Monday, April 27, 2015

అవగాహనా రాహిత్యంలో---------
--------------------------రావెల.
************************************


మనకు తెలిసినంత పరిజ్ఞానంలో
భూమి గుండ్రమైందని చదువుకున్నాం
కానీ తీరా చూసే సరికి
బల్లపరుపుగా వుంటుందని గ్రహించాం.
మన జ్ఞానేంద్రియాలను మనమే అప్పుడు
అనుమానించి అవమానించాం.

సమస్త సృష్టినంతా ఔపోసన పట్తామని భ్రమపడ్డాం..
కానీ ఈ చిన్న విషయాన్ని ఇట్టే గుర్తించలేకపోయాం.

నేనుధరణీతలాన్ని  కలుసుకున్నప్పుడు
పరమాత్ముని ప్రక్కకు పెట్టిమరీ వచ్చాను.
కానీ ఆక్రోశింపజేసే ఆకలినీ
తీర్చుకోలేకపోతున్న దాహపు గొంతుకనూ
అలాగే అవగాహనా రాహిత్యానికే వదలవలసి వచ్చింది.
అప్పుడనిపించింది--భగవంతుడు నిరాకారుడూ, నిర్గుణుడైతే
ఆకలీ దప్పికా చరాచరమౌ సృష్టిలో అనంతమూ అవిశ్రాంతమూ అని
అర్ధమవడానికి ఆట్టే సమయమూ సందర్భమూ అవసరంలేదని.

[ఓ ఆంగ్లకవితకు అనుసృజన]
------------------------------------------------------------

No comments:

Post a Comment