Saturday, May 9, 2015

ద్విముఖ పారాయణం
్్్్్్్్్్్్్్్్్్్్

వదనగ్రంధంలో
ఒక ముఖం దర్శనమిస్తుంది.
నిజ జీవితంలో మరోరకంగా
ప్రవర్తిస్తూ విసుగిస్తుంది.
 ఆమె రెండుజడల సీత కాదుగదా
రెండుతలపాము.

క్రింద పోర్షన్లో ఉండే
కూతురుతోగూడా వాట్సాప్ లోనే
సంభాషిస్తుంది.

వంటలూ వార్పుల్లూ శీర్షికలో
ఉదయాన్నే ఒక వంటను పెట్టి
హాయిగా గుర్రుకొట్టి నిద్రపోతుంది.
కర్రీ  పాయింట్ ఉందిగదా తొందరెందుకని
దబాయించి మాట్లాడుతుంది.
బద్ధకానికి మారుపేరుగా తననే పేర్కొనాలి.
వృద్ధాశ్రమంలో ఉంచిన తల్లిదండ్రులను
వారానికొక్కసారయినా పలకరించిన పాపానపోదు.

అమ్మగా అస్సలు పనికి రాదు.
కూతురుగా కొసరుకైనా సరిపోదు.
ఆడజనమంటే ఇదా అని ఆశ్చర్యపోయేలా
ప్రవర్తిస్తూ అదేంటని అడిగితే అదంతేనని విసూక్కుంటుంది.

ఆషాఢభూతిని చూడలేని వాళ్ళకు
సోదాహరణంగా ఈవిడనే పేర్కొనాలి.
అన్నాననికాదుగాని కడుపుచించి
జన్మనందించిన కన్న తల్లినికూడా

కనికరమంటూ లేకుండా
కసిరికొడుతూ కష్ట పెడుతుంది.
కన్నీటిపర్యంతంజేసి
కకావికల పాల్జేస్తుంది.
--------------------------------------------
[ద్విముఖాలకు నిదర్శనమైన
మహిళామణులకు
కోపకారణంగా అంకితం.]




No comments:

Post a Comment