Wednesday, June 17, 2015

మౌన రాగం
--------------రావెల

జీవితాన్ని
నిర్దిష్టంగా,
నిర్దుష్టంగానూ
నిర్వచించాలని
నిరంతరంతపించాను.
యేండ్లు గడిచాయి
పూండ్లు దాటాయి
దశాబ్దాలుసైతం
దీశ మార్చుకు వెళ్లాయి.

కానీ
నామనోభీష్టం మాత్రం
నెరవేరనేలెదు.
'జీవితంప్రేమమయం' అన్నాను.
ప్రణయపయోధి జలాల్లో
ఒల్లకున్న ప్రేయసిపన
ఆంల ద్రావణంజల్లేవారో
రాక్షాంగా గొంతుకోసేవారో
కళ్ళెదుట సాక్షాత్కరించారు.

జీవితం భక్తి సంభరితం
అన్నాను.అహం బ్రహ్మాస్మి అంటూ
హూంకరిస్తూనే విదేశీ భక్తులపట్ల
అవ్యాజానురాగాలను ప్రకటించే
కపట కాషాయాంబర ధారులే
పరాయిదేశాల పర్యటనల్లో
ఊరేగుతూ స్వార్ధమంటే ఇదేనంటూ
సోదాహరణంగా నిలిచారు.
స్వామీజీలపెరిట కపట నాటకాలాడే
కాషాయంబరహారులకు ఓ నంస్కారంపడేసి
మనోవల్మీకంలోంచి వాళ్ళ పొదను తుడిచేసాను.

శ్రమైక జీవన సౌందర్యాన్ని అభిలషించే
సంఖ్య ఈషణ్మ్,ఆత్రమైనా కనబడలెదు.
మానవత్వానికి మేమె చిరునామా
అని చెప్పగలిగిన ధీశాలురే కరువై పోయారు.

విఫల మనోరధంతో వెనుదిరిగి గృహోన్ముఖుడనయాను.
వేసవికాలంలో చెలరెగె పెనుతుఫానుల నడిగాను.
వర్షాకాలంలో మందిపోయే సూర్య కిరణాలను ప్రశ్నించాను.
ఆమని అందాలు ఎక్కద అని అనునయంగా అడిగాను.కాలుష్యపు కోరలను విప్పారుస్తూ కలికాలం ఎదురొచ్చినిలిచింది.
ౠతువులనీ క్షతగాత్రమై దర్శనమిచ్చాయి.
నెత్తురోడుతూ నన్ను భయ విహ్వలుదిని గావించాయి.
జీవితాన్ని నిర్వచించగల బుద్ధికుశలత నాకులేదని
ఆలోచలన్నింటికీ అర్ధాంతరంగానే స్వస్తిజెప్పి.
నాకునెనే సమాధానంగా నిలిచి మౌనరాగాన్నాలపిస్తూ
స్థాణువుగా నిలిచిపోయాను.
--------------------------------------------------------------18-6-15

No comments:

Post a Comment