Wednesday, April 29, 2015

విన్నపాలు వినవలె--- -------------------రావెల ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ నేను పేద్ధ ధనవంతుడను కావాలని నాకు దుగ్ధ. అదుగ్ధతీరేదాకా నా విషయాలేవీ పట్టించుకోవద్దుసుమా!! పరమాత్మా! అప్పటిదాకా ఈ అమాయకత్వంతో నిండిన ఈజగత్తునంతటినీ అంతమొందించకుండా సమ్రక్షించు స్వామీ! నేను యశోవంతుడనై విలసిల్లేదాకా శాంతి సహనాలతో అసూయారహితంగా ఈ లోకాన్నంటినీ కాపలా కాస్తుండు. సర్వ కాల సర్వావస్థలలోనూ నాకవితాసంపుటి దిగ్దిగంతాలలో ఉత్తమమైనదిగా గుర్తించబడేదాకా ఈ ప్రపంచాన్నంతటినీ అజ్ఞాతమైన అంతర్యుద్ధాల పాలుకాకుండా నీవే కొమ్ముగాసి సం రక్షించు. ఒ ఆదిమధ్యాంతరహితుడా!! అందరినీ అత్యంత స్వల్ప వ్యవధిలో ఐశ్వర్య వంతులను గావిస్తానని ఎన్నికల సమ్రంభంలో నాలుక్కరుచుకుంటూ వాగ్దానం చేసి వున్నానుగనుక నేనే వారికి ప్రజాప్రతినిధిగా దశాబ్దాలపాటు కాణీ ఖర్చుగాకుండా వాగ్దానల ధనప్రవాహంలో వారు మునిగితేలుతూ వుంటూ నా పెరుగుతున్న ఆస్తిపాస్తుల మీద కన్నెర్ర జేయకుండా జగత్తు ఈలోపు శిధిలమై ఖిలం కాకుండా సం రక్షించు. ఈలోకంలో నానాటికీ పెరిగిపోతున్న అసంతృప్తి సెగలు నన్ను తాకకుండా నీ ప్రేమామృత వర్షంలొ జనమంతా తడిసి ముద్దయేలా ఆశీర్వదించు. భగవంతుడా తప్పో ఒప్పో తెలియదు గానీ ఉదయకాంతులతో వనాలూ పొలాలూ మాకు నిత్యావసర వస్తువులను పందించె కృషీవలురంతా ఆనందానికి మరో పేరుగా నిలిచేదాకా వారి సుఖ సంతోషాలు ఉద్యమ గీతాలుగా పరిణమించకముందే నా ఈ చిన్ని చిన్ని కోరికలన్నీ క్షణాల్లో నెరవేర్చబడేలా నువ్వు నీఅనుచర గణాలకు అతి జరూరుగా ఉత్తర్వులను అందించేలా ఆదేశించు. [ఓఅంగ్లకవితకు స్వేచ్చానువాదం]

No comments:

Post a Comment