Thursday, April 9, 2015

ప్రతిఫలంగా-- రావెల పొరుషోత్తమ రావు.
--------------------------------------------
ఇంకా తెలతెలవారకముదే
అతడు గబా గబా నడుచుకుంటూ
సమీపంలోని  స్నేఫితుడిని కలిసి
కరచాలనం చేసి పుట్టినరోజు
శుభాకాంక్షలు చెప్పాలని
తపన పడుతున్నాడు


ఇంకా వంద గజాల
 దూరంలోనే అతనుంటాడు.
సంతోషంపట్టలేక నడకవేగంపెంచాడు.


గగనతలం నుంచి గగుర్పాటుగొలిపేలా
నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఓ భయంకర శబ్దం
ఇంతలో ఆకాశంలోంచి శతృమూక దాడి.

స్నేహితుడు విగతజీవిడై నెత్తురోడుతూ
నేల మీద పడివున్నాడు.
అతనిచేతులుమాత్రం  తన చెలికాడి కరస్పర్శకై
ఎదురుచూస్తున్నట్లే వున్నై.

ఏంచేయగలడు ? అతడా మిత్రుని  పుట్టినరోజు నాడు
రెండు అశ్రు కణాలను మనసారా
రెండుచేతుల్లోనూ రాల్చి వెనుదిరిగి రావడం తప్ప.

సమరం అమరమైతే అజాత శతృవుకైనా సరే
 అందిపుచ్చుకునేది అమాయకజనాల
ప్రాణ నష్టమేనేమో   పనికిరాని  ప్రతిఫలం.
------------------------------------------------------------------
[ ఓ ఆంగ్లకవిత చదివాక]
=============================

No comments:

Post a Comment