Thursday, May 7, 2015


పలనాడులోనిఒక పురోహితుడి ఇంటి దృశ్యం
----------------------శ్రీనాధ మహాకవి.

----------------------------
దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి మంచము దూడరేణమున్
పాసిన వంటకంబు పసిబాలుర శౌచము విస్తరాకులున్
మాసిన గుడ్దలున్ దలకు మాసిన ముండలు వంటకుండలున్
రాసెడు కట్టెలున్ తలపరాదు పురోహితులింటి కృత్యముల్.
=================================================
పుల్లసరోజనేత్ర యలపూతన చన్నుల చేదుద్రావినా
డల్ల దవాగ్నిమ్రింగితినట0చును బిoకములేల తింత్రిణీ
పల్లవయుక్తమౌ నుడుకు బచ్చలి పాకము జొన్నకూటిలో
మెల్లన నొక ముద్ద దిగమ్రింగుమునీపస గాననయ్యెడున్.

అంగడియూరలేదు వరియన్నము లేదు శుచిత్వమేమిలే
దంగనలింపులేరు  ప్రియమైన వనంబులు లేవునీటికై
భంగపడంగ పాల్పడు కృపావరులెవ్వరులేరు దాతలె
న్నంగను సున్న గాన పలనాటికి మాటికి బోవనే టికిన్.
----------------------------------------------------------

No comments:

Post a Comment