Wednesday, April 22, 2015

ప్రతీక్ష------
==============
నువ్వుంటే ఎంత బాగుండేదో
అని ప్రతి క్షణం ప్రతీక్షగా
ఎదురుతెన్నులతో నిరీక్షిస్తుంటాను.
ఆగకుండా దగ్గు తెరలుగా వచ్చి బాధిస్తున్నప్పుడూ
అప్పుడప్పుడూ వచ్చే జ్వరమైనా ఒక్కోసారి
ససేమిరా తగ్గనని మొండికేసినప్పుడూ
రావుగారూ మీరు బీ పీని మధుమేహాన్నీ
వెనువెంటనే నియంత్రించాలని వైద్య ద్యశిఖా మణులు ఆదేశించినప్పుడూ
నువ్వేగనుక నా ప్రక్కన వుండి వుంటే ఎంత బాగుండునోనను
చాలాసార్లు అగణితంగా చెవుల్లో రింగుమంటూ
కలవరపెడుతుంది మనసు
 నువ్వే గనుక ఉండుంటేఎంత బాగుండునో అని,కనుకొలకుల్లోనీరు అడ్డొచ్చినా
నీ నగుమోమే నన్ను ముందుకు నడిపిస్తున్నదన్న మాట
మాత్రం నిరభ్యంతరంగా అక్షర సత్యం సుమా!!


నీ మనుమరాలు అన్విత మొన్న వాళ్ల ఇంటికెళితే
తాతా!! ఈసారి మనం ఇండియాకెళ్ళినప్పుడు అమ్మమ్మను తెద్దాం
అక్కడ ఒక్కతే ఎందుకు పాపం--నువ్వు తాంతి[కాంతికి తన పలుకు బడి]మామ దగ్గరుంటే
తను మాదగ్గరుంటుందిలే తాతా!!  అని అనునయంగా చెబుతున్నప్పుడు.

ఇంకోమనుమరాలికి [ఊహంటూ తెలిసి రాకుండానే నువ్వు నిష్క్రమించావులే] శ్రీ  సం హిత   ఫొటొలొ ఉన్న  నిన్ను చూపి నానమ్మ ఎక్కడుంది ? అని చి ట్టి  చేతులను ప్రశ్నార్ధకంగా తిప్పుతూ అడిగినప్పుడూ
నువ్వు ఆఖరి సారిగా నీ పెద్ద   మనుమడు అనీష్ అను  మాణిక్యాణ్ణి [ప్జోనులోనే]  "నేను నిన్ను చూసి గర్వపడుతున్నానురా1  కన్నా !!"  అని నీసందేశాన్ని ఆసుపత్రి మంచం మీదనుంచేఅందిస్తున్నప్పుడూ
ఇంత సంతో షాన్ని వదిలి ఎలా వెళ్లగలిగావా?  అని ఆశ్చర్య పడుతుంటాను.

నీ పెద్ద మనుమరాలు శ్రీశ్రిత సినీ ప్రముఖుల ఎదుట పాడిన
'తిరు తిరు గణనాధా' పాట విని "ఇది మన ఇంటిపేరు నిలబెడుతుందనీ"
అశీర్వదించిన నీవు  ఆ ముచ్చట తీర్చుకోకుండానే  ఇహలోకానికి వీడ్కోలు
  చెబు తావని మేము అస్సలు వూహించలేకపోయాం.

"వాడేడిరా పైకి తీసుకు రాలేదేమిటని ప్రణద్ ను గూర్చి వాకబు చేసి ఆసుపత్రిలోకి వాడిని అనుమతించలేదని తెలుసుకొని అయితే నేనే దిగివస్తానని చెప్పికూడా
 నీ మాట నిలబెట్టుకోకుండానే అందరినీ వదిలిపెట్టి  హఠాత్తుగాపైకెగిరి ఊర్ధ్వలోకాలకు దూసుకెళతావని  ఎవ్వరం ఊ   హించ  లేకనే పోయాం.

అం దుకే ఆఖరు సారిగా వినమ్రుడనై విన్నపం చెవిదగ్గా వినిపిస్తున్నాను.
ఒక్క సారి నీ బంధు కోటినంతటినీ పరామర్శించగలవన్న అత్యాశతో
  కన్నీటిని కలంతో నింపి వేడుకగా ఈ కవితను గిలికి హృదయపూర్వకంగా    వేడుకొంటున్నాను.

=======================================

No comments:

Post a Comment