Monday, February 2, 2015

ప్రభాత భేరి
-------------
దినం తెల్లవారుతున్నదంటేనే
దిగుళ్ళ కధ మొదలవుతుంది.
వాకిటి గుమ్మం ముందు
వార్తా పత్రికల ఊరేగింపులు.రహదార్లపై రక్తం చిందించినప్రమాదాల ప్రచార ప్రహేళికలు.తాయెత్తులమ్ముకునే దగుల్బాజీలవాణిజ్య ప్రకటనల వరుసదాడులు.మా ఇంటివంటలో కూడా మహిళామణుల
అర్ధం పర్ధంలేని పాటలకు అసభ్యకరమైన
భంగిమలతో ప్రదర్శితమౌతున్న వెకిలి నృత్యాలు.
పలుకు రాళ్ళను ప్రకాశవంతమైన రత్నాలంటూ
బహిరంగంగా అమ్ముకుంటున్న పయోముఖ విషకుంభాళ్ళ్లాంటి
వాణిజ్య వేత్తలు వదరుతూ ఊదరగొట్టే ముదరాల ముదనష్టాలు
ఢీ,కిర్రాకు డాన్స్ షోలపేరిట మూతి మీద మీసాలుకూడారాని
చిరంజీవులు చేసే చిరాకు సర్కస్ చిత్ర విన్యాసనాల
విచిత్ర వేషాల వింగడింపులే.
జబర్దస్తు పేరిట జబ్బలు చరుచుకుంటూ
ప్రదర్శితమౌతున్న ఆడామగో తేడా తెలియనివ్వని
వెకిలి సంభాషణలతో జాతి గౌరవాన్ని వెలితిజేసే కార్యక్రమాలు.
కావ్యగానాల్లేవు. కధా పరిచయాలూ శూన్యం.
ప్రాచీనసాహిత్య సౌరభాలను విరివిగా వెదజల్లే
మూర్తిమంత మైన కార్యక్రమాలు లేవు.
అన్నీ అపభ్రంశపు అశ్లీల గీతాల అవమానాలే.
విదేశాల్ల్లోకూడా ఇదే తంతు--నీ, నా,మన వేదికలపై
సంస్కృతీ సంప్రదాయాలను సాహత్య గావించే
నృత్యప్రదర్శనల ఆంగికంపు అభినయ ప్రదర్శాన మేళవింపులే.
కర్ణపుటాలను చేదించే కఠిన గీతాలకు అభినయ ప్రదర్శనలే.
వందనెలలుమాత్రమే జీవింపజేసే వ్యర్ధాలు మనకక్కర్లేదు.
వందేళ్ళను సైతం సునాయాసంగా శోభాయమా
నoగా దాటించగల

మనసూ,మానసిక సౌలభ్యాన్నందిచగల లలిత్య,లావణ్య
శోభితమై జాతి నరనరాల్లో జీర్ణించుకుపోయే నవనవోన్మేషమైన
నెత్తురును ప్రవహింపజేయగల సౌహార్ద సౌరభాలు
వెదజల్లగల వేదికలు ఇప్పుడు మనకు కావాలి.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

No comments:

Post a Comment