Monday, February 9, 2015

ఇవ్వాళనేనో కవితను రాయాలి
---------------------------రావెల పురుషోత్తమ రావు.

ఇవ్వాళనేనో కవితను రాయాలి
అది నాతోటలో విరబూసిన
సుమాల సుమధుర పరిమళాను గూర్చిన
భావ కవిత కాదు సుమా!

కేశ సంస్కారానికి నోచుకోక
గుబురునెత్తిపై గుత్తగా 
పెరిగిన క్లేశాల గవులుతో
నిద్రపట్టక దీర్ఘంగా
దైన్యపు చూపులు విసురుతున్న ఓ
బిచ్చగత్తె మనసును తొలిచేస్తున్న
మనాదిని గూర్చి మంచి కవితను రాయాలి.

కలవారు కల్యాణ మంటపంలో
అపురూపంగా వడ్డించిన 
తిను బండారాలనుగూర్చో, 
రకరకాల పదార్ధాలను గూర్చిన
ప్రబంధ కవితను కానే కాదు

సాయంత్రానికి అవి విసరబడ్డ

కుప్పతొట్లపై తంబలు తంబలుగా

విరుచుకుపడే పేదరికాన్ని గూర్చి

సమకాలీన సమాజ సజీవ దృశ్యాలకు
దర్పణమై నిలిచేలా ఓ కవితను ఇవ్వాళనే రాయాలి.
==========================================8-2-15

No comments:

Post a Comment