Sunday, February 22, 2015

మధు కీల
=============

నింగినుంచి
నేలమీదకు
క్షణకాలం పాటు 
దూకి పడిన
ఉల్కలా నీవు.

మానసిక హిమ సాగరంలో
శోకతప్తయై
కృద్ధలా విలపించే నేను

ఘనీభవించేందుకు
ససేమిరా సిద్ధంగా లేనని
మొరాయించే గుండె 

ప్రతిక్షణంలోనూ
నీ రూప స్మరణమే
నిఖార్సుగా నిలబడుతుంటే
శోక రహితంగా సాక్షాత్కరించలేని
నా అసమర్ధపు బ్రదుకు పాట

వ్యధా తప్తమై,  ద్రవీభూతం కాలేనని
ఘనమై,  అనురాగ ధనమై
వేదనాంతరంగం వెదుకులాట
మొదలెట్టింది. నింగికీ నేలకూ
నిచ్చెన వేసి నీ సన్నిధికి
ఎగబ్రాకాలనే వ్యధార్త హృదయం
కన్నీటికే కొంగ్రొత్త నిర్వచనం
పలుకుతున్నట్లుంది కదా శ్రద్ధగా గమనించు.
ఆ దివినుంచి ఈభువి మీదకు
నీ విశాల దృష్టిని ఒకసారి
క్షణ కాలమో,కనీసం ఓ లిప్త పాటైనా  
దయామృత వర్షిణివై సారించు.
=====================

No comments:

Post a Comment