Thursday, May 7, 2015

శీర్షిక కోరుకోని కవిత-
=======================
ఇప్పుడు కన్నీళ్ళు ఎందుకింత చులకనైపొయాయి?

తళుకుబెళుకులతో తైతక్కలాడే వాడు
తాగి ఒళ్ళుపై తెలియకుండా కాలిత్రోవలపై
నిదురిస్తున్న పేదరికాన్ని నిలువునా చంపెస్తే
ఎంతమంది కన్నీళ్ళను స్వచ్చందంగా కార్చగలిగారో తెలియదుగాని
ఆ ఢీరోదాత్త  నాయకుదికి చేసిన నెరానికి న్యాయంశిక్షిస్తే

భోరు భొరునా వీరాభిమానులంతా
 ఏకధాటిగా సునామీలను మించినంతగా
బాధపడి కన్నీటి కడలులను ఊరూరా వాడవాడలా సృష్టించారు.

మానభంగంకనా ప్రాణ హరణం తక్కువేనని వారి చిట్టిబుర్రలకు

తట్టిన న్యాయం. ఒకరకంగా  కలియుగాన కరుడుగట్టిన మాయోపాయం.

============================================

No comments:

Post a Comment