Sunday, May 31, 2015

కాదిది కవితకు నిర్వచనం
---------------------------------రావెల
కవిత సామాన్యమైంది కాదు.
అఖండజ్యోతిలా అనవరతం వెలిగేది.
కవిత కల్లోలాంతరంగ కాదు
తొలివేకువకు విప్పారే
సుందర సుమధుర స్వప్నం.

కవిత కాలం అల్లిన ఉచ్చు కానేకాదు.
మమతానురాగాలతో పొదిగిన మణిమయకాంతుల ధీధితిని
ప్రకటించే ముత్యాలహారం.
కవిత చిక్కులముడి కానేరదు.
చర్వితచర్వణమౌతున్న హక్కుల ఆరంగేట్రం.
కవిత వృధాశోష కాదు
భాషాసంస్కృతులకు బాసటగానిలిచే
ఉచ్చ్వాస నిశ్వాసాల తొ పెనగూడిన
ఊపిరితిత్తుల కదలికల శ్వాసాంతరంగ తరంగం .

Saturday, May 30, 2015

మాతృ దేవోభవ----
===================
అమ్మ నాకెప్పుడూ అపురూపంగానూ
అమూల్యమౌ రత్నంగానూ సాక్షాత్కరిస్తుంది.

అలుపూ సొలుపూపైకెగబాకకుండా ముఖకవళికల్లో
నవ్వుల జలపాతమై ప్రభవిస్తుంది.

ప్రభాత వేళ సుప్రభాతంలా
వేడి వేదిగా పొగలుకక్కే డికాక్షన్ కాఫీలా
మంచాలదగ్గరకే నడిపిస్తూ వుంటుంది.
కుక్కరై విజిల్ వేస్తుంది.గ్రైండరుగా మారి చట్నీలను రుబ్బేస్తుంది.
తాలింపై ఘుమ ఘుమ లాడుతుంది.
.

పూజామందిరంలో అగరుబత్తీలా వెలిగిపోతుంది.
స్కూలు బ్యాగుల్లో టిఫిన్ బాక్షుల్లా వాటర్ బాటిల్లా
సర్దుకుపోతుంది.
 మధ్యాహ్నం వేళకు వాషింగ్ మిషనై సబ్దం చేస్తూ
బట్టలకున్నమురికినంతా వదిలించేస్తుంది.
ఆరవలసిన బట్టలు తానే తాడై ఎండేలాచేస్తుంది.
సాయంత్రానికి దందె మీదకో కావిడిపెట్టెలోకో
అల్మరాల్లోకో చెజ్క్క బీరువా అరల్లోకోసర్దుకుపోతుంది.

సాయంత్రానికి పిల్లలకు ఆటస్థలమై ఆడిస్తుంది.
ఇచ్చిన హోంవర్కుకు టీచరై సహకరించి పూర్తయేలా చూస్తుంది.

అప్పటిదాకా సూపర్ ఫాస్టు రైలులా నాన్ స్తాప్ బస్సులా ఉరుకులుపరుగులతో యంత్రాలై తిరుగాడిన అమ్మ
అర్ధరాత్రికి ఓ గంట అటో ఇటో చీరచెరగుపై దిందులా ఒదిగిపోతుంది.

మళ్ళీ తెలతెలవార్రుతుండగా పాలపేకెట్తై దర్శనమిస్తుంది.
సెలవురోజంతూలేకుందా విసుగును వెనక్కు నెట్టేసి శ్రమజీవన
ఫలాలను స్వాదుయోగ్యంజేసి సంతసిస్తూంది.
---------------------------------------------------------------------

Friday, May 29, 2015

భువి భూతలస్వర్గమా? భూతాలనిలయమా?
---------------------------రావెల
శ్వాస ప్రక్రియను
చేపట్టిన క్షణం నుంచి
ఆఖరు శ్వాసవదలే నిముషం వరకూ
ప్రతిప్రాణికోటిలోనూ
విరామాన్నాసించకుండా శ్రమించే
శ్వాస  కోశాలు ఎంత గొప్పవోకదా!
అవి మానవనైజంకన్నా భిన్నంగా
అత్యంత పట్టుదలతో
తమ కివ్వబన ధర్మాన్ని
రెప్పపాటుకూడా ఏమరుపాటుకు లోనుకాకుండా
గొప్పదైన సేవాదృక్పధంతో
అహర్నిశమూ క్రమం తప్పకుండా
అది గడ్డకట్టె చలిప్రాంతంలోగాని
రోళ్ళు పగిలిపోయేలా కాచే
ఎండల ప్రదేశాల్లోగానీ
వాతావరణానుకూలతలను అననుకూలతను
 సంబంధంలేకుండా వాటినే  మాత్రం
 తనతల పై కెక్కించుకోకుండా
 దీక్షతో శ్రమించే
సైనికులకుమించిన సేవా దురంధరులుగదా!!
మన ప్రాణికోటి ఊపిరితిత్తులు.

మనిషి నైజం ఇందుకు భిన్నంగా ఎందుకుమారిందో
మనం గమనించి శ్రద్ధగా గుర్తెరుగాలి !
కార్యాలయాలకు వెళ్ళగానే గడియారాలకు
కళ్ళనతికించి కుర్చీలో కునికి పాట్లు పడుతూ
భోజన విరామసమయం ఎప్పుడెప్పుడా అని 
ఎదురుచూసే వ్యర్ధజీవులనెలా  మందలించాలి?
పై అధికారి సెలవుపై వెళ్ళినా లేదా పనిమీద
నగరాతరం వెళ్ళినా ఇక ఆ కార్యాలయాల సంగతి దేవుడికే యెరుక సుమా!
ఇలా తమ ఇష్టారాజ్యంగా గాడితప్పి ఓ రెప్పపాటు ఊపిరితిత్తులలా
విశ్రమించాలని తలుచుకుంటే ,ఇక ప్రాణికోటి బ్రదుకు లెలామారి
స్వర్గధామం స్వర్గ ధామం  ద్వారాలచెంతకు వడి వడిగా
సవ్వడిచేసుకుంటూ పరుగులెడతాయో ఊహించండి.

ఇకామీదయినా ఊపిరితిత్తులను చూసయినా సమస్త మానవకోటి
సేవాదృక్పధంతో ప్రవర్తించడం మొదలెడితే
ఈ భువినిమించిన స్వర్గం బ్రహ్మర్షి విశ్వామితృడయినా సృజించగలడా? ఊహించండి.

ఈభూమి అటుపై పుణ్య భూమిగా
అలరారారుతుందనడంలోఈ సందేహము వలదు వలదు

Sunday, May 17, 2015

ఎదురుతెన్ను------------
---------------------


నీకోసమే ప్రతినిముషం వేచి వేచి చూసాను.
కలనైనా నీ రాకకోసం ప్రతిరాత్రీ
కలవరిస్తూ అలిసిపోయాను.

నాప్రాణమె నీవంటూ బాసలెన్నో  చేసాను
నీ ప్రణయపు జడివానలో మరల మరల తడిసిముద్దయాను.
చెరో చోటున మనముoటూ కలవడం వీలుగాకున్నా
ఊహలలో నీ బాసలతో పూవులా విరబూసాను.

ప్రేమలన్నీ గుడ్డివని అంటారట ఎందుకో పెద్దవాళ్ళు
ఆ అంధత్వమన్నదంతా అసత్యమని
 ఘంటాపధంగా నిజం తెలుసుకున్నాను.

పగలూ రేయీ నీధ్యానమే మేలనుకుంటూ గడిపాను
కన్నులనిండా నీరూపమే నింపుకుని
కళ్ళనిండా నీళ్ళు కుక్కుకుంటూ కదలుతున్నాను.





.




రోజులు గడిచేకొద్దీ నీ జడలోని మల్లెలు వాడుముఖం పెడుతున్నాయ్.
భ్రమరాలూ దూరంగా జరిగి విరహ గీతాలు పాడడ0  మొదలెడుతున్నాయ్ .
 అందుకే ప్రతిరేయీ అమూల్యమని  పదే నేను చెపుతుంటాను.
పెద్దలు వేసిన పీటముడులన్నీ ఇప్పుడిప్పుడే
ఒక్కటొక్కటిగా ముడులు వీడి మసలడం మొదలెడుతున్నాయ్.

నీ సామీప్యంలోనే కలలన్నీ సాకారమవుతూసాక్షాత్కరిస్తున్నాయ్.
నీఓడిలో తలపెట్టుకున్నరోజులన్నీ కనులముందు సుస్పష్టంగా  కదులుతున్నాయ్.
మోహావేశంలో నన్ను దింపేసి తారలన్నీ అడవిదారిలో తిరోగమిస్తున్నాయ్.
తారలన్నీ అందమైన చందమామ వెంట శరవేగంగా పరుగెడుతున్నాయ్.

విరహమెంత చేదైన గాధో చందమామ పుస్తకంలోని కధలాగా స వివరంగా బోధచేస్తున్నాయ్.
 వసంతం నాటికయినా  నీ ఆగమనం వుండాలని కచ్చితంగా ఆదేశాలను జారీ చేస్తున్నాయ్.

==============================
యంత్రంలాపనిజేసి
సాయంత్రానికి ఇంటికొస్తే
సరుకులన్నీ నిండుకున్నాయని
ఇంటావిడ సమాచారం
కాలేజీ ఫీసుకు రేపే ఆఖరురోజని
అమ్మాయి కస్సు బుస్సు
యూనిఫార్మ్ చినిగిపోయిందని
కడపటివాళ్ళిద్దరి ఫిర్యాదు.
మధ్యతరగతి మందహాసంకోసం
వెదుకుతూ ఇల్లంతా కలయదిరిగే నేను
కంగారు పడితే జబ్బుల పాలౌతాను
అందుకే ఓ చిరునవ్వుతో జవాబుగా
జవానీనై స్పందించాను.
------------------------------------

Friday, May 15, 2015

సన్నిహితంగా
----------
పక్షుల కిలకిలారవాలు
పారుతున్న నీటి గలగలలు
అతి సమీపపంలోనే వినబడుతున్నాయ్
సుమాల పరిమళ సౌరభం
యేమంత దూరంగాలేవనుకుంటా
బహుశా నీవెక్కడనో ఈ దగ్గర్లోనే
దాగివున్నావని స్పష్టమౌతున్నది.
ఎందుకింక వ్యవధానం చెంతచేర వేగ రమ్ము!
=====================

Thursday, May 14, 2015

సమన్యాయంకోసo--------రావెల
=================================

అంతా వ్యాపారమైనచోట
నీ వొక్కడవే నీళ్ళూ
నములుతూ కూర్చోడం
ఎందుకు రారమ్మని
దేవుడిని గూడా
గర్భగుడిలోంచి
రెక్క పట్టు కు లాగి
రధయాత్ర పేరుతో
డబ్బులు పండిస్తున్నాం
నిలువు దోపిడీ చేసే హక్కు
నీకే వుందనిస్వామీజీల చేత
శ్రవణపేయంగా చెప్పిస్తున్నాం.

విద్యను వ్యాపారంజేసిన వాడిని
సిం హాసనమెక్కించి మంత్రినిజేసాం.
వైద్యం వ్యాపారవస్తువేనని
రోగ నిర్ధారణప్రక్రియనును
 చుక్కల నంటుకోమని చక్కగా ఆదేశించాం.

రాజకీయమూ వ్యాపారమేనని
గజదొంగలను కొడుకులుగా కన్నాం.
యువరాజులను 'కాయతుదారుల్లా' మార్చి
విదేశ వస్తువులను  బహిష్కరించిన చేతుల్తోనే
వారి వారి వస్తువులను మన రాష్ట్రాల్లో
స్వేచ్చగా ,నిరభ్యంతరంగా  అమ్ముకోమని
ఆహ్వానాలను అందించడానికి పంపాం.
అంతర్జాతీయ స్థాయిలో మతాన్నికూడా
వాణిజ్యంచేయండని శాఖలనాదేశించాం.

ఇంకేంచేయాలి? ఆలోచించి చెప్పండి
వ్యాపారవేత్తలను రమ్మని
అంతర్జాతీయంగా మన దేశాన్నే
అమ్మడానికి అన్ని ప్రయత్నాలూ ప్రారంభిద్దాం.

చట్టం అడ్డుతగలకుండా అవినీతిని అచ్చుగుద్దిన
ఆంబోతెద్దుల్లా, వీధుల్లోకి వదిలి ఇదే న్యాయమంటే నని
ప్రజలంతా పరిహసంచేలా ప్రయత్నాలు ప్రారంభించాం.
కాదన్న వాడేవడన్న వుంటే ఆ గాడీదకొడుకులను
బహిరంగంగా తీవ్రవాదనో ఎర్రచందనం దొంగలనో
ఎంకౌంటర్లో లేపేద్దాం.
==================================13-5-15

Wednesday, May 13, 2015

చిత్తగించవలెను
-----------------------రావెల.

నేను నడమంత్రపు సిరులతో
నాట్యమాడాలన్న దుగ్ధ.
ఆకోరిక నిజరూపం దాల్చేదాకా
నన్నంటుకోకు

ఈ జగత్తునంటినీ ఆలోపు .
దారిద్ర్యంతో అంతమవకుండా
అత్యంత జాగరూకతతో సమ్రక్షించు.

భగవంతుడా నాయశోకీర్తులు
దిగంతాలదాకా ధగధగాయమానంగా
వెలుతూ లోకాన శాంతి సుస్థిరంగా నిలిచేలా
తగు చర్యలనన్నింటినీ శ్రద్ధగా నిర్వర్తించు.

సర్వ కాల సర్వావస్థలలోనూ
నా కవితా సంపుటికే ప్రపచమంతటా
ఘన కీర్తిని పొందేదాకా
ఈ జగత్తు అజ్ఞానతిమిరాలలోనే
అలమతించేలా అన్ని సదుపాయాలను కల్పించు.

అందరినీ ఐశ్వర్యవంతులను గావిస్తానని
వాగ్దానంచేసిన పాపానికి
మా అర్ధిక వ్యవస్థను సుస్థిరంగా వుండేలా దీవించు.
ఆకోరిక నెరవేర్చేదాకా నన్నే మళ్ళీ మళ్ళీ
ప్రజా ప్రతినిధిగా పేద్ధ మెజారిటీతో గెలిచేలా
ఆశీర్వదించు.

నా ఈచిన్ని కోరికలన్నింటినీ నెరవేరుస్తూ
నాపై ప్రత్యర్ధులు నాపై చేసిన ఆరోపణలన్నీ
న్యాయంకాదని ఋజువయేదాకా ఈ న్యాయదేవత
కళ్ళకు కట్టుకున్న గంతలు తొలగించకుండా తగు చర్యలు చేపట్టు.
వీటన్నింటినీ చిత్తశుద్ధిటొ నేరవేర్చిన పక్షంలో
నీ ఋణం నా అక్రమార్జనలో కొంత శాతం నీ హుండీలో
పడేసి నీ కృతజ్ఞతా భావానికి ధన్యవాదాలు సమర్పిస్తూ
నీ ఆదేశాలను తు చ తప్పకుండా అమలుచేస్తానని ఇందుమూలముగా
నా నియోజక వర్గ పు వోటర్లమీదప్రమాణం చేస్తున్నాను.

=====================================
కవిత్వం రాచపుండు లాంటిది
ఖర్చు పెడుతున్నకొద్దీ
 కొండలనైనా హరాయిస్తుంది.

చికిత్సా సమయంలో
చింత పండునైనా తీయగా
నమిలేలా భరింప జేస్తుంది

అంతటి శ్వాసా ఆగిపోయాక
అప్పుల కుంపటై దహిస్తుంది
-------------------------------------


Sunday, May 10, 2015

శైశవావష్థాలో దాదిగా
బాల్యంలో చంకనెక్కించుకుని
చందమామనందించే జోలపాటగా
యవ్వనంలో మార్గదర్శిగా
నడివయసులో కడలికన్నా మిన్నయిన
గాంభీర్యాన్నందిస్తూ మనసెప్పుడూ

కకావికల పాలుగాకుండా కాపాడే
మహోత్తుంగపు హిమశిఖరంలా
వృద్ధపూమంలో కరగని కలలా
కడుపునుచించుకోనిచ్చుకుంటూతనరక్తాన్ని
పంచిపెట్టే అనురాగ దేవతగా
అత్మీయతనందించే అమృతోపమంగా
 దసల్లోనూ---  నల్దిశల్లోనూ
నేత్రానందకరమై భాసిల్లే
హృదయానందకారకమౌ కల్పతరువుగదా
అమ్మంటే --అపురూపమూ
అద్వితీయమూ అయిన
అపరంజి బొమ్మ--కళ్లెదుటన
 అనునిత్యం సాక్షాత్కరిస్తూ
కనుపాపనంటిపెట్టుకుని కదలిపోతూ
కనుచూపుమేరా కనుపించే కాంతి కిరణం .



Saturday, May 9, 2015

నిన్నటిదాకా ఉన్ని శాలువాకప్పుకున్న
కాశ్మీరం మతవిద్వేషాలతో
తగలబడుతూ కమురుకంపు గొడుతున్నది.
నీవూ నేనూ భాయీ భాయీ అంటూ
తూర్పు పశ్చిమాలు రెండూ అధికారం పంచుకుని
ఆనందం గా ప్రజా సమస్యలను గాలికొదిలేసి
ప్రపంచ శాంతిసదస్సులో పావురాలనెగరేసి
పబ్బంగడుపుకుంటూ,   డాలీ సరస్సులో జాలీగా
జలవిహారంచేస్తూ పారిశ్రామిక వేత్తలకు
పాదాభివందనంజేస్తూ పవిత్రజలాలను నెత్తిపై
జల్లుకుని పునీతులమయ్యామన్న
 భ్రమలో శ్వాసిస్తున్నాయ్.
ద్విముఖ పారాయణం
్్్్్్్్్్్్్్్్్్్్

వదనగ్రంధంలో
ఒక ముఖం దర్శనమిస్తుంది.
నిజ జీవితంలో మరోరకంగా
ప్రవర్తిస్తూ విసుగిస్తుంది.
 ఆమె రెండుజడల సీత కాదుగదా
రెండుతలపాము.

క్రింద పోర్షన్లో ఉండే
కూతురుతోగూడా వాట్సాప్ లోనే
సంభాషిస్తుంది.

వంటలూ వార్పుల్లూ శీర్షికలో
ఉదయాన్నే ఒక వంటను పెట్టి
హాయిగా గుర్రుకొట్టి నిద్రపోతుంది.
కర్రీ  పాయింట్ ఉందిగదా తొందరెందుకని
దబాయించి మాట్లాడుతుంది.
బద్ధకానికి మారుపేరుగా తననే పేర్కొనాలి.
వృద్ధాశ్రమంలో ఉంచిన తల్లిదండ్రులను
వారానికొక్కసారయినా పలకరించిన పాపానపోదు.

అమ్మగా అస్సలు పనికి రాదు.
కూతురుగా కొసరుకైనా సరిపోదు.
ఆడజనమంటే ఇదా అని ఆశ్చర్యపోయేలా
ప్రవర్తిస్తూ అదేంటని అడిగితే అదంతేనని విసూక్కుంటుంది.

ఆషాఢభూతిని చూడలేని వాళ్ళకు
సోదాహరణంగా ఈవిడనే పేర్కొనాలి.
అన్నాననికాదుగాని కడుపుచించి
జన్మనందించిన కన్న తల్లినికూడా

కనికరమంటూ లేకుండా
కసిరికొడుతూ కష్ట పెడుతుంది.
కన్నీటిపర్యంతంజేసి
కకావికల పాల్జేస్తుంది.
--------------------------------------------
[ద్విముఖాలకు నిదర్శనమైన
మహిళామణులకు
కోపకారణంగా అంకితం.]




Thursday, May 7, 2015

సమయోచితంగా---
==================రావెల
===============================
ఒక దశాబ్దం క్రితం
--------------------------
తలుపులనెవ్వరో బాదుతున్న చప్పుడు
తలుపులను బార్లా తీసే లోపు
కట్టుకున్న సాదాచీరెను మార్చాలి
ఏదో ఒక సిల్కు చీరను కట్టుకోవాలి.
మెడలో ఒక గొలుసునన్నా దిగేసేయాలి
జాకెట్ మడతల్లో డబ్బును దాచి
పరధ్యానంలో పోగొట్టుకోకుండా
కాపాడుకోవాలి.
ఇంటియజమానే అయుంటాడు, నెల మొదటివారం గదా
అద్దెకోసం వచ్చి వుంటాడు.
^^^^^^^^^^^^^^^^^
ఇప్పటికిప్పుడు.
----------------
ఇప్పుడు
తలుపులనెవ్వరో తన్నుతున్నంత గట్టిగా శబ్దం.
ఇప్పుడు అన్ని గదుల్లోనూ దీపాలనార్పాలి.
కట్తుకున్న పేరంటం చీరెను మార్చి
సాదా చీరెను చుట్టుకోవాలి.
రెమోట్ను నొక్కేసి టీవీని ఆపాలి.
మెడలో గొలుసును తీసేసి పసుపుతాడును చుట్తుకోవాలి.
ఇంటి యజమాని వచ్చి వుంటాడు. నెల చివరివారంగదా
ఇప్పటికే నాలుగయిదు సార్లు బెదిరించాడు,ఈసారి తప్పక
నిలదీసి నిగ్గు దేలుస్తానని భీష్మించుకు కూర్చుంటాడు.

ఆయనకు నెల జీతం వచ్చి ఆరునెలలు దాటిపోయింది.
అందుకే పేదరికాన్ని నటిస్తూ బీదతనాన్ని కౌగలించుకోవాలి.
========================================================
శీర్షిక కోరుకోని కవిత-
=======================
ఇప్పుడు కన్నీళ్ళు ఎందుకింత చులకనైపొయాయి?

తళుకుబెళుకులతో తైతక్కలాడే వాడు
తాగి ఒళ్ళుపై తెలియకుండా కాలిత్రోవలపై
నిదురిస్తున్న పేదరికాన్ని నిలువునా చంపెస్తే
ఎంతమంది కన్నీళ్ళను స్వచ్చందంగా కార్చగలిగారో తెలియదుగాని
ఆ ఢీరోదాత్త  నాయకుదికి చేసిన నెరానికి న్యాయంశిక్షిస్తే

భోరు భొరునా వీరాభిమానులంతా
 ఏకధాటిగా సునామీలను మించినంతగా
బాధపడి కన్నీటి కడలులను ఊరూరా వాడవాడలా సృష్టించారు.

మానభంగంకనా ప్రాణ హరణం తక్కువేనని వారి చిట్టిబుర్రలకు

తట్టిన న్యాయం. ఒకరకంగా  కలియుగాన కరుడుగట్టిన మాయోపాయం.

============================================

పలనాడులోనిఒక పురోహితుడి ఇంటి దృశ్యం
----------------------శ్రీనాధ మహాకవి.

----------------------------
దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి మంచము దూడరేణమున్
పాసిన వంటకంబు పసిబాలుర శౌచము విస్తరాకులున్
మాసిన గుడ్దలున్ దలకు మాసిన ముండలు వంటకుండలున్
రాసెడు కట్టెలున్ తలపరాదు పురోహితులింటి కృత్యముల్.
=================================================
పుల్లసరోజనేత్ర యలపూతన చన్నుల చేదుద్రావినా
డల్ల దవాగ్నిమ్రింగితినట0చును బిoకములేల తింత్రిణీ
పల్లవయుక్తమౌ నుడుకు బచ్చలి పాకము జొన్నకూటిలో
మెల్లన నొక ముద్ద దిగమ్రింగుమునీపస గాననయ్యెడున్.

అంగడియూరలేదు వరియన్నము లేదు శుచిత్వమేమిలే
దంగనలింపులేరు  ప్రియమైన వనంబులు లేవునీటికై
భంగపడంగ పాల్పడు కృపావరులెవ్వరులేరు దాతలె
న్నంగను సున్న గాన పలనాటికి మాటికి బోవనే టికిన్.
----------------------------------------------------------
Hot and delicious
the mango pickle
summer's  hot cake 
వాసెన కట్టు గట్టిన
వాసనకేంలోటు రాదు వసుధన మాగాయ్
మూసిన నాసికనైనను
తోసియు రాగలుగు  శక్తి తొయ్యలి నీదే!
------------------------------------------
వేసవి వచ్చిన గుర్తుగ
మూసిన మూతల జాడీ ముసిముసినవ్వెన్
కొసరుగ వడ్డనతప్పదు
మిసమిసలాడుచు మిణికెడు మగడే మెచ్చన్

Tuesday, May 5, 2015

వెదుకులాట
----
మిట్ట మధ్యహ్నం
నడినెత్తిన సూర్యుడు
నాట్యమాడుతున్నవేళ
ఒకడు చేతిలో కొవ్వొత్తిని పెట్టుకుని
ఎవరికోసమో తీక్షణంగా వెదుకుతూ
దుకాణాల సముదాయానికొచ్చాడు.



అందరు దుకాణాదారులూ నవ్వుతూ
ఎవ్వరికోసం నీవు వెదికేది అని శ్రద్ధగా అడిగారు.

దైవసంబంధమైన విషయాలతో శ్వాసించె
మనిషికోసమే వెదుకుతూ ఇటుకేసి ఒచ్చానన్నాడు.



ఇక్కడ అందరు దుకాణాదారులూ అలాంటివారేనన్నాడు.
కోపమూ కోరికలూ కలిగి వుండికూడా
శాంత స్వభావంతో సమ్యక్ దృష్టితో ప్రవర్తించే మనిషిని
చూపిస్తే చాలు తిరిగి నాచోటికి నేను వెల్తాననగానే
అతన్ని ప్రశ్నించిన వారందరూ పరాజ్ఞ్ముఖతను ప్రదర్శించారు.



[రూమీ భావానికి తెలుగు సేత]

Monday, May 4, 2015

ఔనన్నా కాదన్నా
======================
ప్రతి పుస్తకానికీ పీఠికలా నీవొస్తావు
  ప్రతిపూవులోనూ పరిమళమై ప్రసరిస్తావు.

  ముందు మాటలోనిముఖస్తుతివై నీవు నిలుస్తావు
 అందులోని అంతరార్ధం గ్రహించక నేను విలపిస్తాను.

  పానశాలలోని మధు పాత్రలా మెరిసిపోతావు
  గరళంలా గళం దిగకుండా నన్ను యేడిపిస్తావు.

 ఆధునిక చిత్ర కళాఖండమని దానిని  నీవు గౌరవిస్తావు
 అది అవగతం కాలేదని నేను  అప్పిసెం  వగరుస్తుంటాను.

అస్తమయమప్పటి ఆకాశంలా రంగులుమారుస్తావు
 అసూర్యంపశ్యవు నీవేనన్న భ్రమలోనే జీవిస్తాను.

కలకాలమిదే కధను కవితలా వినిపిస్తాను
నీవు కాదంటే ధృవతారలా నింగికెగసిపోతాను.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్


మృదుహాసాల దరహాస చంద్రిక
ముగ్గులాముంగిట వాలిన అనుభూతి
ఒక సారస్వతోదయం సన్నిహితమై
సాక్షాత్కరించిన పూర్ణోదయాత్పూర్వ పు
పున్నమి--- జ్యోత్స్నాంతర్హితమైన శుభదినం
ఒక స్త్రీ ధన్వంతరి సహోదరిగా
సాహితీ సుగతులురాలిగా
సహకరించినసాధువాదాల సంరంభం
సుమ సౌరభం ప్రశమించిన పరీమళం
నాసికా పుటాల దగ్గర ఇంకా నర్తిస్తున్న
సుమధుర ఘడియల సహృదయ  సన్నివేశం

చితికి పోతున్నా!
చివికిపోతున్నా

ఎందుకీ మనుషులంతా ఇలా
విరిగి ముక్కలయిన ఆటబొమ్మల్లా
చెల్లచెదరవుతూ కుడ్య సిధిలాల్లా
చావూ బ్రదుకులమధ్యన సగంచస్తూ
జీవితాలను దయాదాక్షిణ్యాలకు దూరంగా
సాగిస్తూ సంతృప్తిపడుతున్నారు?
ఎన్ని సార్లు రోజువారీగామన
భూదేవిమీద అన్యాక్రాతంగా
అరాచకాలనుజేసి అకృత్యాలను
అనుస్యూతంగాజేసి అపవిత్రం గావించడంలేదు?
మనల్ని కాపాడుకోవాల్సినమే
స్వయకృతాపరాధాలుజేసి
సర్వనాశనంగావించుకోవడంలేదు.


యే శాస్త్రవేత్త విజ్ఞనాకికయినా
అందని పరిధుల్లో మనం ఈ భూగోళంపైన
పరిస్థితులను మనకనుగుణంగా సేదుబాటు చేసుకుంటూ
బ్రదుకును ఓ వ్యర్ధ పదార్ధంగా సాగదీసుకుంటూ
మునగదీసుకుని మృణ్యయ రూపంగా మలచుకొని
మూర్ధన్యులమై బ్రదకడంలేదు?
[బీ. ఇందిర గారికవితకు స్వేచ్చానువాదం]




ఈ మానవాళినంతటినీ ఒక్క సారిగా భూగర్భం
అధోజగత్తులోకి
సీతమ్మ వారినిలాగేసుకున్న విధంగా
లాగేసుకుని కడుపులోపెట్టుకుని కాపాడగలగలేదు?

కృతజ్ఞతగా మనమేం చేసాము.

కాలుష్య కారకమైన పనులన్నింటినీ పనిగట్టుకుని
నిర్వహించడంలేదు?

మనపాపాలపుట్టపెరిగి హిమాలయాలంత ఎత్తును దాటి ఎదుగుతున్నా
మౌనం వహించి మూగవారిమైపోయినట్లు అంధులమైనట్లు
పశ్చాత్తాపంలేని బ్రదుకులను పాప కూపాల్లోకినెట్టేసుకుంటూ
నిరర్ధకజీవులమై బ్రదుకును వెలార్చడంలేదు?
=======================================

ఎడారిలో సూర్యోదయం
ఎంత అందంగా హత్తు కుంటుందో
అసుర సంధ్య వేళ ఈ గోలంతా యేమిటని
ఎన్ని చందాల  మొత్తుకుంటుందో?
ఎడారిలో సూర్యాస్తమయం
ఎంత మందంగా  మెత్తుకుంటుందో
---------------------------------------------------
ఆగమనాభిలాష
-------------------రావెల


నువ్వున్నావన్న ధ్యాసతోనే
వసంతాన్నాహ్వానిస్తున్నా!

ఆరు రుతువుల్లోనూ ఏకాగ్రతతో
నీ ధ్యానముద్రలోనే గడిపేస్తున్నా!

ధ్యాస వొకటీ ధ్యానమొకటీ కాకుండా
తగు జాగ్రత్తలు ఎప్పటికప్పుదు తీసుకుంటున్నా!

మనిషీ మనసూ ఏకమయాయని తెలిసాక
ఏ ప్రాణికయినా పాణిగ్రహణమే మేలని తలపోస్తున్నా!

మ్రోడు వారిన జీవలతికనైనా
నిరంతరం నీరుపోసి భద్రంగా పోషిస్తున్నా!

ఏ నాటికయినా అది చిగురుస్తుందన్న
ఆశతోనే అనవరతం శ్వాసిస్తున్నా!!
===========================

Sunday, May 3, 2015

అవిశ్రాంతం------
---------------
వెదకడం సుదీర్ఘమైనా
విసుగును పోగేసుకోవడంలేదు
అన్వేషణ అనంతకాలమైనా
ఆలస్యమైన అవకాశం
 వింతగా తోచ నిచ్చగింపదు.
శూన్యపరిధిలొకి మనసు
విస్తరించుకుంటూ పోయినా
విరామన్ననుసరించాలన్న
ధ్యాస గుండెకు చేరుకోవడంలేదు.
సంతోషమయినా సంతాపమయినా
సన్నిహితత్వాన్ని అది   సాగిలబడనివ్వదు.
మెతుకు వెదకులాటలో గతుకుల బాటయినా
కడుపులో చల్లను ససేమిరా కదలనివ్వదు.
కారణాలెన్ని కలతపెడుతున్నా
కల్కియనేకాలనాగు బుసపెట్టి భయపెట్టి
కాల హరణాన్ని కనుచూపుకు కనబడనీదు.
--------------------------------------------




Saturday, May 2, 2015

పిల్లలూ దేవుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దేవుడున్నాడనెది .కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్టిపారేయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తలలు బద్దలు గొట్టుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాట సాయంతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికట్ విధానం మొదలయింది.ఆ హాల్ టికట్ స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంట్జెబులొ హాల్ టికట్ పెట్టి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడావిడి అంతా ఇంతాగాదు ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్టు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశా డు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి.HM గారు గద్దల జాకబ్ గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మాయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతామూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పకింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ స్కూల్ first స్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆ క్షణంలో గుండె దడ దడా కొకొట్టి కోవడం ఓ కొసమెరుపు.ప్యాసయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు first ఒచ్చింది. ఇక కంటనిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ, దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పె కుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు.వుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దెవుడున్నాడనెది కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్తిపాఋఏయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తvలలు బద్దలు గొత్తుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాటతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికెట్ సంస్క్ర్తి మొదలయింది.ఆ హల్తిక్కెట్ ను స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంత్ జెబులొ పెట్తి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడవిడి అంతా ఇంతాగాదూ. ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్తు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశాదు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాౠ.ఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి. గారు గద్దల జాకబ్[జోసF--] గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంతనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతామూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పతికింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ ఉ స్కూల్ ఫర్స్ట్వొస్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆఖణమో గుండె దడ దడా కొట్తుకోవడం ఓ కొసమెరుపు.ప్యాయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు ఫర్స్టీ ఒచ్చింది. ఇక కంతినిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పెత్తుకుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు.వుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దెవుడున్నాడనెది కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్తిపాఋఏయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తలలు బద్దలు గొత్తుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాటతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికెట్ సంస్క్ర్తి మొదలయింది.ఆ హల్తిక్కెట్ ను స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంత్ జెబులొ పెట్తి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడవిడి అంతా ఇంతాగాదూ. ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్తు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశాదు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాౠ.ఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి. గారు గద్దల జాకబ్[జోసF--] గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంతనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతామూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పతికింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ ఉ స్కూల్ ఫర్స్ట్వొస్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆఖణమో గుండె దడ దడా కొట్తుకోవడం ఓ కొసమెరుపు.ప్యాయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు ఫర్స్టీ ఒచ్చింది. ఇక కంతినిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పెత్తుకుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు.
ఒక కవి కన్నుమూస్తే అతని కవితలన్నీ కరదీపికలై చదువరులను సమాజహితైషులుగా మార్చే దిశలో నిరంతరం శ్రమిమిస్తూ సన్నిహితమై కీర్తిశేషులుగా అజరామరమై నిలిచి ఆదర్శ పధగాములై పాధులుగా పయనిస్తాయి. ============================================

Friday, May 1, 2015

పిల్లలూ దేవుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దెవుడున్నాడనెది కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్తిపాఋఏయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తలలు బద్దలు గొత్తుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాటతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికెట్ సంస్క్ర్తి మొదలయింది.ఆ హల్తిక్కెట్ ను స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంత్ జెబులొ పెట్తి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడవిడి అంతా ఇంతాగాదూ. ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్తు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశాదు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాౠ.ఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి. గారు గద్దల జాకబ్[జోసF--] గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంతనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతామూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పతికింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ ఉ స్కూల్ ఫర్స్ట్వొస్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆఖణమో గుండె దడ దడా కొట్తుకోవడం ఓ కొసమెరుపు.ప్యాయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు ఫర్స్టీ ఒచ్చింది. ఇక కంతినిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పెత్తుకుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు.
ఎండుటాకు ఎక్కడినుండో గాలివాటానికి ఎగిరొచ్చి మాముంగిట తిష్ట వేసింది. చూసిందే తడవుగా దాన్ని తడిమి మరీ ప ట్టు కుని చూసాను. యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ పేరిట నిన్ననే విడుదలైన సినిమాలో ముసలి ముడతలను కప్పెట్టిన మేకప్పులో హీరొ తన కూతురువయసుకూడా ఉండబోని కుర్ర దాన్ని తడిమి తడిమి తన్మయత్వం చెందినట్టు. అదొక రాగిరేకేమోనన్న భ్రమలో అన్నమయ్య కీర్తనుందేమోనని ఆశగా పొదవుకుని చూసాను. డబ్బు కక్కుర్తికి వేల రాగిరేకులను కరిగిoచాలని ప్రలోభానికి లోనైన కరకు హృదయాలు కరిగించకుండామిగులుస్తారా ?మన కళాపోషకులు నా వెర్రిగాని. అదేమైనా పురాతన పద్యసంపదను పంచిపెట్టే తాళపత్రమనికూడా భ్రమపడితీక్షణంగా తేరిపార చూసాను. పురాతన వస్తు సేకరణలో దాచకుండా బయటపడిన అమూల్యమైన పత్రమనికూడా అనుకున్నాను. అది కేవలం శిశిరంలో వచ్చేవసతపు శోభను కనులారా చూడలేనని కుళ్ళుబోతు తనంతో ఈర్ష్యాసూయలకు లోనయి, మ్రోడు వారిన తరువునుండి వేరు పడినదిగా తీర్మానించుకుని ఖేదపడ్డాను.కాలానుగతంగా ప్రతి మనిషిబ్రదుకూ ఇంతేగదా అని విషణ్ణవదనంతో మూర్చిల్లిపోయాను. ======================================
నిరంతరాన్వేషణ ================ అన్యాక్రాంతమైన ఆనందంకోసం అన్వేషణ మొదలెట్టాను అంతటా నైరాశ్యమే ఎదురొచ్చి స్వాగత వచనాలు వల్లించింది. నవ్వులన్నీ నాజూకుగా ఎక్కడికి తప్పుకున్నాయో ఎంత వెదికినా జాడ బోధపడడంలెదు. చిరుమందాహాసాలకూ చిక్కుముడులు తప్పినట్లు లేదు వడివడిగా అవీ నాముందుగనే పరుగలుదీస్తూ వెడలిపోయాయ్. అందుకే ఈనిరంతరాన్వేషణను నిరవధికంగా వాయిదావేసి మళ్ళీ వాస్తవజగత్తులోకి ఒంటరిగా పయనించడం మొదలెట్టాను. పత్తేదారుగా రూపం మార్చుకుని అదేపనిగా శోధన సాగిస్తున్నాను. అపరాధం కాకపోయినా ఈ అన్వేషణ సత్ఫలితాలనేఇస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతో-- ===============================