Tuesday, February 3, 2015

రంగు రంగుల తరు వనంలా
పర్వతంపు తనువు సోయగాల 
సంరంభంతో పులకిస్తున్నది.

క్రిందుగా జలనిధిలా నదీ ప్రవాహం
నానా విధాల నయగారాలనొలకబోస్తూ
క్రిందకు దిగి వడిగా వడి నడక సాగించాలని, 
పంట పొలాల దాహార్తిని తీర్చాలని ఆత్రుత పడుతూoది.

పర్వత సానువుల అదోముఖంలొ నువ్వూ నేనూ
జారి పడకూడకూడదని ప్రణయ భావనను
పదే పదే హెచ్చరికలను జరూరుగా జారీ చేసుకుంటూ.
ప్రకృతిమాత అందంగా అందిస్తున్న ముఖచిత్రానికి 
వినయపురస్సరంగా పాదాభివందనంచేస్తూ.
=================================

No comments:

Post a Comment