Sunday, April 5, 2015

ఎటు నీదారెటు--
------------------------------------------------------

ఓ చిన్న కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకున్నట్టు
గద్దల్లా ఎగిరొచ్చిన నాయకులు అమాయకప్రజల భవితవ్యాన్ని
తేలిగ్గా కిళ్ళీ ఉమ్మును గాండ్రించి గోడమీద ఉమ్మినంత తేలిగ్గా
పచ్చని పంట పొలాలమీద విదిలించి వలేసి వారి ఉజ్జ్వల భవితను
గుటకలో పట్టి అమాంతంగా  మింగేసి ఘన కార్యమేదో చేసినట్లు భుజ కిరీటాలను
వంది మాగధులచేత వరుసగా తగిలించుకుని ఆకాశమార్గాన
ఓ చిన్న పాటి లోహ విహంగాలపై తిరిగివెళుతూ దుమ్ములేపి
కళ్ళల్లో సుతారంగా కారాన్ని తేలిగ్గా చల్లేసి సుఖంగా వెడలిపోతున్నారు.


జపాను దేశమో మరో సింగపూరుకో విదేశాల బేహారులకు ఆపత్రాలను
మారుబేరపు  అమ్మకానికి  విసిరేసి తరలి  సునాయాసంగా చెమటచుక్కను
నేలపై రాలిపడకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళిపోతున్నారు.
  గుప్పెడు గింజలుజల్లి గువ్వలన్నింటినీ ఒక్కుదుటనే పట్టేయగల పకడ్బందీ
ప్రణాళికలను సిద్ధంచేయండని అధికారులనాదేశిస్తూ
ముఖం నిండా ప్లాస్తిక్ నవ్వులు ప్పుట్టించుకుని ముందుకు సాగుతున్నాడు.

 అమాయకంగా జంబుకాలకు అమ్ముడుపోయిన జనం ఏదో రకంగా
దాన కర్ణులమయామని తమలో తామే పొంగిపోతూ భుజాలెగరేసుకుంటూ
మ్రా ంపడి వలస బాట పట్టి ఉన్న ఊరునూ కన్న తల్లినీ
బహిరంగ విపణిలో రహస్యంగా అమ్ముకుని నయవంచన కు లోనై
 తమతమ గూళ్లకు నమ్మ బలికిన ఊహాలోకాల్లొకి కట్టు బట్టలతో
కన్నీళ్ల పర్యంతమై కావిడిపెట్టెలో కష్టాలను కుక్కేసుకుని
వలస బాటలో వంది మాగధుల వంచనా శిల్పానికి బలయి


ఉసురుస్సురనుకుంటూ ఉడిగిపోతున్న ఆశలతో
అలుపెరుగని ప్రవాస సీమల్లోకి, ఉరుకుతూ వెళ్ళిపోతున్నారు.

మళ్ళీ తనకు ఓడినా గెలిచినా ఓ ఓదార్పు యాత్రపేరిటో
మరో నిరశన దీక్షపేరిటో జనామ్ని మభ్యపెట్టగల
మాంచి అవకాశాన్నందిచిన తన తండ్రికి చిరకాలమిత్రుడయిన
ప్రభుత్వాధినేతకు కృతజ్ఞతలు చెపుతూ ఊరూరా ముసలికన్నీరు
కారుస్తూ ముందుకు సాగిపోవాలని పగటికలలతో  తేలిపోతున్నాడు.
================================

No comments:

Post a Comment