Monday, March 30, 2015

సశేషం
----------
రెండొ మనిషిగానువ్వు నన్ను
అంటిపెట్టుకు ని ఉన్నంతకాలం
గుండెనిండా అనుకోని ధైర్యం
పొంగి ప్రవహిస్తున్నట్లనిపించేది.
ప్రపంచమంతా ఓ యుగళగీతమై
కర్ణపేయంగా వినిపిస్తున్నట్లుండేది.

ఇప్పుడిలా నన్ను ఒంటరిగాడిని జేసి నువ్వెళ్లిపోయాక
యావత్ ప్రపంచమూ నన్ను వెలేసినట్లుగా
ఓ భావన పొటమరిస్తూ వుంటుంది.
నన్ను  పట్టించుకోకుండా ఈ జగత్తంతా
ఎక్కడికోపారిపోతున్నదేమోనని దిగులు పుడుతుంది.
ఇప్పుడు నాఎదురుగా ఉన్న ఆకాశం
చందమామను పోగుట్టుకున్నట్లనిపిస్తున్నది.

ఎండవేడిమేలేని ధార్ ఎడారిలా,
మంచు తెరలంటూ కనబడని హిమాలయశ్రేణిలా
తీగెలు తెగిపడ్డ వీణలా
నాదనుకున్నదేదీ నాకు దక్కకుండా పోతున్న నేనులా
అంతా ఒట్టి శూన్యమే దిగంతాల దరిదాకా
ఆవరించి నన్ను అప్రతిభుడినిగావిస్తూ , అశక్తుడిని చేస్తున్నది.
అందుకేనువ్వు నన్ను వెన్నంటే వున్నావన్న భ్రమలోనే
శేష జీవితాన్ని సాదరంగా సాగిస్తూ పోతున్నాను.
==================================

ఓ గరుద పక్షి తన పాదబంధంతో
ఓ సరీసృపాన్ని ఈడ్చుకెల్తున్నది.

కర్బనపు వాయువూ నీలలోహిత కిరణాలూ
కొన్ని దోమలూ, అన్నింటినీ తన హృదయకుహరాల్లో
దాచుకుని గగనం తన భుజాలనెగరేసుకుని
నిరాడంబరంగా నిమ్నోన్నతాలను కుదుపుతూ
తన విజయ యాత్రను కొనసాగిస్తుంది.

ఆకాశానికి ఎందుకోమరి వయసుమీదబడుతున్నదన్న
చింతయేమీ ఉన్నట్లు కనబడడంలేదు.
మతిమరుపన్న మాటనే దగ్గరకు చేరనివ్వడంలేదు.

ప్రతి [రభాతానికి కావాల్సిన రంగవల్లులనన్నింటినీ
తనే స్వయంగా తీర్చిదిద్దిపెడుతున్నది.
అనూహ్యమైన సంతసమంతా తనకె స్వంతమని భావిస్తుంటుంది.

సునామీలుగానీ సుడిగాలులుగానే భయంకరమైన
ఉరుములూ మెరుపులూ దాన్ని జంకించలేకపోయాయి.
వడగండ్ల వానలు దానికేం కడగంద్లను కొనితెచ్చిపెట్తిన దాఖలాలేదు.
మంచుతెరలడ్డొచ్చి ఎన్ని అవాతరాలను కలిగించినా
తన ధీరత్వాన్ని కోల్పోయిన సూచనలు కానరావడంలేదు.
ఉదయాన్నే ప్రతి ఇంటిలో కిటికీ తెరవగానే ఉషస్సులను
వరుసగా సరఫరాజేస్తూ విసుగూ విరామంలేకుండా
సంధ్యాసమయందాకా శ్రమిస్తూనేకనబడుతుండి.
గగనం ఎప్పుడూ సాదృశంగా నిర్మలాకారంలోనే ప్రత్యక్షమౌతుంది.
అద్దంలో తన వదనారవిందాన్ని చూసుకోవాలని తాపత్రయం పడదు.
మబ్బులతో అప్పుడప్పుడూ మసకబారినట్లు కనిపించినా దిగాలుగా
ఎప్పుడూ సాక్షాత్కరించిన ఆనవాలు అస్సలేమీ లేదు.

మనం ఆ నీలిగమనపు నిశ్చలత్వాన్ని చాలా నేర్చుకోవాలేమో మరి!
ఎప్పుడూ కొండాకొనలను స్పృశింఛి చుంబించినా ఎగిరెగిరిపడదు.
సముద్రంలో తన ప్రతిబింబం కనబడినా తన వైశద్యాన్ని తగ్గించుకోదు.
రాత్రంతా చందమామతో కధలు చెప్పుకుంటూ సరద సరదాగా  కాలక్షేపం చేస్తుంది.

గ్రహణాలబాధనూ పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించదు.

అందుకే ప్రతి మనిషీ అంతో ఇంతో ఆకాశాన్ని జూసి సమ్యమనపాఠాలు చెప్పించుకోవాలి.
విహంగయానంలో ఓ చంద్రుడు
విదేశీ యానాల్లో మరో చంద్రుడూ
గగనంలోని చుక్కలను లెక్కింటుకుంటూ
ఆపసోపాలుపడుతున్న రెండురాష్ట్రాలజనం.
అమాయకమా అనామకమా? తలమీదగా
 "మోది"ంచుకొనగా బొప్పికట్టిన దెబ్బలతో
ఉస్సురుస్సురనుకుంటూ -- ఊరికే నీరసపడిపోతూ.

వారణాశిలో వదిలిన వాగ్దానా నీటిమూటలను
వెదుక్కుంటూమళ్ళీ దాపురించే ఎన్నికలకోసం
దాపరికంలేకుండా నిష్టూరాలుడుతున్న వైనం.
==================================
ఎందుకో నాకు చిన్నప్పటినుంచీ పద్య నాటకాలంటే బహు ప్రేమ.ఊరిలోనయునా ప్రక్కనున్న ఊర్లలోనయినా నాటకం వేస్తున్నారంటే స్కూలు దగ్గరనుండిరాగానే తయారయి వుండే  వాళ్ళం. అందునా ఆరోజుల్లో రవాణా సౌకర్యాలు ఇప్పటిలా
లేవుగనుక ఎడ్లబండిగట్టుకుని వెళ్ళే వాళ్ళం.నాతోపాటు ఇప్పుడు డాక్టరయిన మధుసూదనుడు  తొడయే వాడు.బండి జల్లలోనో ముందు తొట్టిలోనో దుప్పటికప్పుకుని దాక్కునే వాళ్లం. బండి కొంతదూరం వెళ్ళాక మమ్మల్నుగమనించినా ఇంకచేసేదేంలేదుగనుక ఊరుకునే వాళ్లు పోనీలెమ్మని.ముఖ్యంగా మాకు సత్య హరిశ్చంద్ర నాటకమంటే
చచ్చేంత అభిమానం. అందులోముఖ్యంగా కొన్నిపద్యాలు మమ్మల్ను బాగా ఆకర్షించేవి మొదటగా తిరమై సంపదలెల్ల  రెండోది
మాయామేయజగంబు--మూడోది, దళమౌ పయ్యెదలోనడంగియును-- ఇవిగాక కాటిసీనులోని జాషువా గారి పద్యాలు బాగా కదిలించేవి.
ముఖ్యంగా నక్షత్రకుడిగా పులిపాటి వెంకటేశ్వర్లు గారు,తమ్ముడు [లక్ష్మీ నారాయణని గుర్తు] వేస్తుంటే విశ్వామిత్రునిగా మందపాటి రామలింగేశ్వరరావుగారు అద్భుతమైన వాచకంతో అల్రించేవారు.


ఆసమయంలోనే 'శివశ్రీ'యని ఓ కొత్తనటుడు హరిశ్చంద్రుని వేషంవేసేవాడు.అతనిది తణుకో బందరో బాగా గుర్తులేదు.

ఆ కింకరుడే రాజగు రాజె కింకరుడగున్ --అన్న మాటలను నాటకంలో
పదే పడే సందర్భానుసరంగా పదే పదే అనడం బాగా నప్పింది.

మా పెదనాన్న గారికి ఈ నాటకాలంటే ఎక్కువ ఇష్టం.స్వయంగా పాదుకా పట్టాభిషేకమనే నాటకమ్రాసి ఊరిలోని వాళ్ళతో ఆనాటకాన్ని పలు చోట్ల ప్రదర్శించి ప్రశంసలనందుకున్న ఘనుడాయన. ఈ నాటకంలో దశరధుడివేషం వేసి జనంచేత కన్నేఏళ్ళను పెట్తించేవారని చెప్పుకునే వారు ఆయన్నుగురించి.
===============================================================
మ్రోడుబారిన కొమ్మలమయినా
శిశిరంలోనే ఇలా దిష్టి బొమ్మల అవతారంలో
మేము ప్రత్యక్షమౌతాము సుమండీ!!

అప్పుడప్పుడూ మామొహాలను పారే నీటి ప్రవహాల్లో చూసుకుని
మేమే సిగ్గుపడుతుంటాము.ఇప్పటిదాకా ఇలా దిశమొలలతో దిష్టిబొమ్మల్లా ఇలా నీటిఒడ్డున నిలబడిపోయామా అని సిగ్గుపడడంకూడాకద్దు. ఋతుమహిమను కాలరాయలేంగదా అని
సర్దుకు పోవడంకూడా అలవరుచుకుంటున్నాం.

మళ్ళేఏ చిగురించే రోజులు మాకూ ఒస్తాయని ఆశాభావంతో రోజులు
వెళ్ళదీయడానికి అలవాటుపడ్డం.మళ్ళేఎ వసంతం మా వాకిళ్ళలోకిరాగానే కొత్త బట్టలెసుకున్న కన్నె పిల్లలా మురిసిముక్కలయిపోయుంతాం.. అందరికీ ఈ చింపిగుడ్దల అమ్మాయెనా
ఇంత అందంగా చిగురకుల ఊయలొ ఇప్పుదూగుతున్నదని ఆశ్చర్యపోయేలా
మా రూపాన్నిమార్చుకుని మురిసిపోతుంటాం.మళ్ళీ ఆ నీటిలోనే మా పరకాయ ప్రవేశానికి మేమే ఆనందం
===================================================================
మరువం దవనం ---------
--------------------------

రోజూ అన్ని పూలకుండీలలో నే నే నీళ్ళు పోస్తాను
అన్ని పూలకుండీలతోపాటు మరువం, దవనం మొక్కలూ
ఉన్నయని నాకు తెలియదు. ఎందుకో వాటి దగ్గరకెళ్ళగానే
పరిచితమైన వ్యక్తులే ఆప్యాతతో పలుకరించినట్లుండే ది.

ఒక్క తులసి మొక్క సమ్రఖణమాత్రం ఆవిడే చూసుకునేది.
యేదయినా తన సౌభాగ్యం నాదే గదా అన్న చిన్న
స్వార్ధమేమన్నా నా అంతరాంత రాళాల్లో
 దాగుందేమోకూడా కూడా వివరంగా చెప్పలేను.

ఆపూలకుండిలతో పాటు ఆ మరువం దవనంకూడా నామనసునుదోచుకున్నాయ్.

ఒక రోజెందుకో పూలకుండీలలో దాగున్న కలుపుమొక్కలను
తొలగించాలని కుండీలలో రహస్యంగా పెరుగుతున్న కలుపు మొక్కలను
తొలగిస్తూ యదాలాపంగా ఈరెండు మొక్కలపై నావ్రేళ్ళు తగిలాయి.
కమ్మని సువాసన నన్ను ఇట్టే కట్టే సింది.పూల దండల్లో
తక్కువ స్థాయిలో వాడబడినా ఎంత పరిమళాన్నందిస్తున్నయో
అని తలచుకుంటే ముచ్చటే సింది. అలగే ఆప్రక్కన పెరుగుతున్న
ఓ చిట్టి ఆకులమొక్కను కలుపుమొక్కగా భావించి పీకబోయాను.
అపురూపంగా ఆకులన్నింటినిముడిచేసుకుని బుంగమూతిపెట్తుకున్న
రెండు జడల ఆడపిల్లలా సిగ్గుబడిపోయాయి.
నేను ఎంత తప్పు చేయబోయానో అర్ధమయి కనులవెంట నీరు కారడం మొదలయింది.
మన సమాజంలో ఎన్నో నిష్ఠూరాలకు గురవుతున్న ఆడశిశువులుకూడా
నన్నంటుకోకు ముడుచుకుపోతానని భీష్మిచుకున్నా మొక్క దశలోనే తుంచాలనే కఠిన హృదయాలలో కొంతయినా కారుణ్య భావన పొడసూపితే ఈ అరాచకం కొనసాగదుగదా అని చింతపడ్డాను.
అందుకే నా ఈచిన్ని అనుభవాన్ని అనుభూతినీ అందరితో పంచుకోవాలని ఉబలాట పడ్డాను.

[
శ్రీ కుమరేంద్ర మల్లిక్ గారి ఆంగ్లకవిత చదివిన నేపధ్యంలో]







Sunday, March 29, 2015

అవీ,ఇవీ అన్నీ,మూకుమ్మడిగా

-------------రావెల పురుషోత్తమ రావు.
===========================================

నేతల వాగ్దానాల్లా
కొందరు మిత్రులు
మాట సాయంతో
ఇట్టే కనుమరుగవుతారు.

వర్షించని మేఘాల్లా
మరికొందరు
పుట్టిముంచడం ఖాయమని
నిరూపిస్తారు.

అతివృష్టికి మరో రూపంలా
ఇంకొందరుమిత్రులు
ఊపిరి సలుపకుండా
ఊదరగొట్టేస్తూ విసిగిస్తుంటారు

మిత్రబేధమూ,మిత్ర లాభములోలా
అందరూ
నావుడు, అనవుడులా
నిష్ప్రయోకత్వానికి
సోదాహరణమై మిగిలిపోతారు.
================================

ముడివేసిన బంధములా?
తడియారని కన్నులందు తాపసమొదవన్
కొడిగట్టిన కొవ్వొత్తుల 
మడిగట్టుకు తెచ్చినారు "మనహరి"జనులున్
============================

గుడిలోపల పూజారిగ
 నడి కొప్పున శిఖను బెట్టి నడుచుచువచ్చెన్
సడిసేయక ఉత్తర్వు
మడిగట్టుకువచ్చినారు మనహరిజనులున్
-------------------------------------
సుడిగాలులెన్ని వచ్చిన
వడివడిగా సంఘశ్రేయమిచ్చెడు గుడిలో
కొడిగట్ట నీక  కాంతుల
మడిగట్టుక వచ్చినారు మనహరిజనులున్
[చిరుయత్నం]
     ప్రభూ!మహాపభూ!!
=================================


కనులముందు నీవు సాక్షాత్కరిస్తే
కన్నీటితో నీ పాదాలను
 కడగాలనుంది ప్రభూ!

శిశిరంలో మ్రోడుబారిన తరువులకు
వసంతం రాగానే హరితశోభలలమినట్లు
మళ్ళీ నీవు సాక్షాత్కరిస్తే
సానుతాపాలనన్నింటినీ సంతోషసాగరాలవైపు
సప్రశ్రయంగామళ్ళించుకోవాలనుంది ప్రభూ!

కాలవాహిని కడలిప్రవాహంలో
కరగని శిలల్లా అట్టడుగునబడి
మిగిలిపోయిన జ్ఞాపకాలను
మధుర స్మృతులుగా మలచుకుని
జీవితాన్ని సాఫల్య దిశగా
మరల్చుకోవాలన్న ఆశే
 ఆఖరి శ్వాసగా మిగిలిపోయింది మహా ప్రభూ!!
=========================================

Saturday, March 28, 2015

ఒక్క రోజయినా--ఓ యేడాదయినా---
---------------రావెల పురుషోత్తమ రావు.
----------------------------------------------

ఒక్క యేడాదిపాటు మాత్రమే నాకాయ్యుస్షు ఉందనితెలిసినా
కంగారు ఏమాత్రం పడనని వాగ్దానం చేస్తున్నాను.
హాయి హాయిగా ఈ ఆనందనందనవనంలో ఓ చిన్నిపూవునై
పరిమళ భరితంగా బ్రదుకును సాగిస్తాను.

ఇతరుల అవసరాలకు ఆదుకునే ఓ మహదవకాశం వచ్చిందని భావిస్తాను.
ఒక సంవత్సరంపాటు నాప్రేమాభిమానాలను తోటి సోదరులకు
హృదయపూర్వకంగా పంచి పెట్టే అవకాశం ఇచ్చినందుకు
ఆ భగవానుడిని మనసారా అభినందిస్తాను.

సంవత్సరం పాటు గుండెనిండా మoదహాసాలను వెలయించే అవకాశం
నాకు దక్కిందని కృతజ్ఞతా భావంతో ఇత :పూర్వం లాగానే సహకరిస్తూపోతాను.

ఇకపైన ప్రతిరోజునూ అమూల్యమైనదిగా భావిస్తూ
విలువలకు కట్టుబడి జీవితాన్ని అమూల్యంగా తీర్చిదిద్దుకుంటాను.

అది ఇకపైన ఏడాదిపాటయినా , ఒకేఒక్కరోజయినా పర్వాలేదు.

తోటిమానవుల జీవితాల్లో ఉషస్సులునింపడాన్నికి కళ్ళల్లో
వెలుగులతో కాంతివంతంగా తీర్చి దిద్దడానికీ వెచ్చిస్తాను.
కృతజ్ఞతాభావంతో ఆ యజమాని అందించిన ఈ చిరు అవకాశాన్ని
ఫలవంతంజేసుకుంటూ ఇతరులకు ఆదర్శవంతంగా మెలగేలా కృషి చేస్తాను.
================================================
[ ఓ ఆంగ్లకవిత చదివాక]

అప్పుడప్పుడూ ఎదుతి మనిషితో మనసారా  ఏదో మాట్లాడాలనిమనసు మోజు పడినప్పుడు

ఎదురుగా ఎవరూలేరనే నిరాశ నన్నావహించకుండా
నా నగుమోము గనలేవా ? అంటూ ప్రశ్నార్ధకంగా
చూసే నీ వాలు చూపులకు జవాబన్నట్లుగా
గోడకు వ్రేలాడే నీచిత్తరువునే కాంచన సీతలా తలపోస్తూ
యేకపత్నీవ్రతుడై మానవరూపంలొ అన్ని సుఖ దు: ఖ సంచయానికిలోనయిన ఆరామయతండ్రిని ననో పధంలో నిలుపుకుంటూ
ఆ దాశరధీ కరుణాపయోనిధినీ ఆర్త త్రాణ పరాయణుడినీ
తన దాంపత్య రాగవీణ సదా సుస్వరాలనేపలకాలనీ
తపన బడిన సీతమ్మ మాయమ్మకూ సీతారామయ్య మాదు తండ్రికీ
ఆడువారికి సహజ సిద్ధమైన మోజుతో ఆ బంగరు లెది కావాలని పట్టు బట్టి కష్టాలనుకొనితెచ్చుకున్న అమాయక ప్రాణి సీతమ్మకు
`

Friday, March 27, 2015

ప్రవాస వైరాగ్యం
======================

మరతుమన్ననూ మరపుకు రాని
మహోజ్వల దాంపత్యం మన స్నేహం.
ఎందరినో ఎదిరించీ మరెందరినో కదిలించి
దట్టంగా అల్లుకుపోయిన స్వారస్యం మన ప్రణయం.

ఈలత ఇలాగే హరితవర్ణంలో సాగుతున్నదనే అనుకున్నా!
ఓ సుడిగాలి ఒక్కుదుటన వీచి నిన్నూ నన్ను చెరోదిశగా
విసిరేస్తుందని విధి ఇంత క్రూరంగా బలీయమై
ప్రవర్తిస్తుందనీ ఊహించలేకపోవడం నా మనో దౌర్బల్యమేనేమో.

ఇప్పుడనుకుని యేంలాభం వైతరిణికావలి ఒడ్డున ఒంటరిగా నీవు.
నీ అజా పజా తెలుసుకోలేక ప్రవాసంలో
 పరితపిస్తున్న మానసంతో ఇవతలి దరిన విలపిస్తూ నేను.

ఇద్దరం ఇప్పుడు సమాంతర రేఖల్లో సంతాప తీరాల్లో విలపిస్తూ.
మనిషికీ మనసుకూ గాయాలుచేసి వదిలేసిన విధిని
 ఎంతగా నిందించినా ఫలితమేముంటుంది--
 వగపుల్లో వెక్కి వెక్కి దు :ఖించడం తప్ప.
========================================




సుమలాస్యం
=====================
ఇంద్రధనస్సే ఇంటిముందు నిలిచి
ప్రకృతిని పరవశింపజేసేమనోహరమైన
రంగవల్లులతో సుమ బాలలనునిలిపి
సౌందర్య లలామలుగా తీర్చిదిద్దితే
యే హృదయం పరవశాన పొంగి ప్రవహించనోపదు?
=============================
నలుపు-తెలుపూ
==================

విద్యార్ధుల గుండెల్లో
గూడుకట్టుకున్న భయంలా
విస్తరించిన చీకటిలా నల్లబల్ల.


పర్వాలేదు నీవు వ్రాయగలవన్న
ధీమాను కలిగించిన పంతులుగారి అభయ హస్త సాముద్రికం
సుద్దముక్కతో దానిపై రాసిన తెలుపు గీతలు.

ఇంక సెలవు
-----------------రావెల పురుషోత్తమరావు.

ఊరు ఊరునూ అమ్మేసుకుంటున్న జనులారా!
ఇక మీరంతా నాకు కన్నీటివీడ్కోలు పలకడానికి
తండోప తండాలుగా తరలి రండి.

ఇప్పటిదాకా మీ ఉచ్చ్వాస నిశ్వాసాలకు
ఊపిరినై ఉండిపోవాలని ఇక్కడనిలబడిపోయా!!
మీఇంటికి పసుపూకుంకుమలను నేనే నై
పదికాలాలపాటు సుమంగళినై దీవించా!

ఇక నా అవసరం మీకు  తీరిందనే నేను అక్షరాలా నమ్ముతున్నా
మీకూ నాకు ఇక ఋణం చెల్లిపొయిందనే ప్రగాఢంగా విస్వసిస్తున్నా!

రాజధాని నిర్మాణంకోసం నన్ను కృత ఘ్నతా భావంతో అమ్మడం
కళ్ళారా వీక్షించా! ఇంత తొందరగా నాతో అనుబంధాన్ని ఇలా
పుటుక్కున తెంచేస్తారని ఊహించలేక పోయా!
ఈ అనూహ్యంగా మీరు తలపెట్టిన అకృత్యాన్ని
నా కనులతో నేను చూడలేక కన్నీళ్ల పర్యంతమై
దిగాలు మొహంతో దీనంగా తరలిపోతున్నా!!

ముసలాళ్లు మంచాన పడినప్పుడు వైద్యుడికన్నా మిన్నగా
నేనున్నాననులెమ్మని మీకు భరోసా చెప్పగలిగా!
అమ్మాయిల పెళ్లిళ్ళకూ అబ్బాయిల చదువులకూ
అండగానేనుంటానని హామీలనిచ్చి మరీ ఆదుకున్నా.



పైరు జొంపాలమీదనుంచి వీచే మలయ  మారుతాలనన్నింటినీ
మీ ఇంటి వైపు వీచేలా చూసి మీరు గుండెలమీద
చేతులు వేసుకుని హాయిగా నిద్రించడానికి ఇతోధికంగా
నా వంతు సాయాన్ని నేను నెరవెర్చాననే భావిస్తున్నాను.

అయినా మీకు నాపైన ఉన్న ప్రేమకన్నా నయవంచకులైన
నేతల  వాగ్దానాల మూటలమీదనే నమ్మకమున్నదని గ్రహించా!
నా సమాధిమందిరాలమీద శాశ్వతమైన రాతికట్టడాలమీదనే
మీకు మోజు పడిందని గ్రహించడానికి నాకు ఇట్టే సమయం పట్టలేదు.

ఇకమీకూ నాకూ మధ్యన అనుభూతుల అంతరాయం యేర్పడిందని తెలుసుకుని   ఇప్పటిదాకా నన్ను ఇంతగా ఆదరించిన మీఅందరికీ చింతనామృతమైన చిత్తంతో పేరు పేరునా
మీకు ధన్య వాదాలు చెపుతూ శాశ్వతంగా ఇక సెలవు తీసుకుంటున్నా!
===============================================



Thursday, March 26, 2015

వానొచ్చినప్పుడు
-------------------

చిన్నప్పుడు స్కూలుముందర వాగు
వానొచ్చినప్పుడలా వరద గోదావరిని
గుర్తుకు తెచ్చి భయకంపితంచేసేది.

ఊరు ముమదరచెరువులో గంగబండను తాకుతూ
నీరొచ్చినప్పుడలా ఊరు వూరంతా
చెరువుగట్టుమీదజేరి దిగాలుముఖాల్తో
గంగబండనుదాటి నీరు ప్రవహించకుండా
 చూడమని ఇష్ట దేవతలందరికీ
ప్రార్ధనల పరంపర కొనసాగుతూ వుండేది.

పొలాల గట్లమీద పహరాకాస్తూ
రైతన్నలంతా బోదె కాలువలు నిరంతరం
సాగుతూ పారేలా చర్యలను చేపట్టేది.

వరిపొలాల్లోనీళ్ళునిలబడక పోతే పైరుకు నష్టమని
నీరు బయటకు మరలిపోకుండా జాగ్రత్త వహించేది.

వాన వెలసిందని తెలియగానే ఊరు ఊరంతా , ఊపిరిపీల్చుకుని
రాత్రిజాగారంచేసినందుకు పగలంతా నిద్రలో మునిగితేలేది.
=========================================
నాణేనికి అటూ ఇటూ
========================

ఒక బాధ సుఖాన్ని సాంతంగా నమిలిలేస్తుంది.
ఒక సంతోషం సంతాపాన్ని మరుగున పడేస్తుంది.


జీవితం మృత్యుకోణం సమాంతరంగా సాగితేనే
పట్టాలమీద నడిచే బ్రదుకు క్షేమంగా గమ్యంచేరుకుంటుంది.

సరళ రేఖగా ఒక్కటై నడిస్తేనే ప్రమాదం వికటించి 
అంచులంటా వెంటబడి అదృశ్యరూపంలో మింగేస్తుంది.

జయాపజయములకు చెక్కుచెదరనినాడే
జీవితనావ ఒడిదుడుకులకు దూరంగాఒద్దికగా 
ఒడ్డుకుజేర్చి సుఖయానానికి సులుసూత్రమై నిలుస్తుంది.

నణేనికి బొమ్మా బొరుసులు సరిగ్గా ముద్రితమైతేనే
అది చెల్లుబడవుతుందని కాలం కరాఖండీగా బోధిస్తుంది.
=======================================
ఉషస్సునుంచి తమస్సులోకి-----
======================= రావెల పురుషోత్తమరావు.
నిన్నటిదాకా జ్వరంలా బాధించింది
ఇప్పుడది నయంగాని వ్రణమై వేధిస్తున్నది
మాయదారి క్రికెట్ జబ్బు
యువతను నిర్వీర్యంజేస్తూ
నిరామయ జగత్తులోకినెట్టేసి
ఉషస్సునుంచి తమస్సులోకి ఈడ్చేస్తున్నది.

అగ్నిపర్వతంలాపరిణమించి
అంతటి శక్తియుక్తులనూ
కాల్చి బూడిదగా మిగులుస్తున్నది.
పురాణాల్లోకనిపించిన రాక్షసుడిలా
కాలయముడికి భటుడిలామారుతూ
దేశ భవితవ్యాన్ని విదేశాల
క్రీడా ప్రాంగణాలలో  దిష్టి బొమ్మలై దేబిరించమని
శతధా, సదా,సర్వదా ,సర్వధా శాసిస్తున్నది.

===========================25-3-15
అమృతం కురవని రాత్రి
=======================

అమృతం కురవని రాత్రి
మాఇంట్లో 'రాత్రి'   ముభావ ముద్రను నర్తించింది.
మేమిద్దరం అంత దగ్గరగా మసులుతున్నా
కలల సామ్రాజ్యంలో విహరించడానికే
కాలమంతా ఖర్చయిపోయింది.

ఆమె వదనారవిందమంతా చిరాకునే 
చిన్మయ జ్యోతిగా వెలిగించింది.
ఏప్పుడో నెలలక్రితం వదరిన నా వసపిట్ట వాక్యాలను
తలచి తలచి దు:ఖ సముద్రంలో స్నాతగా తన్ను నిలిపింది.

అర్ధరాత్రయితే అయిందిగాని ఆమె అమృతఘడియలను
వర్జించడానికే నిశ్చయించుకున్నట్లు భావించవలసి వచ్చింది.
నింగిపై నిర్మల హృదయుడై వీక్షిస్తున్న నెల బాలుడు
తన దయా వృష్టిని వర్షించకుండానే చిత్తగించడం
ఖాయమయేలా వున్నదన్న సత్యం నన్ను
ఉద్వేగానికి గురిచేసి ఉరకలెత్తే నా ఉత్సాహానిపై నీళ్ళు జల్లుతున్నట్లుగా తోస్తున్నది.

మరలా మరో రాత్రిదాకా ఈ అమృతోపమయిన ఘడియలకోసం
చకోరపక్షిలా మూగ సందేశాలతో ఉడుకులెత్తే ఉష్ణోగ్రతను
చల్లబరుచుకోక తప్పదనే  ఆ దిన ఫలం సూచించినదే
ఋజువవడం తప్పదులాగున్నది.వసంతంలో కొన్ని రోజులు
ఇలా వృధా అవడం ప్రకృతి మాతకు కంటగింపుగా మారకూడదనే
నేను మనసారా నా విన్నపాలు వినవలెనని 
ఆ మన్మథవిభావరిని   అభ్యర్ధించే వింత ప్రార్ధన.
=============================================


Wednesday, March 25, 2015

దైనందినం
===========
రోజూ ఎందుకో గుండెగుప్పిట్లోకొచ్చినట్లవుతుంది.
ఎదనంతా చీకటిగుయ్యారమై గుబులు పుట్టిస్తుంది.
నడుస్తున్న చరిత్ర నరజాతికంతటికీ
పరపీడనపరాయణత్వమే ననిపిస్తుంది.

వెలుగు నీడలమధ్యన వెదుకులాటే జీవితమని తోస్తుంది.
కాంక్షాతప్తహృదయాలకు కారుణ్య భావనే
అందని ద్రాక్ష పండుయనిపించే  భావన
అణువణువునా అక్షరాలా నిజమని నిరూపితమౌతున్నది.

పరిష్కారం సూచించలేని సమాజ ధోరణి పరోపకారానికి
దూరమై ఎడారిబ్రదుకులే మేలేమోననే విధంగా ప్రవర్తిస్తున్నది.
=============================================
నీవున్నావు నీపాటా----
================

మనో వల్మీకంలో కూరుకు పోయిన
మధుర స్మృతులనన్నింటినీ
ఒక్కొక్కటిగా వెలికితీయాలి.

గుండె గొంతుకలో తారాడుతూ
అర్ధాంతరంగా నిలిచిపోయిన
రమణీయార్ధాలన్నింటినీ
వెదకి మరీ బయటకు లాక్కు రావాలి.


ఇన్ని దశాబ్డాలయినా నీపాట
నా చెవులవద్దనింకా నిరంతరం
మృదు మధుర స్వనంతో శ్రవణపేయంగా
నినదిస్తూ వీనులకు విందుగావిస్తూనే వున్నది.

అందుకే అనునిత్యం నీవున్నావు నీపాటా
ఉన్నదన్న సత్యానికేనేనుకట్టుబడివున్నాను సుమా!

సుమసోయగాలు ప్రకృతిమాతను పరవశింపజేస్తున్నంతకాలం
సెలయేరులగలగలలుమనలకు సేయంగల విన్నపాలను
పూసగుచ్చినట్లు వివరిస్తూ పోతున్నంత కాలం
చివురాకుల ఊయలలో చిరుదరహసాల వసంత యామిని
నిత్యయవ్వనంతో విరాజిల్లుతున్నంతకాలం
నీవున్నావు నీపాటా నాలో ప్రతిధ్వనిస్తూనే వుంటుందని
నీకుమరీ మరీ ఇందుమూలముగా తెలియజేయడం నాధర్మంగా భావిస్తున్నాను.
======================================================



Tuesday, March 24, 2015

 శిశిర ఝంఝ
------------------రావెల పురుషోత్తమ రావు.
================================================

అప్పుడెప్పుడో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో
చెప్పారోలేదో గుర్తుకు రావడంలేదుగాని
ఇప్పుడు మాత్రం మన్మథ నామ సంవత్సర
పంచాంగం మాత్రం నిక్కచ్చిగా చెపుతున్నది.

రెండు అసెంబ్లీలలోనూ ప్రతిపక్షాలకు
ప్రభుత్వం పరాభవంజేసి బయటకు పంపేసి
తమ గొప్పలు తాము చెప్పుకునే అవకాశాలు
మెండుగా ఉన్నాయని సుస్పష్టంగా విన్న వించింది.


ప్రభుత్వంతీరు అధికారిక సిమ్హాసనం ఎక్కగానే
నీతులు వల్లించేస్థాయికి ఎదిగిపోతుందనీ
పంచాంగ కర్తలు ముందే ఊహించారు.

ఎన్నికలముందు చేసిన వాగ్దానలన్నింటినీ
కట్టగట్టి పారే నదుల్లోనో యేరుల్లోనో మునిగిపోయేలా
నిమజ్జనం చేయండని అమాత్యవరులందరికీ ఆదేశాలు జారీ అయాయి.
కార్యకర్తలంతా లాభదాయకమైన నిర్మాణపు పనుల్లో
గుత్తేదారులుగా అవతారమెత్తుతారని హెచ్చరించిందికూడా.

పచ్చని పంటపొలాలన్నింటినీ రాజధానికోసం రాతికట్టడాలుగా మారి స్మశాన నిస్సబ్దాన్ని తలపోసేలా తయారవుతాయనీ
ఇక పైన ఆహార పదార్ధాల ధరలన్నీ ఆకాశమారగంలోనే

నివాసముండే అవకాశాలు అధికంగా ఉన్నాయనీ వాక్రుచ్చింది.

ప్రజల కష్టాలు మరో ఎన్నికలొచ్చేదాకా ఇలాగే వుంటాయనీ
ఎప్పుడో భవిష్య వాణి వినిపించిందిగదా ఇంకా వెరపెందుకు?
ప్రతిపఖ నెత తన మకిల చరిత్రను కదుగుతారేమోనని
మొహం చాటేసే అవకాశాలు ఉద్ధృతమౌతాయని కూడా చెప్పినట్లు గుర్తు.
================================================

Monday, March 23, 2015

నిన్న కనుపించింది-----
====================

వన చరిలా అడవి దారులవెంట
తళుక్కుమనే తారయై పరుగులిడుతూ
నిన్న అకస్మాత్తుగా దృశ్యమానమయింది.
గోపయ్య మనసారా వెంటాడే గోపెమ్మలా
పూల దారులవెంట పుణికిపుచ్చుకున్న
గాత్ర సౌలభ్యంగల మోహన వంశిలా
మనసునిండా ఆనందామృతాన్ని రంగరిస్తూ
 'నీ వలపు దాహానికి ' ఇదే తగు చికిత్సంటూ
విచికిత్సకు తావివ్వకుండా నిన్న కనుపించింది.


సుమ పరీమళమంతటినీ తనొక్కతే స్వంతం
చేసుకున్నదా అన్నట్లు సుందర దరహాసాన్ని
పెదాల చివరంచులనిండా ప్రవహింపజేసింది.
కన్నులం తటా వెన్నెల వానను ధారా పాతంలాకురిపించింది.


చివురులువేసే కలలన్నింటికీ  చిన్మయ రూపం ప్రసాదించింది.
సచ్చిదానంద స్వరూపమే శాశ్వతమా అన్నట్లు  సాక్షరంగా
నిరూపిస్తూ ఆధ్యాత్మికపు పొరలన్నీ నాలోని అంతరంగంలో
లోవెలుగుగా దాగున్నవని ఋజువుజేస్తూ
నన్ను మరో మధురమైన లోకంలో విహరింపజేసింది.

============================================

సుభాషితం అదే సజ్జనసమ్మతం--
------------------రావెల పురుషోత్తమ రావు.
------------------------------------------

ఆకులు రాలిపోవడంఖాయమేనని
శిశిరం చెవిదగ్గర గూడుకట్టుకుని
మరీ విన్నవిస్తున్నది.అలాగని
అర్ధాంతరంగా ఆ చెట్టుకున్న కొమ్మ
నంటిపెట్టుకున్న పట్టును ఇట్టే వీడలేదుగదా!

వృద్ధాప్యం ఒక శాపమని తెలుసు
అలాగని ఆ ఘడియ సమీపించేదాకా
చూరు పట్టుకు  వ్రేలాడే గబ్బిలంలా
ఇంటి పట్టున విశ్రాంతి తీసుకోక తప్పదుగదా!!

ఆరు రుచులలొనూ అత్యంత బాధాకరమైనది
చేదు వగగరులన్న విషయం  అందరెరిగినదే
అలాగని అహరహమూ ఆరెండురుచులనూ నెమరేస్తూ

కాలం గడపలేంగదా! అప్పుడప్పుడూ తీపిని రుచిచూపించమని
నాలుక అడుగుతూండడం అసహజమేం కాదనిపిస్తున్నది.

జీవితంలోనవరసనాట్యం తప్పదని తెలిసి నడచుకోగలగడమే
మానవునుని ప్రజ్ఞా పాటవాలకు సరయిన పరీక్షసుమా!

చీకటివెలుగుల చిత్రమైన కలబోత మనిషిజన్మమని
గ్రహించగలిగిన నాడే మృత్యువునినా ధైర్యంగా రారమ్మని
ఆహ్వానించగల సత్తా యేమనిషికయినా అసంకల్పితంగా 
ఒనగూడుతుందనే యే శాస్త్రమైనా వల్లె వేసి ఉదాహరిస్తుంది.
======================================







కలనైనా నీ వలపే కలవరమందైనా
నీ తలపే ----
--------------------------
ఎప్పుడు నీ ముఖారవిందాన్ని దర్శించాలన్నీ
అన్నింటికన్నా ముందే అవరోధాలు సమాయత్తమౌతుంటాయి.

అభ్యంగనావిష్కృతమైన నీ నగుమోముకెప్పుడు చేరువవాలన్న
ఆ జలుబు తుమ్ములు నన్ను వెనక్కి వెళ్ళిపొమ్మని శాసిస్తుంటాయ్.

ఎప్పుడు నీ హృదయకమలానికి దగ్గరగా జరుగుదామన్న
ఆగుండె వేగవంతంగా వినిపించే డప్పు చప్పుడులు నన్ను దూరంగా నెట్టేస్తాయ్.

ఎప్పుడునిన్ను వదనగ్రంధంలోకి తొంగిచూసి ఇష్టపడినట్లు
ప్రత్యక్షంగా ప్రకటిద్దామన్నా నన్ను అందులోకి చొరబడుతున్న
దొంగలా నన్ను చుట్టేసి బయటకు చిత్తగించమని తాఖీదులు
జారీ చేసి కంగారుపెడుతుంటుంతుంది.
 ఇక ఈ మెయిళ్ళ సంగతి సరేసరి నీ పాస్ వర్డ్ సరిచూసుకోమని
హెచ్చరిస్తూ అదృశ్యరూపం దాలుస్తూం ది.ఇక ఈ ప్రవాసమే మేలనుకుంటూ ఓ పుస్తకాన్ని దొరకబుచ్చుకుని క్షణాల్లో నిద్రలోకి జారుకుని కలనైనా నీ వలపే కలవరమందైనా
నీ తలపే ననుకుంటూ మరోప్రభాతంవైపు ఆశగా దృష్టిని నిలుపుకుంటాను.
=================================================
ఆఖరి క్షణాలకత్యంత సమీపంగా--------
=====================

అది రాక్షస వ్రణాలను నయంజేసే  వార్డు.
అందరూ క్షతగాత్రుల్లా స్రుక్కి సోలి పొతూ
నిస్త్రాణగా మంచాల కతుక్కుని
ముక్కుల్లో మొహాల్లో త్యూబులతో
రణరంగానికి సిద్ధమైన
వీర సైనికుల్లా ఆశలను శ్వాసిస్తూ
నరనరాల్లో నెత్తురు బొట్లు జారిపడుతుండగా
అందరినీ ఆందోళనా పధంలోకి నెట్టేస్తున్నారు.

వైద్యులూ నర్సులూ నెమ్మది నెమ్మదిగా వాళ్ళకు
సేవలనందిస్తూ రోగులు ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటున్నారు.
ఇంతలో ఒకా విడకు గుండె వేగం తగ్గిందని గబ గబా
ఆత్యయిక స్థితిని సూచించే గదిలోకి హడావిడిగా మార్చేసారు.

ఆమె మాత్రం అచేతనావస్థలోకి
వెళ్ళిన దాఖలా స్పష్టంగా కనబడుతున్నది.
నాలుగ్గంటల తర్వాతగానీ యే విషయం చెప్పలేమని
ఆమె కు వైద్యం చేస్తున్న వైద్యులు
వివరించి బంధువులకు చెప్పారు.

అందరిగుండెల్లోనూ జపాన్ రైళ్ళు పరుగెట్టడం మొదలయింది.
నాలుగో గంట సమీపించేసరికి మొహాలు వేలాడేసుకుని
వైద్యులూ, నర్సులూ ఆ గదిలోంచి గబ గబా బయటకొచ్చేసారు.
కళ్ళు తుడుచుకుంటూ బందువులు, వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ళాయన
ఆమె మాత్రం , ఆరోజు ప్రశాంతంగా శాశ్వతలోకాలకు పయనమైపోతూoది.
అతనిచేతిలోంచి అమృతంకురిసినరాత్రి అసురసంధ్య వేళకే
ప్రక్కకు వాలి, నేలబారుకు క్రిoదకు జారి పడిపోయింది.
=====================================



Sunday, March 22, 2015

అమంగళం ప్రతిహతమగు గాక!
-----------------------రావెలపురుషోత్తమ రావు.

మా ఆయన అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి
ఆయనెప్పుడూ వంటల కార్యక్రమాలుచూస్తూ
అపరాధ పరిశోధక నవలలు సుదీర్ఘంగా చదువుతాడు.
కన్నార్పకుండా డిస్కవరీ చానెల్ని చూస్తూ వుంటాడు.


రాత్రి జరిగిన ఓ సంఘటను పూస గుచ్చినట్లు వివరించాడు.
ఓవ్యక్తి మెదడుకూ కంకాళం మధ్యన కత్తిమొన ఇర్రుక్కుని
అత్యవసర చికిత్సా విభాగానికి యేతెంచాడట.


అదృష్ట వశాత్తూ అతనికి ఆమొన రెండిటి మధ్యన
యే అవయవానికీ తగిలి ముక్కలు చేయకుండా దిగబడడంజరిగింది.





శస్త్ర చికిత్స ద్వారా ఆలోహ శకలాన్ని నైపుణ్యంతో  బయటకు తీసి అతని ప్రాణాన్ని

వైద్య శిఖామణుకు కాపాడడం జరిగింది.

ఇంతకూ ఆ అకృత్యానికి ఎవరు ఒడిగట్టారని అడిగితే మా ఆవిడే నన్నాడు.

అందరూ ఆమె శక్తి సంపన్నయనీ,ఆమె మంగళసూత్రం బాగ  గట్టిదనీ  పొగిడేసారు.
అతనూ ఇంకా యేమైనా అనగలిగే ధైర్యం చాలక  అవునంటూ  బుర్ర  వూపాడు.

[ఓ ఆంగ్ల కవిత ఆధారంగా]
==========================================================
వసివాడని పసిగొంతులు
ముసి ముసిగా నవ్వు చుండి ముద్దులువొలుకన్
కసిగా శతకపు పద్యము
మిసిమి దలిర్ప చదువ , మోహము దీరెన్
తెలుగు పలుకుల శుభ  తోరణాలు
==========================

ఉగాది వచ్చిందిగదా అని ఉత్సాహ భరితంగా
ఇక్కడి ప్రవాసాంధ్ర ఉత్సవాలకు వెళ్ళి వచ్చేసాను.
సభాసదులందరూ సంప్రదాయాన్ని
ఇష్ట పడుతూ కొత్త దుస్తుల్లో నయనానందకరంగా
వచ్చారు.నిర్వాహకులూ విచ్చేసిన అతిధులూ మాత్రం
సూట్లూ బూట్లలో విచ్చేసి ఆంగ్లంలో
తడబడ కూండా తమ శుభాకాంక్షలను
యదావిధిగా కరతాళ ధ్వనులమధ్య అందించారు.
యవ్వనంతో మిసమిసలాడే యువతీ యువకులు
 ప్రత్యక్షంగా "కెవ్వు కేక" లాంటి శబ్ద నాదాలను

ప్రతిధ్వనించేపాటలతో అలరించాలని ప్రయత్నించడానికి
వేదికపై నృత్యాలతో  లేని దుమ్ముమంతా  దులిపారు.
ఇంతలో తెలుగు సరిగ్గా  చదవలేని మా మనవరాలు
"తేనెల తేనెల మాటలతో మన దేశమాతనే కొలువండి"
భావం భాగ్యం చూసుకుని ----   అని ముద్దు ముద్దుగా పాడితే
అందరూ ఆనందంగా నిలబడి మరీ ఆ చిన్నారిని
మనసారా ఆశీర్వదించారు.తెలుగు తనం ఇంకా
చెక్కు చెదరలేదని చెప్పడానికి సోదాహరణంగా

మా మనబడి పిల్లలు సుమతీ వేమన శతకం పద్యాలతో సభా ప్రాంగణానికి
కొత్తగా కొంగ్రొత్తగా  సొబగులనద్దారనే చెప్పుకోవాలి.
ముద్దు ముద్దు పలుకులతో ఆ చిన్నారులే సంప్రదాయబద్ధంగా మామిడితోరణాలై నిలిచారు.
మళ్ళీ నన్ను మా బాల్యంలోని వీధిబడి స్మృతులను దివ్య భావ తరంగాలపై తేలియాడుతూ  విహంగ మార్గాన దిగివచ్చి  సొగసుగా శోభాయమానంగా విందు భోజనాన్ని కడుపారా ఆరగించేలా వడ్డించారు.
===========================================

Saturday, March 21, 2015

వసంతంలా వచ్చి
నీ వొడిలో వాలుదామనుకుంటే
శిశిర ఝంఝ ఒకటొచ్చి వాటేసుకుని నన్ను
నా కలలనన్నింటినీ చిందరవందరజేసి
చీకాకును పెట్టేసాయ్!

కాకి కోకిలా రూపం మార్చుకుని వచ్చేసి
కొత్త సినిమా పాటలు పాడి
బంగారంలాంటి నా మనసును
శకలాల్లా చిద్రం చేసేసింది.


ఆరురుచుల మాట దేవుడెరుగు
అన్నీ చేదు వగరులే 
చివరంటా నాలుకకు తగిలి
వెగటును పుట్టిస్తున్నాయ్.

మన్మథుని సామ్రాజ్యంలో
మనిషితనమే మృగ్యమౌతున్నది.
వసంతం అంగడిలో సాంతం  సంతోషమే
అమ్ముడుబోని సరుకై మిగులుతున్నది.
==================================

చేదు పాట
=============

ఉగాది సంబరంకోసం
వెదుకులాట మొదలయింది.
మరుగవుతున్న మానవత్వానికి
మరణ శిక్ష ఖాయమయేలా వున్నది.

మయసభలా మారిన
 ఉగాది సంబరాలవేదిక
పల్లెతనాన్ని విస్మరించమని
పదే పదే హెచ్చరిస్తున్నది.

పిచ్చుకల కాకుల గుంపులోకి
మీరూ వచ్చికలిసి పోండని
 కమ్మని పాటలకోయిలమ్మలకు
అప్పటికే ఆహ్వానం అందిపోయిందని
కంగారుపడుతున్న వాటికంఠాలే
ఇందుకు దాఖలాగా నిలుస్తున్నవి.

ఇంకెక్కడ ఉగాది?
ఇకముందు అంతర్జాలంలో
చూసి మాత్రమే మురిసిపొండని
భావి కాలం గుర్తు చేస్తున్నది.

====================
ఉగాది విషాదగీతం
----------------
కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త పాట పాడనంది
పాతపదమే పాడుకుంటు
పరవసించి పోతున్నది.

సరిగమలతో సౌమ్యమైన
సినిమా  సంగీతం
వాద్య ఘోషల నడుమ
బక్కచిక్కిపోతున్నదని
అహరహమూ బాధను ప్రకటిస్తున్నది.

పచ్చని పైరగాలులకోసం
రాతి భవనాల రాజధానికి
ఎంతదూరం జరిగిపోవాలని?
వివార వదనంతో ప్రశ్నిస్తున్నది

పండ్లతోటలన్నీ నేలకు రాల్చివేస్తే
తన నివాసం ఎక్కడుంటుందోనని
ప్రభుత్వ యంత్రాంగాన్ని
పదే పదే నిలదీస్తున్నది.

గిజిగాడు తదితర పక్షులకు
సానుభూతిగా తను విషాద
 గీతాల నాలపించడంతప్పదని
అందరినీ హెచ్చరిస్తున్నది.

కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త పాట పాడనంది
పాతపదమే పాడుకుంటు
పరవశించి పోతున్నది.
=================================




Friday, March 20, 2015

పికము పాటలు పొంగించు పీయుషమ్ము
నెమలి యాడెడు నాట్యమ్ము కోమలమ్ము
కొత్త చివురుల నెత్తావి వింత శోభ
కవులు వల్లించు కవితలు చవులుబుట్టు
ఇంత సంతోష సౌందర్య మెంత సొగసు
తెలుగు వత్సరమందించు వెలుగు రేఖ
===============================

Thursday, March 19, 2015

దొంగలబండి------
==============రావెల పురుషోత్తమ రావు.
-------------------------------------------------------------------
వాళ్ళ్ళంతా సిoహసనాధీష్టులై
పదవీ వ్యామోహంతో ప్రవర్తిస్తున్నారు.
స్వార్ధం, సంకుచితత్వాన్ని తద్వారా
స్వప్రయోజనాలకోసం--అక్రమార్జనకోసం
అనునిత్యం పరితపిస్తున్న భ్రష్టులు వాళ్ళు.
అధ్యక్షులుగా,రాజులుగా,వాళ్ళ ప్రయోజనాలకోసం
ప్రతినిత్యం పాటుబడే సామంత రాజులూ ఇందులో ఉన్నారు.
వారి వారి గొంతెమ్మకోర్కెలను నెరవేర్చుకోవడంకోసం
మనశ్చాంచల్యం సంప్రాప్తించి, పిచ్చెక్కిన శునకాల్లా
బరితెగించి మరీ ప్రవర్తిస్తున్నారు.

ప్రపంచమంతటినీ పరమ నికృష్టమైన రణరంగం మార్చి
వారి ప్ర్యోజనాలను కాపాడుకోవాలని వారి లఖ్యం.

అందుకే ఈదొంగలబండిని నిండా తమ దేశంకోసం
శ్రేయోదాయకమైన సమాజం కోసం నిరంతరం తపించే
వాళ్ళనందరినీ యేకంచేసి ఈ బండిలో తీసుకెళ్తున్నాను.

ప్రపంచపు శుఖ శాంతులకోసం-- ఆ స్వార్ధపరులైన
పిచ్చికుక్కల్లాంటివారిని పదవీచ్యుతలను గావించడానికి
సదుద్దేశంతో వీరంతా కంకణబద్ధులై బయలుదేరారు.
నాతో సంపూర్ణంగా సహకరించాలనే సత్సంకల్పం గలవారంతా

ఈ దొంగలబండినెక్కి రండి. ఈ ప్రపంచాన్ని శాంతి సుష్థిరతలకోసం 
శ్వాసించేలాతయారుచేసేందుకు దీక్షబూని నాతో సహకరించండి.

==============================19-3-15
ఆంగ్ల కవిత: రసూల్ జిబ్రాయేల్ స్నైమాన్[అనుమతితో]
విశ్వాసం నూరిపోయండి
-----------రావెలపురుషోత్తమరావు.
రాయిలా,రప్పలా
ఎంతకఠినత్వాన్ని
గుండెలోపేర్చుకుని
 ఓ  జడపదార్ధంలా
మానవుడు మారిపోతున్నాడు
అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ
ఆందొళనాపధంలోకి నెట్టేస్తున్నాడు.

ఒకప్పుడు దయార్ద్రహృదయుడుగా
వెన్న పూసలాంటి మనస్సుతో
యేచిన్న సందర్భంలోనయినా
ఇట్టే కరగి కరుణా సముద్రుడిగా
ప్రత్యక్షమై పరహితం కోసం
ప్రాకులాడిన మనిషి ఎందుకిలా
ఉద్విగ్నుడై ఉసురుసురంటూ నీరుగారిపోతున్నాడు?

రాజకీయ భస్మాసురిడి కబంధ హస్తాల్లో
కన్నీటిజాలును ఇంకింపజేసుకున్నాడా?
సాహిత్యపు గుబాళింపులకు దూరంగా జరిగి
సజ్జన సౌందర్యపు సౌశీల్యాన్ని
సమూలంగా సమాధి స్థితికి దిగజార్చుకున్నాడా?
ఎందుకిలా మనిషి మ్రానులా స్పందన రాహిత్యంలో
కొట్టుమిట్టులాడుతూ మృతజీవుడిగా దర్శనమిస్తున్నాడు
జీవన్మృతుడుగా జాతిమొత్తంచేతా చీదరించుకోబడుతున్నాడు?
ఇతన్నీ మళ్ళీ ఋజుమార్గంలోకి మరల్చే మార్గం లేదంటారా?
అతని అవసరమయితే కవితారసాయనాన్ని
పాత కొత్తా బేధంలేకుండా జరూరుగా నరలలో
కొంగ్రొత్తగా ఉత్సాహం ఉద్వేగం పొంగి ప్రవహించేలా
రబ్బర్గొట్టాలద్వారా ముక్కులకున్న రంధ్రాలద్వారానో
నోటి ద్వారానో గుండె కవాటాలకు శీఘ్రంగా చేరుకునేలా
చివరాఖరు ప్రయత్నం చేయండి! అతడిలో తప్పక
చలనంకలుగుతుందన్న గట్టి నమ్మకం నాకుంది.
నన్ను నమ్మండి! నా నమ్మకాన్ని వమ్ముకానీయకండి.
శుభం భూయాత్!!
==========================================

Wednesday, March 18, 2015

మకరంద మాధుర్యాలు =========
------------------------------
తరంగాల తలలపై
తైతక్కలాడుతూ
పైరు జొంపాలపై
జోరుగా తలలనూపుతూ
వసంత యామిని, చిరుదరహాసినియై
సుమ పరిమళ సురభిళాలను
ఇంటింటికీ కానుకగా చేరవేస్తూ
ఆనందన నందన వనం లా
ప్రాణికోటి జీవితాలను పరిణమింపజేస్తుంటే
పికపు పాటలు నెమలియాటలు
మావిడి తోరణాలతో మనోవీధిలో
మకరంద మాధుర్యాలు వెదజల్లుతూ
హృదయేకవేద్యంగా నర్తించవా?
********************************************
పలాయన మంత్రం
-------------------------
మృత్యువు ఒక్కో సారి
దారితప్పి ధరణి మీదకు వాలిపోతుంది.
అకాలమృత్యువై అకారణంగా కొందరిని హరిస్తుంది.
సాహితీమూర్తులను కబళించి తప్పుచేసానని
నాలుక
ను కరుచుకునీ మరీ విలపిస్తుంది!.
శొకతప్తహృదయాలనన్నింటికీ సానుభూతిని
ప్రకటించి పరాకుగా, పలాయనం చిత్తగిస్తుంది.
===========================
వసంతంలా-వాకిలిముందుకు నడచివచ్చే--
===========================
తలబోడేమోగాని
తలపులు బోడులుగానెకావు.

నిన్నటిదాకా మ్రోడు వారిన రూపంతో
మొహం మొత్తిన తరుసంపదంతా
నూత్న మర్యాదను చేజిక్కించుకుని
గాలులు వీచే దిశనుకనిపెడుతూ
శిర: కంపనలు మొదలెడుతున్న
శుభ ఘడియల సుముహూర్తవేళలు.

 నాలుగునెలలపాటుమృగ్యమైన మొహాలన్నీ
కొత్త చొక్కా  తొడుక్కున్న కుర్రాళ్ళలా
కొంగ్రొత్త చివుళ్ళతో కళకళ లాడిపోతున్నాయ్.

నిన్నటిదాక ఐపులేకుండా జాడకూడా కాన రాకుండా
 యే వల్మీకంలోకో వె ళ్ళాయనుకున్న 
విహంగాలన్నీ మూకుమ్మడిగా చెట్లపైకిజేరి
సామూహికంగా సభా మర్యాదలను పాటిస్తూ
సమావేశమయి,   పరస్పర సహకారాన్నందించుకుంటూ
హరిత శోభతో పరిసరాలనన్నింటినీ అలంకరిచుకుంటున్నాయ్.

ఇంకా పొద్దెక్కి చాలా సేపయినా కార్యాలయాలకు
వడివడిగా వెళుతూ వినిపించడమ్మొదలవని కారు కూతలు.

బద్ధకంగా మేఘాల  నులివెచ్చని కౌగిళ్ళలను వదిలించుకుని
అరుణారుణ రేఖలతో ఉదయించక తప్పదా!! అనుకుంటూ
నేను ప్రవేశిస్తున్నానహో అంటూ  రకరకాల శ బ్డాలు వినిపించగానే
ఉలిక్కిపాటుతో వినిపించే సుప్రభాత గీతాల సంగతులు.

ముందుగా నా రాకను పసిగట్టయేమోమరి
ఇంటిపెరట్లో పూసేస్తున్న సుమపరిమళ సుమగంధాలు.
నాదాకా వచ్చి తమనునులేత  లతలతో పులకింపజేయాలని
తహతహ పడుతున్న దాఖలాలు సుపష్టంగా కనుపిస్తున్నాయ్..

పశువుల కొష్టంలోనుంచి 'మాకు దాణా వెయ్యండిరో' అంటూ
ఆపశులగణం పెడుతున్న ఆకలి కేకల పరంపరలు.
ఇదంతా రాబోయే వసంతునికినేపధ్యమై
అనేవిధంగా' అందచందాల రాణీ' ఆ ఆమని అన్నట్లుగా అలరారుతున్నది.
===================================================
ఆ అనారోగ్యం అమిత భాగ్యదాయకం
----------------------------రావెల పురుషోత్తమ రావు,

పేదరికం
'ఎబోలా'ను పొగడడం మొదలెట్టింది;
దానిపై అవ్యాజానురాగం వెల్లివిరిసికాదండీ!!
ప్రతినిత్యం ఆకలితో అలమటిస్తూ
అడుగడుగునా దాని ప్రవేశాన్ని ప్రతిఘటిస్తూ
మృత్యు వొడిలోకి వెళ్ళిరావడంకన్నా,
అకస్మాత్తుగా క్షణాల్లో అదృశ్యం  గావించే 
అల్ల వుద్దీన్ అద్భుత దీపంలాంటి
ఆ  జబ్బే వూహకతీతంగాని ,సందర్భోచితమౌ  పరిణామాన్ని
అందించగల సత్తా దానికే వున్నదన్న నమ్మకంతోనే సుమా!

Tuesday, March 17, 2015

ఇందుమూలముగా---------
=================రావెల పురుషోత్తమరావు.

క్షరం కానిది అక్షరమని
నేర్చుకున్నాంగదా మరి ఇలా
ఎందుకు అందరినీ అలరించిన అక్షరం
అగ్నికి ఆహుతై బూడిదగా మిగిలింది?

గజారోహణం చేయించాల్సిన గొంతుకను
పచ్చ బద్దల పల్లకీ పై ఎందుకు
ఊరేగించారో తెలుసుకోవాలనుంది.

అతగాడి వాక్ప్రవహానికి ఎవ్వరు ఇలా
 చెలియలి కట్టను హద్దుగా వేసే 
అవకాశమె లేకుండా చేసేసారు?

అంతమంచిగుండెకెవరు అంతపెద్ద
అపాయాన్ని ఆపాదించి మిన్నకున్నారు?

విద్వాం సుడిని సర్వత్రా పూజిస్తామని
నమ్మ బలికి ఎవ్వరు దూరతీరలకు లాక్కెళ్ళారు?

ఆ కంఠదఘ్నమైన కరుణరసాన్ని ఎవ్వరలా
క్రూరంగా శోకరసంతో పరిప్లావితమయేలా 
గుదిగుచ్చి మరీ ప్రవాసానికి ప్రస్థానం చేయించారు?

ఇవన్నింటికీ సరయిన జవాబులను రాబట్టాలంటే
ఈ ప్రజల ఆస్థానానికి ఆ అవధాన శిరోమణినే
అతిజరూరుగా ప్రవేశపెట్టమని  హుకూం జారీ చేయండి!!!

ఎవరక్కడ? యభటుల్లారా మీరు  తప్పుచేసారనే
 నేరారోపణజరిగింది---సమాధానం చెప్పండి!! 
లేదా మరలా భేతాళుడిని పిలిచి మళ్ళీ  మిమ్మల్ను
చెట్టుకు వేలాడదీయమని చెప్పే హక్కు మాకుందిసుమా!
సమాచార చట్టం ద్వారా సేకరించి మిమ్మల్నిముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తాం 

అతని అభిమానులుగా మాకు న్యాయం జరిపించమని నిలదీస్తామని
ఇందుమూలముగా సంబంధిచిన వారదరినీ హెచ్చరించడమైనది.
ఖబడ్దార్ తస్మాత్ జాగ్రత్త!! 
=================================17-3-15
కాశీ యాత్ర
-------------
ఉదయాన్నే నిద్రలేచి
కాశీలోని గంగవొడ్దుకు
గబగబా చేరుకున్నాను.
అప్పటికే దహన వాటికలన్నీ
అంతిమ సంస్కారానికి సిద్ధమయిన
ప్రేతాత్మలన్నీ కట్టెలపైపేర్చబడి
అనంతవాయువుల్లో కలవడానికి
త్వరపడుతున్నాయనిపిస్తున్నాయ్.

అప్పటికే కొన్ని వాటికల్లో
పైకెగసిపడుతున్న అగ్ని జ్వాలనుంచి
పొగలు ధూమ కేతువుల్లా

 నింగి బాట పట్టాయ్.

దూరంగా ఓ మహిళ నీటిలో
పవిత్ర స్నానమాచరించడానికి
సిద్ధమయిన రీతిలో కనబడుతోంది.
ముందస్తుగా తన రెండుచేతుల్లోనూ నిండుగా
నీళ్ళను తీసుకుని నెత్తిపై జల్లుకుంటున్నది.

ఇంటిదగ్గరనుంచి తనతో తెచ్చుకున్న లోహపాత్రను
గంగా జల ప్రవాహంలోముంచి నిండానీటినినింపుకుని
ఇంటికి తీసుకెళ్ళడానికని వొడ్దుకెక్కడానికి తయారవుతున్నది.
ఇంటిదగ్గరనున్న శివలింగాన్ని ఈ జలంతో బహుశా
అభిషేకించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా తోస్తున్నది.

దూరంగా బిస్మిల్లా ఖాన్ గారి సహనాయ్ వాద్యం నుంచి
శ్రవణపేయమైన సంగీతం వీనులవిందుగా వినిపిస్తున్నది.
 ఆ సంగీత శబ్ద తరంగాలు గుడిలోని స్వామి విగ్రహందాకా
చేరుకున్నట్లు గాలిగోపురంపై తిష్టవేసియున్న  పావురాండ్ర 
శిరో కంపనం ద్వారా విదితమౌతూనే వున్నది.
ఇదీ ఇప్పటిదాకా నేనీ పవిత్ర యాత్రా స్థలంలో నేను తిలకించిన దృశ్యమాలిక. వీటిని నామనో నేత్రంపై అనూదితం చేసుకుని
తిరిగి నేను మా విదేశంలోని స్వగృహంచేరే దాకా భద్రపరుచుకోవాలి.వీటిని యధాతధంగా 
మార్పులూ, కూర్పులూ చేరకుండా సంపుటీకరించమని
 ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధించాలి.
=====================================
  Mary Oliver కవితకు అక్షరసహగాని, యధాతథం- కాని స్వేచ్చ అనువాదం]
-------------------------------------------------------------------------------------------------

Monday, March 16, 2015

తలబోడుగాదు
తలపులూ బోడులుగానెకావు.

నిన్నటిదాకా మ్రోడు వారిన రూపంతో
మొహం మొత్తిన తరుసంపదంతా
నూత్న మర్యాదను చేజిక్కించుకుని
గాలులు వీచే దిశనుకనిపెడుతూ
శిర~హ్ కంపనలు మొదలెడుతున్న
శుభఫ్హడియల సుముహూర్తవేళలు.

కొత్త చొక్క తొడుక్కున్న కుర్రాళ్ళలా
మొహాలనీ నాలుగునెలలపాటు
మృగ్యమైన మొహాలన్నీ
కొంగ్రొత్త చివుళ్ళతో
కళకళ లాడిపోతున్నాయ్.

నిన్నటిదాక ఐపులేకుండా జాడకూడా
అవగతంకాకుండా యే వల్మీకంలోకో వెళ్ళయనుకున్న
విహంగాలన్నీ మూకుమ్మడిగా చెట్లపైకిజేరి
సమూహికంగా సభా మర్యాదలను పాటిస్తూ
సమావేశమయి పరస్పర సహకారాన్నందించుకుంటూ
హరిత శోభతో పరిసరాలనన్నింటినీ అలంకరిచుకుంటున్నాయ్.

ఇంకా పొద్దెక్కి చాలా సేపయినా కార్యాలయాలకు
వడివడిగా వెళుతూ వినిపించడమ్మొదలవని కారు కూతలు.

బద్ధకంగా మేఘాల మృదుకౌగిళ్ళలను వదిలించుకుని
అరుణారుణ రేఖలతో ఉదయించక తప్పదా అనుకుంటూ
నేను ప్రవేశిస్తున్నానహో అంటూ రాక సబ్డాలు వినిపించగానే
ఉలిక్కిపాటుతో వినిపించే సుప్రభాత గీతాల సంగతులు.

ముందుగా నా రాకను పసిగట్టయేమోమరి
ఇంటిపెరట్ళో పూసేస్తున్న సుమపరిమళ సుమగంధాలు.
నాదాకా వచ్చి తమనునులేతా లతలతో పులకింపజేయాలని
తహతహ పడుతున్న దాఖలాలు సుపష్టంగా కనుపిస్తున్నావి.

పసువులకొష్టంలోనుంచి మాకు దాణా వెయ్యండిరో అంటూ
ఆపసుగణం పెడుతున్న ఆకలి కేకల పరంపరలు.
ఇదంతా రాబోయే వసంతునికినేపధ్యమై అలరారుతున్నది.


స్నేహాంజలి
------------రావెల పురుషోత్తమరావు
*******************************.
[కవితాప్రసాదుకు మూగగా పలుకుల శ్రద్ధాంజలి.]
బ్రదినంతకాలం కవిత్వాన్ని ప్రేమిచాడూ
ప్రకృతిని ప్రతినిముషం పరవశించేలా కీర్తించాడు.
స్నేహభావానికి ఓ అర్ధముందని నిరూపించాడు.
ఉన్నతమైన కవితాసంపుటులు వెలువరించాల్సిన దశలో
ఊఉర్ధ్వలోకాలకు ఉరికి ఉరికి పరుగెట్టుకెళ్ళాడు
ఇక్కడి సాహితీ సుగతులనందరినీ దుఖ
సాగరంలో ముంచి తరలిపోయాడు. ఉగాది రాకముందే
కోయిల తానై మన్మథును ముందు అవధానగానంచేయాలనీ, పంచాంగ శ్రవణం పంతులుగారురమ్మని ఎంతగా బ్రతిమాలి పిలిచినా జరూరుపనులున్నవాడిలా
జగతిని వదలి వెడలి పోయాడు.ఆతురతో తరలి తిరిగి రాని లోకాలకు వెడలి పోయాడు
తనకవితలకు నేను ఆంగ్లానువాదంచేస్తే సంతోషించి బదులు పలికాడు. బాగున్నాయని ప్రశంసలతో ముంచెత్తాడు. తన అవధ్హనంలో ప్రసాదరాయకులపతిగారి సమక్షంలో పృచ్చకుడిగా
నేను తన అవధానాన్ని పద్యరూపంగా ప్రశంసిస్తే ప్రత్యేకంగా అభినందించిన స్నేహశీలి.]

కవితాసుమాంజలి--
=======================

అతగాడిని చూడగానేనవ్వు తనంతతానే
ఆ మనిషినవ్వుకు సరిపోలను నేనంటూ
నిష్క్రమణపు మార్గాన తిరోగమిస్తుంది.
సౌహార్దం అతని శీలసంపదకు
సాటిరాను నేనంటూ తలొంచుకుని వెళ్ళిపోతుంది.

ఇంకా వసంతం రాకకోసం ఎదురుచూసే కనులకు
చేతుల్లోచి జారిపడ్డ ఒంటరిపూల బుట్ట
శిశిరం రూపమై  మాయాప్రవరుడిలా దిగివవ్చ్చి
కవితా వరూధుని ముఖద్వారం వద్ద 
తిష్టవేసి అతనొచ్చే దాకా కదలను
 పొమ్మని భీష్మించుకు కూర్చుంటే 
ర్టునర్తనం లో తనను మెచ్చని
 శిశిరం కోరికనే మన్నించి
మంచితనం తనకే సొంతమన్నట్లు
మాహాప్రస్థానానికి సిద్ధమై
 కదలి కనీటిసాగరాన్ని 
కవిసుహ్రున్మండలికి కానుకగా
గిరాటేసి కరుణా సముద్రుడిలా
కాలయముడివెంట తలొంచుకుని కదలిపోతున్నాడు.

వేయి పడగల కాలనాగు వెంటబడి వేటాడి
అతన్ని తనవెంటబెట్టుకుని విసురుగా
 విజయ గర్వం తొణికిసలాడగా 
అగ్ని సాక్షిగా అతను నిష్క్రమించడం కవితా భారతి
 తాను కళ్ళారా చుసానని
అవధాన సరస్వతితో అనడం తాను విన్నానని
సమస్త సాహితీలోకం సాక్షీ భూతమై
సజలనయనాలతో అతనికి శ్రద్ధాంజలి
ఘటిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించింది.

==================================================

Sunday, March 15, 2015


మూల్యాంకనం
-----------------రావెల పురుషోత్తమ రావు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^
అటు ఆ ఆకాశం వైపు చూడు
దిగులు మేఘాలనన్నింటినీ
దిగ దుడుచుకుని నిర్మలమైన
మనసుతో ఎలా మనగలగాలో
మంచితనంతో కల్మషంలేకుకుండా
స్వచ్చ మైన  స్వేచ్చాజీవిగా
ఎలా జీవనం సాగించాలో  ఎరుకవుతుంది[1]

నిరంతరం పారే ఆసెలయేరు వైపు నీ దృష్టిని సారించు
కొండాకోనలమీదనుంచి రాలిపడే జలపాతాలనుకూడా
తనలో విలీనం చేసుకుని ఎలా సమున్నతంగా సాగిపోవాలో
సోదాహరణంగా తెలియబరుస్తుంది. ప్రాణాధారమైన
జలకళతో ఎలా నిత్య సుమంగళిగా నిండు మనసుతో
జీవనం సాగించడం యొక్క విలువను  తెలుసుకుంటూ
పరభాగ్యోపజీవిగా  ఎందుకు బ్రదకరాదో విశదమౌతుంది[2]

అటు తిలకించు
దహనమౌతున్న వనమంతా
దేనికి నిదర్శనంగా నిలబడుతుందో.
అంతరాంతరాళాల్లో
అగాధపు అంచులదాకా వెదుకు!
అట్టడుగునకూడా పేరుకున్న
అహంకారాన్నీ, స్వార్ధం
సంకుచితత్వాలనెలా దహింపజేసుకుని
అగ్నిపునీతుడిగా మేలిమి బంగారంలా
ఎలా వెలికిరావాలో విశదమౌతుంది[3]

కుల మత వైషమ్యాల వలలో
చిక్కుకుని నీ విశాల దృక్పధం
రాను రాను కృంగి కృశించకుండా
అచంచలమైన విశ్వాసంతో
అనంతమైన సహనంతో
 విశాల విశ్వాన్నీ
 తనభుజస్కంధలపైమోసినా
అలుపు సొలుపూ ఎరుగని సహనశీలిగా
ఎలా బ్రదుకు బాటను మలచుకోవాలో
పుడమితల్లి ఎంకు పుణ్యరాశీగా
పదిమందిలోనూ ప్రకాశవంతగా
శోభించగలుగుతుందో
స్పష్టంగా నీకవగతమౌతుంది.[4]

అలాంటి ప్రశాంతంగా వీచే చల్లగాలిని
నీ సుఖాలకోసం కాలుష్యపు కోరల్లో చిక్కించి
వ్యవధానంలేని అస్తవ్యస్తావధానాలకు కారకమై
వర్షాభావాలకు అతివృష్టీ అనావృష్టులకు
కారణభూతమై కడగండ్ల పాలై
సునామీల సృష్టికర్తగా యేం సాధించావో గమనించు.
 పంచ భూతాలనన్నింటినీ పరమ శత్రువులుగా జేసుకుని
నీవు సాధించిన ఘన విజయపరంపర యేమిటో మూల్యాకనం చేసుకో.
నీక్రౌర్యానికీ యావజ్జగతీ ఎలా బలయిందో సరిచూసుకో.

ఇప్పటికయినా పెద్దలందిచిన ప్రసాదాన్ని పరహితార్ధమై
ప్రయోజనకారిగా మసలేలా ప్రణాళికలు రచించుకో
ఈ జీవన సాఫల్య పురస్కారాన్ని
అందుకునే   అర్హతను సంపాదించుకో[5].
=======================================14-3-15

Friday, March 13, 2015

మావి చివురులమాటున మనసు విప్పి
పాట పాడెను కోయిల పరవశాన
నవవసంతుని రాకకై నఖిలజగము
వేచియుండెను చూడుడో వేలకనుల.

===========================
కొత్త  పాటను గుండెకు  హత్తుకొనగ
కోయిలమ్మలు పాడిరి గొంతునెత్తి
"భావికాలము నూహించి బాధ  పడకు
వర్తమానము నందునే వరలు సుఖము"
నాదు మాటను నమ్ముడు నయము గాను
మన్మథమ్మున మీకెప్డు మంచి జరుగు.
=================================
చందన స్పర్శ
=================
నిన్నటిదాకా ఎండిపోయి
దివాలాతీసిన అవతారంతో
దిష్టిబొమ్మల్లా నిలబడ్డ
తరువులన్నింటికీ తరుణ స్పర్శ.

గడ్డగట్టి ఘనీభవించి
పారలేను పొమ్మన్న యేరులన్నీ
పరవశాన ప్రవహించే తీరు
నయనానందకారకం.

యేచిత్రకారుడో చెమటోడ్చి
కుంచెలద్దిన వర్ణచిత్రంలా
యావద్ ప్రకృతీ యవ్వనోత్సాహంతో
జవనాశ్వలా ఉరకలు బెడుతున్న తీరు
నయగారాలు బోతున్న నవమన్మధునికి  
పచ్చని తివాసీ మీద నడచిరమ్మని
హృదయమనే కోవిల పాడుతున్న
మోహనరాగంలా వినబడితే  
ఈ జన్మ కిది చాలనుకోవడం 
అభినందన చందన
 పురస్కారమందుకో వడం కాదంటారా?
===========================

హేతు శాతోదరిన్-------
------------------

చిలక్కొయ్యకు వేలాడదీసిన 
తొడుగుచొక్కాలా
అవునా కాదా అన్న సందిగ్ధ
మౌ విచికిత్సలో ఎందుకు నీ మనసు మౌనంగా
వేలాడడం చూస్తే గుండే తరుక్కుపోతుంది.
కారణం వివరించలేవా కడు ప్రియమైన స్నేహితుడా?

గడ్డకట్టిన జలాశయంగూడా
వసంతం వాకిట్లోకి వస్తుందని తెలియగానే

స్రవంతిలా పరకాయప్రవేశం జేసి
వడివడిగా పారడానికి సిద్ధమౌతుంది.
శిశిరంలో తిన్న చీవాట్లన్నింటికీ
ఒకే ఒక్క సమాధానంలా ఎందు గడ్డికూడా
హరితవర్ణ శోభతో నవలాడుతూ
వసంత యామిని నడచివవ్చ్చేందుకు వీలుగా
సుతిమెత్తగా తనరూపాన్ని సరిదిద్దుకుని
అభిసారికలా ఆ నవమన్మధుని రాకకోసం
ప్రతీక్ష చేసే సుందర దృశ్యం వర్ణించనలవిగాదు.

మ్రోడుబారి మొండిదానిలా ఇంటెదురుగా దిష్టిబొమ్మలా
నిలబడి నిలువుదోపిడీకి గురయిన నిర్భయ [జ్యోతి]లా
నిరామయంగా ఉన్న తరు శాఖలన్నీ  కనులకింపయిన పచ్చటి
రంగు పులుముకుని మేం స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధమంటూ
ముస్తాబయి ముచ్చటగొలుపుతున్న తీరు ఎవరా జతగాడు?
అని అందరూ సహస్రాక్షులుగా మారి ఎదురుచూస్తుంటే
ప్రకృతిమాత పరవశానికి ఇంకా అర్ధం తెలీదంటావేం మిత్రమా?
==================================================================


Thursday, March 12, 2015

పడవ ప్రయాణం--
================
నవ్వడంపూర్తిగా తెలిసిన మేధావిలా నేను
నడ్డమెప్పుడోమరచిపోయానన్న ధోఋఅణినంటిపెట్టుకుని నీవు
కొండలనన్నింటినీ పిండి చేద్దామని ధీరువుగా నీవు
పిండిచేసి తర్వాత ఏంచెద్దామో చెప్పమని ప్రశ్నార్ధకగానేను
ఇలా ఇద్దరం వైవిధ్య ప్రవృత్తులలో మరగి మరగి
ఆవిరయే కన్నా ఒకరికొకరం సహకరించుకుంటూ
సాయపడుకుంటూ సహజీవనసౌందర్యపు మాధుర్యాన్ని
పదిమందికీ తెలియజెబుతూ ద్వైదీ భావాన్ని విడనాడుతూ
ఏకీకృతమానసంతో సంసారనౌకను సజావుగా ఒడిదుడుకులకు
దూరంగా నడుపుకుంటా నీవే సరంగుగా నేను చుక్కానిగా సాగుదాం!!
=========================================
ఓ దశాబ్దం దాటాక------
====================
నువూనేనూ ప్రప్రధంగా
సమావేసమావేశమినప్పుడు
ఎర్రెర్రని మధ్యంలా
తీయ తీయని మధువువనిపించావు.
ఇద్దరూ అధరాలను అందుకోగానే
చుర్రున కాలినట్లనిపించింది.
ఎదోతెలియని అనుభూతి నన్ను
నీతో సహజీవనమే మేలని సూచించింది.

ఇప్పుడు మనపరిచయమయి
 దశాబ్ద కాలం దాటింది.
నువ్వు ప్రభాతాన ప్రతివారూ
ఆశించే ఫలహారమందిస్తానని
మారాం చేస్తుంటావు.
నాకు ఇక దేన్నీ రుచిచూడాలనిపించడంలేదు.
కారణం చూపులతోనే నీ సౌందర్యాన్ని
జుర్రుకోడానికి అలవాటు పడ్డాను.
ప్రతినిత్యం సంతుష్టి పడుతూ
కాలం గడిపేస్తున్నాను.సంతులిత ఆహార్యం
నువ్వే ఐనప్పుడు ఇక నాకు ప్రత్యేకమైన
 ఫల హారాలతో  పనిలేదేమోననిపిస్తుంది.
--------------------------
  [Amy Lowell--ఆంగ్ల     కవితకు అనుసృజన]
=====================================




విడివిడిగా---
------------------
విడాకుల పత్రాలు
వాటి మధ్యలో
వాడిన గులాబీ రేకలు.
---------------
మా విడాకులు
మామధ్య స్వర్గం
అంతర్ధానమయిందా?
-----------------
చేసుకున్న బాసలు
చెప్పుకున్న ఊసులు
క్షణభంగురాలా?
==================
అధికార దాహం
అతనిది
అహంభావ కోణం
ఆమెది.
=================

బ్రహ్మాస్త్రం--
=============

అస్తమిస్తున్న సూర్యుడే
అందులో కనిపించి కలవరపెట్టాడు.
మానవ సౌలభ్యంకోసం
ఆత్మత్యాగానికిఒడిగట్టిన 
చిట్ట్టి తల్లిపై అంతపెద్ద
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన
మానవుడిని యే శాస్త్రధర్మాలతో
కరకైన న్యాయ సూత్రాలతో
 ప్రకృతిమాత శిక్షించాలి?
=================
మౌన భంగం-----రావెలపురుషోత్తమరావు
[న్యాయబద్ధంగానే సుమా!]
------------------------------------------
దేశ రాజధాని నగరంలో
రాత్రిపూట బస్సులో  కళాశాలనుంచి
ఇంటికి కులసాగా తిరిగొస్తున్న
కన్నె పిల్లకు మాన భంగం జరిగింది.

ఆ పిడుగుపాటు లాంటి సంఘటనను
అభి శంసిస్తూ నిర్భయ చట్టం వెలువడింది.

ఆ మృగాడికి కారాగారవాసం లభించింది.

ఆ 'చక్రధారి' కి ఓ  అంతర్జాతీయ
 వార్తా పసారమాధ్యమంలో
అంతర్వ్యూహానికి అవకాశం దొరికింది.

ఆ అకృత్యాన్ని తన నల్ల కొటును  ధరించిన
దౌర్భాగ్యానికి నల్లరంగు పూసి వాదించే 
అవకాశం ఆబగా దొరికింది.

ఈ చరిత్రహీనమైన సంఘట సంచలనం సృష్టించింది

ఇంకా బ్రదికున్నానని శ్వాసతో నిరూపిస్తున్న్న
న్యాయస్థానం ప్రసారాన్ని ఆపమని ఆదే శించింది.

ఈపిడుగు పాటుకు హతాశువైన కుటుంబానికి
మానని మాన భంగపు గాయానికి పండుకారప్పొడి
పరుచుకునేలా చల్లినట్లు బాధ కలిగింది.

చదువుకున్న విద్యను చట్టుబండలు చేసుకున్న మేధకు
ఈ ఘటన కోపానికి కారణమై నిలిచింది,నేరస్థుడినికాదు
వాడిమనస్తత్వానికి సిక్ష పడాలని బుద్ధి నేరుగా
వక్రీభవనంజెందింది వితండవాదానికి  దిగింది..
ఇది నాగరక సమాజానికి నగుబాటుగా 
తోచిన దాఖాలా మాత్రం కనబడలేదు.
-----
నాణానికి మరోవైపు
---------------
ఎక్కడో తూర్పుదిశగా నిద్రాణంగా వుండే వూరిలో
ఇలాంటి మానభంగానికే  జనాగ్రం తగు శిక్షను అమలు జేసింది.
మధ్యందిన మార్తాండుల్లా తిరగబడే పౌరుషం వచ్చింది.
నేరం చేసాడని ఋజువయిన వాడిని బందిఖానాలోంచి
బయటకు లాగి చావచితగకొట్టి ఆశవాన్ని ఊరంతటికీ
ఎరుకపరుస్తూ ఖబడ్దార్ !!కాగ్రత్త అంటూ హెచ్చరికను
మగ సమాజానికి త్వరితగతిని జారీచేసింది.

ఏ వార్తా ప్రదారమాధ్యమం దీనిని సాహసోపేతమైన చర్యగా
కీర్తించి వారిని ప్రజా రత్నలుగా గౌరవించాలన్న భావనే రాలేదు.

గర్హించాలసిన సంఘటనకు అంతర్జాతీయంగా గౌరవం లభించింది.

గర్వించి భుజకీర్తులు తొడగవలసిన చర్యకు ప్రాశవాసయోగం సిద్ధించిది. 
అనాగరక చర్యగా దూషణకు ఆలవాలమై నిలిచింది.

మానాభిమానాలకు మౌనమే ఆభరణమన్న కీర్తి తోరణం లభించింది.

నల్లకోటుకు,  న్యాయాన్ని గద్దెనెక్కించి ధర్మ సం రక్షణకు
పాటుబడిన కలియుగ పురుషులను కఠినంగా శిక్షించమని వేడుకునే వీలు లభించింది.
=========================================11-3-15

Wednesday, March 11, 2015

ఎంత శ్రద్ధగా చదివినా
అర్ధమవనిదే కదా!  విధివ్రాత.
వయసెంత చిన్నదయినా
కబళించగలిగింది మృత్యు వాత.
========================
పదినిమిషాలూ రెప్ప పాటులో
===========================


పిల్లాడికి పాలిస్తానికిలేదు
 పదినిమిషాలు నష్టమైతదని 
గునిసి గీపెట్తిన గుత్తేదారు
అరిచీ ఆక్రోశించీ నిద్దర్లోకి జారుకున్న పసివాడు.

అక్రమమైన నల్ల డబ్బుతో కొన్న తెల్లకారులో
వేగాన్ని నిరోధించకుండా పదినిముషాలు
కలిసొస్తాయని ప్రాణం గాలిలో కలిపేసుకున్న
గుత్తేదారు ఒక్కగానొక్క పుత్ర రత్నం
ఇద్దరికీ కాలవ్యవధి పదినిముషాలే.
బ్రదుక్కీ చావుకూ మధ్య సమయపాలనంకూడా
ఆ అంతుచిక్కని పదినిమిషాల వ్యవధానమే.



కాలయముడి కాళ్లదగ్గర యవ్వన గర్వంతో  ఒకడు.
ఆకలితో కలిపురుషుడిని కవ్విస్తూ కాళ్ళను కదుపుతూ చంటోడు.
===================================================
అస్తవ్యస్తంగానే----
_______________
మబ్బులుకమ్మిన ఆకాశంలో
తళుక్కున మెరిసే తటిల్లతలా ఆమె.
రణగొణ ధ్వనులుజేస్తూ
రసరమ్య రాసిక్యానికి
పిడుగుపాటులా ప్రవర్తిస్తూ నేను.

యే మిన్నేటి గంగో ఇద్దరినీ
 కలిపేందుకు రావాలి.
అప్పటిదాకా ఏకాంతనూ మనసులోకి
చొరనివ్వకుండా రక్షక భటుడిలా
కాపలా కాస్తూ అంతరంగ మధనంలో నేను.

ఆపసోపాలు పడుతూ అవ్యక్త బాధామయ
జగత్తులో మత్తుగా మరణిస్తూన్న అనుభూతిలో
అస్తవ్యస్తం గా క్రిందుమీదలుగా పొర్లిగింతలతో
పోరాట పటిమను ప్రదర్శిస్తూ పోహళింపుల పులకింతలతో తను.
యే మిన్నేటి గంగో ఇద్దరినీ
 కలిపేందుకు రావాలి ఇకతప్పదు.
లేదా ఏ మిన్నాగో కాటువేసే దాకా
నిరీక్షణ పర్వాన్ని నిభాయించుకు రావాలి తప్పదు.
===========================================


క్షత గాత్రం--
------------------
తుండు గుడ్డలా పిండేసి మనసును
తను తుర్రు మంటూ జారిపోయింది.
పిచ్చుక కున్న చిన్నిపాటిప్రేమనుగూడా
ప్రకటించకుండానే
పలాయనం చిత్తగించింది.

కవితనింకా కలంపూర్తిగా
రాసి పడేయకముందే
కలాన్ని గిరాటేసి
రుస రుసలాడుతూ
 నే రానికపొమ్మ్మంటూ
రయ్ రయ్ మంటూ సాగిపోయింది.

తనతో తెచ్చుకున్న
చీకటినంతా చీరకొంగులోంచి
నాపైకి దులిపేసి
నయగారంగా నడిచి
వెళ్ళిపోయింది.

ప్రేమగా నేనిచ్చిన మల్లెల
రెక్కలన్న్నింటినీ తుంపి
పక్కమీదపడేసి
పరాకుగా నిష్క్రమించింది.

వెలుగు రేకలనన్నింటినీ
వెన్వెంటనే తన గుండె లోకి
వేగంగా సర్దేసుకుని
విసురుసుగా వెళ్ళిపోయింది.

ఆఖరుకు నన్ను
అసంపూర్తి కవితలా గిరాటేసి

అంతరంగ గవాక్షానికి
అక్షరాలా వీడ్కోలు చెప్పేసి

ఇటు తిరిగి చూడకుండానే
విసుగును ప్రదర్శిస్తూ వీద్కోలు
చూపులను నా గుండెలోకి
గునపంలా గుచ్చేసి
గుర్తులన్నింటినీ గుంభనంగా
చెరిపేసుకుంటూ గునుస్తూ సాగిపోయింది.

ఇప్పుడిక మిగిలిందల్లా నేనూ నా చీకటి
గుర్తుకు వచ్చి గోడకుర్చీ వేయించే
ఆ చేదు జ్ఞాపకాలు.
సుడిగాలిలా చుట్టబెడుతూ
సుర్రుమంటూ కాల్చేసే
చురుక్కుమంటూ సూదిమొనలా
గుచ్చుతూ  కత్తి వాదరపై
కదిలిపోయే గతించిన
ఏ ఉషస్సుకూ అందకుండా

సంసారంలో సగందారిలో ఆగిపోయి
కలతపెడుతుండే ప్రణయ పయోధి జలతరంగాలు
చిత్తగించిన ఆ రాణీ  -ప్రణయోద్దీపనాంతరంగ పు
  ప్రేమ పురస్సరంగా మిగిల్చిన జీవన గాధా సప్తశతులు.

----------------------------------------------------------------
నావుడు అనవుడు---
================రావెలపురుషోత్తమరావు.

జీవన వైవిధ్యపు 

మనసు మూగదయేదాకా
మాటాడని యవ్వనం
దివినుంచి దివికి
జారిపడ్డ దివ్య 
సుందర సుమగంధంలా లావణ్యం.
అనాఘ్రాత పుష్పమేమో అనుకున్నరేమో 
దీపనిర్వాణ గంధమనుకుని
ఎవ్వరూ మూర్కొన్న దాఖలాలేదు.

పట్టపగలే పౌరోహితులవారు
నింగివైపు దృష్టిని సారిస్తూ
అగపదిందిగదా అన్నప్పుడు
అంధ పాంధుడిలా ఔనన్న
అబద్ధపు పెళ్ళికొడుకులా
జీవితాంత కననోపని

దాంపత్య  వీణపు సుమధుర
సుమనోహర సప్త రాగ సుస్వరాలు.

హితం ఎవ్వరు చెవిదగ్గర ఇల్లుగట్టుకుచెప్పినా
సరిగ్గా చెవికెక్కని జీవన వేదాంతపు
సులభ గ్రాహ్యమైన మిత్ర వాక్య
 పరంపరలూన్నీ కలగా పులగంగా
 అస్తవ్యస్తమై అలరారుతూ
చిగురించడానికి సిద్ధమౌతున్న చిలిపి ఆలోచనలు.

పంచతంత్రపు సూక్తికి సన్నిహితంగా
పరాచికానికి కూడా మింగుడుపడని
అనవుడు దానవుడుల అరణ్య రోదనలు.
-----------------------------------------------------------11=3-15

Tuesday, March 10, 2015

పాంచభూతాత్మికం
---------------రావెల పురుషోత్తమరావు.
***************************************

వాహనాలజోరుతో హారన్ల హోరుతో
శబ్దకాలుష్యాన్ని అనూహ్యంగా
పెంచి పోషిస్తూ జగమంతటినీ
చెనటినిచేసి ఆడిస్తున్నారు.

అణు నిర్మితమౌ,  రకరకాలప్రయోగాలతో
విద్యుదుత్పక్తికి ,  తదనుగుణమైన
 అనుబంధాలతో ఐశ్వర్య గుణధాముడై
విపరీతమౌ వాయు కాలుష్యానికి
దోహదమై నిలుస్తున్నారు.

రహదారివిస్తరణలపేరుతో
చెట్లన్నింటినీ తెగనరుకుతూ
స్వచ్చమైన గాలినిపీల్చే
సత్సంప్రదాయాన్ని మట్టుపెట్టే స్తున్నారు.

పంచభూతాలనన్నింటినీ
పాంచభౌతికరూపంలోకి మార్చేసి
పబ్బం గడుపుకుందామని
ప్రయత్నాలను దినదినాభివృద్ధిని జేస్తూ
ప్రకృతిసమతుల్యానికి విఘాతం కలిగించి
తనకు తానే అగ్నికి ఆహుతౌతూ
పొగలుగక్కుతూ  గగన మార్గానికి దారులుతీస్తూ
గవేక్షణకొనసాగిస్తున్నారు.

అందుకే ఈ గావుకేకపెట్టయినా
మానవజాతిని దీర్ఘ నిద్రనుంచి
జాగృతంజేసి కర్త వ్యతోన్ముఖులను
చేద్దామని ఓ  ప్రయత్నం చేసాను.

ఇప్పటికయినా నీ జాతిని మేల్కొల్పేలా
తగు జాగ్రత్తలు తీసుకో--
తన నికిని తాను కాపాడుకునే దిశలో
అడుగులు వేయమని తగు విధాన హెచ్చరించు.
శ్రేయోదాయకమైన మార్గంలో పయనించమని ప్రబోధించు.
***************************************************10-3-15
ఆగామి వసంతానికి---
---------------------

నిన్నటినుంచీ ఎడతెరిపిలేకుండాకురిసిన హిమపాతం
భూ వలయాన్నంతటినీ మంచుదుప్పటితో కప్పినట్లయింది.
యావత్ భూ ప్రపంచమంతా ఉప్పిరిసి ఘనీభవించిన సంద్రంలా
మీద పరుచుకుపోతున్న సూర్య కాంతులతో ధగ ద్ధగాయమానంగా
మెరిసిపోతూ ఆగామి వసంతానికి నేపధ్యం తయారుచేసుకునే దిశలో

అందిపుచ్చుకున్న అవకాశాన్ని సద్వినియోగంచేసుకున్న తీరు
వాస్తవంగా ప్రశంసార్వమై కనులకు మిరుమిట్లు గొలుపుతూ
కళాత్మకమైన అత్యాధునికకళాఖండంలా  మురిసిపోతున్నది.

రాబోయే రోజుల్లో కాలం గీయ తలపెట్టిన హరితవర్ణ శోభను
మరింతగా ద్విగుణీకృతంచేయాలనీ నగ్నంగా నిలుచున్న శిశిర తరువు
రాబోయే వసంతం అందించే  రాజసాన్నూహించుకుని మెరుపులపూల దండగా
 తనను తాను మలచుకుంటూ ధన్యోస్మి అనుకుంటూ దరహాసంతో మెరిసిపోతున్నది,

మావిచిగురులు కడుపారా తింటూనే కోయిలమ్మ కొత్తపాటలు పాడడానికి 
గొంతును సవరించుకుంటూ కాకోలుకీయంగా కాకమ్మను 
తెరవెనుకకెళ్ళమని సఙ్జలు చేస్తూ  సహరించమని శాసనాలతో హెచ్చరిస్తున్నది.

రాబోయే కవిసమ్మేళనంలో ఆహుతులైన సభాసదులు తలలూచి తరించేలా
తాను చదివే కవిత గుండె గుండేకూ గుమ్మానికి కట్టే మావిడి తోరణంలా 
శుభాలతో తేలిపోయే లేఖార్ధంలా మిగిలిపోవాలని కాగితాలను
దస్తాలు దస్తాలుగా ఖరాబు చేస్తున్నాడు.సాంకేతిక పరిజ్ఞానాన్ని
సన్నిహితంచేసుకోలేని తన అసమర్ధతను తానే విమర్శించుకుంటూ
మున్ముందుకు తాను తీసుకుపోబోయే తీర్మానాలకు నేపధ్యాన్ని తనకనుకూలంలా 

మారిపోవాలని మధురమైన స్వప్నాలనుకంటూ ముచ్చటపడుతూ 
ముసి ముసినవ్వులతో ముందుకు సాగే ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంలో 
తలమునకలుగా శిరోదఘ్నంగా ఆలోచనా సంద్రంలో మునిగి గగన మార్గంలో ఊహలను గాలిపటాల్లా ఎగరేస్తూ తుళ్ళింతలతో కవ్వింతలతో తూర్పున త్వరత్వరగా ప్రభవించాలని
ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్నాడు.కవి వసంతుడు సమధికోత్సాహసంతో
ఆగామి వసంతానికి , గ్రహగమనం ఎలావున్నా , తన పంచాంగ శ్రవణం ఇటు  జనతకూ 
అటు ప్రభుతకూ,  కంటకప్రాయంగా తయారవకూడదని పురోహితులవారు 
ప్రతినిత్యం తన  కులదైవానికి విన్నపాలరూపంలో విన్నవించుకుంటూనే వున్నాడు.

ఆగామి వసంత యామిని ఆగమనానికి ముందస్తు ప్రణాళికలు  తయారవుతున్న తీరు 
నెమళ్ళనుసైతం కొత్త భంగిమలను నేర్చుకోమని హెచ్చరిస్తున్నట్లే వుంది.
------------------------------------------------------------------------------------------------------------

Monday, March 9, 2015

 పడవలో----
++++++++++++++++++++++++++

ఆటుపోటుల మధ్యన
పడవప్రయాణం
దూరంగా రేరాణి పూల
సౌరభంపు గుబాళింపు.

సుళ్ళుతిరుగుతూ సరంగు గాలిపాట
మనోనేత్రాల్లో పరిసరాల
అందాలను నిక్షిప్తం
 చేసుకోవాలన్న తపన.
క్షణాలను పరుగెట్టిపొమ్మని స్వాసిస్తూ.

ప్రవాహంలా పరుగెడుతున్నది.
పడవంతటా కిక్కిరిసి ఇంటిముఖం
పట్టి తిరిగొచ్చే శ్రమ జీవన సౌందర్యం
పగలంతా వెలార్చిన  స్వేదం
చుట్టుకుపోతూ నాసికా పుటాల చెంత
పరిభ్రమిస్తున్నది సరిలేరునాకెవ్వరని.
కుదుపుల్లోనే ఖుషీ ఖుషీ గా నవ్వులపువ్వులు.
గోదారమ్మ అందాల మాటెలా వున్నా
జానపదం జాణయై నర్తిస్తున్నది.
చీకటికి స్వాగతం చెప్పగల గుండె నిబ్బరం
పడవంతటా పదిలంగా పరుచుకుని పోతున్నది.



పడమటికొండలవైపు ప్రస్థానం
 కొనసాగిస్తూ పగలంతా
చెమటోడ్చి శ్రమించిన సూర్య భగవానుడు.
తన అందాలనన్నింటినీ నదీ ముఖంలో
ప్రతిబింబింపజేస్తూ.
దూరంగా ఊరంతటినీ కలిపి కుట్టిన దీప కాంతులు.
నావ ఒడ్డుకు చేరుతుండగానే మూటా ముల్లే పలుగూ పారలతో
హడావుడిగా దిగాలనుకుంటూ తొందరపడుతూ
అవతలవారిని అదలాయిస్తూ అణుమాత్రమైనా
ఓపిక బిగబట్టుకోలేని ఊపిరి సలుపడంకూడా సైపనోపని
దైనందిన జీవన యాత్రికులు.


***********************************************


నిన్నటినేపధ్యంలో
************************
అసుర సంధ్య వేళ
మల్లెలు గుచ్చుకుంటూ ఇంటామె
కధల పుస్తకం ముందేసుకుని నేను
ఇది నిన్నటి దృశ్యం------

ఇద్దరిమధ్యా రసరంజనిలా
చిరు దరహాసాల మృదుచంద్రికలు.
ఇవ్వాళ కొత్త నేపధ్యం  చోటు చేసుకుంది.

ఆవిడకూర్చునే కుర్చీలో
మౌనం తిష్ట వేసుక్కూర్చుంది.
ఆవిడ చాయా చిత్రం క్రింద
అగరొత్తుల ధూపం సుడులు తిరుగుతూ
నన్ను ఉక్కిబిక్క్కిరిచేస్తూ
ఊపిరిని బిగబట్టేస్తున్నది.


నిన్నటికీ ఇవ్వాల్టికీ మధ్యన
విధి చేసిన వికటాట్టా హాసం.
దిగంతాలదరికి ఆవిడనూ
ఏకాంతంలోకి నన్నూ నెట్టేసింది.
కాలం మౌనరాగాన్నాలపిస్తూ
కఱకు గుండెకు నిర్వచనమై నిలిచిపోయింది.
=================================

సహృదయ సన్మిత్రులు-- 
=====================================

ఎవరన్నారు ? అతడు మనమధ్యన జీవించిలెడని
కళ్ళ్ళలో కళ్ళుపెట్టి చూడు
అతని దృష్టికోణమే మనకు దర్శనమిస్తుంది.

అన్ని అవయవాలలోనూ నయనం ప్రధానమని
నేత్ర గృహీత చూపుల్లోకి నేరుగా  చూడు
అతని నేత్రానందమే ఇక్కడా ద్యోతకకమౌతున్నది.

అతను అవయవాలకోసం అవసరార్ధం 
ఎదురుచూసే వాళ్ళు
అందిపుచ్చుకున్న ప్రతి అవయవంలోనూ
అతని స్పర్శే స్పష్టంగా విదితమౌతున్నది.

గుండె గొంతులోంచి అతని రాగమే
స్వరాభిషేకమై  ప్రవహిస్తున్నది. 

ఈ హరితానందమే అతన్ని చిరంజీవిగా
ప్రపంచ దర్శనం గావిస్తూ
అజరామరంగా అందరి హృదయ కమలాలలోనూ
వికసిత వదనాలతో  నిలిచి విశెషంగా 
ప్రశంసార్హమై జయ జయధ్వానాలమధ్య
బంధువులూ శ్రేయోభిలాషుల సమేతంగా
అశీ:పూర్వకంగా అమరజీవిగా అభినందనల
శత సహస్రపు సుందరునిగా అలరారుతూ శోభిస్తున్నాడు. 

అందుకే అతను అందరినీ జయించి విశ్వవిజేతగా 
విహంగ వీక్షణ గావిస్తూ ఆనంద నందనమై అలరిస్తున్నాడు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
[ఇటీవల అవయవ దానంజేసిన పుణ్యమూర్తులందరినీ స్మరిస్తూ
అందుకు సహకరించిన హరిత వలయాలను ఏర్పరచిన యావన్మందికీ
కృతజ్ఞతలతో అభినందనల చందనాలనందిస్తూ] ]
=================================================

Sunday, March 8, 2015

ఎక్కడో ఒకచోట
ప్రత్యేకసంచిక విడుదలవుతుంది.
అనాధాశ్రమంలో ని అమ్మకు సుపుత్రుడు
ఓ గులాబీ పువ్వ్వునందించి 
మాతౄణం తీర్చుకున్నాడు.

అప్పటిదాకా అరుస్తూ అంగలార్చిన మొగుడు
అర్ధాంతరంగా ఓ నవ్వును విసిరి రాత్రిని
తన ఒడిలోకి లాక్కో డానికి
 విఫలయత్నం చేస్తున్నాడు.

నిర్భయ చట్రంలోకి ఒదిగిన కన్నెపిల్ల
ఓ భారతీయ పుత్రిక ప్రసారాన్ని
ప్రసారంచేసే బీ బీసీని దుయ్యపట్టే  సంతనకనరాక
ఓపికలేక నిరామయంగా దిక్కులు చూస్తున్నది.
అంతర్జాతీయంగా మహిళలకు 
అంతటా అన్యామే  శాపమై కూర్చుంటుమ్న్నడి.
అసలెందుకిలా జరుగుతున్నాడని అడిగే నాధుడులేక
ఆడతనం అవిశ్రాంతంగా ఆక్రోసిస్తూనే వున్నది
================================