Tuesday, May 5, 2015

వెదుకులాట
----
మిట్ట మధ్యహ్నం
నడినెత్తిన సూర్యుడు
నాట్యమాడుతున్నవేళ
ఒకడు చేతిలో కొవ్వొత్తిని పెట్టుకుని
ఎవరికోసమో తీక్షణంగా వెదుకుతూ
దుకాణాల సముదాయానికొచ్చాడు.



అందరు దుకాణాదారులూ నవ్వుతూ
ఎవ్వరికోసం నీవు వెదికేది అని శ్రద్ధగా అడిగారు.

దైవసంబంధమైన విషయాలతో శ్వాసించె
మనిషికోసమే వెదుకుతూ ఇటుకేసి ఒచ్చానన్నాడు.



ఇక్కడ అందరు దుకాణాదారులూ అలాంటివారేనన్నాడు.
కోపమూ కోరికలూ కలిగి వుండికూడా
శాంత స్వభావంతో సమ్యక్ దృష్టితో ప్రవర్తించే మనిషిని
చూపిస్తే చాలు తిరిగి నాచోటికి నేను వెల్తాననగానే
అతన్ని ప్రశ్నించిన వారందరూ పరాజ్ఞ్ముఖతను ప్రదర్శించారు.



[రూమీ భావానికి తెలుగు సేత]

No comments:

Post a Comment