Friday, April 17, 2015

సుభాషితం
-------------------

నింగి అంచులను తాకిచూడాలని
నీలోని నిరాశా నిస్పృహలు
ఎగసిపడుతున్నంత కాలం
నీలో చింతచావలేదనీ
పులుపు రుచి ఇంకా సలుపుతూనే
వున్నదని అవగాహన చేసుకో.

కాలంతోపాటు  అమిత వేగంగా నీ కోరికలు
గుర్రాలపై స్వారీ చేయాలని
తహతహలాడుతున్నంత సమయమూ
నీకు తీపిమీద మోజు తీరలేదనిఅర్ధంచేసుకోవాలని
హెచ్చరిక మాత్రమే  అదని సుతారమూ గ్రహించడమే మేలు.

సముద్రాన్ని సమీపించగానే దాన్ని
గజీతగాడిలా లంఘించి స్వాధీనం చేసుకోవాలని
నీలో జఠరాగ్ని జ్వలిస్తున్నంత కాలం
అహంకారానికే నీవు దాసోహమనుకుంటూ
చరిస్తున్నావని మాత్రం గ్రహించి మసలుకో.

కవిత్వపు సంపుటిలోని కవితలన్నింటినీ

శ్రద్ధగా చదవడాం మానేసి వదనగ్రంధ దర్శనంలో
చదవకుండానే ఇష్ట పడుతునట్లు నటిస్తూ ఓ లైకు  ను కొట్టి సంతసిస్తూ సమాధానంగా కృతజ్ఞతలనందుకునే నీవు వరుసగా పుటలు అనాలోచితంగా తిప్పుతూ
అనుభూతి స్రవంతులన్నింటినీ అనాలోచితంగా వదులుకునే
దురదృష్టవంతుడవైన చదువరి మాత్రంగానే మిగిలిపోతావన్న సత్యాన్ని శ్రద్ధగా వంట పట్టించుకోగలిగితే నీ సాహితీ యాత్ర సముల్లాసంగా సాగినట్లని తెలుసుకుని మసలుకో!!
==================================================

No comments:

Post a Comment