Monday, June 15, 2015

జయగీతం--

--------
కోటిపున్నముల వెన్నెల కోరుకుందమా
వేయివసంతాల వెలుగు వేడుకుందమా
భరతజాతి బహుళ కీర్తి పాడుకుందమా
మానవతకు జయపతాక ఎగురవేతమా      -కోటి--

ఈగంగా గోదావరి బహుపవిత్ర తీర్ధజలము
ఆకాశీ,ఈ కంచీ సురవాసపు దేవళములు
కాళిదాసు భవభూతులు టాగోరు పోతన్నలు
సాహితీ సామ్రాజ్యమందు సురభిళమౌ పరిమళాలు.--కోటి--

త్యాగయ్యా రామదాసు తులసిదాసు అన్నమయ్య
సంగీతపు భావజగతిన సంకీర్తనల స్వర ఝరులు
తాజమహలు బృందావని సందర్శకక్షేత్రములు
ఎల్లోరా అజంతా చిత్రకళా స్రవంతులు----------కోటి--
కూచిపూది కధాకళి నృత్యభారతికి సిరులు

హిమాలయమూ కశ్మీరము, భరతమాతకు మకుటములు
సత్యాహింసల ధర్మము జాతిగర్వ పడే ధ్వనులు.--కోటి-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^-

No comments:

Post a Comment