Wednesday, April 1, 2015

ఇల్లాలికో ఇంపయిన కవిత
----------------------రావెలపురుషోత్తమరావు.

కొత్తగా  ఆవ బాగా దట్టించి పెట్టిన ఆవకాయలా
ఘుమ ఘుమలాడే మనసుకదానీది.

అల్లం, పచ్చిమిరపా, బాగా దట్టించి
రుచ్యమానంగా నువ్వు పెట్టిన
మజ్జిగపులుసులాగా బాగుంటుంది నీ ధోరణి.

బెల్లంతో కలిపి  వండిన కాకరకాయకూరలా
తియ్య తీయగా ఉంటుంది నీ వచోవిలాసం.

అప్పుడప్పుడూ నువ్వు చేసిపెట్టే ఆవిరికుడుములా
ఎంతచారోగ్యప్రదంగా , ఎంత బాగుంటుందో
నీవు అన్నపూర్ణగా అతిధులను పలకరించే తీరు.
మసాలాదినులు వేసి కూరిన గుత్తి వంకాయకూరలా

మాగాయతో కలిపివండిన కలగూరపప్పులా
ఎంతరుచిగా వుంటాయో నీ ప్రేమాభిమానాల పరంపరలు.

పొట్లకాయముక్కలతో నీవు అప్పుడప్పుడ్శూ చేసిపెట్టే
పెరుగు పచ్చడిలా  ఎంతబాగుంటుందో నీవునన్ను అభిమానించే తీరు.

అప్పుడప్పుడూ ఎందుకలా ముక్కుల్లోంచిపొగలొచ్చేలా
విచిత్రంగా ప్రవర్తిస్తుంటావో నాకవగతమవదు.

అదితెలుసుకుందామనే తపనతోనే ఈకవితను రాసి
పోస్ట చేయలేని ఉత్తరంగా నీకు దివ్యపధంలో
నా మనో వాహిని ద్వారా  మేఘసందేశంగాపంపుతున్నాను.
విసుక్కోకుండా వినమ్రంగా చదువుకుని స్వప్నపధంలోకి
ఓ సారి తొంగిచూసి జవాబివ్వగలవన్న ఆశతోరాస్తున్నా
ఈ ప్రవాసతీరలోంచి ఓ చిన్ని  ప్రేమ లేఖ.
 ================================================================



No comments:

Post a Comment