Thursday, May 7, 2015

సమయోచితంగా---
==================రావెల
===============================
ఒక దశాబ్దం క్రితం
--------------------------
తలుపులనెవ్వరో బాదుతున్న చప్పుడు
తలుపులను బార్లా తీసే లోపు
కట్టుకున్న సాదాచీరెను మార్చాలి
ఏదో ఒక సిల్కు చీరను కట్టుకోవాలి.
మెడలో ఒక గొలుసునన్నా దిగేసేయాలి
జాకెట్ మడతల్లో డబ్బును దాచి
పరధ్యానంలో పోగొట్టుకోకుండా
కాపాడుకోవాలి.
ఇంటియజమానే అయుంటాడు, నెల మొదటివారం గదా
అద్దెకోసం వచ్చి వుంటాడు.
^^^^^^^^^^^^^^^^^
ఇప్పటికిప్పుడు.
----------------
ఇప్పుడు
తలుపులనెవ్వరో తన్నుతున్నంత గట్టిగా శబ్దం.
ఇప్పుడు అన్ని గదుల్లోనూ దీపాలనార్పాలి.
కట్తుకున్న పేరంటం చీరెను మార్చి
సాదా చీరెను చుట్టుకోవాలి.
రెమోట్ను నొక్కేసి టీవీని ఆపాలి.
మెడలో గొలుసును తీసేసి పసుపుతాడును చుట్తుకోవాలి.
ఇంటి యజమాని వచ్చి వుంటాడు. నెల చివరివారంగదా
ఇప్పటికే నాలుగయిదు సార్లు బెదిరించాడు,ఈసారి తప్పక
నిలదీసి నిగ్గు దేలుస్తానని భీష్మించుకు కూర్చుంటాడు.

ఆయనకు నెల జీతం వచ్చి ఆరునెలలు దాటిపోయింది.
అందుకే పేదరికాన్ని నటిస్తూ బీదతనాన్ని కౌగలించుకోవాలి.
========================================================

No comments:

Post a Comment