Tuesday, February 10, 2015

కిటికీలోంచి తొంగి చూస్తుంటే
కలల రాకుమారుడు వస్తున్న సవ్వడి
లేత కొబ్బరాకుల గలగల రవళులలో
నాకు స్పష్టంగా  అవగతమౌతున్నది.

నింగి లోంచి నావైపే చూస్తున్న చందమామ

వెదుక్కుంటున్న ప్రేయసి ఎదురుగా వచ్చినట్లనిపిస్తుంది.

దూరంగా జలజలా ప్రవహించే సెలయేటి నడకలు

నా ఇంట్లోని చిరంజీవుల 
బుడి బుడి నడకల రవళులను గుర్తు చేస్తున్నది.

పూలతోటలోంచి వీస్తున్న సుమపరిమళాలు

నేను భావ కవితా ప్రపంచంలో విహరిస్తున్న
తీరును తన్మయత్వం గా తెలియజేస్తున్నది.

కనులమీదుకు ముంచుకొస్తున్న నిద్రాదేవత

కలల స్వైర విహారం  ప్రణయ కవితా విహాయసంలో
 నన్ను విహంగంలా మార్చి  అక్కడి ఆత్మీయతా 
 సరస్సులోనన్ను ముంచి తేల్చేందుకు
 సముచితాహ్వానం -- పంపుతున్నట్లనిపిస్తున్నది.
------------------------------------------------------------------------

No comments:

Post a Comment