Sunday, April 26, 2015




చాంద్రాయణం
--------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

కనకపు సిం హాసనాధీష్ట యైన
మా ఇంటిశునకం నిరంతరం
మొరుగుతూనే వుంటుంది.
సుప్రభాత సేవలనుంచీ
అర్ధరాత్రి మసాలాదాకా
అనవరతం వాగుతూనే వుంటుంది.

అన్ని అంతరంగాలమధ్యనా
చిచ్చురేపే కధేతివృత్తాలే
ధారావాహికలై
 అత్త కోడళ్ళమధ్యనా
మామా అల్లుళ్ళమధ్యన
అపోహలు రెచ్చగొడుతూ
వేలకొద్దీ వారాలుగా
వేధిస్తూనే వుంటుంది.

విద్వేషాల విపంచిని మీటడంలో
తనకు తానే సాటియని అడుగడునా
సోదాహరణంగా నిరూపిస్తూనే వుంటుంది.


కలవరపెడుతూ
కళవళపరిచే వార్త వినిపిస్తే చాలు
పాచిపళ్ళ దాసరిలా ఆ పాటను
రకరకాల సమయాల్లో తలలు బద్దలుగొడుతూ
తన్నుకు చచ్చేలా దృస్యమానం చేస్తూంటుందిది.


ఒక్క అక్షరాన్నిగూడా సరిగాపలకడం రాని
అందాలలొలకబొసే యాంకరమ్మలు
వంటలూ వార్పులూ చెఫ్లూ
ఇంటింటికీ తయారుచేసే విధానాలను
చూపిస్తూ నేత్రానందం కలిగిస్తున్నారు.

సినిమా విడుడలయిందంటే ఆ దురదృష్టపు క్షణమ్నుంచీ
చిరాకు పెట్టించేలాకార్యక్రమాలను రూపొందించి
ఇంద్రుడు చంద్రుడు మహేంద్రుడంటూ
వారసత్వంగా నటనరాని కధనాయకులతో
కంగాళీ కార్యక్రమాలను రూపొందించి
పబ్బం గడుపుకుంటూ మహిళా కార్యక్రమాలలో సైతం
ఈ అసభ్యకరనృత్యాలనే రెకార్డింగ్ దాన్సుల్లా
విసుగుపుట్టించేలా రూపొందించి ప్రేక్షకులమీదకు
శతసహస్ర రూపాల్లో  సరసంధానం గావిస్తున్నారు.


నేరాలూ క్రైం రెపోర్టులూ
యే నేరం ఎలాచేయాలో ప్రత్యక్షంగా
ప్రసారంజేసి సమాజ ద్రోహానికి
ఇతోధికంగా సాయమందిస్తున్నారు.

మెదడును పనిచేయకుండాజేస్తున్నేఎ ప్రభుత్వం
తన పబ్బం గడుపుకుపోయేలా
మత్తుమందులా కార్యక్రమాలను చేర్చి
ప్రజాద్రొహానికీ నాందీ వచనంగా నిలిచిపోతున్నారు.
 =================================26-4-15



No comments:

Post a Comment