Friday, May 29, 2015

భువి భూతలస్వర్గమా? భూతాలనిలయమా?
---------------------------రావెల
శ్వాస ప్రక్రియను
చేపట్టిన క్షణం నుంచి
ఆఖరు శ్వాసవదలే నిముషం వరకూ
ప్రతిప్రాణికోటిలోనూ
విరామాన్నాసించకుండా శ్రమించే
శ్వాస  కోశాలు ఎంత గొప్పవోకదా!
అవి మానవనైజంకన్నా భిన్నంగా
అత్యంత పట్టుదలతో
తమ కివ్వబన ధర్మాన్ని
రెప్పపాటుకూడా ఏమరుపాటుకు లోనుకాకుండా
గొప్పదైన సేవాదృక్పధంతో
అహర్నిశమూ క్రమం తప్పకుండా
అది గడ్డకట్టె చలిప్రాంతంలోగాని
రోళ్ళు పగిలిపోయేలా కాచే
ఎండల ప్రదేశాల్లోగానీ
వాతావరణానుకూలతలను అననుకూలతను
 సంబంధంలేకుండా వాటినే  మాత్రం
 తనతల పై కెక్కించుకోకుండా
 దీక్షతో శ్రమించే
సైనికులకుమించిన సేవా దురంధరులుగదా!!
మన ప్రాణికోటి ఊపిరితిత్తులు.

మనిషి నైజం ఇందుకు భిన్నంగా ఎందుకుమారిందో
మనం గమనించి శ్రద్ధగా గుర్తెరుగాలి !
కార్యాలయాలకు వెళ్ళగానే గడియారాలకు
కళ్ళనతికించి కుర్చీలో కునికి పాట్లు పడుతూ
భోజన విరామసమయం ఎప్పుడెప్పుడా అని 
ఎదురుచూసే వ్యర్ధజీవులనెలా  మందలించాలి?
పై అధికారి సెలవుపై వెళ్ళినా లేదా పనిమీద
నగరాతరం వెళ్ళినా ఇక ఆ కార్యాలయాల సంగతి దేవుడికే యెరుక సుమా!
ఇలా తమ ఇష్టారాజ్యంగా గాడితప్పి ఓ రెప్పపాటు ఊపిరితిత్తులలా
విశ్రమించాలని తలుచుకుంటే ,ఇక ప్రాణికోటి బ్రదుకు లెలామారి
స్వర్గధామం స్వర్గ ధామం  ద్వారాలచెంతకు వడి వడిగా
సవ్వడిచేసుకుంటూ పరుగులెడతాయో ఊహించండి.

ఇకామీదయినా ఊపిరితిత్తులను చూసయినా సమస్త మానవకోటి
సేవాదృక్పధంతో ప్రవర్తించడం మొదలెడితే
ఈ భువినిమించిన స్వర్గం బ్రహ్మర్షి విశ్వామితృడయినా సృజించగలడా? ఊహించండి.

ఈభూమి అటుపై పుణ్య భూమిగా
అలరారారుతుందనడంలోఈ సందేహము వలదు వలదు

No comments:

Post a Comment