Tuesday, June 9, 2015

ఈ చీకటి గుయ్యారం వెనుక
ఎంతచరిత్ర దాగుందో ఎందరికెరుక?
ఇవ్వళొక్కసారిగా తలుపులూ కొటికీలూ
తెరవగానే ఓ రకమైన
 తేజస్సు ఆవిష్కృతమయింది.
దగ్గరదగ్గర రెండేళ్ళు మూసిన
ఇల్లంతా మూగరాగమాలపిస్తూ
మౌన భంగం కాకుండా
 కాపాడుకుంటూఒచ్చింది.
చీకటితోనే ఇంటిలోని అణువణువూ
చెట్టపాట్టాలేసుకుని తిరిగాయి.

ఇప్పుడొక్కసారిగా వెలుగు వేనువూదుతూ
ఒక్కుదుటన విచ్చేసింది.
చీకటంతా చిందరవందరై చెల్లాచెదరైపోయింది.

వెలుగుమతాబాలు వెలిగించడమ్మొదలెట్టాక
మసిపువ్వొత్తుల్లాంటి చీకటికి స్థానమెక్కడుంటుంది?

అందుకే వెలుగులప్రస్థానం మొదలయాక
చీకటి చిత్తగించడం తప్పనిసరయింది.

ఒకందుకు చీకటినికూడాభినందించకుండా ఉండలేకపొతున్నాను.
పుస్తకాల బీరువాలచెంతకు 

No comments:

Post a Comment