Wednesday, May 13, 2015

చిత్తగించవలెను
-----------------------రావెల.

నేను నడమంత్రపు సిరులతో
నాట్యమాడాలన్న దుగ్ధ.
ఆకోరిక నిజరూపం దాల్చేదాకా
నన్నంటుకోకు

ఈ జగత్తునంటినీ ఆలోపు .
దారిద్ర్యంతో అంతమవకుండా
అత్యంత జాగరూకతతో సమ్రక్షించు.

భగవంతుడా నాయశోకీర్తులు
దిగంతాలదాకా ధగధగాయమానంగా
వెలుతూ లోకాన శాంతి సుస్థిరంగా నిలిచేలా
తగు చర్యలనన్నింటినీ శ్రద్ధగా నిర్వర్తించు.

సర్వ కాల సర్వావస్థలలోనూ
నా కవితా సంపుటికే ప్రపచమంతటా
ఘన కీర్తిని పొందేదాకా
ఈ జగత్తు అజ్ఞానతిమిరాలలోనే
అలమతించేలా అన్ని సదుపాయాలను కల్పించు.

అందరినీ ఐశ్వర్యవంతులను గావిస్తానని
వాగ్దానంచేసిన పాపానికి
మా అర్ధిక వ్యవస్థను సుస్థిరంగా వుండేలా దీవించు.
ఆకోరిక నెరవేర్చేదాకా నన్నే మళ్ళీ మళ్ళీ
ప్రజా ప్రతినిధిగా పేద్ధ మెజారిటీతో గెలిచేలా
ఆశీర్వదించు.

నా ఈచిన్ని కోరికలన్నింటినీ నెరవేరుస్తూ
నాపై ప్రత్యర్ధులు నాపై చేసిన ఆరోపణలన్నీ
న్యాయంకాదని ఋజువయేదాకా ఈ న్యాయదేవత
కళ్ళకు కట్టుకున్న గంతలు తొలగించకుండా తగు చర్యలు చేపట్టు.
వీటన్నింటినీ చిత్తశుద్ధిటొ నేరవేర్చిన పక్షంలో
నీ ఋణం నా అక్రమార్జనలో కొంత శాతం నీ హుండీలో
పడేసి నీ కృతజ్ఞతా భావానికి ధన్యవాదాలు సమర్పిస్తూ
నీ ఆదేశాలను తు చ తప్పకుండా అమలుచేస్తానని ఇందుమూలముగా
నా నియోజక వర్గ పు వోటర్లమీదప్రమాణం చేస్తున్నాను.

=====================================

No comments:

Post a Comment