళ్ళుకూడా తెలియనట్లే
తోటివారనికూడా చూడకుండా
కప్పదాటుగా  దాటుకుంటూ నడిచిపోతున్నారు.

మనిషి జాతికేదోగత్తరొచ్చినట్టుంది.
నెత్తురునుడికించే వార్తలను చూసినా
చిత్తుగా తాగి పడుకున్న 

పానశాలలను గట్టిగా పట్టుకుని 
వదలనంటున్న బానిసల్లా
బరితెగించి మరీ ప్రక్కకు 
తప్పుకు పోతున్నారు.
యేఒక్కరికీ ఆవేశం ఒక్క ఆవగింజంతైనా 
ఉబికి పైకి తన్నుకొస్తున్న దాఖలా కనిపించడమేలేదు.

మానావాళికంతకేదో పుండుబుట్టినట్టుంది.
మనహక్కులు హరిస్తున్నారని
కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా
క్రూరంగా వాటిని కర్కశపు ధోరణిలో
కాలరాస్తున్నారని తెలిసినా
కుంభ కర్ణుడి వారసుల్లా
మౌన ముద్రను వీడడంలేదు.
నిద్రాదేవత బిగికౌగిలిని
వదలి బైట పడలేకపోతున్నారు.
మనమనుగడకే ప్రమాదం 
వాటిల్లబోతున్నదని తెలిసినా
మగత నిద్రలోనే ఇంకా జోగుతున్నారు.
-----------------------------------------------------15-2-15
నలభయ్యో పడిలో--నరుని బ్రదుకు
-----------------రావెల పురుషోత్తమ రావు.
నలభయ్యోపడినంతనే
మనుషుల తీరులో అనేక  మార్పులు సంభవిస్తాయి.
అవి మరీ కొట్టొచ్చిన రీతిలో
మనకు అనునిత్యం సాక్షాత్కరిస్తాయి.
వాళ్ళు వదిలి వచ్చిన గది తలుపులకు
గడియలుతరచుగా  బిగిస్తూ వుంటారు.
గట్టిగా తాళాలు వేసి లాగి మరీ చూస్తారు.

నలభై మెట్లదారిలో సగం మెట్లలోనే
ఒ మజిలీ ని సృష్టించుకుని మరీ ఆగుతాతారు.

ఆ దారినెప్పుడూ చూడని వారిలా 
ఎగాదిగా చూస్తుంటారు.

నదీ ప్రవాహంలో తొణికే పడవలా
కొద్దిగా చలన సహితమై కనబడతారు.

ఎదురుగా అమర్చబడ్డ నిలువుటద్దంలో 
దూరంగా నిలబడి  జుట్టును సవరించుకుంటూ
దుస్తులను సర్దుకుంటుంటారు.
మెడకు టై కట్టుకునే కొడుకులో తన బాల్యాన్ని
గమనించి గుండె నిండా నవ్వుకుంటారు.
ఆక్షణంలో ఆ తండ్రి మొహంలో
నులివెచ్చదనం చోటుచేసుకుని
మెరుపు తీగలా ఆనంద రేఖను
మురిపెంతో ప్రతిబింబిస్తుంటారు.
ఆ ఆనందం అసుర సంధ్య వేళలో 
మెల్ల మెలగా వినబడే పక్షిగణపు
కిల కిలారవాల్లా దూరంగా వన సమూహం నుంచి
తొంగి చూస్తున్నట్లుగా వినబడుతుంది.
తన ఇంటిదాకా ఆవిహంగతతి తోడూ నీడగా
అనుసరిస్తున్నట్లు లీలగా కనుపిస్తుంది.
************************************************
         [ఓ ఆంగ్లకవిత ఆధారంగా]
భక్త్యంజలి
============
పరమ శివుని గళ సీమలొ
పాపసరుల దండ
పార్వతమ్మ నునుసిగ్గుల
బుగ్గ సొట్టలె ఇక అండ.

మధుపర్కం మారుగా
తోలుసీర వరుమానం
గిడుపారు కన్నులతొ
విడిదికింక పయనం
మొదటిరాత్రి ఈనాడు
శ్మశానాన పడక
భక్తకోటికందరికీ
బూదితొ విందు భోజనమని
వారికందరికీ ఎరుక

శివరాత్రి నాడు చేయు
శివపూజలె మన కభయం
అండనుండు మనకికపై
వాగర్ధపు దాంపత్యం.
 ఇతిశివం బహుదా శుభకరం

మహాశివరాత్రి భువినంతా పర్వదినం
శివనామ స్మరణమే సర్వత్రా శుభకరం
మహాశివుని అభిషేకములే
మానవాళికి మంగళప్రదం.
=============================
శివదేవుని కల్యాణం
==================

శివదేవుని కల్యాణం
మెడలో పాపసరులే
పార్వతమ్మ వేయు వరమాల
-----------------------------
శివదేవుణి కల్యాణం
బలుపొడ తోలుసీరయే
దక్షు డిచ్చు మధుపర్కం
---------------------------

శివదేవుని కల్యాణం
మొదటిరాత్రినాడు
శ్మశానంలోనేగదా పడక.

----------------------
శివదేవుని కల్యాణం
గిడుపారు కన్నులతో
భక్తుల కాశీర్వాదం
--------------------------
శివదేవుని కల్యాణం
ముక్కోటి దేవతలకు
బూదియే విందుభోజనం
==================

Monday, February 16, 2015

కొండ కోనలలోన
వెండి వెన్నెలవోలె
వలపు తలపుల తడిసి 
మెరిసి మురిసెను వలపు.

 అడవి దారుల తిరిగి
మధుర ఫలముల మేసి
రమ్య భావనలరసి
రాగరంజితమగుచు
రాణకెక్కెను వయసు

యేడ నున్నదొ తాను
నేను ఎరుగగలేను
వెదకి తెలుపుడు మీరు
అప్సరో భామినుల
అంతరంగములాన
ధన్యునిగ తలతును
మీరలిచ్చెడు సేవ
మరువజాలను మదిన
ప్రతిభ బడసిన మీరు
పరాకు పడుటే తగదు
ఈ తరుణీ అలామ
అరుణారుణపు  తీరు 
కాంతిరేఖయె సుమ్ము
వెదకి చెప్పిన చాలు
వేల వేల వరహాలు
వరుమానమనుకొనుడు.

చీకటాయెను బ్రదుకు
గొంతు దిగదే మెతుకు?
కడలి మించెను కనులు
ధారలుగ ప్రవహించు
అశ్రు సరసులతోడ.
---------------------------------------

Saturday, February 14, 2015

అతడు అడవిని జయించాడు
హృదయారణ్యాలనూ వికసింపజేసాడు.
మూగ వాని పిల్లని గ్రోవితో
జగతినంతటినీ రాగ రంజితం చేసాడు.
శ్మశానాన్ని దున్నే
శ్రమైక జీవనానికి
నాందీవచనమై నిలిచాడు.
ప్రజా వైద్యంలో పేరు గడించాడు
సేవా సాధువుగా జీవనం సాగించాడు
తన ఆరోగ్యాన్ని పణం గాపెట్టి
మందికున్న అనారోగ్యాన్ని అధిగమించేలా
పాటు పడ్డాడు.అందుకే అతను చిరంజీవి
సాహితీ వనంలో వసి వాడిపోని సుమం.
===================================
రచయిత డా//కేశవరెడ్డి మృతికి సంతాప సూచనగా
ప్రేమా!! నన్ను మనసారా క్షమించు.
******************రావెల పురుషోత్తమరావు.
--------------------------------------------
ప్రేమా! నన్ను మనసారా మన్నించు.
 నిన్ను ద్వేషిస్తున్నందుకు
నన్ను మనసారా క్షమించు.
ఒకప్పుడు విశ్వమంతటా
 ఎంతగానో.   భృశార్ధంతో
కీర్తించబడి శ్లాఘనీయమై
విరాజిల్లిన నీవు
కాలంగడుస్తున్న కొద్దీ
సంకుచితత్వంతో సగం చచ్చి
చిక్కి శల్యమై కృశించి
నీరసపడిపోతున్నావ్  గ్రహించావా?

ఇంట్లో కళ్ళెదుట కనుపించే
అమ్మ,అక్క,చెల్లిని అత్మీయంగా
పలికరిచనోపని వాడు
బజారులోకడుగుపెట్టగానే
బరితెగించి
వ్యాఖ్యానాలను విసురుతూ
స్త్రీత్వాన్ని కంటగింపు కలిగించేలా
పరిమారుస్తున్నాడు.

బస్ స్తాపులోనూ వాడే
జనసంచారంకిక్కిరిసివున్న ప్రతిచోటా
వాడే ప్రత్యక్షమై పళ్ళికిలిస్తూ
ఆపదం పలుకుతుంటెనే పరమ చిరాకును
పుట్టీస్తున్నాడు,కిరాతకపు నవ్వులతో
ఉవిదలను ఉడికించాలని చూస్తున్నాడు.

శబ్దార్ధాల సం యోజనకు శర సంధానపు
బిగువుంటుందని మరిచినసినీ గేయ రచయితలు
ఆ పదం పలకాలంటేనే కంపరంపుట్టేలా
గీతాలను గిలికి జనాలపైకి మసిగుడ్డలా
మీద పడేలా త్రిభాషా సుత్రాలను
మొక్కవోకుండా పాటిస్తూ మణి ప్రవాళ
శైలికే మచ్చను ఆపాదిస్తున్నారు.

ఐదుపదులు దాటిన నాయకుడి ఒత్తులురాని
భాషా ప్రకటనలో స్వారాస్యం కోల్ప్యేలా
దీన్ని ఉచ్చరించి అధమాధంగా తీర్చి దిద్దుతున్నారు.
అందుకే ధారావాహికలలో వినిపించే ఏడుపులా
చిరాకుకు ప్రతిరూపంగా ఈ పదం
సార్ధకమై నిలుస్తున్నది. అందుకే ప్రేమానీకు
అడుగడుగునా సందిస్తున్నా దివ్య మంగళ హారతులు.

నన్ను మనసారా క్షమించు
--------------------
నేను నిన్ను ప్రేమించలేను!
వాణిజ్యధోరణితొనో వ్యక్తిగత స్వార్ధానికో
పరిమితమై వీనులకు విషతుల్యమై వినిపించే
ఈ రెండక్షరాలన్నూ ద్వేషిస్తున్నాను.
అoకిత భావంకొరవడిన ఈ పదాన్ని అణువణువునా
మన్నించమని మరీ మరీ వేడుకుంటున్నానని
మనసారా విన్న్నవించగలిగినందుకు
ఆరెండక్షరాల్పై మొన్నటిదాకాకొంత
వ్యామోహంజనించేది
ఇప్పుడెందుకో ఆ రెండు పదాలపై
తెలియకుండానే విరక్తి పుడుతున్నది.

కారణాలు ఖరీదైనవి కాకపోయినా
కళ్ళు తెరుచుకును గమనిస్తే అది
అ,.క్షర సత్యమని తెలుస్తున్నది
ఈమాట అడుగడుగునా కొంత ఆబను తగ్గిస్తున్నది.

దినంతెల్ల వారిందగ్గరనుంచీ ద్వేషానికిసమీపంగా
నేను అడుగులు ముందుకేసేలా చేస్తున్నది.

ఇంట్లో తల్లినీ  చెల్లినీ ప్రేమగా పలకరించలేని వాడు
బజారుకెక్కగానే ఈపంతోనే వెంట బడి ఆడతనాన్నే వేధిస్తున్నాడు.

బస్ స్తాపుల దగ్గరా ఆఫీసులనుంచి తిరిగొచ్చే క్యాబ్ల దగ్గరా
ఆఫీసుల దగ్గర కేంటీన్ల దగ్గరాఈ పదమే పదె పదే
వినబడుతూ విసుగును రాశీభూతంగా పోగుజేస్తున్నది,

పార్కుల దగ్గరా ఈ పదమే పదే పదే వినబడుతూ
 భావాన్ని పోగుజేసుకుంతున్నది.

టీ వీల్ల్లో ప్రతి కార్యక్రమంలో,ఎడతెగకుండా సాగే ధారావాకిలలో
నూ ఈ పదమె రకరకాలుగా ప్రస్తావించబడి
పరాయితనాన్ని ఆలింగనంచేసుకున్నట్లనిపిస్తున్నది.

ఇక చలనచిత్రాల్లో ఈపదం మీదే చిత్రమంతా ప్రదక్షిణాల్జేసి
పరాన్ముఖతను ప్రదర్శించె లా జెస్తున్నది..

నన్నడకుండానే నాలో ప్రవెశించిన యవ్వనం
ఈ పదంతో నన్ను గేలిచేసి గొలగా ఏడిపిస్తున్నది.

దినంతెల్లవారిన దగ్గరనుంచీ కేవలం యవ్వనపు కదలికకే
పరిమితమై ఈ ప్రేమ పయోముఖ విష కుంభంలా గోచరిస్తున్నది.
అందుకే నేనీ పదాన్ని పదే పదే ఉచ్చరించలేకపోతున్నందుకు మన్నించండి.
మరోసారి నా బాధను అర్ధంచేసుకో ప్రార్ధన.
ఇకనుంచీ నెను ఈపదాన్ని ప్రకృతిమాతతో మొదలెడతాను.

నా ఇంటి మొండిగోడలపైకి ఆల్ల్లుకుఒయిన మల్లె తీగనూ
విరజాజి పాదునూ ప్రేమిస్తాను.మాఇంటి దగ్గరగా ప్రవహించే
చిన్నారి పిల్ల కాలువను ప్రెమిస్తాను.

అమ్మ అనె పదంలో ఉన్న కమ్మదనాన్నీ మరంద మాధుర్యాన్నీ
ప్రేమిచడమ్మొదలేడతాను. ఇకపై శబ్దంత్ హడలెత్తిస్తున్న
ఈ మాయదారి పదం బదులుగా .వినిపించి విభ్రమం కలిగించని

నియమాన నతిక్రమించనొపనిమౌనాన్ని ప్రేమిస్తాను,
చెవుల్లో హోరెత్తించి నన్ని హడలు పెడుతున్న చిత్రగీతాలు బదులుగా
సెలయెరుల గలగలలతో సరిపోయే రేడియోలు అప్పుడప్పుడూశ్రవణపెయంగా వినబడే లలితగీతాలను ప్రేమిస్తాను.
జనజీవనంతో పెనవెసుకుపోయిన జానపదాన్ని
జ్ఞాన పధంగా భావించి గౌరవిస్తాను.

వాణిజ్యధోరణితొనో వ్యక్తిగత స్వార్ధానికో
పరిమితమై వీనులకు విషతుల్యమై వినిపించే
ఈ రెండక్షరాలన్నూ ద్వేషిస్తున్నాను.
అoకిత భావంకొరవడిన ఈ పదాన్ని అణువణువునా
మన్నించమని మరీ మరీ వేడుకుంటున్నాను.
**********************************************
ఋతు శోభ---
---------
వసంతం ముఖద్వారంచెంతన
నిలబడి చిరుదరహాసాలను చిందిస్తుంటే
మనసంతాలేలేతమామిడి చివురులనాస్వాదించే
పుంస్కోకిల స్వరంలా హాయిని పుణికిపుచ్చుకుంటుంది.

హిమసౌరభం తలుపు తట్టినా నావలపు తోటపై
చిరుజల్లులా హర్షాతిరేకపుముత్యాలను వెదజల్లినా
నాలో మృదు హాసాల హేమంతం నవ్వులు చిందిస్తున్నట్లు గోచరమౌతుంది.

శరత్జ్యోత్స్నల సమయమంతా నెచ్చెలి నులివెచ్చదనంకొసం
పరితపించే అభిసారికలా సాక్షాత్కరిస్తుంది.

శిశిరాగమనమే కొంత చిరాకును కలిగించి విషణ్ణ వదనాన్ని
కానుకగా అందించి నిష్క్రమిస్తుం ది.

ఈఋతు నర్తనమంతా జీవన గమనపు పలు దశలను
ఆవిష్కరించి అడుగడుగునా  ఆహ్వానాలనందిస్తున్నట్లు స్ఫురిస్తుంది.
=========================================

Friday, February 13, 2015

తెలుగు నాట వెలసిన  శతక నందనోద్యాన వనము

____________________________________
శతకమనగా నూరు పద్యముల సమాహారం
.సామాన్యముగా శతకములలో 108 పద్యములుండుట వాడుక.
దీనికి కారణమిట్లూహింపనగును.భగవంతుని పూజా విధానములలో
అష్టోత్తర శతనామములకు అధిక ప్రాధాన్యమము నిచ్చుట మన సదాచారము.భగవంతుని స్మరణములోవలెనే ముఖ్యముగా భక్తి
ప్రధానముగా వెలువరించుటకు అలవాటు పడిన మనమునూ ఆ సత్సాప్రదాయమునే పాటించుట 
శుభకరమని భావించి అది నియమముగా పాటించుట ప్రారంభమై తరువాత అన్ని శతకములకూ విస్తరించి ఉండనోపు.

శతక నందనోద్యాన వనములో తొలిసుమమును పూయించిన ఘనత,శైవ  వాౙ్మయమునకు విజ్ఞాన పీథముగా నెన్నదగిన 
పాల్కురికి సోమనాధునిదే యనుట నిర్వివాదాంశము.ఇదియే వృషాధిప శతకము.
12 వ శతాబ్దమునకు చెందిన మల్లికార్జున పండితారాధ్యుని "శివతత్వ  రము" తొలి శతకముగా కొందరు భావించిననూ ,
శతకరచన యందు ప్రాధమిక నియమములుగా గల[1] మకుట నియమము,సంఖ్యానియమము ఇందు కనపడకపోవుటచే 
విజ్ఞులు దీనిని అంగీకరింపలెదు.ఇందు శివ యను మకుటమున్ననూ అది నియమిత  స్థా నములో ఉపయోగింప బడలేదు.
సంఖ్యానియమము జూచిన ఇందు మూడు వందలపైన పద్యములుండుత గ్రహించనగును. వృషాధిప శతకమున పద్యములు 108 గానూ
 బసవా బసవా వృషాధిపా యన్న మకుటము నియత స్థానములో కూర్పబడినది.
వీర శైవ మత స్థాపకుడైన బసవేశ్వరుని సంబోధించు కవితాధార ఇందు ప్రకటితమై స్వీయాను భూతి విషయకమై 
సదా సర్వదా స్ఫురించుట గమనించ గలము.

శివ భక్తి ప్రధానముగా వెలువరింపబడిన ఇతర శతకములలో ముఖ్యముగా నెన్నదగినది యధావాక్కుల అన్నమయ్యకృత  "సర్వేశ్వర శతకము".
గొదావరీ తీర ప్రాతమైన పట్టిస క్షేత్రమునందలి వీరభద్ర స్వామికత్యంత భక్తుడైన ఈ అన్నమయ్య
శ్రీశైలమును సందర్శించబోవుచూ,కృష్ణా నదీ తీరమున ఈ శతకము వెలువరించెనని ప్రతీతి.
తరువాత ఈ ధారలో నెన్నదగినది,శ్రీ కాళ హస్తీశ్వర సతకము.ఈ శతక కర్త విషయమున కొంత వివాదాస్పదమైన 
చర్చ జరిగిననూ,ఇది శ్రీకాళ హస్తి మాహాత్మ్యము రచించిన ధూర్జటిదేనని నమ్మదగును.
ఈ శతక పద్యములందలి భావ పటిమ, ధారా శుద్ధి శ్లాఘి0పదగినవి.ఈ తర్వాత శివ పారమ్య బోధకములై 
ఎన్నదగిన శతకములంత గా  లేవనియే చెప్పనగును.

విష్ణు భక్తి ప్రబోధకములైన శతక సంపదలో నతి ప్రాచీన మైనది దేవకీ నందన శతకము.
ఇందలిపద్యములు శ్రీకృష్ణ పరమాత్ముని లీలా విహారములను వివరించుచూ ,విష్ణు మహిమాదికములను ప్రశంసించుచూ
 అటనట కృష్ణ కర్ణామృతముననుసరించి పద్యములు కొన్ని వ్రాయబడినట్లుగా తోచ. లభ్యమైన గ్రంధమందు ఫలసౄతితోగలిపి 
100పద్యములు మాత్రము గలవు. జక్కన విక్రమాదిత్య చరిత్ర ఆధారముగా దీని కృతికర్త హరితస గోత్రీకుడకు జన్నమంత్రిగా కనుపట్టు ను.
  
సుకరంబై,సురసేవ్యమై,సులభమై,సువ్యక్తమై యుక్తమై 
 ప్రకటంబై పరమార్ధమై,ప్రమదమై,ప్రద్యోతమై,పథ్యమై
 యకలంకామృతమై యమోఘతరమై యానందమై
  సకలబున్ భరియించునీకృపయె, కృష్ణా దేవకీ నందనా!

అలాగే మరియొక పద్యం

అరయన్ శంతను పుత్రుపై విదురుపై నక్రూరుపై,గుబ్జపై
నరుపై, ద్రౌపదిపై గుచేలుపై యన్న0ద వ్రజ స్త్రీలపై
పరగంగల్గు భవత్కృపారసము నాపై గొంతరానిమ్ము మీ
చరణాబ్జంబుల నమ్మినాడ , హరికృష్ణా దేవకీ నందనా!

నారాయణ శతకమునందు నారాయణుని మహిమయుశ్రీక్జృష్ణుని బాల్యలీలను 
ముద్దులొలుకు మృదుమధురమగు పద్యములలో వతనవి. సూక్ష్మములో మోమన్నటులీ గ్రంధములు చిన్నవైననూ అద్వైత మత సంప్రదాయములగు 
తత్వరహస్యములను సులభముగా గ్రాహ్యమగునట్లు తీర్చి దిద్దబడినవి.ఈశ్వర తత్వనిరూపణము గురూపదేశము వలన
మోక్ష ధర్మములను గ్రహించు విధమిందు మనోహరముగా వర్ణితమైనది.

నాతికఠినములైన సమాసములు చక్కని శబ్దాలంకార శోభితములైరసవత్తరమగురచనా ప్రతిభ గలిగినది
 ఒంటిమిట్ట వీర రాఘవ శతకము. 
దీని కృతికర్త రామాభ్యుదయ కర్త యగు అయ్యలరాజు రామభద్రునికి ముత్తాతయని వీరేశలింగముగారు వ్రాసియున్నారు.


కంచెర్ల గోపమంత్రి విరచితమై జనావళి నోళ్ళలోనానిన శతకము దాశరధీ శతకము.కంచెర్ల గోపమంత్రియే రామదాసు.

శ్రీరఘు రామ చారు తులసీ దళ ధామ శమక్షమాదిసృం
 గార గుణాభి రామ త్రిజగన్నుత శౌర్యలలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారక రామ భద్రగిరి దాశరధీ కరుణా పయోనిధీ!

 భక్తి రసస స్ఫోరకములైన శతకములలో ఎన్నదగినవెన్నో గలవు
అందున కృష్ణ శతకము,రంగ సాయి సతకము,వసుదేవనందన శతకము,సూర్యనారారాయణ శతకము లక్ష్మీ శతకము, 
నృసిం హ శతకము, యాదగిరీంద్రశతకముముఖ్యమైనవి.

ఒక తరము క్రింద ప్రాధమిక పాఠ శాలల స్థాయిలోనేదాశరధీ శతకము, భాస్కర్శతకము,
శ్రీక్రిష్ణశతకము,కుమారీ శతకము,వేమన సుమతీ శతకము, కుమరా శతకములు వల్లె వేయించు 
నాచారముండెదిది. ఆ స్థాయిలో మనస్సుపై అత్యంత గాఢమైన ముద్రనిడిన ఈశతకములు  జీవన మార్గమున 
ఒడి దుడుకులన్యు తట్టుకోగల మనూధైర్యము కలిగించు ప్రభావము గలవి.ఆధ్యాత్మిక పరమైన అంశముల మాటున జీవన శైలిలో
కొంత మనోనిబ్బరము గల్గించు సాధనములుగా ఈ శతకములు
పేరెన్నిక గన్నవనుట నిర్వి వాదాంశము.

ఆ తర్వాత ఆధునిక కాలమునభక్తి రసప్రధానమగు శతకములు వేల సంఖ్యలో వెలువడినవి. 
అన్నింట మిన్నగా నెన్నదగినవి,కవిసామ్రాట్ విశ్వనాధ వారి శతకరచనప్రశంసార్హమైనది.
క్రీ శ 950 వ ప్రాంతములొని  యుద్ద్ధమల్లుని బెజవాడ శాసనములో సకృత్తుగా గానుపించి, 
తరువాత నన్నయ గారి భారతాంధ్రీకరణమందు అటనట చోటుచేసుకున్నమధ్యాక్క్కర వృత్తమును 
స్వీకరిమితరువాతికవుల ఆదరణందుకొనక అది విశ్వనాధవారి చేతిలో శతసహస్రముగా ఆవిష్కృతమగుట, విశేషముగా పరిగణింపదగును.


 శ్రీ విశ్వనాధ వారు శ్రీశైల మల్ల్లిఖార్జునునిపరముగా శ్రీగిరి సతకము ,ద్రాక్షారామమునందలి భీమేశ్వరుని పరముగా ద్రాక్షా రామశతకము,
నిత్య కల్యాణ  గుణ ధాముడు సప్తగిరి వాసుడైన శ్రీ వేంకటేశ్వని స్తుతించుచూ,శేషాద్రిశతకము , 
ఇవిగాక శ్రీకాళహస్తి శతకము,భద్రగిరి శతకము,కుల స్వామి శతకము,సంతాన వేణుగోపాలుని పరముగా నందమూరు శతకము, 
నెకరుకల్లు  శతకము,మున్నంగి వేణుగోపాల శతకము,రాజరాజేస్వరుని పరముగా వేముల వాడ శతకము చెప్పి వెలువరించిరి. 
శ్రీ విశ్వనాధ వారి తాత్విక భావ సంపదకు ఈ శతకములు దర్పణములుగా నిలిచిన వనుట అతిశయోక్తి గానేరదు.
ధార్మిక ప్రబోధకమునకు శతక పద్య రచన లు చక్కని వాహికలు. ధారా శుద్ధి గలిగిన విమలచిత్తులగు 
కవులకు ఈశతకరచన దుష్కరమైన కార్యము కాదుగదా!


తేట తెల్లమగు భావప్రబోధకములగు శతకములను వెలువరించదగిన ఆవశ్యకత  నేడుఎంతయో గలదు. 
అటుపై లభ్యముగానున్నపూర్వకవికృతమైన శతక పఠనమీ కలికాలమునండు మనసు కూరట కలిగించుటయేగాక,మనసులను 
ధార్మికచింతనవైపు మరలించగలుగుట శ్రేయోదాయకమూ ఆరోగ్య ప్రదమైన సంగతియేగదా!



ఆనాడు శివకవులు తెలుగు సాహితీ నందనోద్యానవనమున పూయించిన శతక సుమములు 
నానాటికీ వెలలేని రత్నములై భాసించుట మన అదృష్టమునకు తార్కాణమేగాక వేరు గాదని మనవి.
ఇట్టి అదృష్ట సంపదను మనమూ ప్రతినిత్యమూ వల్లె వేసిన  మన దేవతలను నిత్య పారాయణ 
ద్వారా తలచుకొని ధ్యానించు పుణ్య కార్యము మనలను శాంతి మార్గము వైపు తరలించుట శుభోద్కరమేగదా!
**************************************************************

[మార్చి 1976-సప్తగిరి సంచికలో వెలువడిన వ్యాసమునిచట భక్తి ప్రపత్తులతో నందించుట జరిగినది. ]

---------------------------------------------------------------------------------------------------------------------------------

వాస్తవస్తవం---రావెల పురుషోత్తమ రావు
********************************************
అవును ఇది నువ్వన్నట్లు ప్రేమికుల దినోత్సవమే

నేను భూమ్మీద పడినంతనే గుక్కపెట్టి ఏడుస్తుంటే
ఓచిరునవ్వును నాపై విసిరి నొసటనుముద్దిడి
తన వక్షోజాన్నందిoచి ప్రప్రధమంగా ,ప్రేమమాధుర్యాన్ని
చవిచూపిన అమ్మను ఇంకా ఇలా, ప్రేమిచడం తప్పా!

నా బుడి బిడి నడకలకు లోలోననే గర్వపడుతూ
నాకు విద్యాబుద్ధులను నేర్పిస్తూ అడుగడుగునా
నన్ను వెన్నెముకలా వెన్నంటిముందుకు నడిపించిన
నాన్నను ఎలా మరువమంటావు ఈ శుభ దినాన ?

అక్షరాభ్యాసంతోమొదలెట్టి అలిఖితంగా నాపై

ప్రేమామృత వర్షాన్ని కురిపిస్తూనా అభివృద్ధికి
తనవంతు సాయంగా చేయూత నందించి ఇవ్వాళ
నాజీవనగమనం ఇంత సుగమం గా సాగేందుకు
సహకరించిన వివిధ దశల్లోని గురువులను ప్రేమించడం
ఎలా మరువగలను చెప్పు నేస్తం--అందుకే వారికి పేరు పేరునా

ఈ గులాబీ గుచ్చాలను ప్రేమ పురస్సరంగా ప్రప్రధమంగా
అందించి నా కృతజ్ఞతా భావాన్ని ప్రకటించుకోవాలని
గట్టిగా తీర్మానించుకున్నాను--ఆతర్వాతే ఎవరికైనా

నా పురస్కారాల ప్రదానం--ఇది ముమ్మాటికీనిజమ్మిత్రమా!
-------------------------------------------------------------------------------12-2-15

Thursday, February 12, 2015

దేవుడా నాదేశాన్ని రక్షించు!!!
-------------------------------రావెల పురుషొత్తమ రావు.
ధన సంపాదనా వ్యామోహంలో పడి
కని పెంచిన తల్లిదండ్రులను తమవంతు కాదనుకుని
శుష్క ప్రియంగా వాదించుకుంటున్న కొడుకుల
 మనోదౌర్బల్యాల మనస్తత్వాలనుండి.

అక్రమ క్రమంలో అన్ని అవినీతి మార్గాలలో
లక్షల కోట్లనువెనకేసుకునిరాష్ట్రాలనూ, దేశాలనూ పాలించగలమన్న ధీమాతొ తిరుగాడుతూ
పేట్రేగిపోతున్న విక్రమర్కుడి మార్కు అరాజకీయ నేతల కబంధ హస్తాలనుండి

అమాయకం గా ఆడపిల్లలను వలలో వేసుకుని
నటీమణులుగా తీర్చిదిద్దుతామని ఆశపెట్టి
వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకోవడం క్రీడగా మలచుకున్న
మన్మధాకృతిని దాల్చుకున్న చిత్ర విచిత్ర మగ మృగాల బారినుండి

విద్యనూ వైద్యాన్నీ వ్యాపారంగాజేసుకుని కల్తీ మందులతో ,వ్యర్ధమైన చదువులతో 
జన ప్రాణాలను బలితీసుకుంటున్న
 వైద్య నారాయణులనుండి,విద్యా వాణిజ్యపు అపర సరస్వతుల 
విష పన్నగాల పన్నాగాల నుండి

అవసరానికి అందకుండా సాగుబడికవసరమైన ఎరువులనూ
క్రిమిసం హారకమందులనూ అమ్ముకుని కోట్లను వెనకేసుకుని
కర్షకులను కష్టాల కడలులలోకి నెట్టేసే  వాణిజ్యమ్మన్యులనుంచి

మతం ముసుగులో మారణ హోమాలను సృష్టిస్తూ
అమాయకుల ప్రాణాలను పణం గాపెట్టి ఆడుకుంటున్న చాందస వాదుల
క్రూరాతి క్రూరమైన రాక్షస చర్యలనుండి.
దేవుడా నాదేశాన్ని రక్షించు!!    11-2-15

Wednesday, February 11, 2015

జీవ నదిలా ప్రవహించేలా--రావెల పురుషోత్తమ రావు.
*********************************************************

అవును నీవంటున్నది అక్షర సత్యమే కాదనను

ఆవొడ్దున  అగ్ని శిఖలా రగులుతూ నేను
ఈదరిన మంచు శిఖలా ఘనీభవిస్తూ నీవు
ఎంతకాలమని ఇలా అంతరంగంలో రాజుకుంటున్న
వై షమ్యాలను కడిగేసుకుండా
 కాలాన్ని ఖర్చు చేసుకుంటూ వృధాగా బ్రదకడం?
ఇద్దరిమధ్యా అగాధాల అంచులనoటి ప్రవహిస్తున్న
ద్వేషా భావాల మలిన సరస్సులను నియంత్రిద్దాం.

శతృవు మనస్సులో  మనల్ను నామరూపాల్లేకుండా
తుదముట్టించాలన్న కోరికలు బలపడకముందే
మన మనసుల్లో అనాదిగా పేరుకుంటూ వస్తున్న వైషమ్యాలను
కడిగేసుకునే ప్రయత్నాలను వెన్వెంటనే ప్రారంభిద్దాం.

చేయీ చేయీ కలిపి నడకను సాగిస్తూ చైతన్య శిఖరాల
నధిరోహించే ప్రయత్నాలను  శీఘ్రమైన దశలో ప్రారంభిద్దాం.

అనితరసాధ్యమనుకుంటున్న మన ఐక్యతా రాగాన్ని
ఆత్మీయంగా ఆలపించడం తక్షణం మొదలెడదాం.

దూర దూర తీరాలనన్నింటినీ కలిపి కుట్టే శ్రమలో
సహకరించుకుంటూ స్వేదఫలాలను తరువాతి తరాలకు
స్వాదు  యోగ్యంగా మార్చి  అందించే ప్రయత్నాలకు

నాందీ వచనాలు పలుకుదాం. రా!!!  ఈదరికి నిర్మాణాత్మకమైన యోచనలతో .
నిరంతరాయంగా మన కట్టుబాటును  జీవ నదిలా ప్రవహించేలా చూద్దాం.
--------------------------------------------------------------------------------------------------------------11-2-15

Tuesday, February 10, 2015

కిటికీలోంచి తొంగి చూస్తుంటే
కలల రాకుమారుడు వస్తున్న సవ్వడి
లేత కొబ్బరాకుల గలగల రవళులలో
నాకు స్పష్టంగా  అవగతమౌతున్నది.

నింగి లోంచి నావైపే చూస్తున్న చందమామ

వెదుక్కుంటున్న ప్రేయసి ఎదురుగా వచ్చినట్లనిపిస్తుంది.

దూరంగా జలజలా ప్రవహించే సెలయేటి నడకలు

నా ఇంట్లోని చిరంజీవుల 
బుడి బుడి నడకల రవళులను గుర్తు చేస్తున్నది.

పూలతోటలోంచి వీస్తున్న సుమపరిమళాలు

నేను భావ కవితా ప్రపంచంలో విహరిస్తున్న
తీరును తన్మయత్వం గా తెలియజేస్తున్నది.

కనులమీదుకు ముంచుకొస్తున్న నిద్రాదేవత

కలల స్వైర విహారం  ప్రణయ కవితా విహాయసంలో
 నన్ను విహంగంలా మార్చి  అక్కడి ఆత్మీయతా 
 సరస్సులోనన్ను ముంచి తేల్చేందుకు
 సముచితాహ్వానం -- పంపుతున్నట్లనిపిస్తున్నది.
------------------------------------------------------------------------
నువ్వుంతకాలం
నీ విలువలకు
వలువలన్నింటినీ
ఊడ్చేసాను.

ఇప్పుడు నానుంచి నీవు
దూరంగా జరిగాక
ఆ విలువల ప్రాధాన్యాన్ని
 గ్రహించగలిగాను.

పూవంటూ ఉంటేనే గదా
పరిమళం పరిసరాళ్ళో
గుబాళించ గలిగేది.

ఆ పూవునే తెంచేసి
పరిమళంకోసం
పరితపించడం
ఎంత బుద్ధి హీనమో
అవగతమైంది.
---------------------------------

Monday, February 9, 2015

ఎటు నీ పయనం ఎటు?
----------------------
ఓకవీ!
కళారవీ!!
మా కవీ!
మంచి కవీ!!
 ఎటు నీ పయనం ఎటు?

చెమటోడ్చే శ్రమజీవుల
చేవ్రాలువు నీవు.
బలవంతుల ధనవంతుల
పన్నాగాలడగించే
ప్రభంజనం నీవు.

వ్య్ధార్త జీవుల
యదార్ధ దృస్యం
కనులారా కంటున్న
ద్రష్టవు కదా నువ్వు
బీదా బిక్కీ సంక్షేమానికి
పేదా సౌభాగ్యానికి
మరో ప్రపంచం నిర్మించాలని
తపన బడ్ద కవికులం గదా నీది.
విప్లవ కవితా యోషకు
వీర తిలకం దిద్దిన
కవితా రణరంగపు
యోధుడవుకూడా నీవేగదా

నీ కవిత చిరంజీవి కావాలి
నీ కృషి అజరామరమై నిలవాలి.

ఓకవీ!
కళారవీ!!
మా కవీ!
మంచి కవీ!!
ఎటు నీ పయనం ఎతు?
ఇవ్వాళనేనో కవితను రాయాలి
---------------------------రావెల పురుషోత్తమ రావు.

ఇవ్వాళనేనో కవితను రాయాలి
అది నాతోటలో విరబూసిన
సుమాల సుమధుర పరిమళాను గూర్చిన
భావ కవిత కాదు సుమా!

కేశ సంస్కారానికి నోచుకోక
గుబురునెత్తిపై గుత్తగా 
పెరిగిన క్లేశాల గవులుతో
నిద్రపట్టక దీర్ఘంగా
దైన్యపు చూపులు విసురుతున్న ఓ
బిచ్చగత్తె మనసును తొలిచేస్తున్న
మనాదిని గూర్చి మంచి కవితను రాయాలి.

కలవారు కల్యాణ మంటపంలో
అపురూపంగా వడ్డించిన 
తిను బండారాలనుగూర్చో, 
రకరకాల పదార్ధాలను గూర్చిన
ప్రబంధ కవితను కానే కాదు

సాయంత్రానికి అవి విసరబడ్డ

కుప్పతొట్లపై తంబలు తంబలుగా

విరుచుకుపడే పేదరికాన్ని గూర్చి

సమకాలీన సమాజ సజీవ దృశ్యాలకు
దర్పణమై నిలిచేలా ఓ కవితను ఇవ్వాళనే రాయాలి.
==========================================8-2-15

Sunday, February 8, 2015

శూన్య పరిధి----రావెల పురుషోత్తమ రావు.
-------------------------------------------

శూన్య పరిధి విస్తరిస్తున్నంతకాలం
సుఖ సంతోషాలతో సాగుతున్న జీవయాత్ర
మృగ తృష్ణల వెంట పరుగులతో కూలబబడి
ముగిసిపోయే ప్రమాదం ముంచుకు రావడం ఖాయం.

ముక్కారు పంటలుపండే పంట పొలాలపై ఇప్పుడు
పాశు పతాస్త్ర ప్రయోగం జరిగి పోయినట్లున్నది.
ఇకపైన పల్లెతల్లిని సుమంగళిలా తీర్చి దిద్దే
పచ్చల హారం పరశు రామప్రీతి కావడం తప్పదనిపిస్తున్నది.

ఆస్థానంలో ఆకాశహర్మ్యాలతో కాంక్రీటు వనాల భవనాలు
ఇబ్బడి ముబ్బడిగా రానున్నాయి.

పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినా,మనుషుల మనస్తత్వంలో
కించిత్తు మార్పూ రాకపోవడం మనదురదృష్టమేనేమో ననిపిస్తున్నది.
మకిల బట్టిన వారి వారి మనసుల్లో 
దయాదృష్టి కొరవడినట్లే కనిపిస్తున్నది.

వసంత కాలపు రంగు రంగుల ఆమ్ర శోభ ఇక  పై
వర్ణనీయ వస్తువుగా సాహితీ సంపదలో
మిగిలిపోయే ప్రమాదం ముంచుకొస్తున్న దాఖలా
ముందున్న ముసళ్ళ పండుగలో  గోచరిస్తున్న్నది.

వ్యవసాయం, సాగుబడీ ఇక పురాతన వస్తు  శాలల్లో
ప్రదర్శనా వస్తువుగా తీర్చిదిద్ద బడటం తప్పదనిపిస్తున్నది.
పంటపొలాలపై నుంచి వీచే పైరగాలులు
ఇకపై ఇక మరో మహా ప్రస్థానం దారిపట్టడం తప్పదులాతోస్తున్నది.

పచ్చని పైరు శాఖలపై వాలవలసిన పక్షి సమూహం
స్మశానపు దారులను వెదుక్కోవలసి రావడం కడు శోచనీయం కాదా?

ఇక పంచాం గాలన్నింటినీ ఈప్రాంతాల్లో ప్రవహించే నదీనదాల్లో
నిమజ్జనం చేయడం మాత్రం మరువకండి.
వార ఫలాలు ఇకపై అందని ద్రాక్షల్లా
అపురూపమవుతూ అదృశ్యరూపం దాల్చనున్నాయన్న సత్యం
అందరినీ కలవరపెట్టి కలవళపెడుతున్న తీరు బాధ కలిగిస్తున్నది..

మంచి చేస్తాడని మనసారా నమ్మిన వాడే 
నిలువునాముంచేస్తుంటే విస్తరిస్తున్న ఈ శూన్యపరిధి
వైభోగాలను వైధవ్యానికి చేరువగా చేర్చడం ఖాయమేగదా!

-----------------------------------------------------------------------------------7-2-15
ఆకులో ఆశనై----
*******************

అవును నువ్వంటున్నది నిజమే !
అవును ఈరోజవన్నీ ఎండుటాకులే
కానీ నిన్నటి దినాన అవి
పండుటాకులని గమనించావోలేదో.
మొన్నా అటుమొన్నా అ క్షరాలాఅవి
అరవిరిసిన హరితపత్రాలు.
వసంతర్తు వాగమనంతో హరిత
శోభనద్దుకున్న సౌందర్య విలసిత
రమణీ లలామలు.
కాలంగడుస్తున్న కొద్దీ కళదప్పి 
కళవళ పడుతున్నాయ్ అంతే!

వయసు నొసలుపై 
ముసలి రేఖలుముద్రితం కాకముందు
మాటల తూటాలు ముఖమ్మీదనే పేల్చబడకమున్ను
అవి మౌన ముద్రలో మునిగి వున్నాయి అంతే!
ఇప్పుడవన్నీ దంతాలతో పాటు
పట్తు సడలి వాడుముఖం పెట్టి
వగపు దారిలో పయనిస్తున్నాయని గ్రహించు.
నడువ డానికి అవయవాలు సహరించక
మంచాన బడ్డ ముసలి తనానికి
గతవైభవపు ఘరాన స్మృతులు ఇవన్నీ గమనించు.
రాబోయే కాలంలో కాబోయే స్థితిగతులకు
అవి మనోదర్పణాలనుకుని జాగ్రత్త వహించు!!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
వూసుల వుయ్యాల
--------------------

ప్రభాత సమయాన మన పూలతోటలో
యే పూవును పలకరించినా నీ వూసులే
నెమరు వేయడం చూసాను.
శిశిరంలోకూడా చిగురించే నీ చిరుదరహాసమే
పదే పదే గుర్తుకొచ్చి తలపంకిస్తూ కూర్చుంటాను.

యే కోయిల గానం విన్నా  అది నీ మురిపెంకోసమేనని
గ్రహించి పులకాంకితుడనౌతుంటాను.

వెన్నెల్లో మెరిసే చందమామకూడా జ్యోత్స్నాభిసారికలా
నీ రాకకోసమే ప్రతీక్ష చేసున్నదేమోననిపిస్తుంది.

ఇలా అంతా నీ నామ స్మరణలోనూ, ఊహల ఊసుల్లోనూ
కాలం గడుపుతుంటే నీవు నన్ను విడిచి ఎక్కడకు వెళ్ళలేదన్న
అసత్యం సత్యమార్గం వైపు నన్ను నడిపించడం 
నవ్వు తెప్పిస్తున్నది సుమా.అందుకే ప్రేమతో ఏకమైన మనం
ప్రేమానుబంధమే గొప్పదని పదే పదే గుర్తుచేసుకుంటూ గడిపేద్దాం.
**********************************************************

Friday, February 6, 2015

బుచ్చిబాబు వచన కావ్యం అజ్ఞానం
-------------------------------
1985   మే 5 సంచికనుంచి--పునః స్వీకారం]---రావెల పురుషోత్తమరావు[రాపు]
-----------------------------------
తెలుగు కధానికను కవితామయంగా తీర్చిదిద్ది పాఠకుల మనోఫలకాలపై చెరగని ముద్రను చిత్రించిన కధాకధన శిల్పి. బుచ్చిబాబు. మనిషి అంతరంగాన్ని మరీ మరీ మదించి ఆమనోవిష్లేషణద్వారా ఓ కొత్త వరవడికి బాటలు వేసిన తాత్వికుడు.
బుచ్చిబాబు కేవలం ఒక్క నవలను [చివరకు మిగిలేది] చిరస్మరణీయమైన ఖ్యాతి నార్జించారు.తెలుగు నవలా ప్రపంచానికి అది మణిహారంగా నిలిచిపోవడం యాదృచ్చికంకాదు.ఆనవల తరువాత ఎందరికో నవలా రచనలో మార్గ దర్శనం చేయడం మనమందరమెరిగినదే.దయానిధి మనస్తత్వ పరిశీలన-పరిశోధనకవసరమయిన విషయానందించిందని చెప్పుకోవడం అతిశయోక్తి కానేరదు.అలాగే అమృతం కోమలి ఎవరికి వారే పాఠకుల మనసులను ఇట్టే దోచుకోగలిగారు.కేవలం ఒక సారి చదివితే తేలిగ్గా అవగాహనయే నవల కాదిది.తర్వాత తర్వాత చదువుతున్న కొద్దీ నూతన కోణాలను ఆవిష్కరింపగల నైపుణ్యం ఈ నవలది.దయానిధి సౌందర్య దాహానికి బాహ్య రూపం కోమలి. ఎడారిలాంటి దయానిధి బ్రదుక్కి  ఒయాసిస్సులా సాక్షాత్కరిస్తుంది.అమృతం.ఇలా ఒక జీవన సౌందర్యాన్ని చిత్రించిన ఘనత బుచ్చిబాబుది.

బుచ్చి బాబు వ్రాసిన 'అజ్ఞానం' 12 కవితాఖండికల సుమహారం.
సమకాలీన సమాజజీవితాన్ని చిత్రిక పట్టాలనే తపన, ఆకాంఖతో బుచ్చిబాబు గారీ కవితలను గుది గుచ్చడం జరిగింది.
మొదటి కవితా ఖండిక- అజ్ఞానం--అ అన్న అక్షరం తో ఆరంభించి ఆ అక్షరం చుట్తూ తన కవితను సుందరంగా పరిభ్రమింపజేస్తాడు కవి.

     అబద్ధానికి నాంది
అశుద్ధానికి ప్రస్తావన
అక్కా అన్నా అయ్యాక అయ్య
ఆ అయ్యవెనుక అమ్మనోరు
ఆ పైని అదికారి
అతనిపైన అది పేరు లేని పెండ్లాం
ఆఖరుకు అల్లా అంటూ ప్రారంభించి,

రాణికోసం రాజుకాడోయ్
రాజ్యం కోసం రాజు
రాణీ మరణం తర్వాత
సోఫా ఖాళీ అవడం
రేపో మాపో మరో రాణీ అవతరణ అంటూ
రాజ్యం పోతే రాణీలేదూ రాజూలేడు
వారిని మోసే మజ్దూర్కే మోక్షం అంటూ రాచరికపు వ్యవష్త పై వ్యంగ బాణాలను సంధిస్తారు.

రెండో కవిత ఆకలిదప్పులు
 తేనే చక్కెర, పటిక బెల్లం
చెరుకుముక్క తాటిపండు
క్రిస్మస్ కేక్ అండ్ క్రీం
ప్రేయసి పెదవి తీపిముందు
అన్న్నీ దిగదుడుపు
అన్నిటికన్నా మధురమైనది ఆకలి
అలాగే చందమామకేసి చేతులు చాచే
 చంటిపాప పిలుపు మదురాతి మధురమైనది. అంటూ

   రాత్రి పీల్చిన మంచులో
ఆమనులో తొరిపినతేనెలో
రవ్వంతతడిసిన రాగం చిమ్మే
పుష్పం కడు రమణీయమైనది.
అని ఒక కుసుమపేసలమైన సుందర దృస్యాన్ని చిత్ర్ర్కరించి చూపు తాడు. ర్తన అక్షరాలతో రంగులద్దుతూ.

ఇక మూడో కవిత దాగుడు మూతలు
చెప్పేదొకటి చేసే దొకటి మనస్తత్వం
 గాలికి చెనంప పెట్తులా ఈ కవిత

   కులమతానికి స్వస్తి
కొంప దగ్గర వేరే విస్తరి మహా పతివ్రత, సదాచారం
రాత్రయేసరికి వ్యభిచారం
నైతిక పరపతి శూన్యం
ప్రతి పైసాకీ కక్కుర్తి. అంటూ
  ప్రపంచ శాంతి స్థాపన పేరిట
ప్రక్కింటి పరంధామయ్య ని ఖూనీ.
అని ద్వంద మనస్తత్వం గలవారిని తూర్పారా బడతాడు.

ఇరుగు పొరుగు వారి కార్య కలాపాలు ఒక్కోసారి ఎంత ఇబ్బంది పెడతాయో తెలిపేది  నాలుగోకవిత 'చతురస్ర గతీ

 చెవులకు చిల్లులు పొడిచే మైక్రోఫోంతమ్ముడి చదువుకు అవరోధం కలిగించి పరీక్షా కాలంలో ఇబ్బంది కలిగిస్తుంది.
అలాగె తలంటుకు కుంకుడు కాయలు కొడితే

కిందివాటాలో ని వాడి తలపగలాలా?
ధాన్యం దంపుడుతో ప్రక్క యింటి నేస్తం
పరారయి పలాయనం చిత్తగించాలా
అని మనం నిత్య జీవితంలో ఎదురయే సంఘటలను వివరిస్తాడు.అవి ఎంత కంటగింపుకు కారణమో విశదీకరిస్తాడు.

తరువాత కవిత చైనా గోడ

---------
బౌద్ధానికి నిచ్చెనగా బాయొనెట్లుకాదన్న
పసికందుకు ఉయ్యాలతాడే ఉరిత్రాడు.
కన్నె పిల్ల కళ్ళల్లోకి గూఢాచారి
క్రీగంటి చూపు.
ఊరంతా స్వతంత్ర గాముల గోరీలే
ఇల్లంతటా నియంతల కంతల గోడలే
అది చాలదన్నట్లు చైనా గోడ.

స్వార్ధం ఈర్ష్యా చైనా గోడకు ఇటుక
ద్వేషం, పగ,భయం ఎర్ర సున్నం
పిరికితనం పైన కప్పిన పెంకు
సరసం తెలీని సరస్సులు
దోవతప్పిన నదులు
భూమట్టమైన స్వతంత్ర శిఖరాలు.
అన్నీ శిధిలమవగా మిగిలిన చైనా గోడ.
అని గోడ కట్తిన సామాగ్రినంతతినీ
కవితమయం చేసి కళ్ళు తెర్పిస్తాడు.
నేనేడవనెందుకో అన్న తరువాతి కవితలో
అప్పుడెవ్వరో ఆకలో అమ్మా అంటే ఏడ్చాను.
కనీరంతా ఖర్చయిపోయింది.
ఆసుపరిలో  ఎవరో అమ్మో అంటే
ఆకేక విని వలవలా ఏడ్చాను
నడిఒడ్డున అంగుళం మేరని స్నానంజేసి
బెత్తెడు ఇసుకలో వోణీ వేసుకున్న
ఆ పిల్ల తడి అందానికి వెక్కి వెక్కి ఏడ్చాను.

అందరి ఏడ్పులూ నేనే ఏద్చాను
కన్నీరంతా ఖర్చయిపోయింది.
మరిప్పుడేడుపేరావడంలేదు--అంటూ
తన దయార్ద్ర హృదయాన్ని ఆవిషరించారు.

ఆ తరువాతి కవిత ఏవరో

  ఎముకల్ని విరగ్గోట్టి
రక్తంలోముంచి
నరాలను పీడించి
మానవత్వాన్ని
ఒక్క మాటలో ఓ డించి
వ్రాసి ముగించాను తయారయిందిప్పుడు
ఎవరి ఆకలి కధనమో!

అలాగే
  ద్రుపది ఒంటిని దాచిన

చీర పరంపరలు
చీనీ చీనాంబరాలు
కాషాయవస్త్రాలు
ఒళ్ళూమండి కొంపకెళ్ళి
నేసాను ఎవరి మగ్గం పైనో.

కౌగలించుకుని చుంబించాను
 ఎవరి ప్రేయసినో

ఒళ్ళు మండికొంపకెళ్ళి
పాడుకొన్నాను ఎవరి పదాన్నో
------
అద్దంలో చూసుకున్నాను ఎవరి మొహాన్నో! అంటూ

పత్రిక విప్పితే
ఎవడో చచ్చాడు
అనుక్షణం ఎవ్వరో ఒకరు చస్తూనే వున్నాడు,
మేకలు మనుషులు
ముంగిసలూ మూకలు
పులులూ పల్లె పడుచులూ
వయో వృద్ధులూ వసి వాడని పసికందులూ
ఇందరిందరూ అంతంతటా
చస్తూనేవున్నారు
ఎవరి చావో నన్నేల చావనివ్వవు పరమాత్మా!
అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు కవి.

 నేనేడవనెందుకో అన్న తరువాతి కవితలో
అప్పుడెవ్వరో ఆకలో అమ్మా అంటే ఏడ్చాను.
కనీరంతా ఖర్చయిపోయింది.
ఆసుపరిలో  ఎవరో అమ్మో అంటే
ఆకేక విని వలవలా ఏడ్చాను
నడిఒడ్డున అంగుళం మేరని స్నానంజేసి
బెత్తెడు ఇసుకలో వోణీ వేసుకున్న
ఆ పిల్ల తడి అందానికి వెక్కి వెక్కి ఏడ్చాను.

అందరి ఏడ్పులూ నేనే ఏద్చాను
కన్నీరంతా ఖర్చయిపోయింది.
మరిప్పుడేడుపేరావడంలేదు--అంటూ
తన దయార్ద్ర హృదయాన్ని ఆవిషరించారు.

ఆ తరువాతి కవిత ఏవరో

  ఎముకల్ని విరగ్గోట్టి
రక్తంలోముంచి
నరాలను పీడించి
మానవత్వాన్ని
ఒక్క మాటలో ఓ డించి
వ్రాసి ముగించాను తయారయిందిప్పుడు
ఎవరి ఆకలి కధనమో!

అలాగే
  ద్రుపది ఒంటిని దాచిన

చీర పరంపరలు
చీనీ చీనాంబరాలు
కాషాయవస్త్రాలు
ఒళ్ళూమండి కొంపకెళ్ళి
నేసాను ఎవరి మగ్గం పైనో.

కౌగలించుకుని చుంబించాను
 ఎవరి ప్రేయసినో

ఒళ్ళు మండికొంపకెళ్ళి
పాడుకొన్నాను ఎవరి పదాన్నో
------
అద్దంలో చూసుకున్నాను ఎవరి మొహాన్నో! అంటూ

పత్రిక విప్పితే
ఎవడో చచ్చాడు
అనుక్షణం ఎవ్వరో ఒకరు చస్తూనే వున్నాడు,
మేకలు మనుషులు
ముంగిసలూ మూకలు
పులులూ పల్లె పడుచులూ
వయో వృద్ధులూ వసి వాడని పసికందులూ
ఇందరిందరూ అంతంతటా
చస్తూనేవున్నారు
ఎవరి చావో నన్నేల చావనివ్వవు పరమాత్మా!
అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు కవి.

ఎనిమిదోకవిత "ప్రపంచ పొరుడా జోహారు!"అన్నది

సంతానం కనకు
అడివికొట్టి జాగా చేయకు
సంద్రంలో ఉప్పును నాకి హుళక్కీ చేయకు.
సూర్యుడితో అగ్గిపుల్ల ముట్టించకు
నీ బిడ్దలకు బడి కట్టించకు
ఐదఘుల చదరపడుగుల
నేలను వెతుక్కో
వీలునామా వ్రాసే అవస్థ లేదు--రాదు కూడా
అంటూ
పుట్టని సంతానానికి నీపేరే పెడతాం
ఆలయంలోనువ్వు వెలుపల మేం
అంతర్ధానమై మా స్వప్నంలో కనబడగలిగితే నీకు మా జోహారు. అని చమత్కరిస్తాడు.
'నాకు జబ్బు చేసిందీ అన్నది పదోకవిత ఇందులో లోకంలో వున్న రకరకాల జబ్బులలిస్టులనూ వాట్కి చక్కని ప్రిస్క్రిప్షన్ ఉదాహరిస్తాడు. చలా వడి వడిగా నడిచే కవిత ఇది.ఇందులో బుచ్చిబాబుగారికున్న ప్రపంచ జ్ఞానం
మనకు సుబోధకమై నిలుస్తుంది.

కట్నంతో కన్నె పిల్ల
భర్తే దైవం
కుచేల సంతానం
కార్మికుల స్వర్గం
కాన్సర్ టీబీల కలసివున్న కాపురం
కూడులేని బిడ్డలే కర్షకుల ధాన్యం
అని నొక్కి వక్కాణిస్తూ

అంతేనా గుడ్దిలోకం
చరిత్ర చినుగులు కుడతావా?
నాకరికత శిధిలంపైనా నీ మకాం
కరుణ చూపని దైవమేనా నీ మొగుడు?
ఆకలి బాధల్ని కన్నావా
గతాన్ని పొట్టన బెట్టుకుని
లావైనావుగానీచావులేదా నీకు గుడ్డిలోకమా
అని గుచ్చి గుచ్చి తరచి తరచీ ప్రశ్ణీస్తాడు,

ప్రేమ పచ్చది
కీర్తికి ఎరుపు
హోదాకి ఆకు పచ్చ
ధనానికి నలుపు
వైరాగ్యానికి తెలుపు
అన్నీ వున్న వాడికేమో  నా గుడ్ది కన్ను!
ఇవ్వండిక మీ కళ్ళకొలతలు
చచ్చిన మర్నాడు సరుకు సిద్ధం అని ఘంటా పధంగా చెప్తాడు తనమనో భావాలను కవి.

ఆఖరి కవిత అన్నింటిలోనూ సుదీర్ఘమైనది.

యుద్ధంలో శిధిలమైన
కొండ శిబిరం వలె
దుఃఖంలో ఏకమైన మంచు శిఖరాలు,
మంచుని మించిని మించిన తెల్లటి మందహాసం
మనలోమానవుడి వుయ్యాల.
మన శిఖరాలు అతని ఆదర్శం.
నానిశ్శబ్దం కవితంటాడు
నాఉనికే చిత్రకళంటాడు
నారక్తం అతని గుండెమీది గులాబీ పుష్పం.
నాతెలుపు అతని హృదయం
నాకంటీత్తు అతని ఆదర్శ శిఖరం
నాకంటె వెడల్పు అతని మానవ తత్వం
----
--
అతని ఎముక నా వెన్నెముక
అతని కన్ను మూత నా స్వప్న.ం
---
పచ్చ కొండలో పుడతాను
మనిషి గుండెలోకెడతాను.
అతనేనేను
నేనే అతను
అంటూ వచన కావ్యాన్ని ముగిస్తాడు బుచ్చి బాబు.

బుచ్చిబాబు ఆ సమయానికి కేవలం నినాదాలతో నింపబడి నిస్సారమైపోఉన్న
కవితామతల్లికి సుమహారంగా సహితీ సుగతునికి అన్వర్ధమైన స్వాగతం పలికేలా
తన వచన కావ్యాన్ని అందిస్తాడు.మానవత్వాన్ని దాని విలువల్ని చాటే విధంగా మనకొక చిత్రరూప దర్శనం గావించారు ఈ కావ్యంతో ప్రతిభాశాలిగా బుచ్చిబాబు .
*********************************************************************************