Monday, April 20, 2015

ప్రక్క వూరిలో పిడుగు పడిందట
మా వూరు వూరంతా అప్రమత్తమయింది
తమ ప్రక్కనే పిడుగు పాటయినంతగా
భయవిహ్వలమయింది.

ప్రక్క నగరంలో బస్సు ప్రమాదమట
మావెనుకనేజరిగినంతగా
భయకంపితులమై వణికి పోయాం.

ప్రక్క రాష్ట్రంలో తీవ్రవాదులపై కాల్పులు
ఇక్కడనేతలంతా నిరశనవ్రత దీక్షలతో
అల్లకల్లోలాలను సృష్టించారు.
ప్రక్క దేశంలొ వర్ణ వైషమ్యాలు పొటమరించి
అక్కడ అంత  కలహాలు జరుగుతుంటే
ఇక్కడ  ఆ మతస్తులంతో  తెగబడి యుద్ధాలు
ఇక్కడ దేశభక్తులలో కలవరం కలిగించింది.

మన వూరిలో మన సరిహద్దుల్లోనే మనపొలాల్లో
ఆడపిల్లలపై అకృత్యాలూ అరాచకాలూ
ఇంతజరుగుతున్నదని తెలిసినా
దున్నపోతుమీద జడివాన కురిసినట్లే
మనం మౌనం వహించడం కిమ్మిన్నాస్తిగా కూర్చోడం
దేశ భక్తా? దేహం పై వ్యామోహమా?
నిరాసక్తతేనా?  మనం తెలిపే నిరశన--
========================================

No comments:

Post a Comment