Sunday, May 10, 2015

శైశవావష్థాలో దాదిగా
బాల్యంలో చంకనెక్కించుకుని
చందమామనందించే జోలపాటగా
యవ్వనంలో మార్గదర్శిగా
నడివయసులో కడలికన్నా మిన్నయిన
గాంభీర్యాన్నందిస్తూ మనసెప్పుడూ

కకావికల పాలుగాకుండా కాపాడే
మహోత్తుంగపు హిమశిఖరంలా
వృద్ధపూమంలో కరగని కలలా
కడుపునుచించుకోనిచ్చుకుంటూతనరక్తాన్ని
పంచిపెట్టే అనురాగ దేవతగా
అత్మీయతనందించే అమృతోపమంగా
 దసల్లోనూ---  నల్దిశల్లోనూ
నేత్రానందకరమై భాసిల్లే
హృదయానందకారకమౌ కల్పతరువుగదా
అమ్మంటే --అపురూపమూ
అద్వితీయమూ అయిన
అపరంజి బొమ్మ--కళ్లెదుటన
 అనునిత్యం సాక్షాత్కరిస్తూ
కనుపాపనంటిపెట్టుకుని కదలిపోతూ
కనుచూపుమేరా కనుపించే కాంతి కిరణం .



No comments:

Post a Comment