Monday, April 20, 2015

ఒకటి:
---------
అతడు బ్రదికినన్నాళ్ళూ
కలిమిబలంతో కాలాన్ని
 నెట్టుకుంటూ వచ్చాడు.
కాకులన్నీ పిట్టగోడలమీద
సమావేశమై సామూహికంగా
ఎంతగా అరిచి గీపెట్టినా
అతను వాటివైపు మొహం
 త్రిప్పికూడా చూడలేదు
సరిగదా ఎంగిలిచేత్తోకూడా
వాటిని తోలకుండా జాగ్రత్త పడ్డాడు.

అందుకేఅతను కీకారణ్యంలో
 దిక్కులేనిచావుచస్తే
దూడలూ రాబందులకూ కబురంపి
కాకులన్నీ నిరశన తెలియ జేసాయి.
అతిక్రూరంగా నాలుగురోజులపాటు
దూడలూ రాబందులూ
 అతని దేహాన్ని  నమిలిమింగాయి.

రెండు:
-------------
అతడు కలవాడుకానేకాదు
యేపూటకాపూటగడిస్తేచాలని
కలలు మాత్రమే కంటుంటాడు.
ఎవరికీ అతను అన్నంపెట్టలేకపోయినా
ఎవరినోటిదగ్గర కూడునూ
 లాగేసుకున్నాడన్న అపవాదు అతనిమీద లేదు.
అతడుమరణించాక
అతని ఉత్తరక్రియలు నామమాత్రంగానే జరిగినా
కాకులన్నీ మూకుమ్మడిగాజేరి
అక్కడపెట్టిన ఒక్కోమెతుకునూ మహాప్రసాదంగా
కళ్ళకద్దుకుని మరీ తినివెళ్ళిపోయాయి.
మూడు:-
___________
అతను మరణించాడు.
అతని ఆస్తిపాస్తులన్నీ అక్షరాలా
అతను అభిమానించినవర్ణ సముచ్చయమే.
అధోఅగత్సహోదరులపైనే ప్రాణం నిలుపుకుని బ్రదికే వాడు.
ఆకలి కేక ఎక్కడ వినపడినా ఆకాశంనించి
ఊడిపడుతున్నఉల్కగా  మరుక్షణమె అక్కడ వాలిపోయే వాడు.
అవశ్యం  వారిని  ఆదుకోవాలని  తపన పడే వాడు.
తనసంపాదనలొతనకు తోచిన సహాయాన్నందిo
ప్రచార సాధనాలకు దూరంగా జరుగుతూ
ప్రక్కకు తప్పుకుని వెళ్ళేవాడు.
అతడు మరణించాక
పూలన్నీ గుత్తులు గుత్తులుగా ఎగిరొచ్చి
అతనికిసన్నిహితంగా వాలిపోయాయి.
కొకిలలుప్రభాత గీతాలు పాడి అతన్ని మేలుకొల్పాలని
విశేషంగా శ్రమించి వెనుదిరిగి వెళ్ళాయి.
సంధ్యాదీపాలు అతనిదగ్గరగా వెలగడం మొదలెట్టాయి.
అస్తమించేసూర్యుడుకూడా అతదు నిష్క్రమించాకె
పడమటి కొందల డిసగా పయనం సాగించాడు.
---------------------------------------------------  21-4-15

No comments:

Post a Comment