Sunday, June 14, 2015

విరామానికి తిమిరం---
---------------
అన్ని కిటికీలనూ
ద్వారబంధాలనూ
ఒక్క సారిగా తెరిచేసాను
.ఎంతోహడావుడిగా  వెలుతురు
వేగంగా నన్ను వెన్నంటి వచ్చేసింది.

ఇప్పటిదాకా ఇంతకాలంగా
చెరసాలజీవితాన్ననుభవించిన చీకటి
చిత్రంగా వెలుగును ఒక్కుదుటున వాటేసుకుని
వలవలా ఏడ్చేసింది.
గుహల్లోనో గుయ్యారాల్ల్లోనోమహళ్ళలోనో
మారుమూల ప్రాంతాల్లోనో నక్కున్న వెలుతురు
అధాటుగా ఆనందంతోముఖాన్ని విప్పార్చుకున్నది.

ఎంతధైర్యమోగదా ఈ చీకటికి
ఒక్కతేఒంటరిగా బేలతనాన్ననుభవిస్తూ
విసిగి వేసారిన దాఖలాలు స్పష్టంగా
దాని ముఖ కవళికల్లో ద్యోతకమయింది.

ఏమయితేనేం ఇంకా నయంగదా
ఇప్పటికయినా చెరసాలజీవితాన్ని
చిత్తగించమని చెప్పి చిర్నవ్వులతొ
వెలుతురును గాఢంగా కౌగలించుకుని
ఏకధారగా కన్నీటిని దాని సరీరాన్నంతటినీ
ఆమూలాగ్రంగా అభిషేకించింది.
వెలుతురు ఎప్పటికయినా మెలుకొల్పుతూ
ప్రభాతగీతం పాదితేనేగదా
తిమిరానికి పవళింపుసేవకు సమాయత్తమయేది.
నిద్రాణంగానయినా నివురు గప్పిన నిప్పుగానయినా
నిష్క్రమించే చీక టి ని అభినందించడంతప్పెలా అవుతుంది?
----------------------------------------------------------------- 14-6-15

No comments:

Post a Comment