Thursday, April 2, 2015

అనుభవ రాహిత్యంలో---
----------------రావెల పురుషోత్తమరావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

 శిశిరం యేచెట్టు ఆకులను
  ఎప్పుడురాలుస్తుందో
తిధి, వార, నక్షత్రాలతో సహా
వివరించిన గంటల పంచాగంకోసమా,
ఈ వెదుకులాట! నన్నుక్షమించు!!

యేనదీ నదమో,ఓపిల్లకాలువో
ఎప్పుడు శీతలీకరణకు గురవుతుందో
లెక్కలేసుకునియేచేద్దామని నీ భావన?

అందరూలక్ష్యం దిశగా అడుగులేస్తూ
లఖ్యాన్నిచేరుకోవాలనే నిత్యం తపన పడుతుంటాము.
ఆరంభింపనోపని నీచ మానవుడిలా మిగిలిపోతూ అనుకోని

ఆప సోపాలుపడుతూ ఆయాసానికి గురౌతూ ఉంటాం.

కవిత్వపుపాదాలతోఒకరికొకరం ఉభయకుశలోపరి
చెప్పుకుంటూ బ్రదుకునీడుద్దామన్న
 ధ్యాసనే మరుగున పడేసుకుంటూ
తల్లక్రిందులవుతూ సతమమొతూ, సగం చచ్చిపోతుంటాం.

శిశిరం అధాటుగా వచ్చిన దాఖలాలేం చరిత్ర పుటల్లో
లిఖించబడ్డదని చెప్పగలిగిన శాస్త్రవేత్తలెవరూ  కనబడలేదు.
ఆకులన్నింటినీ ఆ ఋతువు క్రమేపీ వర్ణ శోభితంజేసి

ఆకుల నరరాల్లోని పచ్చటిజీవాన్ని హరింపజేసి
ఎండకు ఎండడానికి  దణ్ణెం మీద ఆరేసిన ఉతికిన బట్టలా
ఫెళ ఫెళ లాడిస్తూ గలగలలాడిస్తూ, క్రమేపీ రాల్చేస్తుంది.

మరెందుకునీవు నిరామయంగా, గడియపడనితలుపుల్లా
యమపాశంతప్పక పడుతుందని తెలిసీ జీవన సాఫల్య
పురస్కారానికి యేం చేస్తే సమాజహితమై పదికాలాలపాటు
నీ పేరును చిరస్థాయిగా నిలిపే  దిశగా ఆలోచనలను జేసి
నీ శేష జీవితాన్ని చరితార్ధంజేసుకోవాలని శ్రమించవు?
=============================



No comments:

Post a Comment