Tuesday, April 14, 2015

సుపాణినీలు
---------------రావెల పురుషోత్తమరావు
------------------------------------------

స్వేదఫలాలను
సౌఖ్య ధృవం   మింగేసింది.
రిక్షా అదృశ్యమై
ఆటో రిక్షా గా అవతరించింది.
-----------------
కులాల జాబితాను
కూలంకషంగా వెదకి చూసాను.
కమ్మరి కుమ్మరి ఎవరంటూ?
పల్లె తల్లిని ప్రశ్నించాను.
-------------------------
పిచ్చుకకోసం
దిక్సూచి లొకి చూసాను
బ్రహ్మాస్త్తాలకు బలయిందని
కంట నీటిని కార్చాను.

-------------------
దర్జీ అంటే అర్ధంగాక
అమ్మ వైపు తిరిగాను
అమ్మ మొహం చూసి
అమ్మమ్మ నాచొక్కాను చూపింది.
----------------------
వడ్రంగికోసం
వూరంతా వెదికాను
ఎక్కడా కనబడక
వెక్కి వెక్కి ఏడ్చాను.

--------------
పీర్ల సావిట్లో ఉండే
మలాం పట్టీ
మస్తాను మృగ్యమయాడూ
కార్పొరేట్ వైద్యంక్
అందరి కళ్ళను మార్చేసింది
----------------

No comments:

Post a Comment