Saturday, May 30, 2015

మాతృ దేవోభవ----
===================
అమ్మ నాకెప్పుడూ అపురూపంగానూ
అమూల్యమౌ రత్నంగానూ సాక్షాత్కరిస్తుంది.

అలుపూ సొలుపూపైకెగబాకకుండా ముఖకవళికల్లో
నవ్వుల జలపాతమై ప్రభవిస్తుంది.

ప్రభాత వేళ సుప్రభాతంలా
వేడి వేదిగా పొగలుకక్కే డికాక్షన్ కాఫీలా
మంచాలదగ్గరకే నడిపిస్తూ వుంటుంది.
కుక్కరై విజిల్ వేస్తుంది.గ్రైండరుగా మారి చట్నీలను రుబ్బేస్తుంది.
తాలింపై ఘుమ ఘుమ లాడుతుంది.
.

పూజామందిరంలో అగరుబత్తీలా వెలిగిపోతుంది.
స్కూలు బ్యాగుల్లో టిఫిన్ బాక్షుల్లా వాటర్ బాటిల్లా
సర్దుకుపోతుంది.
 మధ్యాహ్నం వేళకు వాషింగ్ మిషనై సబ్దం చేస్తూ
బట్టలకున్నమురికినంతా వదిలించేస్తుంది.
ఆరవలసిన బట్టలు తానే తాడై ఎండేలాచేస్తుంది.
సాయంత్రానికి దందె మీదకో కావిడిపెట్టెలోకో
అల్మరాల్లోకో చెజ్క్క బీరువా అరల్లోకోసర్దుకుపోతుంది.

సాయంత్రానికి పిల్లలకు ఆటస్థలమై ఆడిస్తుంది.
ఇచ్చిన హోంవర్కుకు టీచరై సహకరించి పూర్తయేలా చూస్తుంది.

అప్పటిదాకా సూపర్ ఫాస్టు రైలులా నాన్ స్తాప్ బస్సులా ఉరుకులుపరుగులతో యంత్రాలై తిరుగాడిన అమ్మ
అర్ధరాత్రికి ఓ గంట అటో ఇటో చీరచెరగుపై దిందులా ఒదిగిపోతుంది.

మళ్ళీ తెలతెలవార్రుతుండగా పాలపేకెట్తై దర్శనమిస్తుంది.
సెలవురోజంతూలేకుందా విసుగును వెనక్కు నెట్టేసి శ్రమజీవన
ఫలాలను స్వాదుయోగ్యంజేసి సంతసిస్తూంది.
---------------------------------------------------------------------

No comments:

Post a Comment