Sunday, June 14, 2015

మట్టి,మనిషి-సంతకం
-------------------------మట్టిమహిమాన్విత
పుట్తిన ప్రతిప్రాణికీ
పుణభూమిగా ద్యోతకమౌతుంది.
గిట్టినప్పుడదేనేల
వట్టి మౌభూమిగా దర్శనమిస్తుంది.

మట్టి మాYఅలమరాఠీ కానేకాదు.
మనసెరిగిమసలుకునే మాతృస్వరూపం.
విత్తిన ప్రతివిత్తునూ
విస్తరించేదిశగా సమ్రక్షిస్తుంది.
కోతకొవ్చ్చేసమయానికి
కడుపులోదాచుకుని సమ్రక్షిస్తుంది.

మట్టంటే సేద్యగాండ్రకళ్ళలో
కాతిదీపాలనువెలిగిస్తుంది
అమ్మాయిపెళ్ళి,అబ్బాయిచదువులపై
భయాందోళనలనుమలిగిస్తుంది.
ఒడిదుడుకుకులతో సాగేజీవితాలకు
చక్కని దిగుగుబడినందించి సహకరిస్తుంది.
ఓరిమిని ఒకితసాయంగా నేర్పిస్తుంది.
సాఫీగా సాగేజీవితాలకు
సన్మార్గగామియై సం రక్షిస్తుంది.
మట్తిమీద నమ్మకంతో సంతకం చేసిన మనిషిని
మహిమాన్వితునిగా తీర్చిదిద్ది
మాననీయమైన మనీషిగా రూపొందిస్తుంది.
----------------------------------------

No comments:

Post a Comment