Monday, April 20, 2015

మహోద్యమగీతం
---------------------------రావెల
^^^^^^^^^^^^^^^^^^
మనిద్దరిమధ్యన జరిగే ప్రతి
 సంభాషణలోనూ
నీ ఎత్తిపొడుపులే కత్తిగాట్లకన్నా
ఎక్కువ సలపరంపెడుతుంటాయ్.
మనిద్దరిమధ్యా ఏర్పడే అభిప్రాయ సేకరణలోనే
నీ సలహానే నెగ్గితీరాలనే పట్టుదలే
దౌష్ట్యంగా మారి  నన్ను నీకు దూరంగా
 ఉండడమే మేలేమోనని పదే పదే
హెచ్చరికలు జారీ చేస్తుంది,నా చిట్టిమనసు.
అందుకే అనవసరంగా మన బాగునూహిస్తూ
నీకు ఉచితసలహాలివ్వడంకన్నా అన్ని వేళలా
మౌనాన్నాశ్రయించడమే శ్రేయోదాయకమని
నిర్ణయానికొచ్చి దశాబ్దాలతరబడి యిలా
దశంటూ తిరగని దౌర్భాగ్యంలోమగ్గుతూ
కాలం వెళ్ళదీస్తున్నాను.అందుకే మరోసారినీకు
మన భావి తరాల భవిష్యత్ ను
బాగుపరుచుకోవాలని నీ వనుకుంటే
నానిరంతరమౌన దీక్షకు నీవే
నిమ్మరసాన్నందించి దీక్ష విరమణకు సాయపడాలి.
ఇక్కడ నేను ఎక్కువ,తక్కువలను సున్నితంతంగా
 తిరస్కరించే కొత్త  త్రాసులో మన
వ్యక్తిత్వాలను బేరీజు వేసే పనిలో నిమగ్నమై ఉన్నాను.
నీ కళ్ళెదుటే మనం గుడ్దిగా మన అహంభావాలను నమ్ముకుని
అమూల్యమైన కాలాన్నీ, తిరిగిరాకుండా మనచేతుల్లోంచి
జారి కాల గర్భంలో కలిసిపోయిన క్షణాలనూ
మూల్యాంకణం చేసుకునే దిశలో దీక్షగా శ్రమిద్దాం.
మన సంతానానికి మనమేదిక్సూచిగా నిలబడుతూ
 గురుతరమైన బాధ్యతగా
ముందుకడుగూవేద్దాం. మన జీవితాలను మనమే
కంటకప్రాయంగా మారుతున్న దిశనుంచి తప్పించి
మార్గదర్శకత్వం చేసే దిశగా ముందుకడుగులు వేసేలా
ఓ గట్టినిర్ణయానికొచ్చి నవ్వులపువ్వుల నదిలో పడవను మునగకుండా
నౌకాయానం చేద్దాం! రా కలసి నడుద్దాం.వేతనాలు
మనిద్దరిమధ్యా పెంచిన వ్యత్యాసాలను క్రమేపీ  తగ్గిద్దాం
మూగబోయి మసిబారిన మనసులను మనమే
 దగ్గరకు తీసుకుని ప్రక్షాళనజేసి
గోముగా , దాన్ని ఉమ్మడి బాధ్యతగా భావించి  లాలిద్దాం!
===================================20-4-15

No comments:

Post a Comment