Tuesday, April 7, 2015

మా మేడమీది పడకటింటి  గోడ  ఆప్యాయంగా గుండెకు హత్తుకుంటూ నన్నుపలకరిస్తున్నది.
గోడమీద స్థిరీకరించబడిన ఆవిడ చాయా చిత్రం నన్ను  ఇతోధికంగా హెచ్చరిస్తున్నది.


శిధిలమైన ఆలోచనలను శీర్ణ పత్రాల్లా వర్జించడం మేలని
పదేపదే గుర్తుచేస్తున్నది.
 అదే సమయానికి  సహచరిగా సాన్నిహిత్యపు చనువుతో   హితవైన
సూచనలుజేస్తూ నన్ను అలరిస్తున్నది. తీయగా అదిరించడంకూడా

నిద్రలేమితనానికి విరుగుడు ఎంత త్వరగా కనుగొనగలిగితే
అంత శ్రేయోదాయకమని  సుభాషితమై  హితవులను పలుకుతున్నది.
 కవిత్వమంటే జీవితాన్ని నీటిలోని   రంగుల చిత్రంగా భావించి పట్టిచూపడ మైనదని  బోధిస్తున్నది.
నీమనసులో అనునిత్యం మెదలే శతక సాహిత్యం నీకు మార్గ దర్శిగా నిలవాలని వినమ్రంగా ప్రార్ధిస్తున్నది.


No comments:

Post a Comment