Tuesday, April 28, 2015

కవిత్వం కలంలోకి ప్రవహించడమేకాదు
కన్నీటి ప్రవాహామై కదిలిస్తుందనీ
ఇప్పుడే తెలిసొచ్చింది.

కవిత్వం మరణాన్ని నిర్వచిస్తూనే
మరణించిన వారికి అభిమానుల తరఫున
 సానుభూతి సంద్రమై
గుండె గుండెకూ ఉప్పెనల ఎగసి పడుతుందనీ
ఇప్పుడిప్పుడే గమనానికొచ్చి గర్వంగా నిలిచింది.


కవిత్వం శుద్ధ జలంలా ప్రాణా ధారమై
కొందరిని అమృతోపమంగా నిలబెట్టడమే కాదు
సాగరమధనసమయంకో జగన్మోహినిగా రూపుదాల్చి
రాక్షస ప్రవృత్తికి మంగళంపాడేందుకూ ఇతోధికంగా
సహకరిస్తుందని ఓ అవగాహన కలిగి ఆనందమై వికసించింది.

కవిత్వానికి  అనుపానాలు అంకిత భావమై నిలవడమేనని
ఎదుటి ప్రపంచాన్ని అత్యంత సన్నిహితంగా ముంజేతికంకణమై
దర్శింపజేయడమేనని అర్ధమవడం ఆలస్యమైనా  అమృతగుళికలా
ఆరోగ్య మహాభాగ్యానికీ మానసికంగా ఆదరువై నిలుస్తుందని
సోదాహరణమై శుభంకరమై శోభాయమానమై గెలుస్తుందని అర్ధమయింది.
------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment