Thursday, April 30, 2015

మూడు యాభైలు--? ===============రావెల అతడొక మేరు శిఖరం మహొన్నత మైన ప్రస్థానానికి నాందీ వచనం. అతడొక అగ్ని శిఖ అట్టడుగువర్గాల గుడిసెల్లో నిరంతరం వెలిగే అఖండదీపం. అతడొక సిరి సిరి మువ్వ చదువరుల గుండేల్లో చిరు దరహాసాల నాట్యం. అతడొక మహాకవి మంచికీ మానవత్వానికీ ప్రతిబింబించే వదన ముకురం. విప్లవ సాహిత్యానికి అతనొక అంతుబట్టని విదూషకుడు నరనరాల్లో నవ్యతను వొలకబోసిన హరోo హర మంటూ తిరిగే జగన్నాధ రధచక్రం. రెండు శ్రీలు ద్గరించి మూడు పెగ్గులు బిగించి మూడు యాభైల కీర్తినార్జించిన కిరీట ధారి. ఒక శతాబ్దానికి మాత్రమే పర్రిమితంగాని భజగోవింద శ్లోకం =====================30-4-15
జన్మదినజగదేక కవితామూర్తికి== --------------------------------రావెల ఆకాశంలో నిప్పులు జిమ్మే అగ్ని కెరటం నేలకు రాలిపడుతుందని ఎంతగానో భావించాను నా ఊహ ఊరికే తుస్సుమంది, మహా ప్రస్థానం మధ్య దారిలోకొచ్చి నిర్జీవమై నిలబడుతుందని ఆశావహంగా ఎదురు చూసాను కనీ అది నిరాటంజంగా సాగిపోయి నన్ను నిరాశా నిస్పృజలకు నిండా మునిగిపోయేలా జేసి నిష్క్రమించంకుండా ఉండిపోయింది. ఈశతాబ్దం నాది అన్నవాడు అక్కడికే పరిమితమై పోతాడని ఎంతగానో ఆశించి భంగపడి కృంగి కృశించిపోతున్నాను, జనహృదయ విజేతగా అధోజగత్సహోదరులకు వెన్నంటి అనవరతం నిలిచే కవిగా రవిగా కన్నులముందే కలకాలం ప్రభవించే ప్రతిభా శాలిగా ప్రతి ప్రభాతాన ప్రభవించే ఉద్యమ గీతంలా నినదిస్తున్న సిరి సిరిమువ్వకు స్నిగ్ధ కవితా సూర్యునికి నీరాజనాల విష్పులింగం. ====================================

Wednesday, April 29, 2015

విన్నపాలు వినవలె--- -------------------రావెల ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ నేను పేద్ధ ధనవంతుడను కావాలని నాకు దుగ్ధ. అదుగ్ధతీరేదాకా నా విషయాలేవీ పట్టించుకోవద్దుసుమా!! పరమాత్మా! అప్పటిదాకా ఈ అమాయకత్వంతో నిండిన ఈజగత్తునంతటినీ అంతమొందించకుండా సమ్రక్షించు స్వామీ! నేను యశోవంతుడనై విలసిల్లేదాకా శాంతి సహనాలతో అసూయారహితంగా ఈ లోకాన్నంటినీ కాపలా కాస్తుండు. సర్వ కాల సర్వావస్థలలోనూ నాకవితాసంపుటి దిగ్దిగంతాలలో ఉత్తమమైనదిగా గుర్తించబడేదాకా ఈ ప్రపంచాన్నంతటినీ అజ్ఞాతమైన అంతర్యుద్ధాల పాలుకాకుండా నీవే కొమ్ముగాసి సం రక్షించు. ఒ ఆదిమధ్యాంతరహితుడా!! అందరినీ అత్యంత స్వల్ప వ్యవధిలో ఐశ్వర్య వంతులను గావిస్తానని ఎన్నికల సమ్రంభంలో నాలుక్కరుచుకుంటూ వాగ్దానం చేసి వున్నానుగనుక నేనే వారికి ప్రజాప్రతినిధిగా దశాబ్దాలపాటు కాణీ ఖర్చుగాకుండా వాగ్దానల ధనప్రవాహంలో వారు మునిగితేలుతూ వుంటూ నా పెరుగుతున్న ఆస్తిపాస్తుల మీద కన్నెర్ర జేయకుండా జగత్తు ఈలోపు శిధిలమై ఖిలం కాకుండా సం రక్షించు. ఈలోకంలో నానాటికీ పెరిగిపోతున్న అసంతృప్తి సెగలు నన్ను తాకకుండా నీ ప్రేమామృత వర్షంలొ జనమంతా తడిసి ముద్దయేలా ఆశీర్వదించు. భగవంతుడా తప్పో ఒప్పో తెలియదు గానీ ఉదయకాంతులతో వనాలూ పొలాలూ మాకు నిత్యావసర వస్తువులను పందించె కృషీవలురంతా ఆనందానికి మరో పేరుగా నిలిచేదాకా వారి సుఖ సంతోషాలు ఉద్యమ గీతాలుగా పరిణమించకముందే నా ఈ చిన్ని చిన్ని కోరికలన్నీ క్షణాల్లో నెరవేర్చబడేలా నువ్వు నీఅనుచర గణాలకు అతి జరూరుగా ఉత్తర్వులను అందించేలా ఆదేశించు. [ఓఅంగ్లకవితకు స్వేచ్చానువాదం]

Tuesday, April 28, 2015

ఇదాకవిత్వం?--ఇదేనా కవిత్వం!!!
--------------------------------రావెల.
కవిత్వం కలంలోకి ప్రవహించడమేకాదు
కన్నీటి ప్రవాహామై కదిలిస్తుందనీ
ఇప్పుడే తెలిసొచ్చింది.

కవిత్వం మరణాన్ని నిర్వచిస్తూనే
మరణించిన వారికి అభిమానుల తరఫున
 సానుభూతి సంద్రమై
గుండె గుండెకూ ఉప్పెనల ఎగసి పడుతుందనీ
ఇప్పుడిప్పుడే గమనానికొచ్చి గర్వంగా నిలిచింది.


కవిత్వం శుద్ధ జలంలా ప్రాణా ధారమై
కొందరిని అమృతోపమంగా నిలబెట్టడమే కాదు
సాగరమధనసమయంకో జగన్మోహినిగా రూపుదాల్చి
రాక్షస ప్రవృత్తికి మంగళంపాడేందుకూ ఇతోధికంగా
సహకరిస్తుందని ఓ అవగాహన కలిగి ఆనందమై వికసించింది.

కవిత్వానికి  అనుపానాలు అంకిత భావమై నిలవడమేనని
ఎదుటి ప్రపంచాన్ని అత్యంత సన్నిహితంగా ముంజేతికంకణమై
దర్శింపజేయడమేనని అర్ధమవడం ఆలస్యమైనా  అమృతగుళికలా
ఆరోగ్య మహాభాగ్యానికీ మానసికంగా ఆదరువై నిలుస్తుందని
సోదాహరణమై శుభంకరమై శోభాయమానమై గెలుస్తుందని అర్ధమయింది.


అంతరాంతరాలలంలో ని అట్టడుగుపొరల్లోని అంత: స్సీమల అంచుల్లో
ఆణిముత్యంలా ,అమూల్య రత్నంలా, కవిత్వం ప్రకాశిస్తూ
ప్రవర్ధమానమై ప్రజ్వలిస్తూ  ప్రయోజనకారియై ప్రభవిస్తుంది.

======================================
కవిత్వం కలంలోకి ప్రవహించడమేకాదు
కన్నీటి ప్రవాహామై కదిలిస్తుందనీ
ఇప్పుడే తెలిసొచ్చింది.

కవిత్వం మరణాన్ని నిర్వచిస్తూనే
మరణించిన వారికి అభిమానుల తరఫున
 సానుభూతి సంద్రమై
గుండె గుండెకూ ఉప్పెనల ఎగసి పడుతుందనీ
ఇప్పుడిప్పుడే గమనానికొచ్చి గర్వంగా నిలిచింది.


కవిత్వం శుద్ధ జలంలా ప్రాణా ధారమై
కొందరిని అమృతోపమంగా నిలబెట్టడమే కాదు
సాగరమధనసమయంకో జగన్మోహినిగా రూపుదాల్చి
రాక్షస ప్రవృత్తికి మంగళంపాడేందుకూ ఇతోధికంగా
సహకరిస్తుందని ఓ అవగాహన కలిగి ఆనందమై వికసించింది.

కవిత్వానికి  అనుపానాలు అంకిత భావమై నిలవడమేనని
ఎదుటి ప్రపంచాన్ని అత్యంత సన్నిహితంగా ముంజేతికంకణమై
దర్శింపజేయడమేనని అర్ధమవడం ఆలస్యమైనా  అమృతగుళికలా
ఆరోగ్య మహాభాగ్యానికీ మానసికంగా ఆదరువై నిలుస్తుందని
సోదాహరణమై శుభంకరమై శోభాయమానమై గెలుస్తుందని అర్ధమయింది.
------------------------------------------------------------------------------------

Monday, April 27, 2015

అవగాహనా రాహిత్యంలో---------
--------------------------రావెల.
************************************


మనకు తెలిసినంత పరిజ్ఞానంలో
భూమి గుండ్రమైందని చదువుకున్నాం
కానీ తీరా చూసే సరికి
బల్లపరుపుగా వుంటుందని గ్రహించాం.
మన జ్ఞానేంద్రియాలను మనమే అప్పుడు
అనుమానించి అవమానించాం.

సమస్త సృష్టినంతా ఔపోసన పట్తామని భ్రమపడ్డాం..
కానీ ఈ చిన్న విషయాన్ని ఇట్టే గుర్తించలేకపోయాం.

నేనుధరణీతలాన్ని  కలుసుకున్నప్పుడు
పరమాత్ముని ప్రక్కకు పెట్టిమరీ వచ్చాను.
కానీ ఆక్రోశింపజేసే ఆకలినీ
తీర్చుకోలేకపోతున్న దాహపు గొంతుకనూ
అలాగే అవగాహనా రాహిత్యానికే వదలవలసి వచ్చింది.
అప్పుడనిపించింది--భగవంతుడు నిరాకారుడూ, నిర్గుణుడైతే
ఆకలీ దప్పికా చరాచరమౌ సృష్టిలో అనంతమూ అవిశ్రాంతమూ అని
అర్ధమవడానికి ఆట్టే సమయమూ సందర్భమూ అవసరంలేదని.

[ఓ ఆంగ్లకవితకు అనుసృజన]
------------------------------------------------------------

ఆభిలాష
--------------

నిన్ను స్పృశించకుండానే
అనుభూతి సారాన్ని గ్రోలాలనీ
నాలుకతో తడపకుంజ్డానే
నీ అధరామృతాన్ని
 రుచించుకోవాలనీ

ఊపిరితిత్తుల సాయమడగకుండానే
నీసాన్నిహిత్యంలోశ్వాసించాలనీ
పరిమళసౌరభాన్నంతటినీ
నీ కుసుకోమలమైన తనూలతపై
భ్రమరం వాలిపోకముందే చేరుకోవాలనీ
ఘ్రాణేంద్రియాల సాయమడగకుండానే
శబ్దాలనన్నింటినీ స్పష్టంగా వినాలనీ

పశ్చాత్తాపంతో పనిలేని
ప్రాయశ్చిత్తం తో తృప్తిపడాలనీ
ప్రాణంలేకుండానే జీవనం
శ్వాసించకుండానే
 గుండెను ఊప్రితో అనునిత్యం నింపాలనీ
సాగించగలగాలనీ
మృత్యు ముఖం చేరుకోని విధంగా
నీ సన్నిధిలోనే సమాధిస్థితి నందాలనీ
నాలో చిరంతనంగా ఉప్పొంగుతున్న అభిలాష.
-----------------------------------
[ఓ ఆంగ్ల కవిత చదివాక]



పాపం అక్కు పక్షులు=== రావెల
---------------------------------

ఏమిటీ ఇక్కడ మంచెలమీద పచార్లుజెస్తూ
పొట్టకొచ్చిన వరికంకులమీద పాలగింజలను
నమిలిమ్రింగుతూ త్రేంచే పక్షిగణం ఎక్కడా
కను చూపుమెరలో కనబడకుందా పోయాయేం?

ఇక్కడ ముక్కారు పంటలుపండించే పొలాలను
రాతికట్టడాలుగా మార్చేయాలని కొత్త ప్రభుత్వం
నవ్యాంధ్రకోసం వినూత్నమైన నిర్ణయంతీసుకున్నాక
ఆప్రాంతలంలో అంతగా ఇక అవసరంలేని ట్రాక్టర్
పరిశ్రమలొస్తాయని ఖాయంగా తెలిసాక
దున్ని వదిలేసిన భూముల్లో దూడబోతులూ గ్రద్దలూ
రాజకీయ రాబందులు తిష్టవేసి రాజలాంచనాలతో
విడిదిగానూ  ఎంచుకున్నాక బ్రహ్మాస్త్రం పడ్ద పిచ్చుకలకు
సానుభూతిగా పక్షి గణమంతా సెల్ఫోన్ టవర్లెక్కి
నిరశన తెలుపుతున్న సామాన్య ప్రజానీకాలకు
సానుభూతిని స్వచ్చందగా ప్రకటిస్తూ మళ్ళీ మీ మొహం చూడమని
మూకుమ్మడిగా తీర్మానంజేసి పడిపోయిన దిష్టిబొమ్మలపైనుంచి
అన్ని దీక్షలనూ విరమించి ప్రక్క రాష్ట్రాలకు
పక్కా ప్రణాళికతో  మహా ప్రష్థానం సాగించి
పరాన్ముఖతతో  నిష్క్రమించాయి.
===========================27-4-15

Sunday, April 26, 2015

ఆమె పాదరక్షలు--
____________________
ఆమె పాదరక్షలు
అద్భుతమైన శక్తి సమన్వితలు.

రాత్రయేసరికి ఆ విడ మంచం క్రిందకు చేరి
సుదీర్ఘంగా ఆ విడలా గుర్రుపెట్టి గురకపెడుతూ
నిద్రపోకుండా రాత్రంతా కాపలా గూర్ఖాలా
కళ్ళప్పగించి చూస్తూ ఆవిడకు మెలకువొచ్చినప్పుడల్లా
అప్రమత్తమై జంటగా మాలానే
జంటకవుల్లా అంటిపెట్టుకుని వుంటాయ్.


ఉదయాన్నే స్లిప్పర్లుగా మారి బాత్రూముకూ


వంటింటి పరసరాలదాకా వెళ్లి గుమ్మం బయయట
ఉద్యోగం కోసం అంతర్వూహం హాలు బయట  ఆశగా
నిరీక్షించే అభ్యర్ధిగా వినయ విధెయతలతో
గది బయత కాపలా కాస్తుంటాయి.

అప్పుడప్పుడూ మేమూ నీతో వస్తామని మేడ మీది గదికి కూడా
ఆమెతోపాటే విహరించి వస్తాయి


బజారుకెడదామంటే రెలయన్సులో డిస్కౌంట్ సేలుకు కొన్న చెప్పులు
గబా గబా తయారయి మేం రెడీ అంటూ ఈలవేసిపిలుస్తాయ్.


మమ్మల్ను కనీసం అమ్మమ్మగారి ఇంటికెళ్లే టప్పుడయినా
తీసుకెళ్ళమని బుంగమూతి పెట్టుకుని ఫుట్ ప్రింట్స్ లో
ఆరొందలకు పైగా పెట్టికొన్న చెప్పులు గుర్రుగాఎదురు చూస్తుంటాయి.

దొంగ భడవల్లారా! మిమ్మల్ను నే ను సరదాపడికొనలేదు
వద్దన్నా బలవంతాన కొన్న
మీ అయ్యగారిఫగ్గర పెట్టుకోండి నా దగ్గరకాదంటూ కన్నెర్రజేస్తింది.
అదృష్టం వాటినే వరించి అమ్మగారు ఇహలోకానికి చెప్పాపెట్టకుండా
వెళ్ళిపోయాక అమ్మాయిగారితో పాటు అమ్మగారి గుర్తుగా వుంటామని
లోహ విహంగమెక్కి జల్సాగా తే వీసా పాస్పోర్ట్ లేకుండానే
అమెరికావెళ్ళి  కులుకుతున్నాయని తెలిసి మిగతా రెండుజతలూ
కుళ్ళికుళ్ళి విచారగ్రస్తలై  అయ్యగారొచ్చినప్పుడు విన్న విస్తాంలెమ్మని
  ఆయనరాకకు వేయికళ్ళతో ఎదురుచూస్తూ స్వదేశ ప్రస్థానంలో భీష్మించుకు కూర్చున్నాయ్.


===============================================================



చాంద్రాయణం
--------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

కనకపు సిం హాసనాధీష్ట యైన
మా ఇంటిశునకం నిరంతరం
మొరుగుతూనే వుంటుంది.
సుప్రభాత సేవలనుంచీ
అర్ధరాత్రి మసాలాదాకా
అనవరతం వాగుతూనే వుంటుంది.

అన్ని అంతరంగాలమధ్యనా
చిచ్చురేపే కధేతివృత్తాలే
ధారావాహికలై
 అత్త కోడళ్ళమధ్యనా
మామా అల్లుళ్ళమధ్యన
అపోహలు రెచ్చగొడుతూ
వేలకొద్దీ వారాలుగా
వేధిస్తూనే వుంటుంది.

విద్వేషాల విపంచిని మీటడంలో
తనకు తానే సాటియని అడుగడునా
సోదాహరణంగా నిరూపిస్తూనే వుంటుంది.


కలవరపెడుతూ
కళవళపరిచే వార్త వినిపిస్తే చాలు
పాచిపళ్ళ దాసరిలా ఆ పాటను
రకరకాల సమయాల్లో తలలు బద్దలుగొడుతూ
తన్నుకు చచ్చేలా దృస్యమానం చేస్తూంటుందిది.


ఒక్క అక్షరాన్నిగూడా సరిగాపలకడం రాని
అందాలలొలకబొసే యాంకరమ్మలు
వంటలూ వార్పులూ చెఫ్లూ
ఇంటింటికీ తయారుచేసే విధానాలను
చూపిస్తూ నేత్రానందం కలిగిస్తున్నారు.

సినిమా విడుడలయిందంటే ఆ దురదృష్టపు క్షణమ్నుంచీ
చిరాకు పెట్టించేలాకార్యక్రమాలను రూపొందించి
ఇంద్రుడు చంద్రుడు మహేంద్రుడంటూ
వారసత్వంగా నటనరాని కధనాయకులతో
కంగాళీ కార్యక్రమాలను రూపొందించి
పబ్బం గడుపుకుంటూ మహిళా కార్యక్రమాలలో సైతం
ఈ అసభ్యకరనృత్యాలనే రెకార్డింగ్ దాన్సుల్లా
విసుగుపుట్టించేలా రూపొందించి ప్రేక్షకులమీదకు
శతసహస్ర రూపాల్లో  సరసంధానం గావిస్తున్నారు.


నేరాలూ క్రైం రెపోర్టులూ
యే నేరం ఎలాచేయాలో ప్రత్యక్షంగా
ప్రసారంజేసి సమాజ ద్రోహానికి
ఇతోధికంగా సాయమందిస్తున్నారు.

మెదడును పనిచేయకుండాజేస్తున్నేఎ ప్రభుత్వం
తన పబ్బం గడుపుకుపోయేలా
మత్తుమందులా కార్యక్రమాలను చేర్చి
ప్రజాద్రొహానికీ నాందీ వచనంగా నిలిచిపోతున్నారు.
 =================================26-4-15



Saturday, April 25, 2015

నేరమూ-శిక్ష
---------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్


మా వూరిలో బందెల దొడ్డివున్నది.
కట్టు తప్పి వచ్చిన పశువులూ
గట్టు దాటి ఇతరుల పొలాలో గడ్డిమేసే
పశువులనూ తోలుకొచ్చి అందులోకి
నేట్టేసి అవి గేటు దాటిరాకుండా
గుదిబండలను మెడకు గట్టిగా బంధించి
 గ్రామ సేవకులు కాపలాగాసేవారు.
 గ్రామాధికారులు వాటియజమాబులు
తగిన జరిమానా చెల్ల్లిస్తేనే
వాటిని దొడ్డిలోంచి విడుదలచేసే వారు.


ఇప్పుడు భూసేకరణ మాయాజాలంలో
పొలాలు పోల్పోయిన వారంతా మతి స్థిమితం
కొల్పోయి అందులోకి తంబలు తంబలుగా వచ్చి చేరారు.

యువతకు కడుపు మండింది సిం హాల్లా గర్జించి
ఆ దుస్థికి కారణమయిన నేతలను అందులోకి తోలి
కాళ్ళూ చేతులూ కట్టిపడేసి మళ్ళీ ఎన్నికలొచ్చి
ఓడిపోయే దాకా ఇక్కడే పడుండని ఆవేశంతో ఆదేశించి
ఎవరిగూటికి వారొచ్చి హాయిగా నిద్రించారు.
==============================

Friday, April 24, 2015

జయ జయహో కవిత్వం-2
=======================

ప్రకృతంటే మనకు
పరిచయమైనదిగా భావిస్తాం.
కొండలూ ,కోనలూ,
చల్లని పిల్లగాలులుల సాయంకాలాలూ,
దూకుతూ పరుగిడే ఉడుతలూ,
గ్రహణాలూ,భ్రమర విన్యాసాలూ
ఇవన్నీ దాని లక్షణాలేకాదు.
ప్రకృతంటే మనం చెవులారా విన్న
కనులారా కన్న  స్వర్గధామం కానే కాదు.
యే లలితకళా వర్ణించనలవిగాని
మహోత్కృష్టమైన శిల్పమది--
దాని అనల్పమైన సాధారణత్వం ముందు
మన విజ్ఞాన భాండాగారం ఎంత అల్పమైనది.
[ఎమిలీ డికెన్సన్ ఆంగ్ల కవితకు తెలుగు సేత]

=================================


సంతోష శరణం---
------------------
బాధే ,  జీవితానికి
పర్యాయ పదంగానో
ప్రతిపదార్ధంగానో
పరిణమించినప్పుడు
కనులకు నిద్ర దూరమై
కలత పెడుతూ వుంటుంది.

రేయింబగళ్ళూ
శ్రమించే
స్వేదాశ్రయులకు
గాఢంగా అదే నిద్ర తన్నుకొచ్చి
తగుదునమ్మా అంటూ కనుకొలకులపైనే
నాట్యంచేస్తూ
ప్రభాతాన రెల్లుపూల కాంతులు
భుజంతట్టిలెపేదాకా
ప్రక్కమీదనుండి కదలకుండా
కట్టిపడేసి
కంటికి రెప్పలాకాపాడుతుంది.


మనిషికీ,మనసుకూ క్రమేపీ
బంధం తెగిపోతున్నప్పుడు
జీవాతువే నిర్జీవమై
నిరాశా నిస్పృహలను
 నిండుకుండలుగా జేసి

ముఖద్వారం ముందు
 గుంభనంగా నిలిపి
నిరాశ్రయురాలిగా నిష్క్రమిస్తుంది.

కలత బారిన మనసుకూ
కలలుగనే మనిషికీ
ఆత్మీయతానుబంధం అన్యోన్యంగా
కొనసాగుతున్నాంత కాలం
అమృతం, రాత్రీ పగలూ
వైవిధ్యం చూపకుండా వర్షిస్తూ
నిత్య వసంత శోభను వాకిలిముందు
తోరణాలుగా కట్టి ఆ ఇంటిని నిత్యహరితనుగాజేసి
శుభాశీస్సులనందిస్తూ
సుతారంగా నిష్క్రమిస్తుంది.
---------------------------------------

Wednesday, April 22, 2015

ప్రతీక్ష------
==============
నువ్వుంటే ఎంత బాగుండేదో
అని ప్రతి క్షణం ప్రతీక్షగా
ఎదురుతెన్నులతో నిరీక్షిస్తుంటాను.
ఆగకుండా దగ్గు తెరలుగా వచ్చి బాధిస్తున్నప్పుడూ
అప్పుడప్పుడూ వచ్చే జ్వరమైనా ఒక్కోసారి
ససేమిరా తగ్గనని మొండికేసినప్పుడూ
రావుగారూ మీరు బీ పీని మధుమేహాన్నీ
వెనువెంటనే నియంత్రించాలని వైద్య ద్యశిఖా మణులు ఆదేశించినప్పుడూ
నువ్వేగనుక నా ప్రక్కన వుండి వుంటే ఎంత బాగుండునోనను
చాలాసార్లు అగణితంగా చెవుల్లో రింగుమంటూ
కలవరపెడుతుంది మనసు
 నువ్వే గనుక ఉండుంటేఎంత బాగుండునో అని,కనుకొలకుల్లోనీరు అడ్డొచ్చినా
నీ నగుమోమే నన్ను ముందుకు నడిపిస్తున్నదన్న మాట
మాత్రం నిరభ్యంతరంగా అక్షర సత్యం సుమా!!


నీ మనుమరాలు అన్విత మొన్న వాళ్ల ఇంటికెళితే
తాతా!! ఈసారి మనం ఇండియాకెళ్ళినప్పుడు అమ్మమ్మను తెద్దాం
అక్కడ ఒక్కతే ఎందుకు పాపం--నువ్వు తాంతి[కాంతికి తన పలుకు బడి]మామ దగ్గరుంటే
తను మాదగ్గరుంటుందిలే తాతా!!  అని అనునయంగా చెబుతున్నప్పుడు.

ఇంకోమనుమరాలికి [ఊహంటూ తెలిసి రాకుండానే నువ్వు నిష్క్రమించావులే] శ్రీ  సం హిత   ఫొటొలొ ఉన్న  నిన్ను చూపి నానమ్మ ఎక్కడుంది ? అని చి ట్టి  చేతులను ప్రశ్నార్ధకంగా తిప్పుతూ అడిగినప్పుడూ
నువ్వు ఆఖరి సారిగా నీ పెద్ద   మనుమడు అనీష్ అను  మాణిక్యాణ్ణి [ప్జోనులోనే]  "నేను నిన్ను చూసి గర్వపడుతున్నానురా1  కన్నా !!"  అని నీసందేశాన్ని ఆసుపత్రి మంచం మీదనుంచేఅందిస్తున్నప్పుడూ
ఇంత సంతో షాన్ని వదిలి ఎలా వెళ్లగలిగావా?  అని ఆశ్చర్య పడుతుంటాను.

నీ పెద్ద మనుమరాలు శ్రీశ్రిత సినీ ప్రముఖుల ఎదుట పాడిన
'తిరు తిరు గణనాధా' పాట విని "ఇది మన ఇంటిపేరు నిలబెడుతుందనీ"
అశీర్వదించిన నీవు  ఆ ముచ్చట తీర్చుకోకుండానే  ఇహలోకానికి వీడ్కోలు
  చెబు తావని మేము అస్సలు వూహించలేకపోయాం.

"వాడేడిరా పైకి తీసుకు రాలేదేమిటని ప్రణద్ ను గూర్చి వాకబు చేసి ఆసుపత్రిలోకి వాడిని అనుమతించలేదని తెలుసుకొని అయితే నేనే దిగివస్తానని చెప్పికూడా
 నీ మాట నిలబెట్టుకోకుండానే అందరినీ వదిలిపెట్టి  హఠాత్తుగాపైకెగిరి ఊర్ధ్వలోకాలకు దూసుకెళతావని  ఎవ్వరం ఊ   హించ  లేకనే పోయాం.

అం దుకే ఆఖరు సారిగా వినమ్రుడనై విన్నపం చెవిదగ్గా వినిపిస్తున్నాను.
ఒక్క సారి నీ బంధు కోటినంతటినీ పరామర్శించగలవన్న అత్యాశతో
  కన్నీటిని కలంతో నింపి వేడుకగా ఈ కవితను గిలికి హృదయపూర్వకంగా    వేడుకొంటున్నాను.

=======================================

యశసార్ధకృతే
==================
కాలమాన పరిస్థితుల దృష్ట్యా
కరగని రాయిలాంటి గుండెలు కలిగిన
బండరాళ్ళలాంటీ మనుషులను
 చూడగలిగాముకానీ
మనసును రాయిచేసుకుని
బ్రదుకునుసాగదీసుకునే
 మనుషులకోసమే
 ఈ నిరంతరాన్వేషణ.

మనసుకూ మనిషి గుండెకూ
జరూరుగా చక్కని  రహదారి
 యేర్పరచగలిగితే
కవిజన్మ ధన్యమైనట్లు.

రాళ్లనుసైతం కరిగించగల
కవితలనల్లగలిగితే
కవితాలోకం కలకాలం
నిత్య జవ్వనిగా శోభిస్తుంది.
పదికాలాలపాటు ప్రయోజనకారిగా
పరోపకార పరాయణత్వంతో
ప్రతిభాసమన్వితయై
రాజిల్లుతుంది.
========================

Tuesday, April 21, 2015

అరాచకీయం-3
------------------
వందేళ్ళపైగా అధికారంచెలాయించిన భారంతో
వట్టిపోయినగేదెలా మిగిలిన పార్టీ కాంగ్రెస్.
రా[హు[లుగాయి చేతిలోపెట్టి యిక విసురుతారట
దేశాన్ని దాని ప్రతిష్టను,కాచుకోండి అదొక పెక్యూలియర్ కేస్.
============================================

Monday, April 20, 2015

ధృవపత్రాలు---
===================

కొన్ని మరణాలు
గడపదాటి బయట
పడకుండానే నాలుగ్గోడలమధ్యనే
శాశ్వతంగా సమాధి యౌతుంటాయి.


మరికొన్ని మరణాలు క్షణాల్లోనే
గడపదాటి బయటకొచ్చి
నాలుకలు చాచుక్కూచున్న
కొండ చిలువల్లాంటి చానెళ్ళకు
ఆహారమై అల్లరి పెడుతూటాయి.

ఇంకొన్ని మరణాలు రోజులు గడచినా
అంతరంగాలకే పరిమితమై
ఖ్షోహపెడురూ వేధిస్తుంటాయి.

ఇంకొన్ని మరణాలు కధలుగా మారి
కంచి గరుడ సేవలు చేస్తూ
కాలగర్భంలో కలసిపోకుండా
కరగని శిలల్లా మారి
గుండెలలో గునపాలను గుచ్చుతూ
కలకాలం సలుపుతూ సశెషంగా మిగిలిపోతాయ్.

కొన్ని మరణాలు దేసచరిత్రపుటల్లో
సువర్ణాక్షరాలలో లిఖించబడి
పిల్లలకు పాఠ్యాంశాలై వారి హృదయకవాటాల్లో

చెరగని ముద్రలను వేసి చలన శీలమై చిగురిస్తుంటాయి.


కొన్ని మరణాలు చిరుతప్రాయంలోనే సంభవించి

చిరకాలం బంధువులందరి గృహాల్లో ధు :ఖ సముద్రాలై
జీవ ధునుల్లా అప్పిసెం ప్రవహిస్తూ కత్తిజాట్లకన్నా
నలమైన గాయాలను చేసి కలతపెడుతూ కనులు మూతపడనివ్వక
బాధపెడుతూ వుంటాయి.




కొన్ని మరణాలు చికిత్సామందిరాలకే పరిమితమై
పురాతన గ్రంధాల్లోని చిరుగుతూమిగిలిపోయిన పుటల్లా
రహస్యపత్రాలుగా మిగిలిపోయి అసమర్ధ నారాయణీయంగా
హంసపాదులువేస్తూ వదంతుల్లా వ్యాప్తిజెంది వక్ర మార్గంలో

వంధ్యలుగా మిగిలిపోయి శాశ్వతత్వాన్ని సంపాదించుకుని
వైద్య శాస్త్రపు నీతి సూత్రాలకేమాయని మచ్చలుగా మిగిలిపోయి
కళంకాలుగా కనబడుతూ మిగిలిపోయి శేష ప్రశ్నలుగా సశేషమౌతుంటాయి.
++++++++++++++++++=================================







ఒకటి:
---------
అతడు బ్రదికినన్నాళ్ళూ
కలిమిబలంతో కాలాన్ని
 నెట్టుకుంటూ వచ్చాడు.
కాకులన్నీ పిట్టగోడలమీద
సమావేశమై సామూహికంగా
ఎంతగా అరిచి గీపెట్టినా
అతను వాటివైపు మొహం
 త్రిప్పికూడా చూడలేదు
సరిగదా ఎంగిలిచేత్తోకూడా
వాటిని తోలకుండా జాగ్రత్త పడ్డాడు.

అందుకేఅతను కీకారణ్యంలో
 దిక్కులేనిచావుచస్తే
దూడలూ రాబందులకూ కబురంపి
కాకులన్నీ నిరశన తెలియ జేసాయి.
అతిక్రూరంగా నాలుగురోజులపాటు
దూడలూ రాబందులూ
 అతని దేహాన్ని  నమిలిమింగాయి.

రెండు:
-------------
అతడు కలవాడుకానేకాదు
యేపూటకాపూటగడిస్తేచాలని
కలలు మాత్రమే కంటుంటాడు.
ఎవరికీ అతను అన్నంపెట్టలేకపోయినా
ఎవరినోటిదగ్గర కూడునూ
 లాగేసుకున్నాడన్న అపవాదు అతనిమీద లేదు.
అతడుమరణించాక
అతని ఉత్తరక్రియలు నామమాత్రంగానే జరిగినా
కాకులన్నీ మూకుమ్మడిగాజేరి
అక్కడపెట్టిన ఒక్కోమెతుకునూ మహాప్రసాదంగా
కళ్ళకద్దుకుని మరీ తినివెళ్ళిపోయాయి.
మూడు:-
___________
అతను మరణించాడు.
అతని ఆస్తిపాస్తులన్నీ అక్షరాలా
అతను అభిమానించినవర్ణ సముచ్చయమే.
అధోఅగత్సహోదరులపైనే ప్రాణం నిలుపుకుని బ్రదికే వాడు.
ఆకలి కేక ఎక్కడ వినపడినా ఆకాశంనించి
ఊడిపడుతున్నఉల్కగా  మరుక్షణమె అక్కడ వాలిపోయే వాడు.
అవశ్యం  వారిని  ఆదుకోవాలని  తపన పడే వాడు.
తనసంపాదనలొతనకు తోచిన సహాయాన్నందిo
ప్రచార సాధనాలకు దూరంగా జరుగుతూ
ప్రక్కకు తప్పుకుని వెళ్ళేవాడు.
అతడు మరణించాక
పూలన్నీ గుత్తులు గుత్తులుగా ఎగిరొచ్చి
అతనికిసన్నిహితంగా వాలిపోయాయి.
కొకిలలుప్రభాత గీతాలు పాడి అతన్ని మేలుకొల్పాలని
విశేషంగా శ్రమించి వెనుదిరిగి వెళ్ళాయి.
సంధ్యాదీపాలు అతనిదగ్గరగా వెలగడం మొదలెట్టాయి.
అస్తమించేసూర్యుడుకూడా అతదు నిష్క్రమించాకె
పడమటి కొందల డిసగా పయనం సాగించాడు.
---------------------------------------------------  21-4-15

ప్రక్క వూరిలో పిడుగు పడిందట
మా వూరు వూరంతా అప్రమత్తమయింది
తమ ప్రక్కనే పిడుగు పాటయినంతగా
భయవిహ్వలమయింది.

ప్రక్క నగరంలో బస్సు ప్రమాదమట
మావెనుకనేజరిగినంతగా
భయకంపితులమై వణికి పోయాం.

ప్రక్క రాష్ట్రంలో తీవ్రవాదులపై కాల్పులు
ఇక్కడనేతలంతా నిరశనవ్రత దీక్షలతో
అల్లకల్లోలాలను సృష్టించారు.
ప్రక్క దేశంలొ వర్ణ వైషమ్యాలు పొటమరించి
అక్కడ అంత  కలహాలు జరుగుతుంటే
ఇక్కడ  ఆ మతస్తులంతో  తెగబడి యుద్ధాలు
ఇక్కడ దేశభక్తులలో కలవరం కలిగించింది.

మన వూరిలో మన సరిహద్దుల్లోనే మనపొలాల్లో
ఆడపిల్లలపై అకృత్యాలూ అరాచకాలూ
ఇంతజరుగుతున్నదని తెలిసినా
దున్నపోతుమీద జడివాన కురిసినట్లే
మనం మౌనం వహించడం కిమ్మిన్నాస్తిగా కూర్చోడం
దేశ భక్తా? దేహం పై వ్యామోహమా?
నిరాసక్తతేనా?  మనం తెలిపే నిరశన--
========================================
కావ్యావతరణం--
-------------------
నీ ప్రతినవ్వుతోనూ
ఉషోదయం కావాలి
నీవు జడలొ ముడుచుకున్న
 ప్రతిమల్లె పూవులోనూ
రసోదయం సిద్ధించాలి.

నీవు చిందించే అన్ని దరహాసాల్లోనూ
శృంగార కళాపూర్ణోదయం సాక్షాత్కరించాలి.


మను చరిత్రంతా మన చరిత్రగా
.
దినదిన ప్రవర్ధ మానమై భాషిస్తూ శోభించాలి.
----------------------------------------------------
నిరవధి సుఖదా-------
---------------------
ఎదురుతెన్నుల్లో ఎంత హాయి ఉందో అంతకుమించిన ఆవేదనా
 అందులోనే మిళితమై వుంటుందని తెలుసుకున్నాను.


ప్లాట్ ఫార్మ్ దాటివెడుతున్న బోగీలవంకా
అది పరుగెత్తిన ఇనుప బద్దీలవంకా
ఎంత ఆశగాచూసినా ప్రయోజనం మాత్రం
శూన్యమనే ఇట్టే గ్రహించాను.

మనసు అడుగుపొరల్లో దాచుకున్న అభిమానం
కనుకొలకుల్లోకి నీటిని దట్టిస్తుందని తెలిసి తెలిసీ
ఆ ఎదురుచూపులకోసమే క్షణాలనూ గంటలనూ
రోజులనూ పక్షాలనూ, నెలలనూ ఏండ్లనూ పూండ్లనూ
ఇట్టే ఖర్చు పెట్టేస్తున్నాను.అవి జీవితంలో ఎంత భాగాన్ని
దోచేయడమో దాచేయడమో చేస్తుందని తెలుసుకొనికూడా
యేమీ చేయలేని నిస్తబ్ధతకు లోనయి విలపిస్తున్నాను.


ప్రేమ ఎంతోమధురమని తలచానేగానీ అది చేదుగుళికగానూ

పరిణమిస్తుందని ఇప్పుడు తెలుసుకునినిరామయజగత్తులోకి
నిరవద్యంగా ఒక్కోమెట్టూ క్రిందకు  జారి పడిపోతూ ఆక్రందిస్తున్నాను.

మనిషికీ మనసుకూ మధ్యన ఇంత అగాధమైన అనుభూతి సంద్రందాగుందని తెలుసుకునేలోపే ఆశలనన్నింటినీ
ఆవిరి చేసుకునే దిశను అనాలోచితంగా  ఆవిష్కరింపజేసుకుంటున్నాను.

================================================

గాజు కుండీలో భద్రంగా పేర్చిన
పూల గుత్తిలా కవిత్వం
నవలాడుతూ, నిత్య నూతనంతో
మాలిన్య రహితమై వికసిస్తూ
 కనబడాలి.
అప్పుడే కవిత్వం సమాజహితం
కోరే దిశగా వడి వడిగా
అడుగులేసే గొప్పదనాన్ని
సంతరించుకుంటుంది.
==================
మహోద్యమగీతం
---------------------------రావెల
^^^^^^^^^^^^^^^^^^
మనిద్దరిమధ్యన జరిగే ప్రతి
 సంభాషణలోనూ
నీ ఎత్తిపొడుపులే కత్తిగాట్లకన్నా
ఎక్కువ సలపరంపెడుతుంటాయ్.
మనిద్దరిమధ్యా ఏర్పడే అభిప్రాయ సేకరణలోనే
నీ సలహానే నెగ్గితీరాలనే పట్టుదలే
దౌష్ట్యంగా మారి  నన్ను నీకు దూరంగా
 ఉండడమే మేలేమోనని పదే పదే
హెచ్చరికలు జారీ చేస్తుంది,నా చిట్టిమనసు.
అందుకే అనవసరంగా మన బాగునూహిస్తూ
నీకు ఉచితసలహాలివ్వడంకన్నా అన్ని వేళలా
మౌనాన్నాశ్రయించడమే శ్రేయోదాయకమని
నిర్ణయానికొచ్చి దశాబ్దాలతరబడి యిలా
దశంటూ తిరగని దౌర్భాగ్యంలోమగ్గుతూ
కాలం వెళ్ళదీస్తున్నాను.అందుకే మరోసారినీకు
మన భావి తరాల భవిష్యత్ ను
బాగుపరుచుకోవాలని నీ వనుకుంటే
నానిరంతరమౌన దీక్షకు నీవే
నిమ్మరసాన్నందించి దీక్ష విరమణకు సాయపడాలి.
ఇక్కడ నేను ఎక్కువ,తక్కువలను సున్నితంతంగా
 తిరస్కరించే కొత్త  త్రాసులో మన
వ్యక్తిత్వాలను బేరీజు వేసే పనిలో నిమగ్నమై ఉన్నాను.
నీ కళ్ళెదుటే మనం గుడ్దిగా మన అహంభావాలను నమ్ముకుని
అమూల్యమైన కాలాన్నీ, తిరిగిరాకుండా మనచేతుల్లోంచి
జారి కాల గర్భంలో కలిసిపోయిన క్షణాలనూ
మూల్యాంకణం చేసుకునే దిశలో దీక్షగా శ్రమిద్దాం.
మన సంతానానికి మనమేదిక్సూచిగా నిలబడుతూ
 గురుతరమైన బాధ్యతగా
ముందుకడుగూవేద్దాం. మన జీవితాలను మనమే
కంటకప్రాయంగా మారుతున్న దిశనుంచి తప్పించి
మార్గదర్శకత్వం చేసే దిశగా ముందుకడుగులు వేసేలా
ఓ గట్టినిర్ణయానికొచ్చి నవ్వులపువ్వుల నదిలో పడవను మునగకుండా
నౌకాయానం చేద్దాం! రా కలసి నడుద్దాం.వేతనాలు
మనిద్దరిమధ్యా పెంచిన వ్యత్యాసాలను క్రమేపీ  తగ్గిద్దాం
మూగబోయి మసిబారిన మనసులను మనమే
 దగ్గరకు తీసుకుని ప్రక్షాళనజేసి
గోముగా , దాన్ని ఉమ్మడి బాధ్యతగా భావించి  లాలిద్దాం!
===================================20-4-15

Sunday, April 19, 2015

ఈమధ్య నాకు కవితకు ఓ చదువరి వ్యాఖ్యానంచేస్తూ వారికియేకవితనైనా పైకి చదివే అలవాటున్నదని ఈ కవిత
శ్రావ్యంగా వినబడిందనారు. చాలా సంతోషం కలిగింది.
వెంటనే నాకు బాల్యంలోని ఓ సంఘటన గుర్తుకొచ్చి అది ఇక్కడ ప్రస్తావించాలని తోచింది. మా స్వగ్రామంలో వెంకయ్యగారని ఓ గ్రామీణ వైద్యుండుడేవారు. ఆయనకు దిన పత్రికతో సహా యేదైనా పైకి చదివేఅలవాటు. అలాగే అపరాధ పరిశోధక నవలలు[అప్పట్లో పావలాకొకటి దొరికేవి.కొమ్మూరి సాంబశివరావు,తెంపోరావు లపేర్లమీద చాలా నవలలొచ్చేవి.కాడిలాక్ కారూ,పైపులోంచి పైకివచ్చే పొగలు అసిస్తెంట్ నందన్ లెదా మరో అందమైన యువతీ
ఇలా సాగే నవలలనూ ఆయన ఇంటి వద్దగానీ లేదా ఆయన  అతుకు[అంటే ఏమిటని అమాయకంగా అడక్కండి.] తీరిగా నరసరావుపే కుర్చీ [ఈజీ చైర్ అనేవాళ్లు అప్పట్లో]
రీరిగా సిగరెట్ ముట్ట్తించుకుని పొగ వదులుతూ చదివే వారు
ఆనవలనో దినపత్రికనో, కానీ ఖర్చులేని కాలక్షేపంగదా అందరూ శ్రవణ పేయంగా ఆ కధాంశాన్ని విని ఆనందించే వారు.ఒచ్చిన చిక్కల్లా అక్కద మధ్యలో వచ్చే శృంగార సన్నివేశాలను కూలంకషంగా చదువుతుంటేనే శ్రోతలైన వారికి సిగ్గు మొగ్గలవుతూ విచ్చుకుని పెదాలు దాటి నవ్వుగా ముసి ముసిగా .రూపాంతరంచెంది బయటకు ఒచ్చేది..ఆ అతుకుమాత్రం నూలుచీరకొంగు అడ్దం

పెట్టుకుని ఆయన వైపు ఓరచూపులు సారిస్తూ పకపకా నవ్వుకునేది.
కన్నీటి కావ్యం
-----------------రావెల
ఉప్పగా ఉన్నా చప్పగాఉన్నా
ప్రతి కన్నీటిబిందువుకూ
సింధువంత  కధ వుంటుంది.

పుత్ర  శోకం యేడిచే కన్నతండ్రి
కన్నీటికి సముద్రమంత
లోతుగా  అగాధమై గోచరిస్తూ
అనితరసాధ్యమై సాక్షాత్కరిస్తుంది.

కన్న సంతానాన్ని  అకారణంగా
అకాలమృత్యువుకు   పోగొట్టుకున్న
కన్నతల్లి కడుపుకోత
బంగాళా ఖాతంకన్నా
బాధాకరమై దిగులుతోనిండిన
మాహాసముద్రమై   ఘో షిస్తుంటుంది


పేదరికంతో ప్రతినిత్యం వేగలేనంతగా సతమతమవుతూ
పిల్లలకు కడుపునిండా అన్నంపెట్టలేని
తల్లి దు :ఖం తరతమ బేధాలతో
సాపత్యంలేకుండా సంతాపంతో ఎగసిపడుతూ
విలపిస్తూ విషణ్ణవదనంతో వేడెక్కుతూ
విహాయసంలోంచి ఊడిపడే జీవనదిలా
విలువైన కాలాన్నంతా విచారంతోనే గడిపేస్తుంది.

ఇంకా సూర్యకిరణాల చురుక్కులను  
స్పృశించే అదృష్టానికికూడా నోచుకోలేక
తల్లి గర్భం నుండే భ్రూణ హత్యకు గురై
పిండం   రూపంలోనే పిండప్రదానం
 పెట్టించుకున్న  శిశువుకోసం
గుండెలవిసిపోయేలా సమకాలీన సమాజాన్ని
దూషిస్తూ దుర్మార్గపు  ఈ కృపారహితపు
 జగతినంతటినీ కడుపారా  శపిస్తూ
సానుతాపం చూపే దిక్కుకూడాకనరాక
సాగరమధనంలో వెలువడిన గరళా న్ని కంఠసీమలో
దాచుకున్న హరుని కన్న అధికంగా ఆక్రోశిస్తుంది.

అమానుషంగా తనమానాన్ని మృగాడి
కామప్రకోపానికి ఎరగామారి కొల్పోయిన
మానధనాన్నీ యశోకీర్తులనూ
తిరిగిపొందలేనన్న దురదృష్టానికి
జీవితాంతం అలిపీఠంపై   సాగిలబడిపోయివిలపించే
అమాయకమైన ఆడపిల్లల  అనుతాపాన్ని
సాధికారంగా మూల్యాంకనంజేసి
ఖరీదుకట్టగల షరాబులెక్కడ?
==========================




నీకూ నాకూ మధ్యన సాన్నిహిత్యమే
సకృత్తుగా మారుతున్నప్పుడు
మానవత్వ విలువలపై సుదీర్ఘోపాన్యాసం వల్ల
సాధించగలిగిన సత్కార్యమేముంటుంది?

నీకూనాకూమధ్యన మౌనమొక్కటే సంభాషణగా
మారినప్పుడు నేనెంత వచోవిలాసాన్ని ప్రదర్శించినా
మృగతృష్ణ వెంట పరుగు లిడుతున్నా వని జాలిపడి
పిడసబారుతున్న నీ  నాలుకపైన
నర్మగర్భమైన అమృతఝరులను వర్షింపజేయాలన్న
తాపత్రయం నామనసు  పడడం వల్ల ప్రయోజనం శూన్యమేగదా!!

==========================================

Saturday, April 18, 2015

ఆనంద హేల
---------------
ఆకుపచ్చని చీరలుగట్టుకుని కొందరు
గులాబీ రంగు వస్త్రధారణలో మరికొందరు
పసుపూ .కుంకుమలను వెదజల్లే కాశ్మీరు
కళికల్లా ఇంకొందరూ
వసంతం ఏర్పాటుచేసిన
పేరంటానికి సంతోషంగా
సమాయత్తమై చిరునవ్వుల దరహసాల చిరుజల్లులతో
పూలు క్రిందపడి పరిచిన రేకల తివాసీ  పై

నయగారాలొలకబోస్తూ
నడచివస్తున్న దృశ్యం ప్రకృతి శోభకే
పరిమళకాంతులు వెదజల్లుతున్నట్లుగా
కనుల పండువై కదలివస్తున్న తృప్తికలుగుతున్నది.
=====================================

Friday, April 17, 2015

సుభాషితం
-------------------

నింగి అంచులను తాకిచూడాలని
నీలోని నిరాశా నిస్పృహలు
ఎగసిపడుతున్నంత కాలం
నీలో చింతచావలేదనీ
పులుపు రుచి ఇంకా సలుపుతూనే
వున్నదని అవగాహన చేసుకో.

కాలంతోపాటు  అమిత వేగంగా నీ కోరికలు
గుర్రాలపై స్వారీ చేయాలని
తహతహలాడుతున్నంత సమయమూ
నీకు తీపిమీద మోజు తీరలేదనిఅర్ధంచేసుకోవాలని
హెచ్చరిక మాత్రమే  అదని సుతారమూ గ్రహించడమే మేలు.

సముద్రాన్ని సమీపించగానే దాన్ని
గజీతగాడిలా లంఘించి స్వాధీనం చేసుకోవాలని
నీలో జఠరాగ్ని జ్వలిస్తున్నంత కాలం
అహంకారానికే నీవు దాసోహమనుకుంటూ
చరిస్తున్నావని మాత్రం గ్రహించి మసలుకో.

కవిత్వపు సంపుటిలోని కవితలన్నింటినీ

శ్రద్ధగా చదవడాం మానేసి వదనగ్రంధ దర్శనంలో
చదవకుండానే ఇష్ట పడుతునట్లు నటిస్తూ ఓ లైకు  ను కొట్టి సంతసిస్తూ సమాధానంగా కృతజ్ఞతలనందుకునే నీవు వరుసగా పుటలు అనాలోచితంగా తిప్పుతూ
అనుభూతి స్రవంతులన్నింటినీ అనాలోచితంగా వదులుకునే
దురదృష్టవంతుడవైన చదువరి మాత్రంగానే మిగిలిపోతావన్న సత్యాన్ని శ్రద్ధగా వంట పట్టించుకోగలిగితే నీ సాహితీ యాత్ర సముల్లాసంగా సాగినట్లని తెలుసుకుని మసలుకో!!
==================================================

Thursday, April 16, 2015

ఏడవకండేడవకండి---
----------------------రావెల
నేను ఒకవేళ ఈలోకాని విడిచి వెళితే
ఆకాశమంతటా నవ్వుల్ని విస్తరింపజేసి వెళతాను.
నీ దారంతటినీ పూచేపూలతో తివాసీలా పరుస్తాను.
ఆసుమాలన్నీ పరిమళభరితమై నిన్ను అనునిత్యం అలరిస్తాయి.
ఈ లోకాన్ని విడిచివెడుతున్నానని దు; ఖపడొద్దు.



రేపుప్రభాత సమయానికలా నామధురస్మృతలతో
మళ్ళేఈ నువ్వు ఈ ప్రపంచంలోకి అడుగిడేలా తగు యేర్పాట్లు గావిస్తాను.


కొంటెగాలి నీ కేశసంపదను ఉయ్యాలగా చేసుకుని ఊగేలా
కొండాకోనలన్నింటినీ బ్రతిమాలి పిల్లగాలులను
మలయమారుతాల్లా పంపవలసినదిగా
విన్నవిస్తాను.
నేనులోకాన్ని విడిచివేడుతున్నానని ఖేదమేమాత్రం పడొద్దు.
నిన్ను గిలిగింతలు పెట్టేలా చిట్టి చిట్టి తుంపరలను
నీ తనూలతికపై నాట్యమాడేలా  వెదజల్లమంటాను.

నీడలా నీ వెన్నంటితోడుగా  నడుస్తూనేవుంటాను.
ఆనాటిమధుర స్మృతులన్నింటినీ అప్పుడప్పుడూ నీ మ్రోలనే ఆవిష్కరించి ఆనందపరుస్తూ వుంటాను.నీవు మైమరచి గాఢంగా నిద్రపోయేలా జోలపాటలు పాడుతూ నీవు మైమరచి నిద్రించేందుకు  నాశాయశక్తులా సాయ పడతాను.
=====================================
ఎండుటాకు
ఎక్కడినుండో గాలివాటానికి ఎగిరొచ్చి
మాముంగిట తిష్ట వేసింది.
చూసిందే తడవుగా దాన్ని
తడిమి తడిమి మరీ చూసాను.
యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ పేరిట
నిన్ననే రెలీజైన సినిమాలో
ముసలి ముడతలను కప్పెట్టిన
మేకప్పులో హీరొ తన కూతురువయసుకూడా ఉండబోని
కుర్ర దాన్ని తడిమి తడిమి తన్మయత్వం చెందినట్టు.

అఖండ జ్యోతిదర్శనం
-----------------


ఈ నగరానికి సూర్యచంద్రుల
దర్శన భాగ్యంతో ససేమిరాపనిలేదు.
అన్ని నగరవీధుల్లోనూ వీధిదీపాల కాంతులు
దగద్ధగమానంగా ప్రసరిస్తూ ఉంటాయ్.
పగలన్నా రాత్రయినా తారతమ్యంలేకుండా
దేదీప్యమానంగా వెలుగుతూనే వుంటాయ్.
విద్యుత్ బోర్డుకు ఆదాయం
సమకూర్చేందుకు ఇతోధికంగా
శాయశక్తులా సహకరిస్తూనే ఉంటాయ్.
==========================


Wednesday, April 15, 2015

అరాచకీయం-2
------------------రావెల.
===============================
పచ్చని పంటపొలాలన్నీ
రాజకీయ ప్రేరణతో
పరశురామ ప్రీతికి
ప్రణాళికలు సిద్ధమయాయి.

రాజధాని నిర్మాణపు పునాదులక్రింద
పచ్చని పల్లె తల్లికలలన్నీ
కనీటివరదల్లో కొట్టుకు పోతూ
భూస్థాపితానికే తీర్మాన మయ్యాయి.
===============================
అరాచకీయాలు=1
------------------రావెల

శ్రీనివాసుల జాబితాల్లో
శిఖరారోహణమొదలయ్యింది
బీదా బిక్కీ జనాలకు
బిస్కట్లు పంచడమె ఇక మిగిలింది.
=======================15-4-15

Tuesday, April 14, 2015

నామావశిష్టం
------------

మనసు మూగనోము పట్టడానికి
సిద్ధమవుతున్నప్పుడల్లా
అంతరాంతరాళాల్లో ఓస్వరం
ముక్తాయింపుగా ఓ తిల్లానానందుకుంటుంది.



దానికి మేమున్నాము తోడన్నట్లుగా
మనసు వాద్య సహకారాన్నందించి
కావలసినంత ఊతమిచ్చి ఊరుకుంటుంది.


చివురు తొడగబోతున్న కలలన్నీ
సిగలో మల్లెలుగ మారిపోతామని
మరీ మరీ చిరునవ్వులు చిందిస్తూ
ఓ ప్రకటనను జారీ చేసి కిమ్మిన్నాస్తిగా
భీష్మించుకు కూర్చుంటుంది.

సమస్యల్లా యుగళగీతం పాడిన వెనువెంటనే
విషాద గీతం పాడవలసిన దురదృష్టం
సంప్రాప్తించినప్పుడేమనసును
 సం యమ నాన్ని కోల్పోకుండా సంబాళించుకుంటూ
 సర్దుకు పొమ్మని జీవితం ఓ సుభాషితాన్ని అటుగా విసిరి
చిత్తగించి వెళుతుంది.చిరంజీవ అంటూ దీవెనలందించి
చిరంతనంగా హృదయగతంగా కొట్టుకులాడుతున్న
శతమానం భవతి అంటూ ఆయుస్షేవీంద్రయే ప్రతితిష్టతి
అని దివ్యమైన ఆశీస్సులనందించి నిష్క్రమిస్తుంది.


నామావశిష్టం
------------

మనసు మూగనోము పట్టడానికి
సిద్ధమవుతున్నప్పుడల్లా
అంతరాంతరాళాల్లో ఓస్వరం
ముక్తాయింపుగా ఓ తిల్లానానందుకుంటుంది.



దానికి మేమున్నాము తోడన్నట్లుగా
మనసు వాద్య సహకారాన్నందించి
కావలసినంత ఊతమిచ్చి ఊరుకుంటుంది.


చివురు తొడగబోతున్న కలలన్నీ
సిగలో మల్లెలుగ మారిపోతామని
మరీ మరీ చిరునవ్వులు చిందిస్తూ
ఓ ప్రకటనను జారీ చేసి కిమ్మిన్నాస్తిగా
భీష్మించుకు కూర్చుంటుంది.

సమస్యల్లా యుగళగీతం పాడిన వెనువెంటనే
విషాద గీతం పాడవలసిన దురదృష్టం
సంప్రాప్తించినప్పుడేమనసును
 సం యమ నాన్ని కోల్పోకుండా సంబాళించుకుంటూ
 సర్దుకు పొమ్మని జీవితం ఓ సుభాషితాన్ని అటుగా విసిరి
చిత్తగించి వెళుతుంది.చిరంజీవ అంటూ దీవెనలందించి
చిరంతనంగా హృదయగతంగా కొట్టుకులాడుతున్న
"శతమానం భవతి అంటూ ఆయుస్షేవీంద్రయే ప్రతితిష్టతి"
అని దివ్యమైన ఆశీస్సులనందించి నిష్క్రమిస్తుంది.
=======================================
















సజీవ శిల్పసుందరులారా--
+++++++++++++++++++++++++++++++
ఆగండి ఒక్క క్షణం!!
మీరు వేదికలనెక్కి
పిల్లినడకలు ప్రారంభించేముందుగా
ఒక్క క్షణం ఆలో చించండి.

ఆకాశo  అంచులు అందుకోవాలని
తపన పడుతున్న తారల్లారా
తరుణొపాయంకోసం !!
తప్పని సరిగా ఎదురుచూడండి.

శీథాకాలంలోమీరు
చిరునవ్వులు చిందిస్తున్నా
మాగుండె ఆచలికి గడ్డకట్టుకుని
ఘనీభవించే అపాయంపొంచివుంది సుమా!!

శరదృతు హేమంతాలలో
సన్నిహితంగా మీరొచ్చి
చలినికూడా మావంట్లోనే
గడ్డకట్టించేభంగిమలు
మాత్రం ప్రదర్శించకండి.

గ్రీష్మం అడుగెడితే గిరిగీసుకుని
మీ నివాసాల్లోనే ఆగిపోకoడి
ఆహుతులైన ప్రేక్షకులపై
అమృతవర్షం కురిపించి
మలయమారుతాలను రప్పించి
వారిని పునీతులను గావించండి.

వర్షర్తువులో దయాసాగరాలై
అధోజగత్సహోదరుల
ఆనవాళ్ళను గుర్తించి
మీకరుణామృతఝరులను
వారున్న దిశగా ప్రవహింపజేసి
అందానికో అర్ధముందని
అక్షరాలా ఋజువుచేయండి.
==========================



సుపాణినీలు
---------------రావెల పురుషోత్తమరావు
------------------------------------------

స్వేదఫలాలను
సౌఖ్య ధృవం   మింగేసింది.
రిక్షా అదృశ్యమై
ఆటో రిక్షా గా అవతరించింది.
-----------------
కులాల జాబితాను
కూలంకషంగా వెదకి చూసాను.
కమ్మరి కుమ్మరి ఎవరంటూ?
పల్లె తల్లిని ప్రశ్నించాను.
-------------------------
పిచ్చుకకోసం
దిక్సూచి లొకి చూసాను
బ్రహ్మాస్త్తాలకు బలయిందని
కంట నీటిని కార్చాను.

-------------------
దర్జీ అంటే అర్ధంగాక
అమ్మ వైపు తిరిగాను
అమ్మ మొహం చూసి
అమ్మమ్మ నాచొక్కాను చూపింది.
----------------------
వడ్రంగికోసం
వూరంతా వెదికాను
ఎక్కడా కనబడక
వెక్కి వెక్కి ఏడ్చాను.

--------------
పీర్ల సావిట్లో ఉండే
మలాం పట్టీ
మస్తాను మృగ్యమయాడూ
కార్పొరేట్ వైద్యంక్
అందరి కళ్ళను మార్చేసింది
----------------

Monday, April 13, 2015

బ్రతికినన్నాళ్ళు భ్రమయుట నీపాలు
మరణించినంతనే మట్టిపాలు 
దాచిన ధనమెల్ల దారాసుతుల పాలు
కడకు నీకాయము కాటిపాలు
కడుపారదినకుండ గడుపుటనీ పాలు
కడకు నీ పిండము కాకిపాలు.
ధర్మమేచేయని పాప కర్మము నీపాలు
నీయస్తులా గంగ నీళ్ళ పాలు.

చావు నీపాలు జీవుడా జమునిపాలు
ఆలు అగచాట్లపాలు నీ వు అగ్ని పాలు
బదికినన్నాల్లు   
శ్రీసాయి భజనజేసి
భ్రమల నందుట మానరా పాడు జీవ
----------------------------------------------
రచన: late>రావెల వెంకట శివసీతారామారావు

Sunday, April 12, 2015

పప్పు చారుయున్ను బాగున్న  కూరలు
నంజుకోను  నదరు నావ   కాయ
తెలుగు ఇండ్ల యందు తెలిసిన స్వర్గము
ఇంతకన్న యేమి ఇంతి  చెప్మ

Saturday, April 11, 2015

రమణీ యార్ధ ప్రతిపాదిత శబ్దం---
----------------రావెల పురుషోత్తమరావు
----------------------------------------------

కవిత్వం గుబాళించడానికి
కలమూ కాగితం మాత్రమే సరిపోవు
స్పందించే హృదయం కావాలి
పాఠకుడి గుండెను ఒడిసిపట్టగల
చేతాళం ముఖ్యంగా అవసరమౌతుంది..


మనిషిని కట్తి పడేయలేని
మౌన ముద్రలు యే మాత్రంచెల్లుబాటుకావు
సమకాలీన సమాజాన్ని
సహృదయంతో విశ్లేషించగల సమున్నతగా
మూర్తీభవించే వీలుదొరకాలి.


భావశబలత ససేమిరా సద్య:  స్ఫూర్తితో
 సహకరించే వీలునందివ్వదు.
పదాలపోహళింపులో ప్రావీణ్యం ఉట్టిపడాలి.
అంత: చేతనతో అవకాశాన్ని
అందిపుచ్చుకునే అనుభవం తోడవాలి.

అప్పుడే సుమా కవిత
పూలపరిమళంలా గుబాళిస్తుంది.

శబ్దానికీ అర్ధానికీ సం యోజనయేర్పడి
శరసంధానపు బిగువు ఇట్టే సంప్రాప్తిస్తుంది.
రమణీయార్ధ ప్రతిపాదితమై ఆ కవిత
చిరకాలం చిరంతనంగా శోభిల్లుతుంది.
==============================
దైనందినం
-----------రావెల పురుషోత్తమ రావు.

ఎక్కడోఒకచోట
ఎప్పుడో ఒక సమయంలో
జీవితాన్ని రాజీ బాటలో
నడచిపొమ్మని అనునయంగా
చెప్పక తప్పడంలేదు.

కుండపోతగా కురుస్తున్న వర్షానికి
పనులు పూర్తిగా మానుకుని బ్రదుకును
వెళ్ల దీయడానికి అందరికీ వీలుకాదుగా!

గొదుగేసుకునో యూరియా విదిల్చిన బస్తాను తలకు
ఆధారంగా పెట్తుకుని తడవ కుండా జాగ్రత్తపడి
పనులను తీరిగ్గా చక్కబెట్టుకోవాల్సిన సగటు జీవితాలను
సాగదీస్తూ సర్దుకు పోవాల్సిన మనుషులమేగదా తప్పదు మరి.


ఎండకన్నెరుగని జీవితాలు కొందరికే సంప్రాప్తిస్తాయి.
నెత్తిన తలపాగా చుట్టుకునో ,చెట్లనీడన సేదతీరుతూనో
మన పనులను మనం వెళ్ళదీసుకోలేకపోతే పొయ్యిలో
పిల్లికదలను పొమ్మంటూ భీష్మించుకు కూర్చునే
ప్రమాదం మన వెన్నంటి అంగరక్షకుడిలా వెంటాడుతూనే ఉంటుంది.

సర్దుకు పోతూ సంతృప్తితో ఒడ్దుకుచేరవలసిన మన బ్రదుకుల్లో
రాజీ పడడం అవశ్యమేగాని రాజీ నామా అన్న పదం
నిఘంటువులో చోటుచేసుకోకపోవడం మనం ఎప్పుడూ
ఎదుర్కొనే సమస్యే కాదనను ! అదే అంతిమ పరిష్కారమా అంటే
సమాధానంకోసం మళ్ళీ ఆశగా ఎదురుచూసే ఆవిడాపిల్లలూ
గుర్తుకొస్తూ నాకళ్ళను కన్నీటి సముద్రాలుగా చేసి
స్థాణువుగా నిన్ను నిలబెట్టి మౌనానాశ్రయించడమే మేలని
హితవు పలుకుతూ వేమన సూక్తినో సుమతి సుభాషితాన్నో
ఉదాహరిస్తూ ఉప్పొంగి పొతారు నేను తలనాడించనంతవరకూ
ఆత్మీయంగా అనుబంధాల వలలో చుట్టెసి బలవంతంగా
నవ్వును నా అంతరంతరాల అట్టడుగునుండి కక్కిస్తుంటారు.
ఇదే జీవన సాఫల్య పురస్కారమబుకుని పొంగి ప్రవహిస్తూ
కాలం వెళ్ళ దీయడానికి శ్రమైక జీ వన సౌందర్యం
రుచు చూసే దిశగా మరలా పరుగును లంఘించుకుని
ఉక్కిరిబిక్కిరయిపోతూ ఉచ్చ్వాస నిశ్వాసాలను
నియంత్రించుకునే పనిలో నిండుకుండలా నిమగ్నమై వెలిగిపోతుంటాను.
==================================================





Friday, April 10, 2015

ప్రణయానురాగ పంచ రత్నాలు
----------------
 వసంతాగమంలా నీవు ఆగమించావు
  తుమ్మెదలూ,మలయమారుతాలూ,
పూలతెమ్మెరలూ, ఇలా ఎన్నింటినో అందించావు.
  పాపిష్టి మనసున్న వాళ్ళతో
మిగతా భూతలన్నంతా నింపినా
స్వర్గానికి దీటుగా ఉన్న ఇక్కడే సర్దుకుపోతాను.
------------
నువ్వొస్తావని తెలిసినప్పటినుంచీ
కుండీలో పూలన్నీ
మరింత పరిమల భరితంగా గుబాళిస్తున్నాయ్.
మన అనురాగ బంధం మాత్రం
అలుపెరుగకుండా నీకోసం ఎదురుచూస్తూ
తన్మయత్వంతో తైతక్క లాడుతుంది.
-------------------
నీవొస్తావన్న వార్త తెలిసాక
వసంత శోభతో ఇల్లంతా కళకళలాడుతుంది.
ఇక కూని రాగాలు పాడుకుంటూ
గూట్లోని పక్షులన్నీ కువకలాడుతూ
కుశలంగా విహంగయానం చేస్తున్నాయ్.
---------------
నేనతన్ని ప్రేమించానని
ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
అతన్ని ప్రేమించడంలో తీయటి
ఆనందాన్నభవిస్తున్నాను.
ఈ దివినీ భువినీ గానీఇంతసౌందర్య సీమలుగా
మలచినందుకు కృతజ్ఞత తో
ఇక్కడే కలకాలం జీవించాలని నిర్ణయించుకున్నాను.

----------------------------
అద్భుతమైన ఆనందాన్నందించిన
వసంతానికెంత రుణపడివున్నామోమనందరం
ఇంత సంతోషాన్నితనలోనింపుకున్న
హృదయన్ని వదలలేనూ దాన్ని
వదిలించుకోనికించను.
నీ సలహా ఏమిటో చెప్పు ప్రణయినీ!!


[ఎమిలీ డికిన్సన్ ఆంగ్లకవితలకు అనుసృజన]

తస్మాత్ జాగ్రత్త
-----------------------రావెలపురుషోత్తమ రావు.
--------------------------------------------------
మహిళలూ అప్రమత్తం అయిపోండి
పొద్దస్తమానం పొలాల్లో  చెమటోడ్చి
కాయగూరలు పండిస్తే ప్రతిఫలం బహు స్వల్పం.
అదే మన నగర వీధిమొదల్లోనో చివరనో
 ప్రదర్శితమయే వ్యాపార ప్రకటనలకు
కాషాయం రంగు చీరగట్టి
అంబానీకో మరో గన్నాయిగాడికో
లాభం మూటలు పంచిపెట్టండి
మా పార్టీ ముఖ్య కార్యకర్తలుగానో
భారత దేశ ప్రతినిధులుగానో
దేదీప్యమానంగా వెలిగిపొండి.
మన ప్రధానిగారికి కృతజ్ఞతలో
హార్దిక ధన్యవాదాలో,  చెప్పడం మాత్రం మరువకండి.
============================================9-4-15
రావణ కాష్ఠంలా కాలుతుంది
కాశీలో కాలుష్యపు సమస్య
కోట్లు ఉ ఖర్చు జీసినా
కోలుకో దీ   వ్యవస్థ.
--------------------

నియోజకవర్గం మాత్రం దేశ ప్రధానిదే
నియంత్రణకు నడుంకట్టే నాధుదే కరువు.
తస్మాత్ జాగ్రత్త
-----------------------రావెలపురుషోత్తమ రావు.
--------------------------------------------------
మహిళలూ అప్రమత్తం అయిపోండి
పొద్దస్తమానం పొలాల్లో  చెమటోడ్చి
కాయగూరలు పండిస్తే ప్రతిఫలం బహు స్వల్పం.
అదే మన నగర వీధిమొదల్లోనో చివరనో
 ప్రదర్శితమయే వ్యాపార ప్రకటనలకు
కాషాయం రంగు చీరగట్టి
అంబానీకో మరో గన్నాయిగాడికో
లాభం మూటలు పంచిపెట్టండి

మా పార్టీ ముఖ్య కార్యకర్తలుగానో
భారత దేశ ప్రతినిధులుగానో
దేదీప్యమానంగా వెలిగిపొండి.
మన ప్రధానిగారికి కృతజ్ఞతలో
హార్దిక ధన్యవాదాలో,  చెప్పడం మాత్రం మరువకండి.

======================================
గంగ ఒడ్డున
విసురుగా వీచే గాలి
తడిబట్ట చుట్టుకుని
వణుకుతూ
తడబడే స్వరంతో ఆమె
స్తోత్రాలు వల్లిస్తూ
పుణ్యంకోసం పడే పాట్లు
వరమా? శాపమా?

-----------------------
రామాయణం రంకు
భారతం బొంకు
శ్రీ---మ్మ రచనలు సింకు
------------------
శివశివా
కాశీ వీధులంతా గోమయం
ఎదురుగానే కొట్లళ్ళోనే
దూద్పేడా తయారీకేంద్రం.
----------
గంగాజలమంతా
కాలుష్యకారకం
ఇంటికితెచ్చి నెత్తినచల్లుకుంటే
మాత్రం అదేనీరు
 పవిత్రమైన అభిషేక జలం.

=============================

Thursday, April 9, 2015

మణిమాణిక్యాలు
------------------ఎమిలీ డికెన్సన్
నీవు బాధ తోరాసిన జాబుకు
నా నిశ్చల మౌనమే జవాబు.
----
---సంతోషాన్ని పంచుకే భాగస్వాములెందరో
సంతాపమంటే సాన్నిహిత్యానికే జడుస్తారూందరూ.
----
ఏకాంతం అతని జతనాశించడంలేదు.
ఇరుగూ పొరుగూనే ఇతోధికంగా సహకరిస్తున్నారు.

-----
దైవత్వంకూడా మానవత్వంతో సరిపోలినదే
మొట్టమొదట అనంగీకారంతో మొదలెట్టి
చివరాఖరుకు ఆశ్రయమిచ్చి ఆదరిస్తుంది.
-------
వానజల్లుల్లో తడిసివవ్విన నీ ముఖ లావణ్యం
చిరుమందహాసాల చిత్తడిలో సందడిచేస్తున్నది.
=======================
ప్రతిఫలంగా-- రావెల పొరుషోత్తమ రావు.
--------------------------------------------
ఇంకా తెలతెలవారకముదే
అతడు గబా గబా నడుచుకుంటూ
సమీపంలోని  స్నేఫితుడిని కలిసి
కరచాలనం చేసి పుట్టినరోజు
శుభాకాంక్షలు చెప్పాలని
తపన పడుతున్నాడు


ఇంకా వంద గజాల
 దూరంలోనే అతనుంటాడు.
సంతోషంపట్టలేక నడకవేగంపెంచాడు.


గగనతలం నుంచి గగుర్పాటుగొలిపేలా
నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఓ భయంకర శబ్దం
ఇంతలో ఆకాశంలోంచి శతృమూక దాడి.

స్నేహితుడు విగతజీవిడై నెత్తురోడుతూ
నేల మీద పడివున్నాడు.
అతనిచేతులుమాత్రం  తన చెలికాడి కరస్పర్శకై
ఎదురుచూస్తున్నట్లే వున్నై.

ఏంచేయగలడు ? అతడా మిత్రుని  పుట్టినరోజు నాడు
రెండు అశ్రు కణాలను మనసారా
రెండుచేతుల్లోనూ రాల్చి వెనుదిరిగి రావడం తప్ప.

సమరం అమరమైతే అజాత శతృవుకైనా సరే
 అందిపుచ్చుకునేది అమాయకజనాల
ప్రాణ నష్టమేనేమో   పనికిరాని  ప్రతిఫలం.
------------------------------------------------------------------
[ ఓ ఆంగ్లకవిత చదివాక]
=============================

Tuesday, April 7, 2015

మా మేడమీది పడకటింటి  గోడ  ఆప్యాయంగా గుండెకు హత్తుకుంటూ నన్నుపలకరిస్తున్నది.
గోడమీద స్థిరీకరించబడిన ఆవిడ చాయా చిత్రం నన్ను  ఇతోధికంగా హెచ్చరిస్తున్నది.


శిధిలమైన ఆలోచనలను శీర్ణ పత్రాల్లా వర్జించడం మేలని
పదేపదే గుర్తుచేస్తున్నది.
 అదే సమయానికి  సహచరిగా సాన్నిహిత్యపు చనువుతో   హితవైన
సూచనలుజేస్తూ నన్ను అలరిస్తున్నది. తీయగా అదిరించడంకూడా

నిద్రలేమితనానికి విరుగుడు ఎంత త్వరగా కనుగొనగలిగితే
అంత శ్రేయోదాయకమని  సుభాషితమై  హితవులను పలుకుతున్నది.
 కవిత్వమంటే జీవితాన్ని నీటిలోని   రంగుల చిత్రంగా భావించి పట్టిచూపడ మైనదని  బోధిస్తున్నది.
నీమనసులో అనునిత్యం మెదలే శతక సాహిత్యం నీకు మార్గ దర్శిగా నిలవాలని వినమ్రంగా ప్రార్ధిస్తున్నది.


ఋతుహేల
==========రావెలపురుషోత్తమ రావు.


నువ్వు వసంతానివా?
ఒక్క సారి ఆమని గీతాన్ని
మ్రోడు వారిన జీవలతిక
చిగురించేలా అమృతవర్షిణివై నర్తించు.


నువ్వు గ్రీష్మర్తువువా
పగలల్లా ప్రచండభానుడై
వడగాలులు విసిరినా
చీకటిపడే రాత్రికి
విరబూసిన మల్లెవై
నా మనసు నాహ్లాదపరుచు.

నువ్వు వర్ష రుతువు  వా!!
పంటపొలాలలన్నింటినీ
బీటలు వారి బీడుభూములుగా 
మారకుండా కరుణామృత హృదయంతో
ఆకాశాత్పతితం తోయన్న రీతిలో
సకాలంలో నీటినిప్రవాహాల్లా  పారించు.



నువ్వు శరదృతువ్వా
పిండారబోసినవెన్నెలను
రంగవల్లిగా 
నా నిజగృహప్రాంగణంలో
నిండు మనసుతో వెలయించు.
నువ్వు హేమంత శార్వరివా?
చలిగాలులన్నింటినీ
చిరుజల్లుగా మాత్రమే కురిపించు.




నువ్వు శిశిరానివా?
నాజీవన ప్రస్థానాన్ని
వర్ణశోభితం చేయగలిగినా
శీర్ణమయే దిశ సంప్రాప్తించకుండా
సానుభూతితో సం రక్షిస్తూ  దీవించు.
----------------------------------


స్మరణిక-1
*******
వెన్నెలొచ్చి వాటేసుకుంది
గలగలలు నవ్వుగా తెచ్చుకుంటే
జలకళ దాన్ని లాగేసుకుంది
ఒంటరి గీత గానానికి నేనుద్యుకుడనౌతుంటే
యుగళం నన్ను పాటగామలచుకుంది
అడుగడుగునా నిన్ను తలచుకుంటూ కవితలల్లుతుంటే
స్వారస్యం నన్ను సర్దుకు పొమ్మని బతిమాలుతుంది.
నరకప్రాయమైన జీవితపధంలో నే నడుస్తుంటే
స్వర్గధామం నాకు సహచరిగా మార్గదర్శకమై నిలిచింది.

పదాలపోహళింపు నాకు ప్రాణమై ఊపిరులందిస్తే
అభినందనల పరంపర నన్ను మున్ముందుకు చిరజీవివై సాగమంది.
-------------------------------------------------------------------------------
లోవెలుగులు
=======రావెల పురుషోత్తమరావు

ఎదురుపడగానే
ఎదలోతులను స్పృశిస్తూ
ఆప్యాయతను వర్షించగానే 
అభిమానపు సంద్రమై మురుస్తూండే
నా అంతరంగం ,నాకే 
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .
బాహిరకమైన చీకట్లు
లోవెలుగులకు, నింపాదిగా
దారి చూపిస్తున్న వైనం. 
బరితెగించిన 
బాధలుకూడా 
సమయస్పూర్తితో 
సంతోష సామ్రాజ్యానికి 
సేతువులు నిర్మిస్తున్న చందం
నన్ను అప్రతిభుణ్ణి గావిస్తుంటాయి

పల్లె తల్లి వొడిలో
మురిసి మెరిసి
వికసించిన వాణ్ణి.
పట్టణపు తెలిమబ్బుల
సందడి లో
తలొంచుంకు 
కాలం వెల్లదీస్తున్నాను .

యేవెలుగులకీ ప్రస్థానమని 
ఎవరైనా
ఎప్పుడయినా అడిగితే

లోవెలుగులచెంతకు
శీఘ్రంగా చేరుకునే 
చిరు ప్రయత్నమేయిదని
వింగడించి, వివరంగా
విడమరిచి చెప్తాను 
*************
15-1-2014

 
జతపరచని హామీ పత్రం
---------------------------------
నిన్ను అమితంగా ప్రేమించినదెవరు?
నిన్ను ప్రాణప్రదంగా అభిమానించినదెవరు?
అనవరతం నీ ఊహల్లో ఊసుల్లో
ఆత్మీయతను కనబరచిందెవరు?
 అందరూ విరామ దిశగా చూపులు సారిస్తే
అధిక శ్రమకోర్చియైనా
నీ నవ్వులపువ్వులను నవరత్నాలుగా
భావించి భద్రాంగా గుండె కుహరాల్లో దాచుకున్నదెవరు?
ఈ జన్మకీ సుఖం చాలుననుకుంటూ
నిరంతరం పరవశించిన ప్రేమఖైదీ ఎవరు?
ఆపుణ్యాత్ముడెవరో తెలుసుకోవలన్న కుతూహలం నీకుంటే
రా నాదగ్గరకు వచ్చి ఈ వదనముకురంలోకి తొంగిచూడు.
ఎవరే అతగాడని ఆమన్మధాకారుడిని నేనేనని
నీకు ఇట్టే అవగతమౌతుందని అక్షరాలా హామీ!
 
నాకున్న తెలివితేటలనుపయోగించి
ఉత్త ఉపాధ్యాయునికీ ఉన్న ఒకే ఒక తేడా
వివరించి చెప్పగలను.
ఒకరు నడిచే విజ్ఞాన సర్వస్వమైతే
ఇంకొకరు నడవనుంకించని అజ్ఞాన గ్రంధాలయం.

ఈకోవలోకే ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నిక కాని
పాములపాటి పంతులుగారినో పొన్నెకంటి పంతులుగారినో
[ఉదాయరించక తప్పదనుకుంటా. మరిచానండోయ్
పొన్నెకంటి పంతులుగారు ప్రాధమిక పాఠ శాలలో
ఉద్యోగం సంపాదించి ఉన్నతపాఠ శాలలో ఉద్యోగించారు గనుక
ఈ కోవలోకి వస్తారో రారో తెలియదు గాని ఆయన హార్మోనియం మెట్లపై పలికించే సంగతులూ, పద్యాలు పాడడంలో
సంభాషణలు ఆకట్టుకునేలా చెప్పదంలోనూ పామరులైన మావూరి

నటనాభిలాషులకు తగు శిక్షణనిచ్చిన గురుతుల్త్యులనే చెప్పుకోవాలి--అయితే ఆయన మీద ఓ అపవాదూ అభాండం గూడా వేసే వారు--నటుడు తారా స్థాయిలో పద్యంలోని రాగాన్ని పలుకవలసి వచ్చినప్పుడు ఈయనే ఆమెట్లపై ఆరాగ చ్చాయలను వినిపించి శ్రోతలను నమ్మించి
ఆ నటుడే పాడాడని నమ్మించే వారు. అంతే కాదు ఆయన వాయించే
నాగిని మ్యూజిక్ మళ్ళీ మల్లేఏ వినాలనిపించేది. ఇప్పుడాయన ఆ ఆరోప్రాణంగా చూసుకునే హార్మనీ పెట్టే ఉందో పిల్లలు అద్దెకున్న ఇరుకు ఇళ్ళలో ఈ బరువెందుకని ఆయన బ్రతిమాలుతున్నా వినిపించుకోకుండా చెత్త కుండీ దగ్గరకు విసిరేస్సారో ఈసారి వెళ్ళినప్పుడు కనుక్కుని ఓ సారి ఆ హార్మొనీపై మరలా ఆ  సంగీతం వినాలని దుగ్ధ!!
---------------------------------------------

Monday, April 6, 2015

  ఏడనుంటివి సామి
    జాడకానగలేను
  అందమైన ఆకసాన
  నిండుపున్నమి రేయి
    నవ్వుచిందుచునుండె
     వేగరావదేమి?
  
 వలపునూయలనూప
   తలపు తలుపులుదీయ
   మూగమనసుతొబేను
  మౌనభాషణమేల?
   నీవు దరిచేరగా
  మల్లెమొగ్గలుగూడా
  వెల్లివిరియునులెమ్ము
నీకొరకె యదయంత
అల్లకల్లోలంబాయే
నీప్రేమజల్లులో తడియకున్నచొ
నాకు లోనమండెడుయగ్ని
చల్లరువిధమెట్లు?
నీకొరకు తపియించి
ఎదురుచూసెదనేను
వేగవాకిటనిలిచి
ప్రేమబంధములోన
పరవశింపగ జేయు.
======================
 
శాసనస్థ చరిత్ర---
                      --రావెలపురుషోత్తమ రావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

  పచ్చటి రంగులో గ్రద్దల సమూహమొకటి
   అక్కడి పంటపొలాల దగ్గరకొచ్చి వాలింది.
   మీ పొలాలన్నింటా ఈ బూడిద జజల్లండని ఆదేశించింది.
   అడుగడుగునామీకు ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మబలికింది.
   అందరి కాయ కష్థాలనూ అంగీకారపత్రాలరూపంలో సేకరించింది.
  వాటన్నిటినీ కట్టగట్టుకుని సింగపూర్ జపాన్లవైపు విహంగయానం చేసింది.
  అమాయకమైన జనం కళ్ళల్లో అక్కడ రేగిన దుమ్మూ ధూళీ మాత్రం మిగిలింది.
  అక్కడ ఒకప్పుడు చెమటచుక్కలతో జనం చేసిన సేద్యం ఉండేదని
  చరిత్రలో శిలాక్షరంగా రాజధాని గోడలపై ఓ శాసనం వెలసింది.6-4-15
=======================================================

Sunday, April 5, 2015

విదేశీ పజ్యాలు-3
----------------
ఇక్కడి గ్రంధాలయాలను
ఆబాలగోపాలం మక్కువతో ఆదరిస్తారు.
అధునాతన సౌకర్యాలతో గ్రంధాలయాలను
అత్యంత శ్రద్ధగా నిర్మిస్తారు.
అందరికీ అందుబాటులో రక  రకాల పుస్తకాలను
రాకుల్లో అమరుస్తారు.
పుస్తకాలతో పాటు డీవీడీలనూ, వీసిడీలనూ
అందిపుచ్చుకోవడానికి వీలుకల్పిస్తారు.
పిల్లలకూ యువతకూ ప్రత్యేక విభాగాలను యెర్పరుస్తారు.

అన్నీ కలిపి పాతిక వేల పైగా అందుబాటులో ఉండేలా చూస్తారు.
పిల్లలకు పుస్తకాలను చదవడంలో శ్రద్ధ కలిగే విధంగా
రచయితలతో కధలు వినిపించే యేర్పాట్లు చేస్తారు.

రెండు దశాబ్దాలు చెల్లినపుస్తకాలనూ, ఎక్కువ ప్రతులున్న పుస్తకాలనూ అమ్మకానికి తక్కువ ధరలకు విక్రయిస్తారు.

వన సం రక్షణ దిశగా విత్తనాలనూ వీటిదారా సభ్యులకు
ఉచితంగా సరఫరా చేస్తారు.
మీరు కోరుకున్న పుస్తకాలు అంతర్జాలంలో వెదకి పట్తుకుని అడిగితే
వారి వారి సమూహంలోని గ్రంధాలయానుంచి తెప్పించి మీకు అందిస్తారు.ప్రభుత్వ సహాయ సహకారాలకన్నా శ్రేయోభిలాషుల
ఆదరణపైనే ఎక్కువగా ఆధారపడి పనిచేసేలా చూస్తారు.

ఉచితంగా సాంకేతిక సేవలనందించేవిధంగా కంప్యూటర్లను
సభ్యులందరికీ అందుబాౠలో ఉండేలా అమరుస్తారు.




ఎటు నీదారెటు--
------------------------------------------------------

ఓ చిన్న కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకున్నట్టు
గద్దల్లా ఎగిరొచ్చిన నాయకులు అమాయకప్రజల భవితవ్యాన్ని
తేలిగ్గా కిళ్ళీ ఉమ్మును గాండ్రించి గోడమీద ఉమ్మినంత తేలిగ్గా
పచ్చని పంట పొలాలమీద విదిలించి వలేసి వారి ఉజ్జ్వల భవితను
గుటకలో పట్టి అమాంతంగా  మింగేసి ఘన కార్యమేదో చేసినట్లు భుజ కిరీటాలను
వంది మాగధులచేత వరుసగా తగిలించుకుని ఆకాశమార్గాన
ఓ చిన్న పాటి లోహ విహంగాలపై తిరిగివెళుతూ దుమ్ములేపి
కళ్ళల్లో సుతారంగా కారాన్ని తేలిగ్గా చల్లేసి సుఖంగా వెడలిపోతున్నారు.


జపాను దేశమో మరో సింగపూరుకో విదేశాల బేహారులకు ఆపత్రాలను
మారుబేరపు  అమ్మకానికి  విసిరేసి తరలి  సునాయాసంగా చెమటచుక్కను
నేలపై రాలిపడకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళిపోతున్నారు.
  గుప్పెడు గింజలుజల్లి గువ్వలన్నింటినీ ఒక్కుదుటనే పట్టేయగల పకడ్బందీ
ప్రణాళికలను సిద్ధంచేయండని అధికారులనాదేశిస్తూ
ముఖం నిండా ప్లాస్తిక్ నవ్వులు ప్పుట్టించుకుని ముందుకు సాగుతున్నాడు.

 అమాయకంగా జంబుకాలకు అమ్ముడుపోయిన జనం ఏదో రకంగా
దాన కర్ణులమయామని తమలో తామే పొంగిపోతూ భుజాలెగరేసుకుంటూ
మ్రా ంపడి వలస బాట పట్టి ఉన్న ఊరునూ కన్న తల్లినీ
బహిరంగ విపణిలో రహస్యంగా అమ్ముకుని నయవంచన కు లోనై
 తమతమ గూళ్లకు నమ్మ బలికిన ఊహాలోకాల్లొకి కట్టు బట్టలతో
కన్నీళ్ల పర్యంతమై కావిడిపెట్టెలో కష్టాలను కుక్కేసుకుని
వలస బాటలో వంది మాగధుల వంచనా శిల్పానికి బలయి


ఉసురుస్సురనుకుంటూ ఉడిగిపోతున్న ఆశలతో
అలుపెరుగని ప్రవాస సీమల్లోకి, ఉరుకుతూ వెళ్ళిపోతున్నారు.

మళ్ళీ తనకు ఓడినా గెలిచినా ఓ ఓదార్పు యాత్రపేరిటో
మరో నిరశన దీక్షపేరిటో జనామ్ని మభ్యపెట్టగల
మాంచి అవకాశాన్నందిచిన తన తండ్రికి చిరకాలమిత్రుడయిన
ప్రభుత్వాధినేతకు కృతజ్ఞతలు చెపుతూ ఊరూరా ముసలికన్నీరు
కారుస్తూ ముందుకు సాగిపోవాలని పగటికలలతో  తేలిపోతున్నాడు.
================================
సాహస లక్ష్మణుడు---
---------------రావెల పురుషోత్తమ రావు.

అవును అతను ధైర్యంగా
అచంచలమైన తన ప్రగాఢ విశ్వాసాన్ని
 ఆసాంతం నమ్ముకుని పర్వతాలను అధిరోహించాడు.
ఆ ఏడు పర్వతాలనూ తన పాద స్పర్శతో
బహు పునీతం గావించాడు.
హిమ సౌరభాలను సరిగపదమని ఆదేశిస్తూ
కదన కుతూహల  రాగంతో
తన సాహస గాధను సరిగ్గా
సమన్వయం చేసుకున్నాడు.

గుండెలో తిరుగాడని
దు:ఖ సంద్రాలకన్న
 ఈ శిలాజాలందించిన
ఆనందాశ్రువుల అంబోధి నే
అధికాధికంగా ప్రేమించాడు.
ఎక్కడొ దూరంగా కనుపించే
 నల్లని,తెల్లని రాళ్ళకన్నా
దగ్గరగా మురిపించే
ఈ శిలాసౌందర్యాలపైనే
మక్కువను పెంచుకున్నాడు.

రాయిలాంటి దేవుడితో వేగలేక
ఆ ప్రకృతిలో పరవశించే గీతమై
శిలాక్షరంగా అజరామరమై
నిలిచిపోయాడు .
  అమూల్యమైన చరిత్రకు
ఆల వాలమై మిగిలి మురిసిపోతూ మెరిసాడు
ఎండయినా వానయినా నన్ను తాకి వెళ్లవలసిందేనని
శపిస్తూ, అకాలంగా సంభవించిన మృత్యు పాశానికిలోనై
అదృశ్యమై అనంత దిశల మాటుకు అంతర్ధానమై
ఘన పదార్ధమై మిగిలిపోయాడు.  5-4-15

{చి// మస్తాన్ అను సాహస వీరుని స్మృత్యంకితం.

Friday, April 3, 2015

విదేశీ పజ్యాలు
----------------
అమెరికాలో విద్యా విధానం
వేరుగానే వుంటుంది.
పిల్లలు బడికెళ్ళదానికి
అమిత ఉత్సాహం పడుతుంటారు.
బడికెళ్ళడానికి కష్టమొచ్చినరోజు
రోజంతా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటారు.
-------------------------------[ఒకటి]


వర్కవుట్ పేరిట ఆడా, మగా క్రమం తప్పకుండా
 వ్యాయామం చేస్తుంటారు
ఋతువేదయినాసరే మానకుండా చూస్తారు.
అందుకే పదవీ విరమణను
వాయిదాలేస్తూ పోతుంటారు.
స్వచ్చంగా పనిచేస్తూ
జీవితాన్ని నెట్టేస్తారు.
ఎనభయ్యేళ్ళ వయసునూ
ఉత్సాహంతో గడిపేస్తారు.
--------------------[రెండు]


ఆకాశ హర్మ్యాలనయినా సరే
 ఆరునెలలో కట్టేస్తారు
చెక్కకూర్పునయినా
అందంగా అమరుస్తారు
అన్ని సౌకర్యాలనూ
అవసరానుగుణంగా అందిస్తారు.
అద్దె ఇళ్ళలనయినా
సొంత ఇళ్ళలాగానే చూస్తుంటారు.
-------------------------------మూడు]
వివాహ వ్యవస్థ  మాత్రం
విభిన్నంగాతోస్తుంది.
బాయ్ ఫ్రెండ్ గల్ ఫ్రెండ్ సంస్కృతినే
అధికంగా పోషిస్తారు.
అమ్మా నాన్నలను యేడాదికొక్కసారే
వెళ్ళికలసి విందుభోజనం ఆరగిస్తారు.
ధన్యవాదాలను చెప్పి బహుమతులనందించి
వెనుదిరిగి తీరిగ్గా ,గృహోన్ముఖమై తరలి వస్తారు.[నాలుగు]
=====================================
విదేశీ   పద్యాలు[2]
-----------------రావెలపురుషోత్తమ రావు.
కారు నడపడంలో
తగు జాగ్రత్త వహించాలి
నిబంధనలనతిక్రమించే
ఆలోచనలే రాకుండా చూడాలి
రహస్య కెమేరాలకు కూదా
చిక్కకుండా జాగ్రత్త వహించాలి.
దొరికిఓయామా వేలలో తికెట్లరూపంలో
జరిమానాలు చెల్లించాలి.
----------------------------
 911 --రక్షక భటులు నిజంగా
జనాన్ని రక్షిస్తూనే వుంటారు
మన ప్రయోజనాలను స్వచ్చందంగా
కాపు కాస్తూనే వుంటారు.
యేచిన్న అవసరమొచ్చినా ఫోంచేస్తే
మేమున్నామని వెన్వెంటనే పరుగెట్టుకొస్తారు.
-------------------------------------

స్కూల్ ఉన్న ప్రాంతాలలో
వేగం బాగాతగ్గించి వెళ్ళాలి
పాదచారులెక్కడెదురయినా
వారిని గౌరవంగా దాటనివ్వాలి.
స్కూల్ బస్సులకు  దూరంగా  రోడ్లపై
 కారును ఆపేసి మనం బండ్లను నిలపాలి.
యేమాత్రం పొరపాటుజరిగినా తీవ్రమైన
శిక్షలను ఎదుర్కొనాలి.
--------------------------
కాపులు కార్లమీద లైటులేస్తే
దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేసులోనే
కారును ఆపడానికి ప్రయత్నం చేయాలి.
స్టీరింగ్ మీదచేతులెట్టి ఆయన చెప్పేది వినాలి.
తికెట్[ఫైన్] కట్టమంటే నోర్మూసుకుని కట్టేయాలి.
లేదా ఈమెయిలో ఋజువు చూపే ఫోటోలకోసం ఆగాలి.
===================================================









ఏడనుండెను వాడు
  ఎదను దోచినవాడు
  మన్మధునికంటెను
  మధుర మానసము  వాడు.

  గుండెగొంతుకనిండ
  ప్రేమనింపెడువాడు
  కలలోన, ఇలలోన
  కలతనెరుగనివాడు.

  కొండకోనలలోన
  నిండుకుండగనుండి
  అడవిదారులదిరిగి
  అలసి సొలసిన రేడు.

కలనైనా కలవరమందైనా---------
----------------------

పారిజాతపుష్పంలా
పరిమళాలను ప్రసరిస్తుంది
ఎండ ఎరుపెక్కకముందే
వాడు ముఖంతో తనువు వాల్చేస్తుంది
పగలంతా తన దిగులుతోనే నన్ను చిత్రంగా నలిపేస్తుంది
చీకటి పడుతూనే చిత్రంగా చెంతజేరుతుంది.
సువాసనలను గుబాళిస్తూ అనుక్షణం
 గుండెను కొల్లగొట్టే స్తుంది.

గతంలోనే నన్ను జీవించమంటూ
హుకూములు జారీ చేస్తుంటుంది.

వర్తమానం వగపుమయమేనని
హెచ్చరిస్తూ వుంటుంది
ఆవిడ మధుర స్మృతి

ఎంత గాఢంగా నన్ను అల్లేసుకుని
వదలలేను పొమ్మంటూ
 భీష్మించుకు కూర్చుంటుంది.
============================

Thursday, April 2, 2015

అనుభవ రాహిత్యంలో---
----------------రావెల పురుషోత్తమరావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

 శిశిరం యేచెట్టు ఆకులను
  ఎప్పుడురాలుస్తుందో
తిధి, వార, నక్షత్రాలతో సహా
వివరించిన గంటల పంచాగంకోసమా,
ఈ వెదుకులాట! నన్నుక్షమించు!!

యేనదీ నదమో,ఓపిల్లకాలువో
ఎప్పుడు శీతలీకరణకు గురవుతుందో
లెక్కలేసుకునియేచేద్దామని నీ భావన?

అందరూలక్ష్యం దిశగా అడుగులేస్తూ
లఖ్యాన్నిచేరుకోవాలనే నిత్యం తపన పడుతుంటాము.
ఆరంభింపనోపని నీచ మానవుడిలా మిగిలిపోతూ అనుకోని

ఆప సోపాలుపడుతూ ఆయాసానికి గురౌతూ ఉంటాం.

కవిత్వపుపాదాలతోఒకరికొకరం ఉభయకుశలోపరి
చెప్పుకుంటూ బ్రదుకునీడుద్దామన్న
 ధ్యాసనే మరుగున పడేసుకుంటూ
తల్లక్రిందులవుతూ సతమమొతూ, సగం చచ్చిపోతుంటాం.

శిశిరం అధాటుగా వచ్చిన దాఖలాలేం చరిత్ర పుటల్లో
లిఖించబడ్డదని చెప్పగలిగిన శాస్త్రవేత్తలెవరూ  కనబడలేదు.
ఆకులన్నింటినీ ఆ ఋతువు క్రమేపీ వర్ణ శోభితంజేసి

ఆకుల నరరాల్లోని పచ్చటిజీవాన్ని హరింపజేసి
ఎండకు ఎండడానికి  దణ్ణెం మీద ఆరేసిన ఉతికిన బట్టలా
ఫెళ ఫెళ లాడిస్తూ గలగలలాడిస్తూ, క్రమేపీ రాల్చేస్తుంది.

మరెందుకునీవు నిరామయంగా, గడియపడనితలుపుల్లా
యమపాశంతప్పక పడుతుందని తెలిసీ జీవన సాఫల్య
పురస్కారానికి యేం చేస్తే సమాజహితమై పదికాలాలపాటు
నీ పేరును చిరస్థాయిగా నిలిపే  దిశగా ఆలోచనలను జేసి
నీ శేష జీవితాన్ని చరితార్ధంజేసుకోవాలని శ్రమించవు?
=============================



ఋతుశోభ
=========
నువ్వు వసంతంలా వచ్చి
వాకిట్లో నిలబడితే
సమస్త ప్రకృతీ నాకు
సహకరిస్తున్నట్లుంతుంది.

అదే నువ్వు విసురుగా
 సుడిగాలిని వీస్తే
శిశిరమై
చీత్కరిస్తున్నట్లుగా తోస్తుంది.


శరదృతువులో
పండు వెన్నెలగా
నాకనుసన్నలలో మెలగాలనీ


హేమంత శాద్వరిలా శోభిల్లుతూ
నువ్వు ఆగమించాలనీ
ఆహ్వానంపలుకుతాను.

గ్రీష్మంకన్ను మాత్రం
కప్పాలన్న సంగతిని
మరచిపోకు ప్రియతమా!!
==============================
తేనెల తేటల మాటలతో---
-------రావెల పురుషోత్తమ రావు.
================================

ఏప్రియల్  నెలంతా
కవితా మహోత్సవమే
ఎవడు రానన్ను
ఫూల్ చెస్తానంటున్న వెధవాయ్?
----------------
మనలో వెధవాయిత్వం
తగ్గించడమే మేలు
రోజుకో కవితన్నా
గిలకండిక చాలు.
-----------------
కవిత రాయడమంటే
మనిషిని చదవడమే
మనసనే పలకపైన
అక్షరాలు దిద్దడమే
---------------------
ఇంకో సారి ఇంకో సారి
తిలక్ ను బాగా చదువు
అనుభూతి సారాన్ని
గుండెలోకి పంపుకో
-----------
స్నిగ్ధ సౌందర్యమంటే
సి.నా.రె కవిత
వెన్నను చిలికించే
కవ్వముంటుంది వెదుకు.
----------------
శివారెడ్డి కవితలన్నీ
శిరోధార్యం చేసుకో
మట్టివాసన ఒలుకుతుంది
గట్టిగా ఒడిసి పట్టుకో
------------
పఠాబి పన్ చాంగం
మరోసారి చదువుకో
మణిప్రవాళ శైలిని
మనసునిండా నింపుకో
--------------
మరోసారి  మహా ప్రస్థానం
బాటమీద నడచిపో
అధోజగత్సహోదరుల
ఆక్రందన తెలుసుకో.
-------------------
ఆవంత్స సోమసుందరుడిని
అవలీలకాదు చదవడం
వజ్రాయుధమంటే
నిర్వచనం తెలుసుకోవడం
------------------

త్వమేవహమనగానే
ఆరో రుద్రుడి స్వప్నం
పెన్నును గన్నుగా జేసి
మాంచి దన్నుతోడ పేల్చడం.

-----------------
వచనకవిత అంటేనే
వావి వరుసలు వెదకడం
'తెలంగాణా' కావ్యంతో
కుందుర్తిని తవ్వడం.
----------------------
శివసాగర మధనంతో
విప్లవాన్ని శోధించు
దిగంబర కవిత్వంపై
దృష్టి బాగ సారించు.
---------------------------------------
కవితా వ్యాసంగమంటే
వొడలువంచిచేసే   సాగుబడి
ఉంటుందా పిచ్చివాడా?
నిముసమైనా తీరుబడి
------------------------
ఆదికవినుంచి ఆధునికునిదాకా
కవిత్వాన్ని వల్లించి జల్లించు
మేలురకం విత్తనాలతో
పంటల అధిక నాణ్యతను  సాధించు.
------------------------------2-4-15





Wednesday, April 1, 2015

నరరూపం సర్వత్రా నింద్యతే---
-----------రావెల పురుషోత్తమ రావు.
******************************************

జంతువులన్నీ ఒకచోటజేరి
మసకమసక చీకటిలో
సమావేశమయ్యాయి.

ఇంతలో పొదల మాటున పొంచి ఓ ప్రాణి
నక్కినట్లు  వాటికి అలికిడయిండి.
"చిరుత చిరుత" అంటూ
జంతువులన్నీ భయకంపితమై
ఉరుకులుపరుగులూ మొదలెట్టాయి.

వెలుగు చిక్కటి చీకటిని పారద్రోలాక
అది చిరుత కాదని మనిషిరూపంలోని
మనిషేననీ ఇట్టే పసిగట్టాయి.
అయినా జంతుకోటి అంతా పరుగులు తీయడం
మాత్రం మానడానికి ధైర్యం చేయలేకపోయాయి.

జంతువులు తనవునికినెలా పసిగట్టాయని
పగతో రగులుతున్న మనిషి ఇంకా
పరిశోధనల్లోమునిగి తేలుతూనే వున్నాదు.
దీక్షా కంకణ బద్ధుడై కారణాలకోసం
నిరంతరాన్వేషణ కొనసాగిస్తూనేవున్నాడు
చిరుతకన్నా క్రూరమైన తన చిత్త ప్రవృత్తితో.
===================================

కోకిల
కాకి అరుపులకు
పరవశిస్తూ
తలవూపుతూంది.

కాకి
కోకిల పాటకు
పదే పదే వన్స్ మోర్
అంటూ ఎగిరెగిరి పడుతుంది.


అకాలవసంతమంటే
ఇదేనంటూ ప్రకృతి
మనసారా పరిహసిస్తుంది.
============================
అనుబంధమున్న ఆత్మీయత అంతా రుచిగానే ఉంటుంది
అప్పుడప్పుడూవగరుగా రుచిస్తూనే 
చేదును దగ్గరకు రానీయకుండా
శిశిరాన్ని మరపించే వసంతంలా
జీవితపు నేపధ్యాన్ని సులువైన పదాలతో నిర్వచిస్తూ.
తగు జాగ్రత్తలు తీసుకుంటూ తననైజాన్ని ప్రకటిస్తుంటూంది.

కొకిల
కాకీరుపులకు
తలవూపుతూంది.

కాకి
కోకిల పాటకు
పదే పదే వన్స్ మోర్
అంటూ ఎగిరెగిరి పడుతుంది.


అకాలవసంతమంటే
ఇదేనంటూ ప్రకృతి
మనసారా పరిహసిస్తుంది.
=========================
ఇల్లాలికో ఇంపయిన కవిత
----------------------రావెలపురుషోత్తమరావు.

కొత్తగా  ఆవ బాగా దట్టించి పెట్టిన ఆవకాయలా
ఘుమ ఘుమలాడే మనసుకదానీది.

అల్లం, పచ్చిమిరపా, బాగా దట్టించి
రుచ్యమానంగా నువ్వు పెట్టిన
మజ్జిగపులుసులాగా బాగుంటుంది నీ ధోరణి.

బెల్లంతో కలిపి  వండిన కాకరకాయకూరలా
తియ్య తీయగా ఉంటుంది నీ వచోవిలాసం.

అప్పుడప్పుడూ నువ్వు చేసిపెట్టే ఆవిరికుడుములా
ఎంతచారోగ్యప్రదంగా , ఎంత బాగుంటుందో
నీవు అన్నపూర్ణగా అతిధులను పలకరించే తీరు.
మసాలాదినులు వేసి కూరిన గుత్తి వంకాయకూరలా

మాగాయతో కలిపివండిన కలగూరపప్పులా
ఎంతరుచిగా వుంటాయో నీ ప్రేమాభిమానాల పరంపరలు.

పొట్లకాయముక్కలతో నీవు అప్పుడప్పుడ్శూ చేసిపెట్టే
పెరుగు పచ్చడిలా  ఎంతబాగుంటుందో నీవునన్ను అభిమానించే తీరు.

అప్పుడప్పుడూ ఎందుకలా ముక్కుల్లోంచిపొగలొచ్చేలా
విచిత్రంగా ప్రవర్తిస్తుంటావో నాకవగతమవదు.

అదితెలుసుకుందామనే తపనతోనే ఈకవితను రాసి
పోస్ట చేయలేని ఉత్తరంగా నీకు దివ్యపధంలో
నా మనో వాహిని ద్వారా  మేఘసందేశంగాపంపుతున్నాను.
విసుక్కోకుండా వినమ్రంగా చదువుకుని స్వప్నపధంలోకి
ఓ సారి తొంగిచూసి జవాబివ్వగలవన్న ఆశతోరాస్తున్నా
ఈ ప్రవాసతీరలోంచి ఓ చిన్ని  ప్రేమ లేఖ.
 ================================================================