Friday, May 1, 2015

ఎండుటాకు ఎక్కడినుండో గాలివాటానికి ఎగిరొచ్చి మాముంగిట తిష్ట వేసింది. చూసిందే తడవుగా దాన్ని తడిమి మరీ ప ట్టు కుని చూసాను. యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ పేరిట నిన్ననే విడుదలైన సినిమాలో ముసలి ముడతలను కప్పెట్టిన మేకప్పులో హీరొ తన కూతురువయసుకూడా ఉండబోని కుర్ర దాన్ని తడిమి తడిమి తన్మయత్వం చెందినట్టు. అదొక రాగిరేకేమోనన్న భ్రమలో అన్నమయ్య కీర్తనుందేమోనని ఆశగా పొదవుకుని చూసాను. డబ్బు కక్కుర్తికి వేల రాగిరేకులను కరిగిoచాలని ప్రలోభానికి లోనైన కరకు హృదయాలు కరిగించకుండామిగులుస్తారా ?మన కళాపోషకులు నా వెర్రిగాని. అదేమైనా పురాతన పద్యసంపదను పంచిపెట్టే తాళపత్రమనికూడా భ్రమపడితీక్షణంగా తేరిపార చూసాను. పురాతన వస్తు సేకరణలో దాచకుండా బయటపడిన అమూల్యమైన పత్రమనికూడా అనుకున్నాను. అది కేవలం శిశిరంలో వచ్చేవసతపు శోభను కనులారా చూడలేనని కుళ్ళుబోతు తనంతో ఈర్ష్యాసూయలకు లోనయి, మ్రోడు వారిన తరువునుండి వేరు పడినదిగా తీర్మానించుకుని ఖేదపడ్డాను.కాలానుగతంగా ప్రతి మనిషిబ్రదుకూ ఇంతేగదా అని విషణ్ణవదనంతో మూర్చిల్లిపోయాను. ======================================

No comments:

Post a Comment