Monday, May 4, 2015

చితికి పోతున్నా!
చివికిపోతున్నా

ఎందుకీ మనుషులంతా ఇలా
విరిగి ముక్కలయిన ఆటబొమ్మల్లా
చెల్లచెదరవుతూ కుడ్య సిధిలాల్లా
చావూ బ్రదుకులమధ్యన సగంచస్తూ
జీవితాలను దయాదాక్షిణ్యాలకు దూరంగా
సాగిస్తూ సంతృప్తిపడుతున్నారు?
ఎన్ని సార్లు రోజువారీగామన
భూదేవిమీద అన్యాక్రాతంగా
అరాచకాలనుజేసి అకృత్యాలను
అనుస్యూతంగాజేసి అపవిత్రం గావించడంలేదు?
మనల్ని కాపాడుకోవాల్సినమే
స్వయకృతాపరాధాలుజేసి
సర్వనాశనంగావించుకోవడంలేదు.


యే శాస్త్రవేత్త విజ్ఞనాకికయినా
అందని పరిధుల్లో మనం ఈ భూగోళంపైన
పరిస్థితులను మనకనుగుణంగా సేదుబాటు చేసుకుంటూ
బ్రదుకును ఓ వ్యర్ధ పదార్ధంగా సాగదీసుకుంటూ
మునగదీసుకుని మృణ్యయ రూపంగా మలచుకొని
మూర్ధన్యులమై బ్రదకడంలేదు?
[బీ. ఇందిర గారికవితకు స్వేచ్చానువాదం]




ఈ మానవాళినంతటినీ ఒక్క సారిగా భూగర్భం
అధోజగత్తులోకి
సీతమ్మ వారినిలాగేసుకున్న విధంగా
లాగేసుకుని కడుపులోపెట్టుకుని కాపాడగలగలేదు?

కృతజ్ఞతగా మనమేం చేసాము.

కాలుష్య కారకమైన పనులన్నింటినీ పనిగట్టుకుని
నిర్వహించడంలేదు?

మనపాపాలపుట్టపెరిగి హిమాలయాలంత ఎత్తును దాటి ఎదుగుతున్నా
మౌనం వహించి మూగవారిమైపోయినట్లు అంధులమైనట్లు
పశ్చాత్తాపంలేని బ్రదుకులను పాప కూపాల్లోకినెట్టేసుకుంటూ
నిరర్ధకజీవులమై బ్రదుకును వెలార్చడంలేదు?
=======================================

No comments:

Post a Comment