Saturday, June 13, 2015

స్వేదపుష్పాలు
---------------------రావెల
--------------------------------
శ్వాసప్రక్రియను చేపట్టినదేతడవుగా
రెప్పపాటునకూడావిరామ్మాన్నసించకుండా
అవిశ్రాంతంగా శ్రమించే
శ్రమజీవులుకదా శ్వాసకోశాలు.

అవి అత్యంత సహజంగా
 మానవనైజంకన్నా భిన్నంగా
తమసేవా ధర్మాన్ని దయాగుణంతో
నిర్వర్తించే నియమనిబద్ధతలకు
అవేగదా అక్షరాలా సోదాహరణాలు.

గడ్దకట్టించేచలిలోనైనా
రోళ్ళను బద్దలుకొట్తించే రోహినీ కార్తె

ఎండలలోనయినా క్షణమాత్రమేనా
యేమరుపాటుకులోనవకుండా
వాతావరణశాఖ హెచ్చరికలనుసైతం
 ఖాతరు చేయకుండా, నిస్స్వార్ధంతో
తమపనిని తాము విధ్యుక్తంగా
చేసుకుపోగలిగిన నిస్స్వార్ధ జీవులుగాదా
ఈ శ్వాసకోశాలు.

మనిషి నైజం మాత్రం  మరెందుకో ఇందుకు భిన్నంగా నడుస్తూ
నలుగురిలోనూ నగుబాట్ల పాలయి వేదనకు గురవుతూ వుంటుంది.
 కార్యాలయాలకుతమ తమ కార్యాలయాలకు చేరుకుని
కేటాయించబడిన కుర్చీలలో కూర్చున్నదేతడవుగా
కళ్లను గోడకమర్చబడిన గడియారాలకతికించి
ఎప్పుడెప్పుడు మనుషులోస్తారా వారితో ఫలహారశాలలకెళ్ళి
పనిని దూరంగానెట్టేసి కాలక్షేపానికే
ప్రాధాన్యతనిచ్చే పరభాగ్యోపజీవులుకదా
మన మానవకోటి.


 పైఅధికారి సెలవుపై వెళ్ళినా,
కార్యాలయంపనిమీద గ్రామాంతరం వెళ్ళవలసివచ్చినా
ఎవరికి వారే యమునాతీరేనన్నట్లుగా కార్యాలయాలు
పనిగండంగాళ్ళతో అధోగతికి ప్రస్థానం సాగించడం మనమెరుగనిదా?
ఇలా శ్వాసకోశాలను చూసయినా మనం శ్రద్ధాళువురై
నేర్చుకుని మన ప్రవర్తనతీరును ఎంతగానో మార్చుకోక తప్పదనిపిస్తుంటుంది. ఊపిరితిత్తులనుచూసయినామనిషన్నవాడు
తనపంధాన్ని మార్చుకోవాల్సిన అవసరమందరెరిగినదే.

సర్వ ప్రాణికో సదా ధ్యానమగ్నులై పనిచేసుకోగలిగితే
మట్టికూడా మాణిక్యంచేయగల పరుసవేదులై
 ప్రభవించగలరనడంలో నాకెలాంటి సందేహం
లేదన్నది నిర్వివాదాంశంసుమా!
***************************************



No comments:

Post a Comment