Saturday, April 11, 2015

దైనందినం
-----------రావెల పురుషోత్తమ రావు.

ఎక్కడోఒకచోట
ఎప్పుడో ఒక సమయంలో
జీవితాన్ని రాజీ బాటలో
నడచిపొమ్మని అనునయంగా
చెప్పక తప్పడంలేదు.

కుండపోతగా కురుస్తున్న వర్షానికి
పనులు పూర్తిగా మానుకుని బ్రదుకును
వెళ్ల దీయడానికి అందరికీ వీలుకాదుగా!

గొదుగేసుకునో యూరియా విదిల్చిన బస్తాను తలకు
ఆధారంగా పెట్తుకుని తడవ కుండా జాగ్రత్తపడి
పనులను తీరిగ్గా చక్కబెట్టుకోవాల్సిన సగటు జీవితాలను
సాగదీస్తూ సర్దుకు పోవాల్సిన మనుషులమేగదా తప్పదు మరి.


ఎండకన్నెరుగని జీవితాలు కొందరికే సంప్రాప్తిస్తాయి.
నెత్తిన తలపాగా చుట్టుకునో ,చెట్లనీడన సేదతీరుతూనో
మన పనులను మనం వెళ్ళదీసుకోలేకపోతే పొయ్యిలో
పిల్లికదలను పొమ్మంటూ భీష్మించుకు కూర్చునే
ప్రమాదం మన వెన్నంటి అంగరక్షకుడిలా వెంటాడుతూనే ఉంటుంది.

సర్దుకు పోతూ సంతృప్తితో ఒడ్దుకుచేరవలసిన మన బ్రదుకుల్లో
రాజీ పడడం అవశ్యమేగాని రాజీ నామా అన్న పదం
నిఘంటువులో చోటుచేసుకోకపోవడం మనం ఎప్పుడూ
ఎదుర్కొనే సమస్యే కాదనను ! అదే అంతిమ పరిష్కారమా అంటే
సమాధానంకోసం మళ్ళీ ఆశగా ఎదురుచూసే ఆవిడాపిల్లలూ
గుర్తుకొస్తూ నాకళ్ళను కన్నీటి సముద్రాలుగా చేసి
స్థాణువుగా నిన్ను నిలబెట్టి మౌనానాశ్రయించడమే మేలని
హితవు పలుకుతూ వేమన సూక్తినో సుమతి సుభాషితాన్నో
ఉదాహరిస్తూ ఉప్పొంగి పొతారు నేను తలనాడించనంతవరకూ
ఆత్మీయంగా అనుబంధాల వలలో చుట్టెసి బలవంతంగా
నవ్వును నా అంతరంతరాల అట్టడుగునుండి కక్కిస్తుంటారు.
ఇదే జీవన సాఫల్య పురస్కారమబుకుని పొంగి ప్రవహిస్తూ
కాలం వెళ్ళ దీయడానికి శ్రమైక జీ వన సౌందర్యం
రుచు చూసే దిశగా మరలా పరుగును లంఘించుకుని
ఉక్కిరిబిక్కిరయిపోతూ ఉచ్చ్వాస నిశ్వాసాలను
నియంత్రించుకునే పనిలో నిండుకుండలా నిమగ్నమై వెలిగిపోతుంటాను.
==================================================





No comments:

Post a Comment