Monday, February 2, 2015

జపాన్ దేశ సాహితీ చరిత్రలో ఎన్నదగిన కవయిత్రులలో ఉత్తమ స్థాన్నాన్ని అధిరోహించిన కవయిత్రి ఒనో నో కొమాచ్చి.[ono no komachi]క్రీశ 825-900 మధ్యన జీవించిన కవయిత్రి ఈమె.అతిలోకసౌందర్యవతిగా మన్నలనందిన కవయిత్రికూడా.
ఆమె కవితలు కొన్ని అనువదించి పొందుపరుస్తున్నాను.
------------------------------రావెల పురుషోత్తమరావు
[1] ఏమాత్రం బహిరంగంగా ఎలాంటి
లక్షణాలు స్ఫురించకుండా
వాడిపోగలిగిన ఒకే
ఒక పుష్పం
ప్రపంచం మొత్తంలో
పురుష హృదయమొక్కటే.
-----------------------------
[2]శిశిర రాత్రి ఎంతో సుదీర్ఘమైందని
అందరూ భావిస్తుంటారు.
ఇదికేవలం ఓ నామమాత్రమైన
అపోహమాత్రమే నని నా భావన
రాత్రంతా ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటుంటే
భళ్ళున తెల్లారేదాకా సమయమే తెలియ[లే[దు. 2-2-15
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
Like · 

No comments:

Post a Comment