Wednesday, April 1, 2015

నరరూపం సర్వత్రా నింద్యతే---
-----------రావెల పురుషోత్తమ రావు.
******************************************

జంతువులన్నీ ఒకచోటజేరి
మసకమసక చీకటిలో
సమావేశమయ్యాయి.

ఇంతలో పొదల మాటున పొంచి ఓ ప్రాణి
నక్కినట్లు  వాటికి అలికిడయిండి.
"చిరుత చిరుత" అంటూ
జంతువులన్నీ భయకంపితమై
ఉరుకులుపరుగులూ మొదలెట్టాయి.

వెలుగు చిక్కటి చీకటిని పారద్రోలాక
అది చిరుత కాదని మనిషిరూపంలోని
మనిషేననీ ఇట్టే పసిగట్టాయి.
అయినా జంతుకోటి అంతా పరుగులు తీయడం
మాత్రం మానడానికి ధైర్యం చేయలేకపోయాయి.

జంతువులు తనవునికినెలా పసిగట్టాయని
పగతో రగులుతున్న మనిషి ఇంకా
పరిశోధనల్లోమునిగి తేలుతూనే వున్నాదు.
దీక్షా కంకణ బద్ధుడై కారణాలకోసం
నిరంతరాన్వేషణ కొనసాగిస్తూనేవున్నాడు
చిరుతకన్నా క్రూరమైన తన చిత్త ప్రవృత్తితో.
===================================

No comments:

Post a Comment