Monday, April 20, 2015

ధృవపత్రాలు---
===================

కొన్ని మరణాలు
గడపదాటి బయట
పడకుండానే నాలుగ్గోడలమధ్యనే
శాశ్వతంగా సమాధి యౌతుంటాయి.


మరికొన్ని మరణాలు క్షణాల్లోనే
గడపదాటి బయటకొచ్చి
నాలుకలు చాచుక్కూచున్న
కొండ చిలువల్లాంటి చానెళ్ళకు
ఆహారమై అల్లరి పెడుతూటాయి.

ఇంకొన్ని మరణాలు రోజులు గడచినా
అంతరంగాలకే పరిమితమై
ఖ్షోహపెడురూ వేధిస్తుంటాయి.

ఇంకొన్ని మరణాలు కధలుగా మారి
కంచి గరుడ సేవలు చేస్తూ
కాలగర్భంలో కలసిపోకుండా
కరగని శిలల్లా మారి
గుండెలలో గునపాలను గుచ్చుతూ
కలకాలం సలుపుతూ సశెషంగా మిగిలిపోతాయ్.

కొన్ని మరణాలు దేసచరిత్రపుటల్లో
సువర్ణాక్షరాలలో లిఖించబడి
పిల్లలకు పాఠ్యాంశాలై వారి హృదయకవాటాల్లో

చెరగని ముద్రలను వేసి చలన శీలమై చిగురిస్తుంటాయి.


కొన్ని మరణాలు చిరుతప్రాయంలోనే సంభవించి

చిరకాలం బంధువులందరి గృహాల్లో ధు :ఖ సముద్రాలై
జీవ ధునుల్లా అప్పిసెం ప్రవహిస్తూ కత్తిజాట్లకన్నా
నలమైన గాయాలను చేసి కలతపెడుతూ కనులు మూతపడనివ్వక
బాధపెడుతూ వుంటాయి.




కొన్ని మరణాలు చికిత్సామందిరాలకే పరిమితమై
పురాతన గ్రంధాల్లోని చిరుగుతూమిగిలిపోయిన పుటల్లా
రహస్యపత్రాలుగా మిగిలిపోయి అసమర్ధ నారాయణీయంగా
హంసపాదులువేస్తూ వదంతుల్లా వ్యాప్తిజెంది వక్ర మార్గంలో

వంధ్యలుగా మిగిలిపోయి శాశ్వతత్వాన్ని సంపాదించుకుని
వైద్య శాస్త్రపు నీతి సూత్రాలకేమాయని మచ్చలుగా మిగిలిపోయి
కళంకాలుగా కనబడుతూ మిగిలిపోయి శేష ప్రశ్నలుగా సశేషమౌతుంటాయి.
++++++++++++++++++=================================







No comments:

Post a Comment