Friday, April 10, 2015

ప్రణయానురాగ పంచ రత్నాలు
----------------
 వసంతాగమంలా నీవు ఆగమించావు
  తుమ్మెదలూ,మలయమారుతాలూ,
పూలతెమ్మెరలూ, ఇలా ఎన్నింటినో అందించావు.
  పాపిష్టి మనసున్న వాళ్ళతో
మిగతా భూతలన్నంతా నింపినా
స్వర్గానికి దీటుగా ఉన్న ఇక్కడే సర్దుకుపోతాను.
------------
నువ్వొస్తావని తెలిసినప్పటినుంచీ
కుండీలో పూలన్నీ
మరింత పరిమల భరితంగా గుబాళిస్తున్నాయ్.
మన అనురాగ బంధం మాత్రం
అలుపెరుగకుండా నీకోసం ఎదురుచూస్తూ
తన్మయత్వంతో తైతక్క లాడుతుంది.
-------------------
నీవొస్తావన్న వార్త తెలిసాక
వసంత శోభతో ఇల్లంతా కళకళలాడుతుంది.
ఇక కూని రాగాలు పాడుకుంటూ
గూట్లోని పక్షులన్నీ కువకలాడుతూ
కుశలంగా విహంగయానం చేస్తున్నాయ్.
---------------
నేనతన్ని ప్రేమించానని
ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
అతన్ని ప్రేమించడంలో తీయటి
ఆనందాన్నభవిస్తున్నాను.
ఈ దివినీ భువినీ గానీఇంతసౌందర్య సీమలుగా
మలచినందుకు కృతజ్ఞత తో
ఇక్కడే కలకాలం జీవించాలని నిర్ణయించుకున్నాను.

----------------------------
అద్భుతమైన ఆనందాన్నందించిన
వసంతానికెంత రుణపడివున్నామోమనందరం
ఇంత సంతోషాన్నితనలోనింపుకున్న
హృదయన్ని వదలలేనూ దాన్ని
వదిలించుకోనికించను.
నీ సలహా ఏమిటో చెప్పు ప్రణయినీ!!


[ఎమిలీ డికిన్సన్ ఆంగ్లకవితలకు అనుసృజన]

No comments:

Post a Comment