Sunday, April 5, 2015

సాహస లక్ష్మణుడు---
---------------రావెల పురుషోత్తమ రావు.

అవును అతను ధైర్యంగా
అచంచలమైన తన ప్రగాఢ విశ్వాసాన్ని
 ఆసాంతం నమ్ముకుని పర్వతాలను అధిరోహించాడు.
ఆ ఏడు పర్వతాలనూ తన పాద స్పర్శతో
బహు పునీతం గావించాడు.
హిమ సౌరభాలను సరిగపదమని ఆదేశిస్తూ
కదన కుతూహల  రాగంతో
తన సాహస గాధను సరిగ్గా
సమన్వయం చేసుకున్నాడు.

గుండెలో తిరుగాడని
దు:ఖ సంద్రాలకన్న
 ఈ శిలాజాలందించిన
ఆనందాశ్రువుల అంబోధి నే
అధికాధికంగా ప్రేమించాడు.
ఎక్కడొ దూరంగా కనుపించే
 నల్లని,తెల్లని రాళ్ళకన్నా
దగ్గరగా మురిపించే
ఈ శిలాసౌందర్యాలపైనే
మక్కువను పెంచుకున్నాడు.

రాయిలాంటి దేవుడితో వేగలేక
ఆ ప్రకృతిలో పరవశించే గీతమై
శిలాక్షరంగా అజరామరమై
నిలిచిపోయాడు .
  అమూల్యమైన చరిత్రకు
ఆల వాలమై మిగిలి మురిసిపోతూ మెరిసాడు
ఎండయినా వానయినా నన్ను తాకి వెళ్లవలసిందేనని
శపిస్తూ, అకాలంగా సంభవించిన మృత్యు పాశానికిలోనై
అదృశ్యమై అనంత దిశల మాటుకు అంతర్ధానమై
ఘన పదార్ధమై మిగిలిపోయాడు.  5-4-15

{చి// మస్తాన్ అను సాహస వీరుని స్మృత్యంకితం.

No comments:

Post a Comment